Shan Masood Well Paced 88, David Willey Sensational Spell Take Multan Sultans Home - Sakshi
Sakshi News home page

మ‌సూద్ తుపాన్ ఇన్నింగ్స్‌.. 6 ఫోర్లు.. 4 సిక్స్‌లతో!

Published Tue, Feb 1 2022 12:50 PM | Last Updated on Tue, Feb 1 2022 5:46 PM

Shan Masoods well paced 88, David Willeys sensational spell take Multan Sultans home - Sakshi

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో భాగంగా క్వాట్టా గ్లాడియేటర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్ 7 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 175 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన గ్లాడియేటర్స్ 168 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ముల్తాన్ సుల్తాన్ బౌల‌ర్ల‌లో కుష్దిల్ షా, తాహిర్, విల్లీ చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. గ్లాడియేటర్స్ బ్యాట‌ర్ల‌లో బెన్ డకెట్(47), ఇఫ్తికార్ అహ్మద్(30) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌ల‌గా నిలిచారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముల్తాన్ సుల్తాన్ ఆదిలోనే కెప్టెన్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ వికెట్ కోల్పోయింది.

అయితే మ‌రో ఓపెన‌ర్ షాన్ మసూద్ ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. షాన్ మ‌సూద్ కేవ‌లం 58 బంతుల్లోనే 88 ప‌రుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. షాన్ మసూద్ చేల‌రేగ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ముల్తాన్ సుల్తాన్ 174 ప‌రుగులు చేసింది. ఇక  గ్లాడియేటర్స్ బౌలర్ల‌లో మహ్మద్ హస్నైన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, ఫాల్క్‌నర్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

చ‌ద‌వండి: టీమిండియాపై విజ‌యం మాదే.. విండీస్ ప‌వ‌ర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement