పాకిస్థాన్ సంతతికి చెందిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడనున్నాడు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సంతతికి చెందిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడనున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరపున అతడు బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ తరపున ఆడుతున్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్-నిలె గాయపడడంతో అతడి స్థానంలో తాహిర్ను తీసుకున్నారు. దీనికి ఐపీఎల్ సాంకేతిక సంఘం ఆమోదముద్ర వేసింది.
ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరగనున్న మ్యాచ్లో తాహిర్ ఆడనున్నాడు. ఏప్రిల్ 21న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో నాథన్ గాయపడ్డాడు. జహీర్ఖాన్, సౌరవ్ తివారి కూడా గాయాలతో ఐపీఎల్కు దూరమయ్యారు.