ఢిల్లీకి తాహిర్, బెంగళూరుకు రోసో | Delhi Tahir,Bangalore Rosso | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి తాహిర్, బెంగళూరుకు రోసో

Published Tue, Apr 29 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

ఢిల్లీకి తాహిర్, బెంగళూరుకు రోసో

ఢిల్లీకి తాహిర్, బెంగళూరుకు రోసో

న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో గాయపడిన ఆటగాళ్ల స్థానాల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు కొత్త ఆటగాళ్లను తీసుకున్నాయి. ఢిల్లీ జట్టులో పేస్ బౌలర్ కౌల్టర్ నైల్, బెంగళూరులో ఓపెనర్ నిక్ మ్యాడిన్సన్‌తోపాటు చెన్నై ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోలు గాయాలపాలై టోర్నీ నుంచి నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. కౌల్టర్ నైల్ స్థానంలో ఢిల్లీ.. దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్‌లో తాహిర్ 12 వికెట్లతో రాణించాడు.

బెంగళూరు జట్టు మ్యాడిన్సన్ స్థానంలో దక్షిణాఫ్రికాకే చెందిన రిలీ రోసోను జట్టులో చేర్చుకుంది. దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుకు మాత్రమే ఆడిన రోసో.. దేశవాళీల్లో భారీ స్కోర్లు సాధించాడు. ఇక బ్రేవో స్థానంలో ఎవరిని తీసుకోవాలన్న విషయంపై చెన్నై ఇంకా తుదినిర్ణయానికి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement