ముంబై ఇండియన్స్‌కు పాండ్యా షాక్‌? | Hardik Pandya goes to IPL auction | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ వేలానికి హర్దిక్‌ పాండ్యా?

Published Sun, Oct 29 2017 2:17 PM | Last Updated on Sun, Oct 29 2017 3:44 PM

Hardik Pandya goes to IPL auction

సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా హర్దిక్ పాండ్యా తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ముంబై ఇండియన్స్‌కు షాకిస్తూ వేలంలో పాల్గొనాలని అతను నిర్ణయించుకున్నాడు. అధికారిక ప్రకటన లేకపోయినా.. జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. 

ఐపీఎల్‌ వేలంలో పాల్గొనే విషయాన్ని పాండ్యా ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్టు సమాచారం. 2015 నుంచి పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తు‍న్నాడు. 2015, 2017లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలవటంతో ఈ యువ ఆల్‌రౌండర్ కీలక పాత్ర పోషించాడు కూడా. తొలి సీజన్‌లో అతన్ని 10 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్‌.. ప్రస్తుతం 30 లక్షల దాకా చెల్లిస్తోంది.

అయితే అదే ముంబై ఇండియన్స్‌ పాండ్యా సోదరుడు కృనాల్‌ను మాత్రం 2 కోట్లు చెల్లించటం విశేషం. ఈ నేపథ్యంలో తాను వేలానికి వెళ్లటమే మంచిదన్న భావనలో హర్దిక్‌ ఉన్నాడన్ననది ఆ కథనాల సారాంశం. ప్రస్తుతం ఆల్‌రౌండర్‌గా వీరలెవల్లో విజృంభిస్తున్న పాండ్యా వేలానికి వస్తే 10 కోట్లు అయినా చెల్లించేందుకు ప్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 4న ఐపీఎల్-11 వేలం జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement