pace bowler
-
IPL Auction 2025 : పేస్ బౌలర్లకు పట్టం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్‌గా నిలిచిన దీపక్ చహర్‌కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్‌దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండేలకు మంచి విలువ లభించింది. విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్‌లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్‌లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్‌స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్‌లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి. -
మూడో టెస్టుకు హర్షిత్
ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టెస్టు కోసం పేస్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. బుధవారం అతను జట్టుతో చేరతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ట్రావెలింగ్ రిజర్వ్‌లలో ఢిల్లీకి చెందిన హర్షిత్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రధాన జట్టులోకి రానున్నాడని సమాచారం. నవంబర్ 1 నుంచి భారత్, కివీస్ మధ్య మూడో టెస్టు వాంఖెడే మైదానంలో జరుగుతుంది. హర్షిత్‌కు ఇప్పటికే బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఆ్రస్టేలియాకు వెళ్లే భారత టెస్టు టీమ్‌లో చోటు లభించింది. దానికి ముందు ఒక టెస్టులో అతడిని ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.కివీస్‌తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో మూడో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే హర్షిత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టవచ్చు. బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లకు ఎంపికైనా... హర్షిత్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మంగళవారం అస్సాంతో ముగిసిన రంజీ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన హర్షిత్...ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 24.00 సగటుతో రాణా 43 వికెట్లు పడగొట్టాడు. విలియమ్సన్ దూరం వెలింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేని అతను ఇప్పుడు మూడో టెస్టునుంచి తప్పుకున్నాడు. విలియమ్సన్ భారత్‌కు రావడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గాయం నుంచి కోలుకొని అతను ప్రస్తుతం రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్తగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.సంచలన ప్రదర్శనతో కివీస్ ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో హడావిడిగా విలియమ్సన్‌ను బరిలోకి దించరాదని బోర్డు భావించింది. ఈ సిరీస్ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. దాని కోసం విలియమ్సన్ పూర్తి స్థాయిలో ఫిట్‌గా అందుబాటులో ఉండాలనేదే ప్రధాన కారణం. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన తర్వాత స్వదేశానికి వెళ్లిన విలియమ్సన్ గాయం కారణంగా భారత గడ్డపై అడుగు పెట్టనే లేదు. -
IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది
భారత క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది ప్రతీ యువ క్రికెటర్ కల. ప్రతిభకు తోడు శ్రమ, పట్టుదల, పోరాటంతో సత్తా చాటి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు కుర్రాళ్లకు ఆదివారం అలాంటి గొప్ప అవకాశం వచి్చంది. ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఢిల్లీ పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్ల టీమిండియా తరఫున ‘బ్లూ జెర్సీ’లో ఆడటం మాత్రమే కాదు... వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా తమ విలువను అమాంతం పెంచుకున్నారు. వీరిద్దరిని వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి ఆయా ఫ్రాంచైజీలు కొనసాగిస్తాయా అనేది ఆసక్తికరం. ఐపీఎల్–2025 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము కొనసాగించే ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఈ సిరీస్‌కు ముందు వరకు వీరిద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లే. ఇప్పుడు భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో ‘క్యాప్డ్’ ప్లేయర్లుగా మారిపోయారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత ఐపీఎల్లో ఆడి వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు భారత్‌కు ఆడితే ‘క్యాప్డ్ ప్లేయర్’గా అతనికి సంబంధించిన వేలం నిబంధనలన్నీ మారిపోతాయి. 2024 సీజన్లో నితీశ్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున, మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడారు. నిబంధనలు ఇలా... ఐపీఎల్–2025 కోసం గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను టీమ్‌కు కొనసాగించేందుకు అవకాశం ఉంది. ఇందులో కనీసం ఒకరైనా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. కొనసాగించే తొలి ముగ్గురు ప్లేయర్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్లు చొప్పున ఫ్రాంచైజీలు చెల్లించాలి. ఆ తర్వాత నాలుగో, ఐదో ఆటగాడికి ఇదే వరస కొనసాగుతుంది. అంటే రూ. 