Mumbai Indians team
-
వయసు 16 ఆట ఖరీదు 1.6 కోట్లు
తమిళనాడుకు చెందిన ఆ అమ్మాయి 12 ఏళ్ల వయసు వరకూ స్కేటింగ్ చేసింది. అదృష్టమో దురదృష్టమో లాక్డౌన్ వచ్చింది. బోర్ కొట్టి బ్యాట్ అందుకుంది. సరిగ్గా నాలుగేళ్లు. డబ్ల్యూపీఎల్ ఆక్షన్‌లో 10 లక్షలు పలికితే గొప్పనుకుంటే కోటీ అరవై లక్షలు పలికింది. అద్భుతమైన ప్రతిభ, కృషి ఉంటే విధిని తిరగరాయొచ్చని చెబుతుంది జి.కమలిని.మొన్నటి ఆదివారం (డిసెంబర్ 15) ఏం జరిగిందో తెలుసా? కౌలాలంపూర్‌లో మహిళల అండర్–19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్–ఇండియాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్‌లో పాకిస్తాన్ బ్యాటర్స్ రన్స్ కోసం బాల్‌ను బాదినప్పుడల్లా వికెట్స్ వెనుక నుంచి ఆ అమ్మాయి గట్టిగట్టిగా కేకలు వేస్తూ బాల్‌ను విసరమని ఫీల్డర్లను ఉత్సాహపరుస్తోంది. ఆ అమ్మాయి హుషారు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధ్యాహ్నం టార్గెట్‌ను ఛేదించే బాధ్యత ఇండియన్స్‌ది. వికెట్‌కీపర్‌గా ఉన్న అమ్మాయి ఇప్పుడు బ్యాట్ పట్టుకొని క్రీజ్ మీదకు వచ్చింది. అంతవరకే గుర్తుంది... అందరికీ. ఆ తర్వాత ఆ అమ్మాయి కొడుతున్న షాట్లకి గతం భవిష్యత్తు మర్చిపోయి వర్తమానంలో మునకలేశారు. షాట్ షాట్‌కు కేరింతలే. మొత్తం 44 రన్స్ చేసిందా అమ్మాయి. లాస్ట్ బంతిని భారీ సిక్స్ కొట్టి ఆట ముగించింది.కౌలాలంపూర్‌లో ఇలా ఆట ముగుస్తున్న సమయానికి బెంగళూరులో డబ్ల్యూపీఎల్ కోసం మహిళా క్రికెటర్ల ఆక్షన్ జరుగుతోంది. ఇదే అమ్మాయి పేరును పిలిచారు. అంతవరకూ ఆమె 10 లక్షల రూపాయలకు వేలంలో దక్కుతుందని అందరూ భావించారు. కాని కౌలాలంపూర్ ఆట ప్రభావం చూపింది. ముంబై ఇండియన్స్ టీమ్, ఢిల్లీ కాపిటల్స్ టీమ్ పాట పెంచుతూ పోటీ పడ్డాయి. చివరకు కోటీ అరవై లక్షలతో ఆక్షన్ ముగిసి ఆ అమ్మాయి ముంబై ఇండియన్స్ జట్టు భాగస్వామి అయ్యింది. ఒకేరోజు ఇలా కౌలాలంపూర్‌లో ఇటు బెంగళూరులో మార్మోగిన ఆ అమ్మాయి పేరు కమలిని. వయసు 16.మదురై అమ్మాయికమలినిది మధ్యతరగతి కుటుంబం. మదురైలో ఉండేది. స్కేటింగ్ నేర్చుకుంటూ హుషారుగా ఉండే కమలిని 12 ఏళ్ల వరకు క్రికెట్ జోలికే వెళ్లలేదు. 2022లో కరోనా రావడంతో లాక్డౌన్ వచ్చి ఆమె తండ్రి గుణాలన్ కాలక్షేపానికి కొడుకుతో వీధిలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఒకరోజు కమలినిని పిలిచి నువ్వు బౌలింగ్ చెయ్ అన్నాడాయన. కమలిని బౌలింగ్ చేస్తే దిమ్మెర పోయాడు. అలా ఆ వయసులో అలా బౌలింగ్ చేసే పిల్లలు లేరు. కమలినికి ఇది సహజసిద్ధంగా వచ్చిందని గ్రహించిన తండ్రి మరి ఆలస్యం చేయలేదు. మరుసటి సంవత్సరమే చెన్నై కాపురం మార్చి‘చైన్నె సూపర్‌కింగ్స్ అకాడెమీ’లో చేర్చాడు. అక్కడ ఆమె ప్రతిభ గమనించి వెంటనే ‘తమిళనాడు అండర్–19’లోకి తీసుకున్నారు. విమెన్స్ అండర్ 19 టి 20 కప్‌లో 8 మేచెస్లో 311 పరుగులు కొట్టింది కమలిని. అంతేకాదు సిక్సర్ల కమలినిగా పేరు ΄పొందింది. ఆమె సిక్స్‌కు బాల్ని లేపితే బౌండరీ దాటాల్సిందే.తండ్రి అంటే ప్రేమకమలినికి తండ్రంటే చాలా ప్రేమ. ఆయనకు గుండె సమస్య తలెత్తితే తల్లడిల్లిపోయింది కమలిని. ‘మా నాన్నంటే నాకు చాలా ఇష్టం’ అంటుంది. ఆ సమయంలో ఆటమీద మనసు లగ్నం చేయలేకపోయింది. అయితే తండ్రికి సర్జరీ అయ్యి ఇంకేం పర్వాలేదని డాక్టర్లు చె΄్పాక ఆ మరుసటి రోజే తమిళనాడు– ఆంధ్రల మధ్య మ్యాచ్ ఉంటే చెలరేగి సెంచరీ బాదింది కమలిని. ప్రతిభ, తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రోత్సాహం సమృద్ధిగా ఉన్న ఈ అమ్మాయి మున్ముందు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తుంది. -
ఐపీఎల్ 2021: ముంబైకి అడ్డుందా!
ఒకటి... రెండు... మూడు... నాలుగు... ఐదు... ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ విజయయాత్ర సాగిపోతూనే ఉంది. తొలి ఐదు సీజన్లలో తమదైన ముద్ర కోసం ప్రయత్నించి విఫలమైన ఆ జట్టు తర్వాతి ఎనిమిది ఏళ్లలో ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలిచి సత్తా చాటింది. గత సీజన్లో ఆట, జట్టు సభ్యుల తాజా ఫామ్ చూసుకుంటే ముంబైని నిలువరించడం ప్రత్యర్థికి మరోసారి అసాధ్యం కావచ్చు. సిక్సర్లతో విరుచుకుపడే హిట్టర్లు, పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేసే బౌలర్లు, మైదానం బయటా హంగామాతో భారీ బడ్జెట్ సినిమాను తలపించే టీమ్ గత ఏడాది గెలుపుతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. రోహిత్ కెప్టెన్సీలో జట్టు దాదాపు ఎలాంటి లోపాలు లేకుండా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అదే జోరును కొనసాగించి ‘సిక్సర్’ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. -సాక్షి క్రీడా విభాగం కొత్తగా వచ్చినవారు టీమ్ అన్ని రకాలుగా కుదురుకొని ఉండటంతో ముంబైకి వేలంలో ప్రత్యేకంగా కొందరు ఆటగాళ్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేకపోయింది. అయితే వేలానికి ముందు విదేశీ పేస్ బౌలర్లతో పాటు రాహుల్ చహర్‌కు తోడుగా అదనపు లెగ్‌స్పిన్నర్ అవసరం కనిపించింది. వేలానికి ముందు తామే విడుదల చేసిన నాథన్ కూల్టర్‌నైల్ (రూ. 5 కోట్లు)ను మళ్లీ ఎంచుకుంది. కివీస్ పేసర్ ఆడమ్ మిల్నేపై రూ. 3.20 కోట్లు వెచ్చించిన జట్టు సీనియర్ లెగ్‌స్పిన్నర్ పీయూష్ చావ్లాను రూ. 2.40 కోట్లకు తీసుకుంది. వీరితోపాటు కివీస్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ జట్టులోకి వచ్చాడు. మరో ముగ్గురు వర్ధమాన ఆటగాళ్లు యుధ్వీర్ చరక్, అర్జున్ టెండూల్కర్ (భారత్), మార్కో జాన్సన్ (దక్షిణాఫ్రికా)లను కనీస ధర రూ. 20 లక్షల చొప్పున చెల్లించి జట్టులో భాగం చేసింది. మొత్తంగా చూస్తే హడావిడి పడకుండా టీమ్ అవసరాలకు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లను మాత్రమే తీసుకోగా, చివరకు రూ. 3.65 కోట్ల స్వల్ప మొత్తమే జట్టు ఖాతాలో మిగిలింది. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఆదిత్య తారే, అనుకూల్ రాయ్, అన్మోల్ప్రీత్ సింగ్, ధావల్ కులకర్ణి, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా, మొహసిన్ ఖాన్, రాహుల్ చహర్, సౌరభ్ తివారి, సూర్యకుమార్ యాదవ్, పీయూష్ చావ్లా, యుధ్వీర్ చరక్, అర్జున్ టెండూల్కర్. విదేశీ ఆటగాళ్లు: క్రిస్ లిన్, కీరన్ పొలార్డ్, క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, నాథన్ కూల్టర్‌నైల్, జిమ్మీ నీషమ్, మార్కో జాన్సన్ సహాయక సిబ్బంది: మహేలా జయవర్ధనే (హెడ్ కోచ్), జహీర్ ఖాన్ (డైరెక్టర్, క్రికెట్ ఆపరేషన్స్), రాబిన్ సింగ్ (బ్యాటింగ్ కోచ్), షేన్ బాండ్ (బౌలింగ్ కోచ్), జేమ్స్ ప్యామెంట్ (ఫీల్డింగ్ కోచ్), తుది జట్టు అంచనా/ఫామ్ గత కొన్నేళ్లుగా ఒకటి, రెండు స్థానాలు మినహా... లేదంటే ఆటగాళ్లు గాయపడితే తప్ప ముంబై ఇండియన్స్ తుది జట్టులో ఎప్పుడూ మార్పులు జరగలేదు. అసలు అలాంటి అవసరం కూడా కనిపించలేదు. అంత పక్కాగా ఆ టీమ్ కూర్పు, వ్యూహాలు ఉన్నాయి. రోహిత్, డి కాక్, పొలార్డ్, హార్దిక్, కృనాల్, బుమ్రా, బౌల్ట్ మరో సందేహం లేకుండా తుది జట్టులో ఉంటారు. ఇక ఇటీవలే భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత సీజన్లోనూ అదరగొట్టిన వీరిద్దరితో కలిపితే