జహీర్‌ఖాన్ స్థానంలో ప్రవీణ్ కుమార్
ముంబై: గాయం కారణంగా ఐపీఎల్-7కు దూరమైన జహీర్‌ఖాన్ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రవీణ్ కుమార్‌ను తీసుకుంది. గతంలో బెంగళూరు, పంజాబ్ జట్ల తరఫున ఆడిన ఈ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఎవరూ కొనలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు.
అయితే అనుకోని విధంగా తనని అదృష్టం తలుపుతట్టింది. జహీర్ స్థానంలో అనుభవజ్ఞుడైన బౌలర్ కావాలని భావించిన ముంబై... కుమార్‌ను తీసుకుంది. ఢిల్లీ బాట్స్ మన్ సౌరభ్ తివారి కూడా గాయంతో ఐపీఎల్కు దూరమయ్యాడు.