Imran Tahir
-
టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించిన సౌతాఫ్రికా బౌలర్
సౌతాఫ్రికా వెటరన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 500 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రపంచ క్రికెట్లో తాహిర్‌కు ముందు డ్వేన్ బ్రావో (624 వికెట్లు), రషీద ఖాన్ (556), సునీల్ నరైన్ (532) 500 వికెట్ల మార్కును తాకారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో రంగ్‌పూర్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తాహిర్.. ఖుల్నా టైగర్స్‌తో నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తాహిర్ ఐదు వికెట్ల ఘనత సాధించి, తన జట్టును ఒంటిచేత్తో గెలిచిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రంగ్‌పూర్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (69), మెహిది హసన్ (60) అర్దసెంచరీలతో రాణించగా.. నురుల్ హసన్ (32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షకీబ్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఖుల్నా టైగర్స్ బౌలర్లలో లూక్ వుడ్ 3, నహిద్ రాణా, నసుమ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్.. ఇమ్రాన్ తాహిర్ (4-0-26-5), షకీబ్ అల్ హసన్ (3.2-0-30-2), మెహిది హసన్ (1/13), హసన్ మహమూద్ (1/29), జేమ్స్ నీషమ్ (1/5) ధాటికి 18.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. టైగర్స్ బౌలర్లలో అలెక్స్ హేల్స్ (60) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లు కనీసం 20 పరుగులకు మించి చేయలేకపోయారు. -
ముసలాడివి నువ్వేం చేస్తావన్నారు.. అశ్విన్‌కు థ్యాంక్స్: ఇమ్రాన్ తాహిర్
పాకిస్తాన్ బార్న్ సౌతాఫ్రికా వెటరన్ ప్లేయర్ ఇమ్రాన్ తాహిర్ అద్భుతం చేశాడు. 44 ఏళ్ల వయసులో గయానా అమెజాన్ వారియర్స్‌కు కరీబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను అందించి, ఆటకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు. వయసును సాకుగా చూపి తనను ఎగతాళి చేసిన వారందరిని నోళ్లను తాహిర్ సీపీఎల్ 2023 టైటిల్‌తో మూయించాడు. ముసలాడివి.. నువ్వేం చేస్తావ్ అని తనపై జోకులు పేల్చిన వారికి తాహిర్ టైటిల్‌తో బుద్ది చెప్పాడు. 11 ఎడిషన్లలో నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచిన వారియర్స్‌ను తాహిర్ ఐదవ ప్రయత్నంలో ఛాంపియన్‌గా నిలబెట్టి, పట్టుదలతో ప్రయత్నిస్తే కాదేదీ అనర్హం అని నిరూపించాడు. కాగా, వారియర్స్ టైటిల్ గెలిచిన అనంతరం తాహిర్ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పాడు. తన చుట్టూ ఉన్న చాలామంది తన వయసుపై జోకులు పేలుస్తున్న సమయంలో అశ్విన్ తనపై విశ్వాసం వ్యక్తం చేశాడని, తాను వారియర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు అందరూ తనపై జోకులు పేల్చారని, తాను ఈ ఎడిషన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ సాధిస్తానని యాష్ ముందు నుంచే గట్టిగా నమ్మి వెన్నుతట్టాడని తాహిర్ అన్నాడు. వయసు పైబడిన నాపై నమ్మకాన్ని ఉంచి, తనలో సూర్తిని రగిల్చినందుకు యాష్‌కు ధన్యవాదాలని తాహిర్ తెలిపాడు. ధోని రికార్డు బద్దలు కొట్టిన తాహిర్.. 44 ఏళ్ల వయసులో వారియర్స్‌ను ముందుండి నడిపించి కరీబియన్ ఛాంపియన్‌గా నిలిపిన తాహిర్.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ధోని 41 ఏళ్ల 325 రోజుల్లో తన ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలబెడితే.. తాహిర్ 44 ఏళ్ల 181 రోజుల్లో అమెజాన్ వారియర్స్‌కు టైటిల్‌ను అందించి, లేటు వయసులో టీ20 టైటిల్‌ను అందించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. కాగా, నిన్న జరిగిన సీపీఎల్ 2023 ఫైనల్లో తాహిర్ సారథ్యం వహించిన గయానా అమెజాన్ వారియర్స్.. విధ్వంసకర ఆటగాళ్లతో నిండిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, తొట్టతొలి సీపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలగా.. వారియర్స్ ఆడుతూపాడుతూ 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని విజేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్‌లో తాహిర్ అత్యంత పొదుపుగా బౌలింగ్ (4-0-8-2) చేసి వారియర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. -
కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్‌గా గయానా.. ఫైనల్లో పొలార్డ్ టీమ్ చిత్తు
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా ఇమ్రాన్ తహీర్ సారథ్యంలోని గయానా అమెజాన్ వారియర్స్ నిలిచింది. సోమవారం గయానా వేదికగా జరిగిన ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసిన అమెజాన్ వారియర్స్.. తొలిసారి సీపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్.. గయనా బౌలర్ల ధాటికి 94 పరుగులకే కుప్పకూలింది. గయనా బౌలర్లలో ప్రోటీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ 4 వికెట్లతో నైట్ రైడర్స్‌ను దెబ్బతీయగా.. మోతీ, తహీర్ తలా రెండు వికెట్లు సాధించారు. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో కార్టీ(38) మినహా మిగితందరూ దారుణంగా విఫలమయయ్యారు. 100 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గయానా బ్యాటర్లలో ఓపెనర్ అయాబ్(52),హోప్(32) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా డ్వైన్ ప్రిటోరియస్ నిలవగా.. షాయ్ హోప్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు వరించింది. చదవండి: KL Rahul: నేను అస్సలు ఊహించలేదు.. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది -
వామ్మో ఇదేం షాట్.. దెబ్బకు కిటికీ పగిలిపోయింది! వీడియో వైరల్
CPL 2023 - Guyana Amazon Warriors vs Jamaica Tallawahs: జమైకా తల్లావాస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ అద్భుత షాట్‌తో అలరించాడు. గయానా అమెజాన్ వారియర్స్‌తో మ్యాచ్‌లో మాసివ్ సిక్సర్‌తో మెరిశాడు. అతడు కొట్టిన భారీ సిక్స్ దెబ్బకు గయానా స్టేడియం వద్ద గల కిటికీ అద్దం పగిలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా బుధవారం జమైకా తల్లావాస్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ రెండు సిక్సర్లు హైలైట్ గయానాలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వారియర్స్.. జమైకాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కెప్టెన్, ఓపెనర్ బ్రాండన్ కింగ్ అర్ధ శతకం(52)తో మెరవగా.. ఫాబియన్ అలెన్ 21 పరుగులతో రెండో టాప్ స్కోరర్(నాటౌట్)గా నిలిచాడు. 14 బంతులు ఎదుర్కొన్న ఈ విండీస్ ఆల్‌రౌండర్ ప్రిటోరియస్, ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో రెండు అదిరిపోయే సిక్సర్లు బాదడం హైలైట్‌గా నిలిచింది. డ్వేన్ ప్రిటోరియస్ బౌలింగ్‌లో 18వ ఓవర్ ఆఖరి బంతికి కిటికీని పగలగొట్టిన అలెన్.. తదుపరి ఓవర్లో తాహిర్ వేసిన బంతిని 103 మీటర్ల సిక్సర్‌గా మలిచాడు. ఓపెనర్ సంచలన ఇన్నింగ్స్ కింగ్, అలెన్ మినహా మిగతా వాళ్లు విఫలం చెందిన క్రమంలో.. నిర్ణీత 20 ఓవర్లలో జమైకా జట్టు 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన వారియర్స్‌కు సయీమ్ అయూబ్ 53 బంతుల్లో 85 పరుగులతో దంచికొట్టాడు. మరో ఓపెనర్ మాథ్యూ నందు 37 పరుగులతో రాణించడంతో 18.3 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి విజయం సాధించింది. సయీమ్ అయూబ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. Fabian Allen SMASHES a window with an enormous six for the @BetBarteronline Magic Moment 💥#CPL23 #GAWvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/aNDkImZH72 — CPL T20 (@CPL) September 14, 2023 -
దంచికొట్టిన రొమారియో షెపర్డ్.. ప్రిటోరియస్ ఆల్‌రౌండ్ షో
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా సెయింట్ కిట్స్ నెవిస్ అండ్ పేట్రియాట్స్‌తో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 98 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. సైమ్ అయూబ్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), షిమ్రోన్ హెట్‌మైర్ (22 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు), కీమో పాల్ (31 బంతుల్లో 41 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), ప్రిటోరియస్ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్), రొమారియో షెపర్డ్ (7 బంతుల్లో 26 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పేట్రియాట్స్ బౌలర్లలో ఒషేన్ థామస్ 3 వికెట్లు పడగొట్టగా.. కోర్బిన్ బోష్, జార్జ్ లిండే, డొమినిక్ డ్రేక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పేట్రియాట్స్.. ప్రిటోరియస్ (3-0-17-3), గుడకేశ్ మోటీ (4-0-15-2), రొమారియో షెపర్డ్ (1/19), జూనియర్ సింక్లెయిర్ (1/10), సైమ్ అయూబ్ (1/2) ధాటికి 17.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో అందరూ దారుణంగా విఫలమయ్యారు. కోర్బిన్ బోష్ (27), జార్జ్ లిండే (13), ఆండ్రీ ఫ్లెచర్ (11), యాన్నిక్ కారియా (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఓటమితో ప్రస్తుత ఎడిషన్‌లో పేట్రియాట్స్ పరాజయాల సంఖ్య 5కు చేరింది. ఆ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ గెలువలేదు. 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. -
కట్టింగ్ మెరుపు ఇన్నింగ్స్.. ఇమ్రాన్ తాహిర్ మాయాజాలం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో చాలా రోజుల తర్వాత బౌలర్ల హవా నడిచింది. లీగ్‌లో భాగంగా నిన్న (మార్చి 12) జరిగిన రెండు మ్యాచ్‌ల్లో నాలుగు జట్ల బౌలర్లు పేట్రేగిపోయారు. ఫలితంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న పరుగుల ప్రవాహానికి పాక్షికంగా బ్రేక్ పడింది. నిన్న మధ్యాహ్నం ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ ఓ మోస్తరు స్కోర్ (179/8) నమోదు చేయగా.. ఛేదనలో జల్మీ బౌలర్ల ధాటికి ఇస్లామాబాద్ యునైటెడ్ (166 ఆలౌట్) చేతులెత్తేసింది. రాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ దాదాపు ఇదే సీన్ రిపీటయ్యింది. లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ జట్టు.. ముహమ్మద్ అక్లక్ (51), ఇమాద్ వసీం (45), తయ్యబ్ తాహిర్ (40), బెన్ కట్టింగ్ (33) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఖలందర్స్.. ఇమాద్ వసీం (2/26), అకీఫ్ జావిద్ (2/8), మహ్మద్ ఉమర్ (2/20), జేమ్స్ ఫుల్లర్ (1/29), ఇమ్రాన్ తాహిర్ (2/24) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. కాగా, ఈ పీఎస్ఎల్ సీజన్లో ట్రెండ్‌ను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇరు జట్లు సునాయాసంగా 200 పరుగుల మైలురాయిని దాటాయి. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే ముల్తాన్ సుల్తాన్స్ రికార్డు స్థాయిలో 262 పరుగులు చేయగా.. ఛేదనలో అదే స్థాయిలో రెచ్చిపోయిన గ్లాడియేటర్స్ 253 పరుగులు చేసి లక్ష్యానికి 10 పరుగులు దూరంలో నిలిచిపోయింది. ఈ సీజన్ మ్యాచ్‌ల గురించి చెప్పుకుంటు పోతే 240, 242, 243, 244, 226.. ఇలా ఆయా జట్లు పలు మార్లు 250 పరుగుల మైలురాయి వరకు రీచ్ అయ్యాయి. ప్రస్తుత సీజన్లో బ్యాటర్లు శతక్కొట్టుడులోనూ టాప్‌లో నిలిచారు. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, జేసన్ రాయ్, రిలీ రొస్సొ, ఫకర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ వంటి బ్యాటర్లు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడి ఆయా జట్లు భారీ స్కోర్లు చేయడానికి దోహదపడ్డారు. మరోవైపు లీగ్ కూడా చివరి అంకానికి చేరింది. మార్చి 15 లాహోర్ ఖలందర్స్-ముల్తాన్ సుల్తాన్స్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుండగా.. ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ మార్చి 16న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఆ తర్వాత ఎలిమినేటర్-2, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
ఐపీఎల్ చరిత్రలో యజ్వేంద్ర చహల్ సరికొత్త రికార్డు
రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఐపీఎల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎ్ సీజన్లో స్పిన్నర్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ అరుదైన ఫీట్ సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్ పోరులో హార్దిక్ పాండ్యాను ఔట్ చేయడం ద్వారా ఈ సీజన్లో చహల్ 27వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న చహల్ ఓవరాల్‌గా 17 మ్యాచ్‌ల్లో 7.75 ఎకానమీ రేటుతో 27 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఇమ్రాన్ తాహిర్(26 వికెట్లు) రికార్డును బ్రేక్ చేసిన చహల్ తొలి స్థానానికి దూసుకెళ్లాడు. ఇంతకముందు 2019లో ఇమ్రాన్ తాహిర్ సీఎస్కే తరపున 26 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లంక స్పిన్నర్ వనిందు హసరంగా కూడా 26 వికెట్లతో తాహిర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. సునీల్ నరైన్ 2012లో కేకేఆర్ తరపున స్పిన్నర్‌గా 24 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉండగా.. 2013లో ముంబై ఇండియన్స్ తరపున హర్భజన్ 24 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. చదవండి: IPL 2022: ఓవర్ యాక్షన్ అనిపించే రియాన్ పరాగ్ ఖాతాలో అరుదైన రికార్డు -
ఐపీఎల్ చరిత్రలో చహల్ అరుదైన ఫీట్
రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఐపీఎల్లో అరుదైన ఫీట్ సాధించాడు. ఇప్పటికే పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న చహల్ ఒక సీజన్లో స్పిన్నర్‌గా అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో ఇమ్రాన్ తాహిర్ సరసన నిలిచాడు. ఇప్పటివరకు చహల్ 14 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టాడు. శుక్రవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ధోనిని ఔట్ చేయడం ద్వారా సీజన్లో 26వ వికెట్‌ను ఖతాలో వేసుకున్నాడు. ఇంతకముందు 2019లో ఇమ్రాన్ తాహిర్ సీఎస్కే తరపున 26 వికెట్లు పడగొట్టాడు. తాజాగా చహల్ తాహిర్‌తో సమానంగా నిలిచినప్పటికి.. మరో రెండు మ్యాచ్‌లు ఉండడంతో తొలి స్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సీజన్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లంక స్పిన్నర్ వనిందు హసరంగా 24 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా.. సునీల్ నరైన్ 2012లో కేకేఆర్ తరపున స్పిన్నర్‌గా 24 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో ఉండగా.. 2013లో ముంబై ఇండియన్స్ తరపున హర్భజన్ 24 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక చహల్ తన కెరీర్లోనే బెస్ట్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఒకే మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ఫీట్ సాధించిన అరుదైన బౌలర్ల జాబితాలో చహల్ చోటు సంపాదించాడు. టి20 ప్రపంచకప్ 2022 టార్గెట్‌గా కసిగా ఆడతున్న చహల్‌ను రూ. 6.5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. తన ధరకు న్యాయం చేస్తున్న చహల్ రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా 2008 తర్వాత సూపర్‌ఫామ్‌లో కనిపిస్తున్న రాజస్తాన్ రాయల్స్ ఎలాగైనా కప్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. మే 24న గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్లనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. చదవండి: Ravi Shastri: 'అర్థం పర్థం లేని ట్వీట్స్.. మాకేదో తేడా కొడుతుంది' Yashasvi Jaiswal: 'బట్లర్, శాంసన్ల కంటే బెటర్‌గా కనిపించాడు' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మసూద్ తుపాన్ ఇన్నింగ్స్.. 6 ఫోర్లు.. 4 సిక్స్‌లతో!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా క్వాట్టా గ్లాడియేటర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లాడియేటర్స్ 168 పరుగులకే ఆలౌటైంది. ముల్తాన్ సుల్తాన్ బౌలర్లలో కుష్దిల్ షా, తాహిర్, విల్లీ చెరో మూడు వికెట్లు పడగొట్టాడు. గ్లాడియేటర్స్ బ్యాటర్లలో బెన్ డకెట్(47), ఇఫ్తికార్ అహ్మద్(30) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముల్తాన్ సుల్తాన్ ఆదిలోనే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ షాన్ మసూద్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షాన్ మసూద్ కేవలం 58 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. షాన్ మసూద్ చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్ 174 పరుగులు చేసింది. ఇక గ్లాడియేటర్స్ బౌలర్లలో మహ్మద్ హస్నైన్ రెండు వికెట్లు పడగొట్టగా, ఫాల్క్‌నర్ ఒక వికెట్ పడగొట్టాడు. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ -
రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్... ముల్తాన్ సుల్తాన్ ఘన విజయం
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముల్తాన్ సుల్తాన్ బోణీ కొట్టింది. కరాచీ వేదికగా కరాచీ కింగ్స్‌తో జరగిన తొలి మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముల్తాన్ విజయంలో ఇమ్రాన్ తాహిర్, మహ్మద్ రిజ్వాన్ కీలక పాత్ర పోషించారు. తాహిర్ మూడు వికెట్లు పడగొట్టగా, రిజ్వాన్ 52 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కరాచీ కింగ్స్ నిర్ధేశించిన 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి ముల్తాన్ చేధించింది. ముల్తాన్ బ్యాటర్లలో రిజ్వాన్(52), సోహైబ్ మసూద్(30) పరుగులతో రాణించారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరాచీ కింగ్స్‌కు ఘనమైన ఆరంభం లభించినప్పటికీ.. భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగల్గింది. కరాచీ కింగ్స్ బ్యాటర్లలో షర్జీల్ ఖాన్ (43), జో క్లార్క్(26) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక మూల్తాన్ బౌలింగ్‌లో తాహిర్ మూడు వికెట్లు పడగొట్టగా, దహాని, కుషీదల్ చెరో వికెట్ సాధించారు. చదవండి: Team India Test Captain: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో కొత్త పేరు..! -
ఇమ్రాన్ తాహిర్ విధ్వంసం.. 5 సిక్స్‌లు,3 ఫోర్లలతో..
లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ బ్యాట్‌తో విద్వంసం సృష్టించాడు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో వరల్డ్ జెయింట్స్‌కు తాహిర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా మహారాజాస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేసి జెయింట్స్‌ను గెలిపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మహారాజాస్ నమన్ ఓజా(140), కెప్టెన్ కైఫ్(53) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు సాధించింది. అనంతరం 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెయింట్స్ విజయంలో కెవిన్ పీటర్సన్(53), తాహిర్ (52) పరుగులుతో కీలక పాత్ర పోషించారు. చదవండి నమన్ ఓజా తుపాన్ ఇన్నింగ్స్.. 15 ఫోర్లు, 9 సిక్స్‌లు.. కేవలం 60 బంతుల్లో.. -
నమన్ ఓజా తుపాన్ ఇన్నింగ్స్.. 15 ఫోర్లు, 9 సిక్స్‌లు.. కేవలం 60 బంతుల్లో..
legends league cricket 2022: లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ మూడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మహారాజాస్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి జెయింట్స్ ఛేదించింది. వరల్డ్ జెయింట్స్ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఒకనొక సమయంలో 130 పరుగులకే 6 వికెట్ల కోల్పోయిన జెయింట్స్‌కు ఓటమి తప్పదు అని అంతా భావించారు. కానీ తాహిర్ తన తుపాన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అంతే కాకుండా మహారాజాస్ చెత్త ఫీల్డింగ్ కూడా ఓటమికు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మహారాజాస్ ఆదిలోనే సుబ్రమణియన్ బద్రీనాథ్, వసీం జాఫర్ వికెట్లను కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ నమన్ ఓజా చేలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్స్‌లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 69 బంతుల్లో 140 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. అతడికి తోడు కెప్టెన్ కైఫ్(53) బ్యాట్ ఝలిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు సాధించింది. చదవండి: సంచలనం సృష్టించిన రాజ్ బావా.. ధావన్ రికార్డు బ్రేక్ -
ఫోటో షేర్ చేసిన భారత స్పిన్నర్.. ఈ ఫొటోలో ఉన్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం.!
Harbhajan Singh posts throwback picture from U19 days: భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పడు అభిమానుల కోసం ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో అండర్-19 ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలను భజ్జీ గుర్తు చేసుకున్నాడు. 1997-98 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ నాటి ఫొటోను హర్భజన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో హర్భజన్‌తో పాటు అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొన్న పాక్ క్రికెటర్లు ఇద్దరు ఉన్నారు. ఈ ఫొటోకు భజ్జీ పెహచానో టు మానే(అర్ధం తెలుసుకో) అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఈ ఫొటోలో హర్భజన్ సింగ్‌ను ఈజీగా గుర్తు పట్టవచ్చు. కానీ మిగతా ఇద్దరు ఆటగాళ్లను గుర్తు పట్టడం కొంచెం కష్టం. అందులో ఒకరు ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న ఇమ్రాన్ తహీర్, మరొకరు పాక్ ఆటగాడు హసన్ రాజా. కాగా ఈ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాయి. డర్బన్‌లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో భారత జట్టు పాక్‌పై విజయం సాధించింది. చదవండి: Virat Kholi: బలమైన జట్టును తయారు చేయడం కష్టం.. కానీ నాశనం చేయడం ఈజీ కదా! Pehchano to maaane.. U-19 World Cup days 1998/99 pic.twitter.com/2iawM1dSUK — Harbhajan Turbanator (@harbhajan_singh) December 10, 2021 -
లంక ప్రీమియర్ లీగ్‌లో ఐపీఎల్ విధ్వంసకర వీరులు
Gayle, Du Plessis Among LPL 2021 Picks: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విధ్వంసకర వీరులు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న లంక ప్రీమియర్ లీగ్-2021లోనూ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్-2021లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించి రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచిన డుప్లెసిస్, పంజాబ్ కింగ్స్ తరఫున రాణించిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, సీఎస్కే తరఫున బౌలింగ్‌లో సత్తా చాటిన ఇమ్రన్ తాహిర్ తదితర ఆటగాళ్లతో పాటు టీ20 నంబర్ వన్ బౌలర్, దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రేజ్ షంషి, పాక్ స్టార్ ఆల్‌రౌండర్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు మెరుపు ప్రదర్శనలతో అలరించేందుకు రెడీ అయ్యారు. వీరే కాకుండా బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్, విండీస్ రోవ్‌మన్ పావెల్, లంక స్టార్ ఆటగాళ్లు ఏంజెలో మాథ్యూస్, కుశాల్ పెరీరా, అఖిల ధనంజయ, దినేశ్ చండీమాల్, ధనంజయ డిసిల్వ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు వివిధ ఫ్రాంఛైజీల తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం 5 జట్ల(కొలొంబో స్టార్స్, దంబుల్లా జెయింట్స్, గాలే గ్లాడియేటర్స్, జాఫ్నా కింగ్స్, కాండీ వారియర్స్)తో జరగనున్న ఈ లీగ్ డిసెంబర్ 5 నుంచి 23 వరకు జరగనుంది. చదవండి: ట్విటర్లో సచిన్ హవా.. విశ్వవ్యాప్త సర్వేలో మోదీ తర్వాతి స్థానం -
దుమ్మురేపిన తాహిర్; హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్లు
లండన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ టోర్నీలో దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ దుమ్మురేపాడు. తొలిసారి జరుగుతున్న ఈ టోర్నీలో హ్యాట్రిక్‌తో మెరిసిన తాహిర్.. ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. టోర్నీలో అరుదైన ఫీట్ అందుకున్న తొలి బౌలర్‌గా తాహిర్ రికార్డులకెక్కాడు. వెల్ష్‌ఫైర్‌తో సోమవారం బర్మింగ్హమ్ ఫొనిక్స్, వెల్ష్‌ఫైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఇమ్రాన్ తాహిర్ మెరుపులతో బర్మింగ్హమ్ కీలకదశలో విజయాన్ని అందుకొని టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఖయాస్ అహ్మద్, మాట్ మిల్నెస్, డేవిడ్ పైన్ రూపంలో హ్యాట్రిక్‌ను అందుకున్న తాహిర్ అంతకముందు గ్లెన్ ఫిలిప్స్, లూస్ డూ ప్లూయ్లను కూడా ఔట్ చేసి మొత్తం ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫోనిక్స్ విల్ సిమిద్(65 నాటౌట్), మొయిన్ అలీ(59) మెరుపులతో 100 బంతుల్లో 184 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెల్ష్‌ఫైర్ తాహిర్ దెబ్బకు 74 బంతుల్లోనే 91 పరుగులకు కుప్పకూలింది. ఇయాన్ కాక్బైన్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో బర్మింగ్హమ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ట్రెంట్ రాకెట్స్‌తో సమానంగా ఉన్న బర్మింగ్హమ్ మెరుగైన రన్‌రేట్‌తో తొలిస్థానంలో ఉంది. ఇక ట్రెంట్ రాకెట్స్ ఏడో స్థానంలో నిలించింది. -
Imran Tahir: అందుకే సీక్రెట్‌గా ప్రాక్టీస్ చేస్తా
ముంబై: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్ ఇమ్రాన్ తాహిర్ తన స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాహిర్ స్వేర్‌లెగ్ నుంచి ఆర్సీబీ ఆటగాడు జేమిసన్‌ను డైరెక్ట్ త్రో ద్వారా రనౌట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాహిర్ చేసిన రనౌట్‌పై రకరకాల మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఈ వయసులోనూ ఫీల్డింగ్‌లో ఇరగదీసిన తాహిర్‌ను మీ సీక్రెట్ ఎంటో చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు తాహిర్ మ్యాచ్ విజయం అనంతరం బదులిచ్చాడు. మ్యాచ్ అనంతరం ఆల్‌రౌండర్ జడేజాతో జరిగిన ఇంటర్య్వూలో తాహిర్ మాట్లాడాడు. ''ఈ విషయంలో మాత్రం నేను జడేజా నుంచి ఇన్స్పైర్ అయ్యాను. తానెంత మంచి ఫీల్డరో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే మనం ఆడేది ప్రోఫెషనల్ క్రికెట్.. ఫీల్డింగ్ చేయకపోతే కుదరదు. అయితే నా వయసు పెద్దది కావడంతో నేను మెరుపు ఫీల్డింగ్‌లు చేయగలనా అన్న సందేహం మీకు వచ్చింది. నిజానికి నేను నెట్స్‌లో ఎవరకి తెలియకుండా ఫీల్డింగ్‌ను ప్రాక్టీస్ చేస్తా. మా జట్టులోనే జడేజా లాంటి మెరుపు ఫీల్డర్ ఉన్నాడు. అతన్ని అందుకోవాలంటే ఈ మాత్రం ప్రాక్టీస్ లేకపోతే కష్టం'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. ఇక జడేజా కూడా తాహిర్ ప్రదర్శనపై స్పందించాడు. ''తాహిర్‌కు 42 ఏళ్లు అంటే నమ్మలేకపోయా.. ఈరోజు మ్యాచ్‌లో అతను ఫీల్డింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. కానీ అతని వయసుకు నేను వచ్చేసరికి నా ఫీల్డింగ్ ఇప్పుడున్నంత స్ట్రాంగ్‌గా ఉంటుందని అనుకోను'' అంటూ తెలిపాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 69 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయాన్ని అందుకుంది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన సంగతి తెలిసిందే. ముందు బ్యాటింగ్‌లో ఆఖరి ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించి 37 పరుగులు రాబట్టిన జడ్డూ మొత్తంగా 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత బంతితోనూ మ్యాజిక్ చేసి మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన తాహిర్ మెరుపు రనౌట్‌తో పాటు బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక సీఎస్కే తన తర్వాతి మ్యాచ్‌ను ఢిల్లీ వేదికగా ఏప్రిల్ 28న ఎస్ఆర్హెచ్తో తలపడనుంది. చదవండి: తాహిర్ సూపర్ రనౌట్.. ఈ వయసులోనూ Last-over carnage 💪 Lightning-quick fielding ⚡️ A bowling spectacle 👌 Man of the moment @imjadeja & @ImranTahirSA discuss it all after @ChennaiIPL's convincing win at Wankhede. 👍 👍 - By @NishadPaiVaidya #VIVOIPL #CSKvRCB Full interview 🎥 👇https://t.co/qoedmUUpQb pic.twitter.com/WZCaq95TaI — IndianPremierLeague (@IPL) April 26, 2021 -
తాహిర్ సూపర్ రనౌట్.. ఈ వయసులోనూ
ముంబై: ఆర్సీబీతో మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ సూపర్ రనౌట్‌తో మెరిశాడు. ఈ సీజన్లో తాహిర్‌కు ఇదే మొదటి మ్యాచ్.. కాగా ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతిని జేమిసన్ స్వేర్‌లెగ్ దిశగా ఆడాడు. అయితే తర్వాతి ఓవర్ స్ట్రైక్ తీసుకోవాలని భావించిన జేమిసన్ చహల్‌కు కాల్ ఇచ్చాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న చహల్ క్రీజు నుంచి కదిలి పరుగు రావడం కష్టమని భావించి మళ్లీ వెనక్కి వచ్చేశాడు. అయితే జేమిసన్ క్రీజు వదిలి ముందుకు రావడం.. అప్పటికే స్వేర్‌లెగ్‌లో ఉన్న తాహిర్ డైరెక్ట్ త్రో విసరడంతో నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో జేమిసన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. తాహిర్ చేసిన రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''తాహిర్ వచ్చీ రావడంతోనే ఇరగదీశావ్.. ఈ వయసులోనూ సూపర్ డైరెక్ట్ త్రో..'' అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇక బౌలింగ్‌లోనూ తాహిర్ మెరిశాడు. 4 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.అందుకుంది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. పడిక్కల్(34) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మ్యాక్స్‌వెల్ 22 పరుగులు చేయగా.. మిగతావారు సీఎస్కే బౌలర్ల దాటికి అలా వచ్చి ఇలా వెళ్లారు. సీఎస్కే బౌలర్లలో జడేజా 3, తాహిర్ 2, శార్ధూల్, సామ్ కరన్ చెరో వికెట్ తీశారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటింగ్‌లో జడేజా 62 నాటౌట్ మెరుపులు మెరిపించగా.. డుప్లెసిస్ 50 పరుగులతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చహల్ ఒక వికెట్ తీశారు. చదవండి : ఒక్క ఓవర్.. 37 పరుగులు.. జడ్డూ విధ్వంసం pic.twitter.com/WefCKRyqTd — Aditya Das (@lodulalit001) April 25, 2021 -
ఉత్తమ జట్టు బరిలో ఉంది.. నా అవసరం వచ్చినప్పుడు చూద్దాం
ముంబై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సీఎస్కే జట్టు.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సొంతం చేసుకుని నాలుగో టైటిల్ దిశగా అడుగులేస్తుంది. అయితే, చెన్నై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు స్థానం లభించకపోవడంపై అతని అభిమాని ఒకరు ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. దీనికి తాహిర్ బదులిస్తూ చేసిన రిటర్న్ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ ట్వీట్లో తాహిర్ సదరు అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రస్తుతం చెన్నై తమ అత్యుత్తమ జట్టుతో బరిలో ఉందని, వారు మైదానంలో ఉత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నారని, చెన్నై జట్టు సభ్యుడిగా ఉన్నందుకు గర్విస్తున్నానని, జట్టుకు తన సేవలు అవసరమైనప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు సిద్ధంగా ఉన్నానని బదులిచ్చాడు. Thank you https://t.co/CwOFkDXgPq players are in the field and they are delivering and they should continue for the teams benefit.Its not about me.Its about the team.Iam extremely proud to be a part of this wonderful team.If Iam needed sometime I will give my best for the team https://t.co/Wh6PJ0dYHV — Imran Tahir (@ImranTahirSA) April 19, 2021 కాగా, 2018 ఐపీఎల్ నుంచి చెన్నై జట్టు సభ్యుడిగా కొనసాగుతున్న తాహిర్.. తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను గతేడాది పంజాబ్ కింగ్స్‌తో ఆడాడు. గడిచిన మూడు సీజన్లలో తాహిర్ లేకుండా చెన్నై జట్టు బరిలోకి దిగడం చాలా అరుదుగా చూశాం. తాహిర్ తన ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 58 మ్యాచ్‌ల్లో 16.15 స్ట్రయిక్ రేట్‌తో 80 వికెట్లు పడగొట్టాడు. చెన్నై ఫ్రాంఛైజీ తరఫున 26 మ్యాచ్‌లు ఆడిన ఈ సఫారీ లెగ్ స్పిన్నర్.. 33 వికెట్లు సాధించాడు. తాహిర్.. చెన్నై తరఫున ఆడిన తొలి సీజన్లోనే(2018) సీఎస్కే టైటిల్ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే సీజన్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమిపాలైన ధోని సేన... ఆతరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో(పంజాబ్, రాజస్థాన్) విజయం సాధించి జోరుమీదుంది. బుధవారం(ఏప్రిల్ 21న) కేకేఆర్‌తో జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో కూడా విజయ ఢంకా మోగించి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. చదవండి: వాషింగ్టన్, పడిక్కల్‌లకు బంపర్ ఆఫర్.. -
మా లయన్ వచ్చేశాడు : సీఎస్కే ఫ్యాన్స్
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌కు తాను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ పేర్కొన్నాడు. కాగా తాహిర్ ఐపీఎల్లో సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్లో తాహిర్ కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కాగా ఇటీవలే సీఎస్కే కలిసిన ఇమ్రాన్ తాహిర్ తన ప్రాక్టీస్‌ను ఆరంభించాడు. స్పిన్ బౌలింగ్‌తో ఎక్కువసేపు నెట్స్‌లో గడిపిన వీడియోనూ సీఎస్కే తన ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియయాలో వైరల్‌గా మారింది. మా లయన్ వచ్చేశాడు.. అంటూ కామెంట్లు పెట్టారు. తాహిర్‌కు పరాశక్తి ఎక్స్‌ప్రెస్ అనే మరో పేరు ఉన్న సంగతి తెలిసిందే.కాగా గతేడాది సీజన్లో సీఎస్కే దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మొత్తం 14 మ్యాచ్‌లాడిన సీఎస్కే 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. చదవండి: సీఎస్కేతో ఆసీస్ పేసర్ ఒప్పందం Sakthi kodu! Parasakthi Express all set to weave his magic this #Summerof2021 #WhistlePodu #Yellove 🦁💛 @ImranTahirSA pic.twitter.com/jhkJ1Osn5u — Chennai Super Kings (@ChennaiIPL) April 9, 2021 -
ఈ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్ కాబోతోందా?!
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ టోర్నీకి తెరలేవనుంది. కరోనా భయాల నేపథ్యంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ క్రీడాభిమానులకు వినోదం పంచేందుకు క్రికెటర్లు సిద్ధమైపోయారు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ ఈసారి భారత్‌లోనే జరగనుండటంతో అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. అయితే, కొన్ని ఊహాగానాలు మాత్రం స్టార్ ఆటగాళ్ల ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. ఈ సీజన్ తర్వాత తమ ఆరాధ్య క్రికెటర్లు లీగ్‌కు వీడ్కోలు పలుకనున్నారనే వార్తలు వారి మదిని మెలిపెడుతున్నాయి. తెరమీదకు వచ్చిన ఆ ఆటగాళ్లు ఎవరో పరిశీలిద్దాం. ఎంఎస్ ధోని(2008) టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ సింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని. సీఎస్కేను మూడుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత అతడి సొంతం. అంతేకాదు ఐదుసార్లు రన్నరప్... ఒక్కసారి మినహా ఆడిన ప్రతీ సీజన్లో టాప్–4లో స్థానం... ఐపీఎల్లో అత్యంత నిలకడైన జట్టుగా సీఎస్కే రికార్డు సాధించడంలో ధోని పాత్ర మరువలేనిది. విజయవంతమైన కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న ధోని ఐపీఎల్లో ఇప్పటివరకు 204 మ్యాచ్‌లు ఆడి 4632 పరుగులు చేశాడు. ఇక గతేడాది ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టర్ కూల్, ఈ సీజన్ తర్వాత సీఎస్‌కు కెప్టెన్‌గా రిటైర్ అయి మెంటార్‌గా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ధోనిలో అత్యుత్తమ క్రికెట్ ఆడగలిగే సత్తా ఇంకా ఉందని, అతను మరిన్ని ఐపీఎల్‌లు ఆడగలడని, ఐపీఎల్ 2021 కచ్చితంగా అతనికి ఆఖరి ఐపీఎల్ కాబోదని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. హర్భజన్ సింగ్(2008) టీమిండియా వెటరన్ ప్లేయర్ చాలాకాలం పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అదేవిధంగా, సీఎస్కే తరఫున కూడా మైదానంలో దిగిన భజ్జీ.. ఇప్పటివరకు 160 మ్యాచ్‌లు ఆడి 150 వికెట్లు తీశాడు. అంతేకాదు, 829 పరుగులు చేశాడు. ఇక సీఎస్కే అతడిని వదులుకోవడంతో మినీ వేలం-2021లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ హర్భజన్‌ను కొనుగోలు చేసింది. ఇక 38 ఏళ్ల భజ్జీ, ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు స్వస్తి పలుకనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రిస్‌గేల్(2009) విధ్వంసకర విండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ పేరిట ఐపీఎల్లో ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యధిక సిక్సర్లు (349), ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు(17), అత్యధిక వ్యక్తిగత స్కోరు(175 నాటౌట్), అత్యధిక సెంచరీలు (6), ఫాస్టెస్ట్ సెంచరీ(30 బంతుల్లో) నమోదు చేసిన ఘనత అతడి సొంతం. ఇప్పటివరకు 132 మ్యాచ్‌లలో 4772 పరుగులు చేసిన 42 ఏళ్ల క్రిస్‌గేల్, ఐపీఎల్-2021 తర్వాత క్యాష్ రిచ్‌లీగ్‌కు గుడ్ బై చెప్పనున్నాడనే ఊహాగానాలు విస్త్రృతమవుతున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ తరఫున గేల్ మైదానంలోకి దిగనున్నాడు. గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. ఏబీ డివిలియర్స్(2011) అభిమానులు ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకునే దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్. ఐపీఎల్లో ఇప్పటివరకు 169 మ్యాచ్‌లు ఆడి, 4849 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ సీజన్ తర్వాత ఐపీఎల్లో ఏబీడీ మెరుపు విన్యాసాలు చూసే అవకాశం ఉండదనే వార్తలు క్రీడా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్ విభాగంలోనూ పటిష్టంగా కనిపిస్తున్న ఆర్సీబీ.. కనీసం ఈసారైనా కప్ గెలిస్తే.. ఏబీడీ సగర్వంగా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇమ్రాన్ తాహిర్(2014) 2014లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు సౌతాఫ్రికా ఆటగాడు ఇమ్రాన్ తాహిర్. ఇప్పటి వరకు 58 మ్యాచ్‌లు ఆడిన ఈ స్పిన్ బౌలర్ 80 వికెట్లు తీశాడు. సీఎస్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు 2018లో జట్టు టైటిల్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ఈ సీజన్ తర్వాత 41 ఏళ్ల తాహిర్ ఐపీఎల్ నుంచి వైదొలగాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. చదవండి: ఐపీఎల్ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?! -
వికెట్ తీయగానే జెర్సీ విప్పేసిన తాహిర్
కరాచీ: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాహిర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బుధవారం క్వెటా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీసిన ఆనందంలో జెర్సీ విప్పేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. అయితే తాహిర్ ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే.. గత జనవరి 10న పాకిస్తాన్ లోకల్ క్రికెటర్ తాహిర్ ముగల్ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 503 వికెట్లు తీసిన 43 ఏళ్ల ముగల్ ప్రస్తుతం లాహారి కోచ్‌గా పనిచేసేవాడు. ఆయన మృతికి నివాళిగా తాహిర్ జెర్సీ తీసేశాడు. అయితే తాహిర్.. ముగల్ ఫోటో ఉన్న షర్ట్‌ను ధరించి అతనికి ఘనమైన నివాళి అందించాడు. "మై బ్రదర్ మిస్ యూ.. రిప్" అంటూ షర్ట్‌పై రాసి ఉంది. తాహిర్ చర్యతో ఆశ్యర్యపోయిన సహచర ఆటగాళ్లు తర్వాత విషయం తెలుసుకొని అతన్ని అభినందనలతో ముంచెత్తారు. కాగా ఇమ్రాన్ తాహిర్ పీఎస్ఎల్లో బుధవారం ఆడిన మొదటి మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఈ వీడియోనూ పీఎస్ఎల్ ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల 176 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ (51 బంతుల్లో 81, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్ 19.4 ఓవర్లలో 154 పరుగులు చేసి ఆలౌటైంది. ముల్తాన్ ఇన్నింగ్స్‌లో ఎవరు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.. గ్లాడియేటర్స్ బౌలర్లలో కైస్ అహ్మద్ 3 వికెట్లతో రాణించాడు. చదవండి: 1889 తర్వాత మళ్లీ ఇప్పుడే.. రెచ్చిపోయిన పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు 'ఆ వ్యాఖ్యలు చేసుంటే నన్ను క్షమించండి' A touching tribute by @ImranTahirSA for Tahir Mughal, the Pakistani ex-cricketer who passed away earlier this year. #HBLPSL6 | #MatchDikhao | #QGvMS pic.twitter.com/TCqoWLT5BO — PakistanSuperLeague (@thePSLt20) March 3, 2021 -
డుప్లెసిస్ డ్రింక్స్ మోయలేదా?
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో సీఎస్కే కథ దాదాపు ముగిసినట్లే. ఇప్పటికే 10 మ్యాచ్‌లాడి ఏడు పరాజయాలను చూసిన సీఎస్కే ప్లేఆఫ్ రేసులో ఉండే అవకాశం ఎలా చూసినా కనబడుటం లేదు. ఇక మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిచినా సీఎస్కేకు అవకాశం ఉండకపోవచ్చు. ప్రధానం సీఎస్కే జట్టులో ఉన్న స్వదేశీ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబర్చకపోవడంతోనే ఆ జట్టు దారుణంగా డీలా పడిందనేది వాస్తవం. ఇక విదేశీ ఆటగాళ్లు జట్టులో ఉన్నా తుది జట్టులో ఉండేది నలుగురు మాత్రమే కావడంతో ఇమ్రాన్ తాహీర్‌కు సైతం అవకాశం దక్కలేదు. వాట్సన్, డుప్లెసిస్, బ్రేవో, సామ్ కరాన్లకే పెద్ద పీట వేయడంతో తాహీర్ ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యాడు. ఆల్ రౌండర్ల కోటాలో కరాన్ వైపే ధోని మొగ్గుచూపడంతో తాహీర్‌కు మొండిచేయి ఎదురైంది. గతేడాది 26 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను అందుకున్న బౌలర్ తాహీర్ కూడా రిజర్వ్ బెంచ్‌లో పెట్టడాన్ని చాలామంది ప్రశ్నించారు. ఇప్పటికే సీఎస్కేకు జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆడబోయే తదుపరి మ్యాచ్‌ల్లో తాహీర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. డ్వేన్ బ్రేవో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో తాహీర్‌కు తుది జట్టులో ఆడేది ఖాయంగానే ఉంది. (మీ ఆప్షన్ ఏది.. ఆరు సిక్స్‌లా.. సెంచరీనా?) కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో తన యూట్యూబ్ చానల్లో మాట్లాడిన తాహీర్ కొన్ని విషయాలను పంచుకున్నాడు. ‘ నాకు సీఎస్కే నుంచి అందే సహకారం మరవలేనిది. ఒక ఫ్రాంచైజీ ఇంత రెస్పెక్ట్ ఇవ్వడం నేను ఎక్కడా చూడలేదు. నన్ను సీఎస్కే చాలా గౌరవిస్తుంది. ఆల్ ఓవర్ వరల్డ్‌లో నా అత్యుత్తమ జట్టు సీఎస్కే. ఒక కుటుంబలో ఉన్న ఫీలింగ్ సీఎస్కేలో ఉంటుంది. సీఎస్కే ఫ్యాన్స్ కూడా ఆటగాళ్లపై నమ్మశక్యం కాని ప్రేమ కురిపిస్తారు. చాలా భిన్న వాతావరణాల్లో ఆడినా ఇక్కడ కల్చర్‌ను ఇష్టపడతా. వారు(సీఎస్కే మేనేజ్మెంట్) ప్రదర్శన గురించి ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడూ మద్దతుగా ఉంటారు. క్రికెట్లో ఒక రోజు రాణించొచ్చు.. మరొకరోజు ఫెయిల్ కావొచ్చు.. సపోర్ట్ అనేది ముఖ్యం’ అని తాహీర్ చెప్పుకొచ్చాడు. ఇక నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలనే నిబంధనతోనే తనకు ఆడే అవకాశం రాలేదన్నాడు. తాను ఆడకుండా ఆటగాళ్లకు డ్రింక్స్ తీసుకెళ్లడాన్ని కొంతమంది హేళన చేశారని, అది ఆటలో భాగమేనని తాహీర్ అన్నాడు. గతంలో సీజన్ మొత్తం డుప్లెసిస్ కూడా డ్రింక్స్‌ను అందించిన విషయాన్ని గుర్తుచేశాడు. టీ20 యావరేజ్ల్లో మెరుగ్గా ఉన్న డుప్లెసిస్ అప్పుడు అలా డ్రింక్స్ మోయడం కాస్త బాధనిపించినా కొన్ని పరిస్థితుల్లో తప్పదన్నాడు. అప్పుడు డుప్లెసిస్ ఎలా ఫీలై ఉంటాడో తనకు తెలుసన్నాడు. ఇప్పుడు అదే పని తాను చేస్తున్నా అది జట్టు కోసమేనని తాహీర్ తెలిపాడు.(గంభీర్.. ఇప్పుడేమంటావ్?) -
'డ్రింక్స్ అందిస్తే తప్పేంటి.. ఏదైనా జట్టు కోసమే'
దుబాయ్ : దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్.. 2019 ఐపీఎల్ సీజన్లో సీఎస్కే తరపున 17 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. సీఎస్కే ఫైనల్ చేరడంలో తాహిర్ కీలకంగా వ్యవహరించాడు. కానీ యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్లో మాత్రం తాహిర్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే సీఎస్కే ఆడిన మ్యాచ్‌ల్లో విరామం మధ్యలో తాహిర్ చెన్నై ఆటగాళ్లకు డ్రింక్స్ అందించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక అంతర్జాతీయ బౌలర్ ఇలా డ్రింక్స్ మోయడం ఏంటని కామెంట్స్ చేశారు. తాజాగా నెటిజన్లు చేసిన కామెంట్స్‌పై తాహిర్ బుధవారం ట్విటర్లో స్పందించాడు. డ్రింక్స్ మోయడంలో తప్పేమి ఉందని.. ఏం చేసినా జట్టుకోసమేనని పేర్కొన్నాడు. (చదవండి : అంతా ధోని వల్లే..: ఆర్సీబీ బౌలర్) 'నేను చెన్నై తరపున చాలాసార్లు మ్యాచ్‌లు ఆడినప్పుడు చాలా మంది నాకు డ్రింక్స్ అందించారు. ఇప్పుడు నాకన్నా బాగా ఆడుతున్న ఆటగాళ్లకు డ్రింక్స్ అందించడంలో తప్పేముంది. అయినా పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. నేను ఆడుతున్నానా లేదా అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు.. జట్టు గెలుపు నాకు ముఖ్యం కాదు.. ఏం చేసినా జట్టు కోసమే. ఒకవేళ నాకే అవకాశం వస్తే బెస్ట్ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. అవకాశాలు ఈసారి రాలేదు.. అందుకే డ్రింక్స్ అందించా. నా దృష్టిలో జట్టు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నా.' అని చెప్పుకొచ్చాడు. కాగా యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్లో సీఎస్కే తన జట్టులో విదేశీ ఆటగాళ్లుగా షేన్ వాట్సన్, సామ్ కరన్, డు ప్లెసిస్, డ్వేన్ బ్రేవోలకు చోటు కల్పించడంతో తాహిర్‌కు అవకాశం రాలేదు. చెన్నై ఆడిన 8 మ్యాచ్‌ల్లో దాదాపు వీరితోనే బరిలోకి దిగింది. వాట్సన్, డుప్లెసిస్‌లు చెన్నైకి బ్యాటింగ్‌లో కీలకంగా మారగా.. బ్రావో, కరన్‌లు ఆల్రౌండర్లుగా సీఎస్కేలో కొనసాగుతూ వస్తున్నారు. ఈ సీజన్లో వాట్సన్ రెండు అర్థసెంచరీలతో 281 పరుగులు, డుస్లెసిస్ 307 పరుగులతో మంచి ప్రదర్శన చేస్తుండగా.. బ్రావో 5 వికెట్లు తీయగా.. కరన్ ఆల్‌రౌండర్‌గా మంచి ప్రదర్శన కనబరుస్తూ కీలక వికెట్లు తీస్తున్నాడు. ఈ సీజన్లో చెన్నై నుంచి అనుకున్నంత ప్రదర్శన రావడం లేదు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి చెన్నై ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోతుంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు.. ఐదు ఓటమిలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. (చదవండి : ఇలాంటివి ధోనికి మాత్రమే సాధ్యం) -
'మలింగ రూపంలో దురదృష్టం వెంటాడింది'
2019 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ అనడంలో సందేహం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్ ఇది. ఎందుకంటే ఇరు జట్ల మధ్య ఆఖరి బంతి వరకు విజయం దోబుచులాడిన చివరకు ఒక్క పరుగు తేడాతో చెన్నై ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానుల గుండెలు బరువెక్కిపోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ 25 బంతుల్లో 41 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. బలమైన బ్యాటింగ్ లైనఫ్ కలిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఈ టార్గెట్ పెద్ద కష్టమని ఎంత మాత్రం అనిపించలేదు, అందుకు తగ్గట్టుగానే ఓపెనర్ షేన్ వాట్సన్ 59 బంతుల్లోనే 80 పరుగులు చేయడంతో సూపర్ కింగ్స్ విజయానికి చేరువగా వచ్చింది. అయితే చివర్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. దీనికి తోడు స్టార్ బౌలర్ లసిత్ మలింగ ఆఖరి ఓవర్లో చేసిన మ్యాజిక్‌తో చెన్నై విజయానికి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయి ఓడిపోవాల్సి వచ్చింది.దీంతో ముంబై ఇండియన్స్ నాలుగోసారి ఐపీఎల్ టైటిల్‌ను చేజెక్కించుకుంది. తాజాగా అప్పటి ఫైనల్లో ఓడిపోయిన చెన్నై జట్టులో సభ్యుడిగా ఉన్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మరోసారి ఆ మ్యాచ్‌ను గుర్తుచేసుకున్నాడు. అనిస్ సాజన్ నిర్వహించిన ఇన్‌స్టా లైవ్ చాట్‌లో పాల్గొన్న తాహిర్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'ఆ ఫైనల్ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగుతో ఓడిపోవడం నా గుండెను బద్దలయ్యేలా చేసింది. ఎందుకంటే లీగ్‌లో మేము అప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లో గెలుచుకుంటే వచ్చాం. అందులో పెద్ద టీమ్స్ కూడా ఉన్నాయి... వాటిని కూడా రెండేసి సార్లు ఓడించాం. ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు జట్టుతో జర్నీ చేసిన నేను ఫైనల్లో కేవలం ఒక్కపరుగుతో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయా. మాకు టైటిల్ దూరం కావడానికి ఒక్క పరుగే తేడా.. కానీ ఆ ఒక్క పరుగే మమ్మల్ని టైటిల్‌కు దూరం చేసింది. మేం కష్టపడ్డాం.. గెలుపుకోసం ప్రయత్నించాం.అయినా గెలుపోటములు అనేది మన చేతిలో ఉండవు.(తండ్రైన హార్దిక్ పాండ్యా..) నిజానికి ఆ మ్యాచ్ ఈజీగా గెలవాల్సింది..వాట్సన్ మంచి ఆరంభాన్నిచ్చాడు. శార్థుల్ ఠాకూర్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ లసిత్ మలింగ రూపంలో దురదృష్టం మమల్ని వెంటాడింది. మలింగ ఆరోజు ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒత్తిడిని తట్టుకొని మరీ బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగుతో ముంబైకి టైటిల్ కట్టబెట్టాడు. నిజంగా ప్రపంచంలో మలింగ అత్యుత్తమ బౌలర్ అనడంలో సందేహం లేదు. కానీ ఏం చేస్తాం.. మాది కాని రోజు ఇలాగే ఉంటుంది అని ఆ క్షణంలో నాకు అనిపించింది' అంటూ పేర్కొన్నాడు.కాగా కరోనాతో వాయిదా పడిన ఐపీఎల్ 13 వ సీజన్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 మొదలుకానుంది. 51 రోజులు పాటు జగరునున్న ఐపీఎల్ 13 సీజన్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 8న జరగనుంది. -
తాహీర్ ఓవరాక్షన్ చూడలేకపోతున్నా!
రావల్పిండి: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన లెగ్ బ్రేక్‌లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే తాహీర్.. వికెట్ తీసిన సందర్భంలో సంబరాలు చేసుకోవడం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. వికెట్ తీస్తే చాలు రెండు చేతులను చాచుకుంటూ మైదానంలో కలియదిరుగుతాడు. అయితే తాహీర్ ఈ తరహా సెలబ్రేషన్స్‌ను చూడలేకపోతున్నామంటున్నాడు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కొలిన్ మున్రో. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా ఆదివారం ముల్తాన్ సుల్తాన్స్- ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్ తరఫున మున్రో ఆడుతుండగా, ముల్తాన్ సుల్తాన్స్ తరఫున తాహీర్ ఆడుతున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో మున్రోను ఔట్ చేసిన తర్వాత తాహీర్ తన సెలబ్రేషన్స్‌కు పని చెప్పాడు. ఈ క్రమంలోనే తాహీర్‌కు మున్రోకు మాటల యుద్ధం జరిగింది. పెవిలియన్‌కు వెళుతూ మున్రో ఏదో అనగా, దానికి తాహీర్ రిప్లే ఇచ్చాడు. అయితే దీనిపై పాకిస్తాన్ జర్నలిస్ట్ సాజ్ సాదిక్.. మున్రోను వివరణ కోరగా తాహీర్ ఓవరాక్షన్ చూడలేకపోతున్నామనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ‘ నేను తాహీర్ సెలబ్రేషన్స్ చూడలేకపోతున్నా. ఆ సెలబ్రేషన్స్ చూసి చూసి అలసిపోయా. సర్కస్‌లో చేసే ఫీట్లా ఉంటుంది అతని సెలబ్రేషన్. అది సరైన సెలబ్రేషన్స్ కాదు. అతను నాతో వాగ్వాదానికి దిగిన క్రమంలో ఎలా ప్రవర్తించాడో మీరు చూశారు కదా. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం’ అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ 9 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) విజయం సాధించింది. ఇస్లామాబాద్ నిర్దేశించిన 92 పరుగుల టార్గెట్‌ను ముల్తాన్ సుల్తాన్స్ వికెట్ కోల్పోయి ఛేదించింది. జేమ్స్ విన్సే(61 నాటౌట్) ముల్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ముల్తాన్ సుల్తాన్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్ ప్లేఆఫ్‌కు చేరడం ఇదే తొలిసారి. కాగా, ఈ సీజన్లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టు కూడా సుల్తాన్సే. -
చెలరేగిన సొహైల్.. దక్షిణాఫ్రికా లక్ష్యం 309
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్‌లో మెరిసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 309 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. హరీస్ సొహైల్(89; 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా, బాబర్ అజామ్(69), ఇమాముల్ హక్(44), ఫకార్ జమాన్(44)లు రాణించడంతో పాకిస్తాన్ మూడొందల పరుగుల మార్కును చేరింది. ఇన్నింగ్స్‌ను ఇమాముల్ హక్- ఫకార్ జమాన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగులు జత చేసిన తర్వాత ఫకార్ జమాన్(44; 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు. సఫారీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ వేసిన 15 ఓవర్ ఐదో బంతికి ఫకార్ జమాన్ పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ఇమాముల్ హక్కు బాబర్ అజామ్ జత కలిశాడు. ఈ జోడి 17 పరుగులు జత చేసిన తర్వాత ఇమాముల్ హక్(44; 57 బంతుల్లో 6 ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై మహ్మద్ హఫీజ్(20) నిరాశపరిచాడు. కాగా, హరీస్ సొహైల్ మెరుపులు మెరిపించి పాక్ స్కోరును గాడిలో పెట్టాడు. బాబర్ అజామ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే అజామ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.(ఇక్కడ చదవండి: ఇమ్రాన్ తాహీర్ ‘వరల్డ్‌కప్’ రికార్డు) ఈ జోడి 81 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత అజామ్ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ సమయంలో సోహైల్‌కు ఇమాద్ వసీం కలిశాడు. వీరిద్దరూ 71 పరుగుల జత చేసిన తర్వాత ఇమాద్(23) ఐదో వికెట్‌గా ఔట్ కాగా, కాసేపటికి వహాబ్ రియాజ్(4) పెవిలియన్ చేరాడు. మరో మూడు పరుగుల వ్యవధిలో సొహైల్ కూడా ఔట్ కావడంతో స్కోరు వేగం తగ్గింది. దాంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఇదిలా ఉంచితే, పాక్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఇక్కడ గమనార్హం. చివరి ఓవర్లో రెండు బంతులు ఆడిన సర్పరాజ్ రెండు పరుగులు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్ రెండు వికెట్లు తీశాడు. ఫెహ్లుక్వోయో, మర్కరమ్‌లకు తలో వికెట్ లభించింది. -
ఇమ్రాన్ తాహీర్ రికార్డు
-
ఇమ్రాన్ తాహీర్ ‘వరల్డ్‌కప్’ రికార్డు
లండన్: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తాహీర్ ఈ ఫీట్ సాధించాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో భాగంగా తాహీర్ వేసిన 21 ఓవర్ మూడో బంతికి ఇమాముల్ హక్‌ను ఔట్ చేయడంతో వరల్డ్‌కప్‌లో సఫారీ జట్టు తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇది తాహీర్‌కు 39వ వరల్డ్‌కప్ వికెట్. దాంతో అలెన్ డొనాల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. (ఇక్కడ చదవండి: ఒకే స్కోరు.. ఒకే బౌలర్) 2003 వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్ గుడ్ బై చెప్పిన డొనాల్డ్.. ఓవరాల్‌గా వరల్డ్‌కప్‌లో 38 వికెట్లు సాధించాడు. తాజాగా ఆ రికార్డును తాహీర్ బ్రేక్ చేశాడు. పాక్‌తో మ్యాచ్‌లో మరో ఓపెనర్ ఫకార్ జమాన్ ఔట్ చేసిన తర్వాత డొనాల్డ్ సరసన చేరిన తాహీర్.. మరి కాసేపటికి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఇమాముల్ హక్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అందుకున్న తాహీర్.. ఇప్పటివరకూ ఈ వరల్డ్‌కప్‌లో 10 వికెట్లను ఖాతాలో వేసుకోవడం మరో విశేషం. -
ప్రపంచకప్ చరిత్రలోనే తొలి స్పిన్నర్‌గా
లండన్: ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ 2019 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నేడు ఆతిథ్య ఇంగ్లండ్- దక్షిణాఫ్రికా మధ్య ఓవల్ మైదానంలో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ సమరం ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు జరిగిన 11 ప్రపంచకప్‌లలో ఎవరికి దక్కని అరుదైన ఘనత అతడికి దక్కింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రొటీస్ జట్టు సారథి డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలి ఓవర్ వేసేందుకు తాహీర్‌కు డుప్లెసిస్ బంతిని అప్పగించాడు. దీంతో 11 ప్రపంచకప్‌ల నుంచి వస్తున్న ఆనవాయితీని డుప్లెసిస్ తెరదించి స్పిన్నర్‌తో తొలి ఓవర్ వేయించాడు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ప్రపంచకప్‌లోనే తొలిసారి స్పిన్నర్‌తో తొలి ఓవర్ 1975 తొలి ప్రపంచకప్‌లో టీమిండియా పేస్ బౌలర్ మదన్‌లాల్ తొలి ఓవర్ వేసి చరిత్రలో నిలిచిపోగా.. వెస్టిండీస్ బౌలర్ రాబర్ట్స్(1979లో), న్యూజిలాండ్ దిగ్గజ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ(1983), శ్రీలంక బౌలర్ వినోథెన్(1987), ఆసీస్ బౌలర్ డెర్మాట్(1992), ఇంగ్లండ్ బౌలర్లు కార్క్(1996), గాఫ్(1999), ప్రొటీస్ బౌలర్ పొలాక్(2003), పాక్ బౌలర్ ఉమర్ గుల్(2007), 2011లో బంగ్లా బౌలర్ ఇస్లాం(2011), లంక బౌలర్ కులశేఖర్(2015)లు ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌లలో తొలి ఓవర్ బౌలింగ్ చేశారు. వీరందరూ పేస్ బౌలర్లు కాగా తాజా ప్రపంచకప్‌లో స్పిన్నర్ తొలి ఓవర్ వేయడం విశేషం. ఇక తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెయిర్ స్టోను గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు పంపించి దక్షిణాఫ్రికాకు అదిరే ఆరంభాన్ని అందించాడు. ఇక బెయిర్ స్టోతో పాడు ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్ వికెట్‌ను పడగొట్టాడు. తాజా ఐపీఎల్ సీజన్లోనూ తాహీర్ అత్యధిక వికెట్లు(26) పడగొట్టి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: కోహ్లి మరో రికార్డుపై కన్నేసిన ఆమ్లా పన్నెండో ప్రపంచ యుద్ధం -
తాహిర్ అలా పరిగెత్తుతుంటే.. ధోనీ జోకులు!
వికెట్ పడిందంటూ ఎంపైర్ వేలెత్తడమే ఆలస్యం.. ఇమ్రాన్ తాహిర్ సంబరాల్లో మునిగిపోతాడు. చేతులు విశాలంగా చాచి.. అభిమానుల గ్యాలరీ వైపు పరిగెత్తుతూ.. ఛాతి బాదుకుంటూ.. కొన్నిసార్లు సింహంలా గర్జిస్తూ.. అతను ఆకాశమే హద్దుగా ఆనంద డొలికల్లో తేలిపోతాడు. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న 40 ఏళ్ల వెటరన్ సౌతాఫ్రికా లెగ్ స్పిన్నర్ తాహిర్ ఎనర్జీ ఇప్పుడు అందరినీ విస్మయపరుస్తోంది. ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైరయ్యే వయస్సులో చక్కని బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టడంలోనే కాదు.. మైదానమంతా హల్చల్ చేస్తూ సంబరాల్లో మునిగిపోవడంలోనూ అతను తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. చెన్నై అభిమానులు ‘పరాశక్తి ఎక్స్‌ప్రెస్’ అని ముద్దుగా పిలుచుకునే తాహిర్ హోమ్‌గ్రౌండ్‌లో జరిగిన తాజా ఐపీఎల్ మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో ఢిల్లీని చిత్తుచేయడంతో.. సూపర్‌కింగ్స్ 80 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తన స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్లు పడగొట్టిన తాహిర్.. వికెట్ పడిన ప్రతిసారి చెప్పాక్ స్టేడియంలో అభిమానుల వద్దకు పరిగెత్తి.. సింహంలా గర్జిస్తూ సంబరాలు జరిపాడు. మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా తాహిర్ ట్రేడ్‌మార్క్ సెలబ్రేషన్స్ ధోనీ చాలా ఒకింత ఫన్నీగాస్పందించాడు. ‘తాహిర్ సెలబ్రేషన్స్ చూడటం ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ, వికెట్ తీయగానే అతనికి దగ్గరికి వెళ్లకూడదని నాకు, వాట్సన్ చాలా బాగా తెలుసు. ఎందుకంటే వికెట్ పడగానే మరోవైపునకు అతను పరిగెత్తుకు వెళుతాడు. ఇది నాకు, వాట్సన్‌కు కొంత కష్టమే. మేం 100శాతం ఫిట్‌గా లేనప్పుడు అలా పరిగెత్తి అభినందించడం కూడా కొంచెం కష్టమే. అందుకే అతను సంబరాలు ముగించుకొని.. వెనక్కి వచ్చాక.. అతని దగ్గరికి వెళ్లి బాగా బౌలింగ్ చేశావని అభినందిస్తాం. మళ్లీ మా ఫీల్డింగ్ పొజిషన్‌కి వచ్చేస్తాం’ అని ధోనీ సరదాగా వివరించాడు. చెన్నై లీడింగ్ వికెట్ టేకర్ అయిన తాహిర్ ఈ ఐపీఎల్ సీజన్లో 13 మ్యాచ్‌ల్లో మొత్తం 21 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతను రెండోస్థానంలో ఉండగా.. ఢిల్లీ బౌలర్ రబడ 25 వికెట్లతో ఆగ్రస్థానంలోఉన్నాడు. -
చెన్నైకి భారీ విజయం
-
చెన్నై సూపర్ ‘స్పిన్’
చెన్నై సూపర్‌కింగ్స్ ముందు మెల్లగా ఆడింది. ఒకానొక సమయంలో అయితే మూడు ఓవర్ల పాటు ఓవర్‌కు పరుగు మాత్రమే చేసింది. కానీ ఢిల్లీ అలాకాదు దంచేసింది. ఫోర్లు, సిక్సర్లతో ధాటిగా ఆడింది. కానీ అంతలోనే తాహిర్ (3.2–0–12–4) స్పిన్ మాయలో పడింది. ఆ తర్వాత ఎంతకీ తేరుకోలేక పరాజయం పాలైంది. చెన్నై: సూపర్‌కింగ్స్ మళ్లీ ‘టాప్’ లేపింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. రైనా (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ధోని (22 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచేశారు. సుచిత్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.2 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (31 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. ఇమ్రాన్ తాహిర్ (4/12) ఢిల్లీ మెడకు తన స్పిన్ ఉచ్చు బిగించాడు. మరో స్పిన్నర్ జడేజాకు మూడు వికెట్లు లభించాయి. ధోనికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మందకొడిగా మొదలై... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆట చిత్రంగా సాగింది. బ్యాటింగ్ కష్టంగా మొదలైంది. ఓవర్‌కు ఒక పరుగు మాత్రమే చేసింది. 3 ఓవర్లలో మూడే పరుగులు వచ్చాయి. 3 ఓవర్లపాటు 6 ఓవర్ల పవర్ ప్లేలో 27/1 స్కోరు చేసిన సూపర్‌కింగ్స్... చేతిలో వికెట్లున్నా 14 ఓవర్లలో చేసింది 2 వికెట్ల నష్టానికి 88 పరుగులే! అప్పటికీ వందయినా చేయలేదు. అయితే ఆలస్యంగా, ఆఖరికి బ్యాట్ ఝళిపించిన చెన్నై చివరి రెండు ఓవర్లలో 39 పరుగులు చేయడంతో పోరాడే లక్ష్యాన్ని ఉంచగలిగింది. రైనా, ధోని మెరుపులు... ఓపెనర్లు వాట్సన్, డు ప్లెసిస్ పరుగులు చేసేందుకే ఆపసోపాలు పడ్డారు. దూకుడైన బ్యాట్స్‌మన్ వాట్సన్ ఏకంగా తొమ్మిది బంతులు ఆడినా ఖాతానే తెరువలేదు. నాలుగో ఓవర్లో అతను డకౌటయ్యాడు. ఎట్టకేలకు ఐదో ఓవర్లో బౌండరీ నమోదైంది. డు ప్లెసిస్, రైనా చెరో ఫోర్ కొట్టారు. ఆరో ఓవర్లో 2 ఫోర్లు వచ్చాయి. ఇదే జోరు మాత్రం కొనసాగలేదు. వికెట్లున్నా కూడా మరో 10 ఓవర్లు ఆడిన రైనా, డు ప్లెసిస్ జోడీ పెద్దగా పరుగులైతే చేయలేకపోయింది. డు ప్లెసిస్ (41 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను అక్షర్ ఔట్ చేశాడు. ధోని క్రీజులోకి వచ్చాక... సుచిత్ వేసిన 15వ ఓవర్లో రైనా వేగం పెంచాడు. వరుస మూడు బంతుల్లో 4, 4, 6 కొట్టి అర్ధసెంచరీని 34 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. కానీ ఐదో బంతికి ఔటయ్యాడు. జడేజా (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్న కాసేపు ధాటిగా ఆడాడు. 19వ ఓవర్లో ధోని 4, 6, రాయుడు 4 బాదడంతో 18 పరుగులొచ్చాయి. ఆఖరి ఓవర్‌ను ధోని ఫోర్‌తో పాటు 2 సిక్సర్లతో ముగించాడు. ఈ ఓవర్లో 21 పరుగుల లభించడంతో స్కోరు అమాంతం పెరిగింది. ధాటిగా మొదలైతే... తాహిర్ తిప్పేశాడు తొలి ఓవర్లోనే పృథ్వీ షా (4) ఔటైనా... ఢిల్లీ లక్ష్యఛేదన ధాటిగానే సాగింది. ఓపెనర్ ధావన్ (13 బంతుల్లో 19; ఫోర్, సిక్స్), అయ్యర్ చకచకా పరుగులు సాధించారు. భజ్జీ వేసిన 4వ ఓవర్లో ధావన్ సిక్స్, ఫోర్ కొడితే... చహర్ ఐదో ఓవర్లో అయ్యర్ దాన్ని రిపీట్ చేశాడు. 5.1 ఓవర్లోనే జట్టు 50 పరుగులు చేసింది. అదే ఓవర్లో ధావన్‌ను హర్భజన్ ఔట్ చేయడంతోనే ఢిల్లీ పతనం కూడా మొదలైంది. ఏడో ఓవర్లో తాహిర్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన పంత్ (5) మరుసటి బంతికే నిష్క్రమించాడు. స్పిన్‌కు విలవిల టాపార్డర్ స్పిన్ ఉచ్చులో ఉక్కిరిబిక్కిరైనా అయ్యర్ ఒంటరి పోరాటం చేశాడు. కానీ అవతలి నుంచి సరైన సహకారం కరువైంది. దీంతో జట్టును నిర్మించే భాగస్వామ్యం లేక ఢిల్లీ మూల్యం చెల్లించుకుంది. 10 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 80/4 కాగా... రెండు ఓవర్లకే 85/8 స్కోరుతో పరాజయానికి సిద్ధమైంది. 11వ ఓవర్లో తాహిర్ మొదట అక్షర్ పటేల్ (9), రూథర్‌ఫోర్డ్ (2)లను ఔట్ చేయగా... 12వ ఓవర్లో జడేజా తానేం తక్కువ కానని మోరిస్ (0)తో పాటు క్రీజులో పాతుకుపోయిన శ్రేయస్‌నూ పెవిలియన్ చేర్చాడు. టెయిలెండర్లు తర్వాత నాలుగు ఓవర్లు ఆడటంతో చెన్నై విజయం కాస్త ఆలస్యమైంది. -
అందుకే అతడిని పక్కన పెట్టాం : ధోని
చెన్నై : ‘ జడేజా, సాంట్నర్ బంతిపై గ్రిప్ సాధించలేకపోయారు. వారిద్దరు చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే బౌలర్లను రొటేట్ చేసుకోగలిగాం. ఈరోజు లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. రిస్ట్ స్పిన్నర్ అయి ఉండి కూడా తనలా బౌలింగ్ చేసిన విధానం నన్నెంతగానో ఆకట్టుకుంది’ అంటూ మిస్టర్ కూల్ ధోని.. చెన్నై విజయంలో తనతో పాటుగా కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్ తాహిర్పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. ఇందులో భాగంగా రాహుల్ త్రిపాఠి, స్మిత్‌లను పెవిలియన్‌కు చేర్చిన చెన్నై బౌలర్ తాహిర్ పర్పుల్ క్యాప్(మూడు మ్యాచుల్లో 6 వికెట్లు) దక్కించుకున్నాడు.(చదవండి : శివమెత్తిన ధోని ) ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై కెప్టెన్ ధోని మాట్లాడుతూ..‘మా జట్టులో పదకొండు మంది నిలకడగా ఆడేవాళ్లే. అయితే రాయల్స్ జట్టులో రైట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఉన్నారు. అందుకే హర్భజన్‌ను పక్కన పెట్టి సాంట్నర్‌కు అవకాశం ఇచ్చాం. అంతేతప్ప జట్టులో ప్రతీసారి మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. టోర్నమెంట్ ఆసాంతం.. ప్రత్యర్థి జట్ల బలాలు, బలహీనతల ఆధారంగా జట్టులోని ప్రతీ సభ్యుడు అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. ఇక తాహిర్ నిజంగా చాలా బాగా బౌల్ చేశాడు’అంటూ హర్భజన్‌ను పక్కన పెట్టడం పట్ల తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. Super run for the #ParasakthiExpress capturing the Purple Cap at the #AnbuDen! To many more happy runs! #WhistlePodu #Yellove #CSKvRR 🦁💛 pic.twitter.com/XnwSjduCVV — Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2019 -
ప్రపంచకప్ తర్వాత... వన్డేలకు తాహిర్ గుడ్‌బై
జొహన్నెస్‌బర్గ్: వచ్చే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికే క్రికెటర్ల జాబితాలో మరో పేరు చేరింది. ఇప్పటికే వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతానని ప్రకటించగా... తాజాగా దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కూడా రిటైర్మెంట్ బాటలో నడవనున్నాడు. ఈనెల 27వ తేదీన 40 ఏళ్లు పూర్తి చేసుకోనున్న తాహిర్ ఇప్పటికి 95 వన్డేలు ఆడి 156 వికెట్లు పడగొట్టాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత తాను టి20 ఫార్మాట్లో కొనసాగుతానని తెలిపాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తాహిర్ 2011, 2015 వన్డే వరల్డ్ కప్‌లలో... 2014, 2016 టి20 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తాహిర్ 45 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా తరఫున వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా తాహిర్ (58 వన్డేల్లో) ఘనత వహించాడు. -
వైరల్ : అయ్యో తాహీర్.. ఎంత పనాయే!
పెర్త్ : దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ నవ్వులపాలయ్యాడు. మాములుగానే వికెట్ పడిన ఆనందంలో కొంచెం ఎక్కువ చేసే తాహీర్ ఈ సారి అలానే ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆస్ట్రేలియా దేశవాళీ జట్టు ప్రైమ్ మినిస్టర్ X1తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో కగిసో రబడా వేసిన ఆరో ఓవర్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ జోష్ ఫిలిప్ భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని డీప్‌ఫైన్ లెగ్ దిశగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తాహీర్ అద్భుతంగా అందుకున్నాడు. ఆ వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గ్యాలరీలోని అభిమానులవైపు తిరిగి, తన టీషర్టుపై ఉన్న పేరును సూచిస్తూ.. ‘నేనంటే ఇది’ అన్నట్లు సైగ చేశాడు. కానీ ఆ బంతి కాస్త నోబాల్ కావడంతో తాహీర్ ఆనందం కాస్త ఆవిరైంది. అంపైర్ వైపు ఏ మాత్రం చూడకుండా తను చేసిన ఈ హడావుడికి తన మొహం చిన్నబోయింది. ఇక ఇలా దొరికిన తాహిర్‌ను అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ ఆటాడుకుంటున్నారు. ‘ముందు అంపైర్‌ను చూడు.. ఆ తర్వాత సెలబ్రెషన్స్ చేసుకుందువు కానీ’ అని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఆసాంతం కామెంటేటర్లు ఈ ఘటనను ప్రస్తావిస్తూ నవ్వుకోవడం విశేషం. Imran Tahir might want to check if it was a no ball first 😂😂😂 #FoxCricket #PMXIvSA pic.twitter.com/zDvOs74n9h — FOX SPORTS Cricket (@FoxCricket) October 31, 2018 -
తాహీర్ నవ్వులపాలయ్యాడు
-
తాహిర్ తిప్పేశాడు
ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (5/23) మాయాజాలంతో తొలి టి20లో దక్షిణాఫ్రికా 34 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలిచింది. ఈ పోరులో మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. డుసెన్ (56; 5 ఫోర్లు, 1 సిక్స్), మిల్లర్ (39; 1 ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్ డుప్లెసిస్ (34; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత జింబాబ్వే 17.2 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. తాహిర్ దెబ్బకు 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను పీటర్ మూర్ (44; 1 ఫోర్, 5 సిక్సర్లు) ఆదుకున్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. డాలా, ఫెలుక్వాయో చెరో 2 వికెట్లు తీశారు. -
ఇమ్రాన్ తాహిర్ ‘హ్యాట్రిక్’
బ్లూమ్ఫొంటీన్: ఇమ్రాన్ తాహిర్ (6/24) చెలరేగడంతో జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 120 పరుగుల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. ముందుగా దక్షిణాఫ్రికా 47.3 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. డేల్ స్టెయిన్ (60) టాప్ స్కోరర్‌గా నిలవడం గమనార్హం. అనంతరం జింబాబ్వే 24 ఓవ ర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. తాహిర్ తీసిన 6 వికెట్లలో ‘హ్యాట్రిక్’ కూడా ఉండటం విశేషం. ఓవరాల్‌గా జింబాబ్వేపై దక్షిణాఫ్రికాకిది వరుసగా 29వ విజయం. -
తాహీర్ హ్యాట్రిక్
-
పరుగు వ్యవధిలో 5 వికెట్లు!
షార్జా: క్రికెట్ అనేది ఫన్నీ గేమ్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. అందులోనూ టీ 20 క్రికెట్ వచ్చిన తర్వాత ఈ గేమ్ స్వరూపమే మారిపోయింది. బంతికో ఫోర్.. బంతికో వికెట్‌గా అన్న మాదిరిగా టీ 20 ఫార్మాట్ తయారైందనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఒక జట్టు పరుగు వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోవడమే ఇందుకు ఉదాహరణ. శనివారం క్వెట్టా గ్లాడియేటర్స్-ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ 15.4 ఓవర్లలో 102 పరుగులకు కుప్పకూలింది. 101 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయిన గ్లాడియేటర్స్.. మరో పరుగు మాత్రమే చేసి మిగతా వికెట్లను నష్టపోయింది. దాంతో పరుగు వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఇందులో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ తాహీర్ హ్యాట్రిక్ వికెట్లను సాధించడం మరొక విశేషం. తాహిర్ స్పిన్ దెబ్బకు గ్లాడియేటర్స్ విలవిల్లాడుతూ హ్యాట్రిక్‌ను సమర్పించుకుంది. చివరి ఐదు వికెట్లలో మూడు డకౌట్లు ఉండటం గమనార్హం. ఇది పీఎస్ఎల్ చరిత్రలో మూడో హ్యాట్రిక్‌గా నమోదైంది. ఆపై 103 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముల్తాన్ సుల్తాన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కుమార సంగక్కరా(51 నాటౌట్), షోయబ్ మస్జూద్(26 నాటౌట్), అహ్మద్ షెహజాద్(27)లు తమ జట్టు ఘన విజయానికి సహకరించారు. -
క్రికెటర్‌పై జాతివివక్ష వ్యాఖ్యలు..విచారణకు ఆదేశం
సాక్షి స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య జరిగిన నాలుగో వన్డే సమయంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్పై జాతి వివక్ష వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై క్రికెట్ దక్షిణాఫ్రికా, వాండరర్స్ స్టేడియం భద్రతా టీం విచారిస్తున్నాయి. పింక్ వన్డే జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల్లోని ఓ గుర్తుతెలియని వ్యక్తి తాహిర్‌ను అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో తాహిర్ సదరు ప్రేక్షకుడితో గొడవపడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని స్టేడియం భద్రతా సిబ్బందికి తాహిర్ తెలిపాడు. దీంతో భద్రతా సిబ్బంది వచ్చి ఆ ప్రేక్షకుడిని స్టేడియం బయటకు తీసుకువెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఫేస్బుక్లో ఓ వీడియో హల్చల్ చేస్తుంది. తాహిర్‌తో ప్రేక్షకుడు ఘర్షణ పడుతుండటాన్ని పక్కనే ఉన్న మరో ప్రేక్షకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, జాతి వివక్ష వ్యాఖ్యలు చోటుచేసుకుంటే సహించేదిలేదని, తప్పు ఎవరిదైనా చర్యలు తప్పవని క్రికెట్ దక్షిణాఫ్రికా అధికారులు వెల్లడించారు. -
దక్షిణాప్రికా క్రికెటర్‌ను అవమానించిన పాక్
బర్మింగ్హమ్: దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ ఇమ్రాన్ తాహీర్‌కు పాక్ కాన్సులేట్ అధికారులు చుక్కలు చూపించారు. లాహోర్ వేదికగా వరల్డ్ ఎలెవన్, పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్11 నుంచి టీ20 సిరీస్ జరగుతున్న విషయం తెలిసిందే. వరల్డ్ ఎలెవన్ జట్టులో సభ్యుడైన తాహీర్ పాక్ వీసా కోసం బర్మింగ్హమ్ కాన్సులేట్‌ను సంప్రదించగా అధికారులు వీసా ఇవ్వకుండా అవమానించారు. ఈ విషయాన్ని తాహీర్ ట్విట్టర్ వేదికగా ‘వరల్డ్ఎలెవన్ జట్టు సభ్యుడిగా పాక్ వెళ్లేందుకు వీసా కోసం వెళ్తే నన్ను నాకుటుంబాన్ని ఈరోజు పాక్ హైకమిషన్ అవమానపరించిందని’ ఓ మెసేజ్ ఫోటోకు క్యాప్షన్‌గా ట్వీట్ చేశారు. ఆమెసేజ్ ఏమిటంటే.. ‘నేను ఈ రోజు బర్మింగ్హమ్ పాక్ కాన్సులేట్‌లో విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను. పాక్ వీసా కోసం నా కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్లాను. కాన్సులేట్ అధికారులను నన్ను నాకుటుంబ సభ్యులను 5 గంటలు వేచి ఉంచి, ఆఫీస్ సమయం అయిపోయిందంటూ వీసాలు జారీ చేయకుండా అవమానించారు. చివరకు కాన్సులేట్ హై కమిషనర్ ఐబీఎన్ ఈ అబ్బాస్ సూచనలతో నాకు వీసా జారీచేశారు. కమిషనర్ నాగురించి పాకిస్థాన్ సంతతికి చెందిన ఇరానీ, దక్షిణాఫ్రికా క్రికెటర్, వరల్డ్ ఎలెవన్ జట్టు సభ్యుడైన ఇతని పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తిస్తారా అని అధికారులపై మండిపడ్డారు. నన్ను రక్షించిన అబ్బాస్ గారికి హ్యాట్సాఫ్ అని’ తాహీర్ పేర్కొన్నారు. Me with my family were humiliated & expelled from Pak High Commission earlier today when I went to get visa to play for WorldXI in Pakistan pic.twitter.com/VByiqV4oFh — Imran Tahir (@ImranTahirSA) 4 September 2017 -
తాహీర్ తడాఖా..
-
తాహీర్ తడాఖా..
పుణె: ఐపీఎల్ -10 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ అద్భుతమైన బౌలింగ్ తో చెలరేగిపోతున్నాడు. ముంబై ఇండియన్స్ ను వణికిస్తూ తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పార్థీవ్ పటేల్(19), రోహిత్ శర్మ(3), జాస్ బట్లర్(38) వికెట్లను సాధించి ముంబైకు షాకిచ్చాడు. ముంబై ఇండియన్స్ మంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తాహీర్ తన మ్యాజిక్ ను ప్రదర్శించాడు. దాంతో ముంబై 62 పరుగులకు మూడు వికెట్లను నష్టపోయింది. ఈ ఐపీఎల్ వేలంలో తాహీర్ ను ఎవరూ కొనగోలు చేయని సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ఆరంభానికి కొన్ని రోజులు ముందు ఈ నంబర్ వన్ వన్డే బౌలర్ ను పుణె జట్టులోకి తీసుకుంది. జట్టు పెట్టుకున్న ఆశల్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్ లోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు తాహీర్. ఈ మ్యాచ్ లో రెండు ఓవర్లు బౌలింగ్ ను పూర్తి చేసిన తరువాత మూడు వికెట్లను తీసిన తాహీర్ తొమ్మిది పరుగుల్ని మాత్రమే ఇవ్వడం ఇక్కడ మరో విశేషం. -
రైజింగ్ పుణే జట్టులో తాహిర్
ముంబై: దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్, ఐసీసీ వన్డే, టి20 నంబర్‌వన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్‌కు ఎట్టకేలకు ఐపీఎల్లో మరో అవకాశం లభించింది. గాయపడిన మిషెల్ మార్ష్ స్థానంలో రైజింగ్ పుణే జట్టు తాహిర్‌ను తీసుకుంది. గత నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన తాహిర్పై ఎవరూ ఆసక్తి చూపించలేదు. గత ఏడాది తాహిర్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. మరోవైపు పుణే తమ జట్టు పేరునుంచి చివరి టను తొలగించి సూపర్ జెయింట్గా మార్చుకుంది. డికాక్ దూరం! : ఐపీఎల్–10కు మరో దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ దూరమయ్యే అవకాశముంది. చేతి వేలిగాయంతో బాధపడుతోన్న డికాక్ పూర్తిగా కోలుకునేందుకు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుందని జట్టు వర్గాలు తెలిపాయి. దాంతో ఐపీఎల్లో కూడా పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే డుమిని వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ పదో సీజన్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. ఈ ఇద్దరు ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన డికాక్ కూడా దూరమైతే డేర్వెవిల్స్కు ఇది ఎదురుదెబ్బే! -
తాహిర్ తడాఖా...
ఐదు వికెట్లు తీసిన స్పిన్నర్ టి20 మ్యాచ్‌లో కివీస్‌పై దక్షిణాఫ్రికా విజయం ఆక్లాండ్: లెగ్‌స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (5/24) తన అద్భుత బౌలింగ్‌తో న్యూజి లాండ్ జట్టును వణికించాడు. దీంతో శుక్రవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు సాధించింది. 15 పరుగులకే వికెట్ కోల్పోయినా... ఓపెనర్ ఆమ్లా (43 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్ (25 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగారు. దీంతో రెండో వికెట్‌కు వీరి మధ్య 87 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. డుమిని (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చివర్లో వేగంగా ఆడాడు. బౌల్ట్, గ్రాండ్‌హోమ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 14.5 ఓవర్లలోనే 107 పరుగులకు కుప్పకూలింది. తాహిర్‌కు తోడు పేసర్ ఫెలుక్వాయో (3/19), మోరిస్ (2/10) రెచ్చిపోవడంతో ఆతిథ్య జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. బ్రూస్ (33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... సౌతీ ఆఖర్లో 6 బంతుల్లోనే మూడు సిక్సర్ల సహాయంతో 20 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ ప్రదర్శనతో తాహిర్ అంతర్జాతీయ టి20ల్లో అజంతా మెండిస్ (26 మ్యాచ్‌ల్లో) తర్వాత తక్కువ (31) మ్యాచ్‌ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్‌గా నిలిచాడు. 19 నుంచి ఈ రెండు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. -
టాప్ ర్యాంకుల్లో తాహిర్
దుబాయ్: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వన్డేల్లో నంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు. 761 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్ లోకి దూసుకొచ్చాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో తాహిర్ 10 వికెట్లు పడగొట్టి ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) నుంచి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్, వెస్టెండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ తర్వాతి ర్యాంకుల్లో నిలిచారు. టాప్ -10లో భారతీయ బౌలర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ డుప్లెసిస్ కెరీర్ లో బెస్ట్ ర్యాంకు సాధించాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్ లో 410 పరుగులు సాధించిన ప్లెసిస్ 7 స్థానాలు మెరుగుపరుచుకుని 4వ ర్యాంకులో నిలిచాడు. వార్నర్, డివిలియర్స్, కోహ్లి మొదటి మూడు ర్యాంకుల్లో ఉన్నారు. శ్రీలంకపై వన్డే సిరీస్ 5–0తో క్లీన్‌స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా టీమ్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంకు కైవసం చేసుకుంది. కాగా, టీ20 ర్యాంకింగ్స్ లోనూ ఇమ్రాన్ తాహిర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. -
ఇమ్రాన్ తాహీర్‌కు భారీ జరిమానా
కేప్ టౌన్: ఆస్ట్రేలియాతో తుది వన్డే సందర్భంగా డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్‌కు భారీ జరిమానా పడింది. ఆస్ట్రేలియా లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన క్రమంలో 38.0 ఓవర్లలో వార్నర్ ను రెచ్చగొట్టేలా తాహీర్ ప్రవర్తించాడు. ఎల్బీడబ్యూ విషయంలో గట్టిగా అరవడమే కాకుండా వార్నర్ తో తప్పుగా ప్రవర్తించాడు. అయితే దీనిపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు పలుమార్లు చెప్పినా తాహీర్ పెడచెవిన పెట్టాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధలన ప్రకారం అంపైర్ల విజ్ఞప్తిని పట్టించుకోకపోవడం విరుద్ధం కనుక తాహీర్ కు మ్యాచ్ ఫీజులు 30 శాతం జరిమానా విధించారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ ఫీజులో కోతతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లను కూడా తాహీర్ కు విధించారు. ఒకవేళ రాబోవు రెండు సంవత్సరాల వ్యవధిలో నాలుగు, అంతకన్నా ఎక్కువ డీమెరిట్ పాయింట్లకు తాహీర్ గురైన పక్షంలో అతనిపై రెండు మ్యాచ్‌లు సస్పెన్షన్ పడే అవకాశం ఉంది. -
ఆఖరి బంతికి నెగ్గిన దక్షిణాఫ్రికా
గెలిపించిన మోరిస్ ఠ 3 వికెట్లతో ఓడిన ఇంగ్లండ్ కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా లక్ష్యం 135 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 19 ఓవర్లలో 120/7.. ఇక గెలవాలంటే ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాలి. ఈ దశలో టోప్లే బౌలింగ్‌లో తొలి ఐదు బంతుల్లో మోరిస్ 13 పరుగులు రాబట్టాడు. ఇక మిగిలింది ఒక బంతి... రెండు పరుగులు... ఈ సమయంలో ఆఖరి బంతిని లాంగాఫ్‌లోకి కొట్టిన మోరిస్ రెండో రన్ కోసం ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్ వెంటనే స్పందించి బంతిని బౌలర్ వైపు విసిరినా.. టోప్లే దాన్ని అందుకోలేకపోయాడు. దీంతో రనౌట్ మిస్సయింది. మ్యాచ్ సఫారీల సొంతమైంది. ఫలితంగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి టి20లో ప్రొటీస్ 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలు 1-0 ఆధిక్యంలో నిలిచారు. న్యూలాండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసింది. బట్లర్ (30 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు), హేల్స్ (27) రాణించారు. తాహిర్ 4, అబాట్ 2 వికెట్లు తీశారు. తర్వాత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (25), డుమిని (23), ఆమ్లా (22), రోసోవ్ (18) తలా కొన్ని పరుగులు చేశారు. జోర్డాన్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టారు. తాహిర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 జొహన్నెస్‌బర్గ్‌లో నేడు (ఆదివారం) జరగనుంది. -
'తాహీర్ ను బయటకు వెళ్లొద్దని సూచించాం'
ముంబై: ఇటీవల ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ సందర్బంగా దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ ను హోటల్ గది నుంచి బయటకు వెళ్లొద్దని సూచించినట్లు జట్టు మేనేజ్ మెంట్ తాజాగా స్పష్టం చేసింది. పాకిస్థాన్ సంతతికి చెందిన తాహీర్ దక్షిణాఫ్రికా జట్టులో కీలక సభ్యుడని.. ఆ కారణం చేతనే ముందస్తు జాగ్రత్తగా హోటల్ గది దాటి వెళ్లకుండా ఆదేశించినట్లు పేర్కొంది. గత నెల 19 వ తేదీన త శివసేన కార్యకర్తలు పాకిస్థాన్ తో సిరీస్ ను నిరసిస్తూ ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించడంతోనే తాహీర్ కు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. తమ ఆటగాళ్లకు ఇచ్చిన సాధారణ భద్రతనే తాహీర్ కు కూడా కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీమ్ మేనేజ్ మెంట్ తెలిపింది. ముంబైలోని కొన్ని ప్రదేశాలకు వెళ్లడానికి తాహీర్ ముందుగా ప్లాన్ చేసుకున్నాడని.. అదనపు సెక్యూరిటీ లేకపోవడంతో వాటిని రద్దు చేసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. వాంఖేడ్ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో తాహీర్ కు భారత అభిమానుల నుంచి పెద్ద ఎత్తున తాకిడి ఉన్నట్లు ఈ సందర్భంగా మేనేజ్ మెంట్ స్పష్టం చేసింది. కాగా, బ్రబౌర్న్ స్టేడియంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉందని దక్షిణాఫ్రికా మీడియా మేనేజర్ తెలిపారు. తాహీర్ తన భార్య సుమయ్య దిల్దార్, 18 నెలల కుమారుడు గిబ్రాన్ లతో కలిసి భారత పర్యటనకు వచ్చాడని .. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే తాహీర్ ను ముంబైలోని హోటళ్ల గదులకే పరిమితం కావాల్సిందిగా సూచించామన్నాడు. -
జాగ్రత్త... వెనక్కు తగ్గొద్దు!
♦ భారత ఆటగాళ్లకు సచిన్, రవిశాస్త్రి సూచనలు ♦ రెండు జట్లూ సమతుల్యంగా ఉన్నాయి రోజులు గడుస్తున్నకొద్దీ దక్షిణాఫ్రికాతో సిరీస్ వేడెక్కుతోంది. సఫారీ జట్టులోని కీలకమైన ఆటగాళ్లతో జాగ్రత్త అంటూ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ సూచన చేస్తే... ప్రత్యర్థి జట్టు పటిష్టంగా ఉన్నా... వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ఆటగాళ్లకు దిశా నిర్దేశనం చేస్తున్నారు. దాదాపు రెండు నెలలకు పైగా సాగే ఈ సుదీర్ఘ పర్యటన గురించి రెండు దేశాల్లో అటు అభిమానులతో పాటు ఇటు మాజీలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ముంబై : స్వదేశంలో జరిగే సిరీస్‌లో దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ టీమిండియా ఆటగాళ్లకు సూచించారు. అద్భుత నైపుణ్యం ఉన్న తాహిర్.. ఈ సిరీస్‌లో కీలకం కానున్నాడని చెప్పారు. అయితే ప్రస్తుత భారత జట్టు కూడా మంచి సమతుల్యంతో ఉందని మాస్టర్ వెల్లడించారు. ‘జట్టులో నైపుణ్యం, అంకితభావం ఉన్న కుర్రాళ్లకు లోటు లేదు. వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. అవకాశం వస్తే అద్భుతాలు చేయగలరు. అయితే క్రికెట్‌కు వచ్చేసరికి షార్ట్‌కట్స్ ఉండవనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. మొత్తానికి ఈ సిరీస్ చాలా హోరాహోరీగా సాగుతుంది. నా వరకైతే ఎక్కువగా టెస్టు సిరీస్‌పై దృష్టిపెట్టా. బలం, బలహీనతల్లో రెండు జట్లు సమానంగా ఉన్నాయి’ అని సచిన్ పేర్కొన్నారు. తానెప్పుడూ తక్కువ నైపుణ్యం ఉన్న ప్రొటీస్ జట్టుతో మ్యాచ్‌లు ఆడలేదని, ప్రతిసారి వాళ్లు పటిష్టమైన టీమ్‌గానే బరిలోకి దిగారన్నారు. ఇప్పుడు కూడా జట్టులో ఏం తేడా లేదని... డివిలియర్స్, ఆమ్లా, స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌లతో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. 1992 హీరో కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్ మ్యాచ్ అద్భుతంగా జరిగిందన్నారు. ‘ఆ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అయితే గెలవాలన్న తపనను మాత్రం కొనసాగిస్తున్నాం. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు 2 పరుగుల తేడాతో నెగ్గాం. నాకు అదో మంచి అనుభవం. దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రతిసారి మంచి ఆతిథ్యంతో పాటు వాతావరణం, పిచ్ వంటి రకరకాల సవాళ్లు ఎదురయ్యేవి. 1991లో తొలిసారి భారత్‌లో పర్యటించిన సఫారీ జట్టుతో ఆడటం మాకు బాగా లాభించింది. ఈడెన్‌లో వేల మంది అభిమానులను చూసి వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ స్పందనను చూసి ఆశ్చర్యపోయారు’ అని మాస్టర్ గుర్తుచేసుకున్నారు. బెంగళూరు: ఇటీవల కొంత మంది టాప్ ఆటగాళ్లు రిటైర్ అయినప్పటికీ సఫారీ జట్టు ఇంకా పటిష్టంగానే ఉందని భారత టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి అన్నారు. అయితే రాబోయే సిరీస్‌లో మాత్రం ప్రొటీస్‌పై భారత జట్టు తన దూకుడును ఏమాత్రం తగ్గించదని స్పష్టం చేశారు. ‘దక్షిణాఫ్రికా నంబర్‌వన్ జట్టు. విదేశాల్లో బాగా ఆడుతుంది. రికార్డులను చూస్తే తెలుస్తుంది. అయితే ఆ జట్టును గౌరవిస్తాం. కానీ ఆటపరంగా పరిస్థితులు ఎలా ఉన్నా మేం వెనక్కి తగ్గం’ అని శాస్త్రి వెల్లడించారు. జట్టును నడిపించడంలో ధోనికి ఎలాంటి ఇబ్బందిలేదని, అతను ప్రపంచస్థాయి ఆటగాడని కితాబిచ్చారు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకుపోవడం మ్యాచ్ పరిస్థితిని బట్టి కెప్టెన్ నిర్ణయం తీసుకుంటాడన్నారు. ఎన్నో ఏళ్లుగా శ్రమించిన మహీకి ఇప్పుడు ఆటను ఆస్వాదించే అవకాశం ఇవ్వాలన్నారు. జట్టు డిమాండ్ మేరకు అందరూ ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కోహ్లి టెస్టుల్లో అనుసరించిన ఐదుగురు బౌలర్ల వ్యూహం శాశ్వతమైంది కాదని, ప్రత్యర్థిని, మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇది మారుతుందన్నారు. తన పదవీ కాలంలో ఆసీస్ టూర్ చాలా బాగా జరిగిందని శాస్త్రి చెప్పారు. కుర్రాళ్లు చాలా కఠినమైన పాఠాలను నేర్చుకున్నారన్నారు. భారత్ ‘ఎ’ జట్టు బాగా రాణిస్తుండటంతో సీనియర్ జట్టు రిజర్వ్ బెంచ్ సత్తా కూడా పెరిగిందన్నారు. ‘రిజర్వ్ బెంచ్ చాలా బాగా పుంజుకుంది. ‘ఎ’ జట్టు కోచ్ ద్రవిడ్‌తో అప్పుడప్పుడు మాట్లాడుతున్నా. నైపుణ్యం ఉన్న కుర్రాళ్లను గుర్తించమని చెబుతున్నా. సరైన ఆటగాళ్లను గుర్తించే అనుభవం, ఆ స్థితి రాహుల్‌కు ఉంది. సీనియర్ జట్టుకు ఎవరు తొందరగా పనికి వస్తారనే విషయాన్ని అతను మాత్రమే గుర్తించగలడు’ అని శాస్త్రి వివరించారు. -
భారత్ క్రికెటర్లూ.. అతనితో జాగ్రత్త
ముంబై: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌తో జాగ్రత్త అంటూ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత క్రికెటర్లను హెచ్చరించాడు. ప్రపంచ క్రికెట్లో టాప్ స్పిన్నర్లలో తాహిర్ ఒకరని, నాణ్యమైన బౌలరని, అతని బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాలంటూ సచిన్ సలహా ఇచ్చాడు. త్వరలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు 3-టీ-20లు, 5 వన్డేలు, 4 టెస్టులు ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ స్పందించాడు. 'భారత జట్టు పటిష్టంగా ఉంది. ప్రతిభావంతులు, అంకితభావం గల యువ క్రికెటర్లు జట్టులో ఉన్నారు. ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉంటుంది' అని సచిన్ అన్నాడు. -
ముగ్గురు స్పిన్నర్లతో భారత్‌కు...
దక్షిణాఫ్రికా జట్ల ప్రకటన జొహన్నెస్‌బర్గ్ : భారత గడ్డపై సుదీర్ఘ పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా జట్టు మూడు ఫార్మాట్ల జట్లను ప్రకటించింది. టెస్టుల్లో స్పిన్ పిచ్‌లు ఎదురయ్యే అవకాశం ఉండటంతో తమ జట్టులో కూడా ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం కల్పించింది. టెస్టు జట్టులోకి లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌తో పాటు ఆఫ్ స్పిన్నర్లు డేన్ పైడ్, సైమన్ హార్మర్లను ఎంపిక చేసినట్లు దక్షిణాఫ్రికా సెలక్షన్ కమిటీ కన్వీనర్ లిండా జోండి ప్రకటించారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు ఆడిన జట్టులో లేని తాహిర్, పైడ్లతో డివిలియర్స్ మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. మూడు జట్లలో చూస్తే టి20 సిరీస్‌కు ఎంపికైన బ్యాట్స్‌మన్ ఖాయా జోండో ఒక్కడే పూర్తిగా కొత్త ఆటగాడు. ఐదుగురు ప్రధాన ఆటగాళ్లు డివిలియర్స్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, తాహిర్‌లు మూడు ఫార్మాట్లలోనూ ఉన్నారు. వన్డే, టి20 జట్లలో కూడా ఎలాంటి సంచలనాలు లేకుండా రెగ్యులర్ సభ్యులనే ఎంపిక చేశారు. గాయం కారణంగా టి20 సిరీస్‌కు దూరమైన రోసో... వన్డే సిరీస్ సమయానికి కోలుకునే అవకాశం ఉంది. స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌లాంటి ప్రధాన బౌలర్లకు టి20ల్లో విశ్రాంతినిస్తూ మోరిస్, డి లాంజ్‌లకు అవకాశం కల్పించారు. ఈ నెల 29న జరిగే ప్రాక్టీస్ వన్డే మ్యాచ్‌తో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటన డిసెంబర్ 7న ముగుస్తుంది. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు: హషీం ఆమ్లా (కెప్టెన్), డివిలియర్స్, డు ప్లెసిస్, డుమిని, ఇమ్రాన్ తాహిర్, బవుమా, ఎల్గర్, హార్మర్, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్, పైడ్, రబడ, స్టెయిన్, వాన్‌జిల్, విలాస్. -
భారత్ టూర్ కి ముగ్గురు స్పిన్నర్లు
భారత్ లో పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. టెస్టులు, వన్డేలు, టీ20 లకు వేరు వేరుగా టీమ్ లను ఎంపిక చేసినట్లు సెలక్షన్ కన్వీనర్ లిండా తెలిపారు. భారత్ పర్యటనకు ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లను ఎంపిక చేసినట్లు వివరించారు. భారత్ లోని టర్నింగ్ పిచ్ లపై బౌలింగ్ సమ తూకంగా ఉండేందుకే.. ముగ్గురు స్పిన్నర్ల ఆప్సన్ ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. సైమన్ హామర్ కి తోడుగా.. శ్రీలంక పై సత్తాచాటిన ఇమ్రాన్ తాహిర్, డానేలను భారత పర్యటకు ప్రొటీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. టెస్ట్ టీమ్ కు షమీమ్ ఆమ్లా, వన్డే జట్టుకు ఏ బీ డివిలీర్స్, టీ20 జట్టుకు ఫఫ్ డు ప్లెసిస్ లు కెప్టెన్ లు గా వ్యవహరించనున్నారు. రానున్న టీ20 వాల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని టీమ్ ఎంపిక జరిగినట్లు తెలిపారు. టీ20ల్లో ఇమ్రాన్ తమ ట్రంప్ కార్డ్ అని లిండా చెప్పాడు. రెండు నెలల పైగా జరిగే ఈ టూర్ లో ప్రోటీస్ టీమ్ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తొలి వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. తర్వాత మూడు టీ 20లు, 5 వన్డేలు, 4 టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. -
'ప్రయోగాలు చేయకపోతే.. మనుగడ కష్టం'
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ టోర్నీలో స్సిన్నర్లు ప్రముఖ పాత్ర పోషిస్తారని దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ స్పష్టం చేశాడు. ఈ ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తహీర్.. ప్రధానంగా ట్వంటీ 20 ఫార్మెట్ అనేది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో ఆకట్టుకున్న తాహీర్.. ఎప్పుడూ విన్నూత్న ప్రయోగాలు చేస్తుండాలన్నాడు. అలా చేయకపోతే ఎక్కువకాలం జట్టులో మనుగడ సాగించడం కష్టసాధ్యమన్నాడు. భారత్ లో జరిగే ఈ టోర్నీలో ఇక్కడి ఆటగాళ్లు స్పిన్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటారని తాహీర్ తెలిపాడు. వన్డే ఫార్మెట్ కు, పొట్టి ఫార్మెట్ కు చాలా వ్యత్యాసం ఉంటుందన్నాడు. ట్వంటీ 20 ఫార్మెట్ కు తాను తొందరగా అలవాటు పడాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. -
ఐపీఎల్లో పాకిస్థాన్ సంతతి స్పిన్నర్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సంతతికి చెందిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడనున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరపున అతడు బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ తరపున ఆడుతున్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్-నిలె గాయపడడంతో అతడి స్థానంలో తాహిర్‌ను తీసుకున్నారు. దీనికి ఐపీఎల్ సాంకేతిక సంఘం ఆమోదముద్ర వేసింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో తాహిర్ ఆడనున్నాడు. ఏప్రిల్ 21న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ గాయపడ్డాడు. జహీర్‌ఖాన్, సౌరవ్ తివారి కూడా గాయాలతో ఐపీఎల్‌కు దూరమయ్యారు. -
ఢిల్లీకి తాహిర్, బెంగళూరుకు రోసో
న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో గాయపడిన ఆటగాళ్ల స్థానాల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు కొత్త ఆటగాళ్లను తీసుకున్నాయి. ఢిల్లీ జట్టులో పేస్ బౌలర్ కౌల్టర్ నైల్, బెంగళూరులో ఓపెనర్ నిక్ మ్యాడిన్సన్తోపాటు చెన్నై ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోలు గాయాలపాలై టోర్నీ నుంచి నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. కౌల్టర్ నైల్ స్థానంలో ఢిల్లీ.. దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్‌లో తాహిర్ 12 వికెట్లతో రాణించాడు. బెంగళూరు జట్టు మ్యాడిన్సన్ స్థానంలో దక్షిణాఫ్రికాకే చెందిన రిలీ రోసోను జట్టులో చేర్చుకుంది. దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుకు మాత్రమే ఆడిన రోసో.. దేశవాళీల్లో భారీ స్కోర్లు సాధించాడు. ఇక బ్రేవో స్థానంలో ఎవరిని తీసుకోవాలన్న విషయంపై చెన్నై ఇంకా తుదినిర్ణయానికి రాలేదు. -
తాహిర్ మాయాజాలం...
దుబాయ్: బ్యాటింగ్‌లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ జట్టు... దక్షిణాఫ్రికాతో బుధవారం ప్రారంభమైన రెండో టెస్టులో కుప్పకూలింది. ఇమ్రాన్ తాహిర్ (5/32) తన స్పిన్ మాయాజాలంతో మిస్బా సేన బ్యాటింగ్ ఆర్డర్‌ను పేకమేడలా కూల్చేశాడు. దీంతో మొదటి రోజు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 36.4 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. జుల్ఫికర్ బాబర్ (25 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్లకు 128 పరుగులు చేసింది. స్మిత్ (67 బ్యాటింగ్), స్టెయిన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పీటర్సన్ (26), ఎల్గర్ (23), కలిస్ (7) విఫలమయ్యారు. అజ్మల్‌కు 2, బాబర్‌కు ఒక్క వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ప్రొటీస్ బౌలర్లు చుక్కలు చూపారు. ఆరంభం నుంచే స్టెయిన్ (3/38), ఫిలాండర్, మోర్కెల్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగారు. దీంతో ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ ఖుర్రమ్ మన్జూర్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత షాన్ మసూద్ (21), అజహర్ అలీ (19) రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే నవంబర్ 2011 తర్వాత తొలి టెస్టు ఆడుతున్న తాహిర్... 11 బంతుల వ్యవధిలో మసూద్, మిస్బా (2), అద్నాన్ అక్మల్ (0)లను అవుట్ చేసి షాకిచ్చాడు. దీంతో లంచ్ విరామానికి పాక్ 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. చివర్లో బాబర్, జునైద్ ఖాన్ (4) ఆఖరి వికెట్‌కు 33 పరుగులు జోడించారు.