తొమ్మిది స్థానాలు ఖాయం. నాలుగో విదేశీ ఆటగాడిగా మిల్నే, కూల్టర్నైల్లలో ఒకరు ఆడతారు. లిన్, నీషమ్‌లకు అవకాశం దక్కడం చాలా కష్టం. స్పిన్నర్‌గా రాహుల్ చహర్‌కు తొలి ప్రాధాన్యత ఉంటుంది కానీ అవసరమైతే చావ్లాను అతనికి బదులుగా వాడుకోవచ్చు. ఆఫ్ స్పిన్నర్ జయంత్‌కు కూడా కొన్ని మ్యాచ్‌లలో అవకాశం దక్కవచ్చు. ఆరంభ ఓవర్లలో సూపర్ బౌలింగ్‌తో బౌల్ట్ 2020 విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఇప్పుడు కివీస్ తరఫున చక్కటి ఫామ్‌లో ఉండగా... ఇటీవలే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది పొలార్డ్ తానేమిటో గుర్తు చేశాడు. అత్యుత్తమ ప్రదర్శన 5 సార్లు చాంపియన్ (2013, 2015, 2017, 2019, 2020) 2020లో ప్రదర్శన: సీజన్ మొత్తం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి చివరకు విజేతగా నిలిచింది. లీగ్ దశలో 9 విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు తొలి క్వాలిఫయర్, ఫైనల్లలో అలవోక విజయాలు సాధించింది. ఓడిన ఐదింటిలో కూడా రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిసినవే. గాయంతో రోహిత్ నాలుగు మ్యాచ్‌లకు దూరమైనా జట్టుపై దాని ప్రభావం పడలేదు. ఒకరిని మించి మరొకరు పోటీ పడి అద్భుత ప్రదర్శనతో టీమ్‌కు ఐదో టైటిల్‌ను అందించారు. -
రోహిత్ శర్మకు ఘన స్వాగతం..
ముంబై: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన మరుసటి రోజే ముంబై ఇండియన్స్ శిబిరంలో ప్రత్యక్షమాయ్యడు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. మరో పది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 ప్రారంభంకానున్న నేపథ్యంలో జట్టుతో పాటు శిక్షణా శిబిరంలో చేరాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేయటంతో జట్టు సభ్యులు ఒక్కొక్కరుగా ముంబైకి చేరుకుంటున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన గంటల వ్యవధిలోనే పాండ్యా సోదరులు(హార్దిక్, కృనాల్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు ముంబై ఇండియన్స్ జట్టుతో చేరగా, తాజాగా రోహిత్ కూడా వీరితో పాటు ముంబై శిబిరంలో చేరిపోయాడు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లందరూ స్థానికంగా ఉన్న ఓ హోటల్లో క్వారంటైన్ అంక్షల నడుమ బస చేస్తున్నారు. 🙁 Where is RO ➡️ Here we GO! 😎#OneFamily #MumbaiIndians #IPL2021 @ImRo45 https://t.co/epbgkGM3at pic.twitter.com/GCVeKrKr3P — Mumbai Indians (@mipaltan) March 29, 2021 సోమవారం జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ హోటల్లో అడుగుపెట్టగానే ఆటగాళ్లతోపాటు మేనేజ్మెంట్ సభ్యులు అతనికి ఘన స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి పాండ్యా సోదరులు, సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు జట్టుతో చేరిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. తాజాగా రోహిత్‌కు వెల్కమ్ చెబుతున్న వీడియోను సైతం ట్విటర్లో షేర్ చేసింది. ఇదిలా ఉండగా చెన్నై వేదికగా ఏప్రిల్ 9న ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఢీకొంటుంది. The boys have come home! 💙 Hardik, Surya and Krunal checked in at the @RenaissanceMum last night ✅#OneFamily #MumbaiIndians #IPL2021 @hardikpandya7 @surya_14kumar @krunalpandya24 @MarriottBonvoy pic.twitter.com/zWJ5Sfb6vy — Mumbai Indians (@mipaltan) March 29, 2021 -
సందడి షురూ...
దుబాయ్: అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)– 2020కి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని మూడు వేదికల్లో లీగ్ జరగనుండగా... సుమారు నెల రోజుల ముందుగానే జట్లు అక్కడికి చేరుకుంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం యూఏఈ గడ్డపై అడుగు పెట్టాయి. మరో రెండు టీమ్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే అక్కడికి వెళ్లాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఆరు రోజుల వరకు అందరికీ క్వారంటీన్ తప్పనిసరి. ఈ సమయంలో ఒక్కొక్కరికి కనీసం మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహి స్తారు. ఆ తర్వాతేనుంచి ఆటగాళ్ల ప్రాక్టీస్, లీగ్ వార్తలు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి. మలింగ మరింత ఆలస్యంగా... శ్రీలంక స్పీడ్‌స్టర్, ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ లసిత్ మలింగ కూడా ఆలస్యంగానే యూఏఈ వెళ్లనున్నాడు. దీంతో తొలి దశ మ్యాచ్‌లకు అతను జట్టుకు అందుబాటులో ఉండడు. కుటుంబ కారణాల వల్లే లంక ఆటగాడు కాస్తా ఆలస్యంగా ఐపీఎల్ ఆడనున్నాడు. ఈ పేసర్ తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు త్వరలోనే సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉండటంతో మలింగ తండ్రి వెంటే ఉండాలనుకుంటున్నాడు. దీంతో సగం మ్యాచ్‌లు అయ్యాకే అక్కడికి వెళ్లే అవకాశముంది. గతేడాది మలింగ మలుపు తిప్పిన ఆఖరి ఓవర్‌తోనే ముంబై నాలుగోసారి చాంపియన్ అయ్యింది. 8 పరుగులు చేస్తే చెన్నై గెలిచే ఆ ఓవర్లో అద్భుతంగా కట్టడి చేయడం వల్లే రోహిత్ సేన నెగ్గింది. చెన్నై బౌలర్ హర్భజన్ సింగ్ కూడా వ్యక్తిగత కారణాలతో జట్టుతో పాటే యూఏఈ వెళ్లలేకపోయాడు. -
ఆఫర్ పట్టు.. జెర్సీ కొట్టు
సాక్షి, ముంబై : స్మార్ట్ఫోన్ల దిగ్గజం శాంసంగ్ ఐపీఎల్-11 సీజన్ సందర్భంగా శాంసంగ్ 20 - 20 కార్నివల్‌ను ప్రకటించింది. ఈ కార్నివల్లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక ధరలను, ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. ఈ కార్నివల్‌ను శాంసంగ్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో నిర్వహిస్తోంది. శాంసంగ్ కార్నివల్ నేటి(ఏప్రిల్ 18) నుంచి ఏప్రిల్ 21 వరకు జరగనుంది. కేవలం డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు మాత్రమే కాక ప్రతిరోజు 20 మంది లక్కీ విన్నర్స్కి శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ముంబై ఇండియన్స్ జెర్సీని కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. శాంసంగ్ 20 - 20 కార్నివల్లో అందిస్తున్న డిస్కౌంట్లు ఈ విధంగా ఉన్నాయి.. గెలాక్సీ ఏ8 ప్లస్ రూ.29,990కు అందుబాటులో ఉంది. 2వేల రూపాయల డిస్కౌంట్ ప్రకటించిన తర్వాత గెలాక్సీ ఆన్7 ప్రైమ్ 32 జీబీ వేరియంట్ రూ.10,990కే విక్రయానికి లభ్యమవుతోంది. అలానే గెలాక్సీ ఆన్7 ప్రైమ్ 64జీబీ వేరియంట్‌పై కూడా 2వేల రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,990కి తగ్గింది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుని గెలాక్సీ ఆన్7 ప్రైమ్ కొనేవారికి అదనంగా మరో వెయ్యి రూపాయల డిస్కౌంట్ లభించనుంది. వీటితో పాటు శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో, ఆన్5 ప్రో స్మార్ట్ఫోన్లు కూడా ప్రత్యేక ధరలు రూ.6,990కు, రూ. 6,490కు లభిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌కి ప్రధాన స్పాన్సర్ అయిన శాంసంగ్ ఈ ఐపీఎల్ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులకు ఆనందాన్ని పంచడానికి అమెజాన్‌లో ఈ కార్నివల్‌ను నిర్వహిస్తున్నట్లు శాంసంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ సందీప్ సింగ్ అరోరా తెలిపారు. అమెజాన్ ఇండియా డైరెక్టర్ నూర్ పటేల్ మాట్లాడుతూ... అమెజాన్‌లో నిర్వహిస్తున్న శాంసంగ్ కార్నివల్ దేశవ్యాప్తంగా ఉన్న అమెజాన్ వినియోగదారులకు పునరుత్తేజాన్ని కలిగించనుందని తెలిపారు. ఈ క్రికెట్ సీజన్లో వినియోగదారులు కేవలం శాంసంగ్ స్మార్టఫోన్లపై ఆఫర్లను, డిస్కౌంట్లను మాత్రమే కాక వారి అభిమాన ముంబై ఇండియన్స్ జట్టు అధికారిక జెర్సీని కూడా పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్నివల్లో కొనుగోలుదారులకు డిస్కౌంట్ ఆఫర్లు మాత్రమే కాక మరిన్ని ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన ఫోన్లపై ఎంపిక చేసిన క్రెడిట్ / డెబిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్‌ను కూడా శాంసంగ్ ప్రకటించింది. -
పాండ్యా నాటౌట్..! చిర్రెత్తిన కోహ్లీ
ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోపమొచ్చింది. హార్దిక్ పాండ్యా ఔటైనా నాటౌట్‌గా ప్రకటించారంటూ అతడు అసహనానికి గురయ్యాడు. ఫీల్డ్ అంపైర్‌ని కలిసి ఇదేంటని ప్రశ్నించాడు. ఈ సంఘటన ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి కీరన్ పొలార్డ్ ఔటవడంతో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కి వచ్చాడు. అదే ఓవర్లో వోక్స్ వేసిన మరో బంతికి హార్దిక్ క్యాచ్ ఔట్ అంటూ ఆర్సీబీ అప్పీల్ చేయడం ఫీల్డ్ అంపైర్ వేలెత్తడం చకచక జరిగిపోయాయి. అయితే దీనిపై రివ్యూ కోరిన ముంబై ఇండియన్స్ జట్టుకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. థర్డ్ అంపైర్ హార్దిక్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. హార్దిక్ నాటౌట్ అంటూ బిగ్ స్ర్కీన్‌పై చూసిన కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఫీల్డ్‌లో ఉన్న అంపైర్ దగ్గరికి వెళ్లి ఆరా తీశాడు. మైదానంలో కూల్‌గా వ్యవహరించే కోహ్లీ ఈ నిర్ణయం సరైంది కాదని అడ్డంగా తల ఊపుతూ.. అసహనం వ్యక్తం చేశాడు. అయితే స్టికో మీటర్లో సైతం బంతి పాండ్యా బ్యాట్ అంచును తాకుతూ వెళ్లినట్లు నిర్ధారణ కావడం గమనార్హం. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో బెంగుళూరుపై ఘన విజయం సాధించింది. ముంబైకి ఈ సీజన్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. -
ముంబై ఇండియన్స్‌కు పాండ్యా షాక్?
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా హర్దిక్ పాండ్యా తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ముంబై ఇండియన్స్‌కు షాకిస్తూ వేలంలో పాల్గొనాలని అతను నిర్ణయించుకున్నాడు. అధికారిక ప్రకటన లేకపోయినా.. జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఐపీఎల్ వేలంలో పాల్గొనే విషయాన్ని పాండ్యా ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్టు సమాచారం. 2015 నుంచి పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2015, 2017లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలవటంతో ఈ యువ ఆల్‌రౌండర్ కీలక పాత్ర పోషించాడు కూడా. తొలి సీజన్లో అతన్ని 10 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్.. ప్రస్తుతం 30 లక్షల దాకా చెల్లిస్తోంది. అయితే అదే ముంబై ఇండియన్స్ పాండ్యా సోదరుడు కృనాల్‌ను మాత్రం 2 కోట్లు చెల్లించటం విశేషం. ఈ నేపథ్యంలో తాను వేలానికి వెళ్లటమే మంచిదన్న భావనలో హర్దిక్ ఉన్నాడన్ననది ఆ కథనాల సారాంశం. ప్రస్తుతం ఆల్‌రౌండర్‌గా వీరలెవల్లో విజృంభిస్తున్న పాండ్యా వేలానికి వస్తే 10 కోట్లు అయినా చెల్లించేందుకు ప్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 4న ఐపీఎల్-11 వేలం జరగనుంది. -
ముంబై ఇండియన్స్ జట్టు డిజ్జి స్టంప్స్ ఛాలెంజ్
-
ధోనీకి మందలింపు
►అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకే.. ►చర్చనీయాంశంగా మిస్టర్ కూల్ అప్పీల్ పుణె: సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా ధోనీకి మంచి పేరు ఉంది. వ్యూహాలను అమలు చేయడంలో, ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టడంలో దిట్ట అన్న పేరు ఉంది. తాను నాయకత్వం వహించిన మ్యాచ్‌ల్లో వూహించని నిర్ణయాలు తీసుకొని చాలాసార్లు ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా గురువారం ముంబయి ఇండియన్స్ జట్టుతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తలపడింది. తన ఐపీఎల్ కెరీర్లో ధోనీ తొలిసారి సారథిగా కాకుండా ఓ సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగాడు. ముంబయి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీ తాను కెప్టెన్ కాదు అన్న సంగతి మరచిపోయి అతడు వ్యవహరించిన తీరు అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అసలు ఏం జరిగింది? అంతర్జాతీయ క్రికెట్ల్లో ప్రస్తుతం టెస్టు, వన్డే ఫార్మాట్లో మాత్రమే ‘డీఆర్ఎస్’ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రం సమీక్ష కోరే పద్ధతి అందుబాటులో లేదు. ఐతే ముంబయి ఇండియన్స్ జట్టు 115/5 ఉన్న సమయంలో పుణె స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 15వ ఓవర్ వేయడానికి బంతి అందుకున్నాడు. ముంబయి బ్యాట్స్‌మన్ పొలార్డ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. తాహిర్ వేసిన బంతి పొలార్డ్ ప్యాడ్లకు తాకడంతో అతడు ఔట్ కోసం అంపైర్‌ను అప్పీల్ కోరాడు. కీపింగ్ చేస్తున్న ధోని సైతం గట్టిగానే అప్పీల్ చేశాడు. అంపైర్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. ధోనీ వెంటనే సమీక్ష కోరాడు. ఐతే ఐపీఎల్లో డీఆర్ఎస్ లేకపోయినప్పటికీ పరోక్షంగా అంపైర్ నిర్ణయాన్ని అసహనంతో వ్యంగ్యంగా సంజ్ఞ రూపంలో తెలియజేశాడు. ఈ పరిణామంతో తోటిఆటగాళ్లు, మ్యాచ్ చూస్తోన్న ప్రేక్షకులు విస్తుపోయారు. అదేంటి? ధోనీ ఇలా చేశాడు. ఎప్పుడూ నిలకడగా కనిపించే ధోనీ.. ఇలా నిరసన ప్రదర్శించడంపై చర్చానీయాంశమైంది. కేవలం అంపైర్ తమ నిర్ణయాన్ని వ్యతిరేకించాడన్న కారణంతో ఇలాంటి వ్యంగ్య సైగలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మహీకి.. మందలింపు చివరికి అనుకున్నదంతా అయింది. అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధోని వ్యవహరించడం ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే. అతని ప్రవర్తనా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉండటంతో లెవల్–1 నిబంధనల ప్రకారం అతన్ని తీవ్రంగా మందలించారు. నియమావళిలో లెవల్–1 నేరం కిందకు వస్తుండటంతో మ్యాచ్ రిఫరీ మనూ నాయర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ధోనీ తాను కెప్టెన్ అన్న సంగతి మరిచి ఇలా చేశాడో.. కావాలనే చేశాడో అన్న విషయం అర్థం కావడం లేదు. సాధారణ జట్టు సభ్యుడిగా ధోనీకి ఇది తొలిమ్యాచ్ కావడం వల్ల.. పాత అలవాటు ప్రకారం అలా చేసి ఉంటాడని చాలామంది ధోనికి మద్దతుగా నిలుస్తున్నారు. -
‘వండర్’సన్
కోరె అండర్సన్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీని తన పేరిట లిఖించుకున్న ఈ కివీస్ ఆటగాడు ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్‌కు పెద్దగా ఉపయోగపడింది లేదు. కానీ ప్రత్యర్థి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రేంజిలో కీలక మ్యాచ్‌లో చెలరేగాడు. దీంతో లీగ్‌లో పడుతూ లేస్తూ తన ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై అత్యంత నాటకీయ పరిస్థితుల్లో ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ముంబై: టి20 క్రికెట్లో ఏదీ అసాధ్యం కాదేమో... ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ దశకు చేరుకోవాలంటే 14.3 ఓవర్లలోనే 190 పరుగులు చేయాలి. ముంబైకి చావో రేవోగా నిలిచిన ఈ మ్యాచ్‌లో కోరె అండర్సన్ (44 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) లీగ్‌లో తొలిసారిగా విశ్వరూపం ప్రదర్శించాడు. శనివారం మ్యాచ్‌లో యూసుఫ్ పఠాన్ విధ్వంసాన్ని మరిపించే రీతిలో కొనసాగిన ఈ విలయ తాండవంతో... ఛేదించడం సాధ్యమేనా అనుకున్న లక్ష్యాన్నికాస్తా పిడుగుల్లాంటి షాట్లతో 14.4 ఓవర్లలోనే ఉఫ్ మని ఊదేసి జట్టును సంబరాల్లో ముంచాడు. దీంతో వాంఖడే మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ అత్యంత ఉత్కంఠభరిత మ్యాచ్‌ను 5 వికెట్ల తేడాతో గెల్చుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 189 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ (47 బంతుల్లో 74; 7 ఫోర్లు; 3 సిక్సర్లు), కరుణ్ నాయర్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ముంబై 14.4 ఓవర్లలో ఐదు వికెట్లకు 195 పరుగులు చేసి నెగ్గింది. హస్సీ (11 బంతుల్లో 22; 1 ఫోర్; 2 సిక్సర్లు) ఆకట్టుకోగా చివర్లో అంబటి రాయుడు (10 బంతుల్లో 30; 5 ఫోర్లు; 1 సిక్స్) జట్టుకు ఉపయోగపడ్డాడు. కులకర్ణి, కూపర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండర్సన్‌కు దక్కింది. ఆరంభంలో నెమ్మదించినా.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (18 బంతుల్లో 8; 1 ఫోర్) పరుగులు తీసేందుకు తెగ ఇబ్బంది పడ్డాడు. బుమ్రా తొలి ఓవర్‌ను మెయిడిన్ వేయగా అటు మరో ఓపెనర్ సంజూ సామ్సన్ మాత్రం బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఆరో ఓవర్లో వాట్సన్ అవుటైన అనంతరం మ్యాచ్ స్వరూపం మారింది. కరుణ్ నాయర్‌తో కలిసి సామ్సన్ ఇన్నింగ్స్‌ను పట్టాలెక్కించాడు. 11వ ఓవర్లో నాయర్ విజృంభించి 6,4,4,4తో 19 పరుగులు రాబట్టాడు. ఇదే జోరుతో 26 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన అనంతరం అవుటయ్యాడు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 57 బంతుల్లో 100 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత ఓవర్లోనే సామ్సన్ వెనుదిరిగినా రాజస్థాన్ దూకుడు తగ్గలేదు. బ్రాడ్ హాడ్జ్ (16 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు; 1 సిక్స్), ఫాల్క్‌నర్ (12 బంతుల్లో 23; 3 సిక్సర్లు) చివరి 27 బంతుల్లో 48 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోరును అందించారు. వారెవ్వా అండర్సన్ గెలిచేందుకు కావాల్సిన రన్‌రేట్‌ను దృష్టిలో ఉంచుకుని బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ అదే స్థాయిలో తమ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. తొలి ఓవర్లో మూడు ఫోర్లు బాదిన సిమ్మన్స్ (8 బంతుల్లో 12; 3 ఫోర్లు) మరుసటి ఓవర్లో అవుటైనా అండర్సన్, హస్సీ (11 బంతుల్లో 22; 1 ఫోర్; 2 సిక్సర్లు) ఏమాత్రం తగ్గలేదు. మూడో ఓవర్లో 15, నాలుగో ఓవర్లో 19 పరుగులు సాధించి జోష్‌లో ఉన్న ముంబైని కూపర్ నేలకు దించాడు. ఐదో ఓవర్లో హస్సీ, పొలార్డ్ (3 బంతుల్లో 7; 1 సిక్స్)ను అవుట్ చేసి షాకిచ్చాడు. అయితే పవర్ ప్లే ముగిసే సరికి ముంబై 71 పరుగులు సాధించింది. అండర్సన్ మాత్రం కసిదీరా బ్యాట్‌ను ఝుళిపించాడు. దీంతో తొమ్మిదో ఓవర్లోనే జట్టు వంద పరుగుల మార్కును దాటగా... అతను 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. వాట్సన్ వేసిన 12వ ఓవర్లో రాయుడు వరుసగా మూడు ఫోర్లతో విజృంభించాడు. ఇక తమ టార్గెట్‌ను పూర్తి చేయాల్సిన 15వ ఓవర్లో అందరి ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సిన దశలో తొలి బంతికి అండర్సన్ సింగిల్ తీశాడు. రెండో బంతిని రాయుడు సిక్స్ బాదడంతో ముంబై ఆనందంలో మునిగింది. అయితే ఒక్క బంతికి రెండు పరుగులు రావాల్సిన దశలో సింగిల్ తీసిన అనంతరం రాయుడు రనౌట్ అయ్యాడు. దీంతో ఫలితం ఏమిటో అర్థం కాక స్టేడియంలో అయోమయం నెలకొంది. అయితే కొంత సమయం తర్వాత మరుసటి బంతికి ఫోర్ సాధిస్తే ముంబై ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుందని ప్రకటించారు. దీంతో ఆదిత్య తారే సిక్స్‌గా మలిచి మైదానాన్ని హోరెత్తించాడు. స్కోరు వివరాలు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 8; సామ్సన్ (సి) హర్భజన్ (బి) గోపాల్ 74; కరుణ్ (సి) సిమ్మన్స్ (బి) బుమ్రా 50; హాడ్జ్ నాటౌట్ 29; ఫాల్క్‌నర్ (సి) అండర్సన్ (బి) పొలార్డ్ 23; కూపర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 2, వైడ్లు 3) 5; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1-34; 2-134; 3-136; 4-185. బౌలింగ్: అండర్సన్ 2-0-14-0; బుమ్రా 4-1-30-1; ఓజా 4-0-31-0; హర్భజన్ 4-0-43-1; గోపాల్ 3-0-36-1; పొలార్డ్ 3-0-33-1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) ఫాల్క్‌నర్ (బి) కులకర్ణి 12; హస్సీ (బి) కూపర్ 22; అండర్సన్ నాటౌట్ 95; పొలార్డ్ (సి) హాడ్జ్ (బి) కూపర్ 7; రోహిత్ (సి) నాయర్ (బి) కులకర్ణి 16; రాయుడు (రనౌట్) 30; తారే నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 3, వైడ్లు 4) 7; మొత్తం (14.4 ఓవర్లలో 5 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1-19; 2-53; 3-61; 4-108; 5-189. బౌలింగ్: ఫాల్క్‌నర్ 3.4-0-54-0; కులకర్ణి 3-0-42-2; వాట్సన్ 2-0-33-0; కూపర్ 4-0-38-2; తాంబే 2-0-25-0. -
జహీర్ స్థానంలో ప్రవీణ్
ముంబై: గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన జహీర్‌ఖాన్ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రవీణ్ కుమార్‌ను తీసుకుంది. గతంలో బెంగళూరు, పంజాబ్ జట్ల తరఫున ఆడిన ఈ యూపీ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఎవరూ కొనలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అయితే అనుకోని విధంగా తనని అదృష్టం తలుపుతట్టింది. జహీర్ స్థానంలో అనుభవజ్ఞుడైన బౌలర్ కావాలని భావించిన ముంబై... భారత మాజీ బౌలర్ ప్రవీణ్‌ను తీసుకుంది. ముంబై డ్రెస్‌లో ప్రవీణ్ ఉన్న ఫొటోను కెప్టెన్ రోహిత్ ట్విట్టర్లో పెట్టాడు. -
జహీర్‌ఖాన్ స్థానంలో ప్రవీణ్ కుమార్
ముంబై: గాయం కారణంగా ఐపీఎల్-7కు దూరమైన జహీర్‌ఖాన్ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రవీణ్ కుమార్‌ను తీసుకుంది. గతంలో బెంగళూరు, పంజాబ్ జట్ల తరఫున ఆడిన ఈ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఎవరూ కొనలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అయితే అనుకోని విధంగా తనని అదృష్టం తలుపుతట్టింది. జహీర్ స్థానంలో అనుభవజ్ఞుడైన బౌలర్ కావాలని భావించిన ముంబై... కుమార్‌ను తీసుకుంది. ఢిల్లీ బాట్స్ మన్ సౌరభ్ తివారి కూడా గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. -
ముంబై జట్టులో సిమ్మన్స్
జలజ్ సక్సేనా స్థానంలో తీసుకున్న ఫ్రాంచైజీ దుబాయ్: వరుస ఓటములతో కుదేలైన ముంబై ఇండియన్స్ జట్టు ఓ కీలక మార్పు చేసింది. వెస్టిండీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లెండిల్ సిమ్మన్స్‌ను జట్టులోకి తీసుకుంది. జలజ్ సక్సేనా స్థానంలో సిమ్మన్స్‌ను తీసుకోవడానికి ఐపీఎల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. అయితే జలజ్‌ను ఎందుకు తీశారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మధ్యప్రదేశ్ క్రికెటర్ జలజ్ సక్సేనాను రూ.90 లక్షలకు ముంబై కొనుక్కుంది. కానీ సీజన్లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. మరోవైపు వెస్టిండీస్ క్రికెటర్ సిమ్మన్స్ ఇప్పటివరకూ ఎప్పుడూ ఐపీఎల్లో ఆడలేదు.