18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాలి. ఈ ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లు అయి ఉంటే ఆరో ఆటగాడు కచి్చతంగా ‘అన్క్యాప్డ్’ అవుతాడు. అతనికి కనీసం రూ.4 కోట్లు ఇవ్వాలి. ఐదుగురుని అట్టి పెట్టుకోకుండా ముగ్గురు చాలు అని భావించే ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చేందుకు కూడా రెండు దశలుగా ఈ మొత్తాలను నిర్ణయించారు. వీరికి అవకాశం ఉందా... నితీశ్ రెడ్డి గత ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 142.92 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన అతను ఏకంగా 21 సిక్సర్లు బాదాడు. దీని ప్రకారం చూస్తే ‘అన్క్యాప్డ్’గా అతడిని కనీసం రూ. 4 కోట్లకు హైదరాబాద్ కొనసాగించే అవకాశం కనిపించింది. అయితే ఇప్పుడు క్యాప్డ్ కావడంతో తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఒకరిగా ఎంచుకోవాలి. కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిõÙక్ శర్మవంటి ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో నితీశ్‌ను కనీసం ఐదో ఆటగాడిగా రూ. 11 కోట్లకు కొనసాగిస్తారా అనేది సందేహమే! అతడిని విడుదల చేసి వేలంలో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా సొంతం చేసుకునేందుకు సన్‌రైజర్స్‌కు మరో అవకాశం ఉంటుంది. మయాంక్ విషయంలో మాత్రం లక్నో సానుకూలంగా ఉండవచ్చు. గత సీజన్లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా అతను తన వేగంతో ఎంతో ప్రభావం చూపించాడు. కేవలం 12.14 సగటుతో 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు భారత్ తరఫున ఆడిన తర్వాత అలాంటి ఆటగాడిని వదులుకునేందుకు సూపర్ జెయింట్స్ ఇష్టపడకపోవచ్చు. లక్నో మెంటార్‌గా ఉన్న జహీర్ ఖాన్ కూడా మయాంక్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కాబట్టి కనీసం ఐదో ప్లేయర్‌గా రూ.11 కోట్లు చెల్లించి తమతో కొనసాగించవచ్చు. ఇద్దరిలో ఎవరినీ ఇరు జట్లు కొనసాగించకపోయినా...వేలంలోకి వెళితే భారీ మొత్తం లభించేందుకు కూడా ఆస్కారం ఉంది. కల నిజమైంది: నితీశ్ రెడ్డి గ్వాలియర్: భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ సంతోషం వెలిబుచ్చారు. తమ కెరీర్లో ఇది అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించినట్లు ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు వెల్లడించారు. ‘భారత్‌లో క్రికెట్ ఆడే ఎవరికైనా ఇది అద్భుతంలాగే అనిపిస్తుంది. టీమిండియా తరఫున ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైనట్లుగా భావించాను. సహజంగానే కొంత ఉత్కంఠ, ఆందోళన ఉన్నా ఆ తర్వాత మెల్లగా ఆటను ఆస్వాదించాను. నాకూ, నా కుటుంబానికి ఇది గర్వకారణమైన క్షణం. టీమ్‌లో చాలా మంది సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం నుంచి మంచి మద్దతు లభించింది. బౌలింగ్‌లోనూ నాకు మంచి సూచనలు లభించాయి. కెపె్టన్ సూర్య నాపై ఎలాంటి ఒత్తిడి దరి చేరకుండా ప్రశాంతంగా బౌలింగ్ చేసే అవకాశం కలి్పంచాడు. తొలి మ్యాచ్ అనిపించకుండా స్వేచ్ఛగా ఆడమని చెప్పాడు’ అని నితీశ్ రెడ్డి వివరించాడు. తొలి మ్యాచ్‌లో మయాంక్ కూడా భావోద్వేగభరితమయ్యాడు. ‘నేను మ్యాచ్ ఆడుతున్నానని తెలియగానే గత నాలుగు నెలలు నా కళ్ల ముందు మెదిలాయి. పైగా గాయం నుంచి కోలుకొని వస్తున్నాను కాబట్టి అదనపు ఒత్తిడి నాపై ఉంది. అయితే కెప్టెన్ సూర్య నేను రనప్ తీసుకుంటున్న సమయంలో నా వద్దకు వచ్చి నువ్వు ఎలా బౌలింగ్ చేయగలనని భావిస్తోవో అలాగే చేయి అతని ధైర్యం నింపాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో గతంలో పని చేసిన అనుభవం కూడా పనికొచి్చంది’ అని మయాంక్ చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం -
PAK VS BAN 2nd Test: చరిత్రలో తొలిసారి ఇలా..!
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక బంగ్లాదేశ్ విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు ఆటలో బంగ్లా పేసర్లు పూర్తి ఆధిపత్యం చలాయించి పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ముఖ్యంగా బంగ్లా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. ఫలితంగా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ ఐదు, నహిద్ రాణా నాలుగు, తస్కిన్ అహ్మద్ ఓ వికెట్ తీసి పాక్ పతనాన్ని శాశించారు. బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో పేసర్లే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు నేలకూల్చడం ఇదే తొలిసారి.టార్గెట్ 185సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ 172 పరుగులకు ఆలౌటై బంగ్లాదేశ్ ముందు 185 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. వాతావరణం అనుకూలించకపోవడంతో బంగ్లా జట్టు ఛేదనను ధాటిగా ప్రారంభించింది. నాలుగో రోజు చివరి సెషన్లో వర్షం మొదలయ్యే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా గెలవాలంటే మరో 143 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. ఆట చివరి రోజు మిగిలి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి నుంచి తప్పించుకోలేదు. జకీర్ హసన్ (31), షద్మాన్ ఇస్లాం (9) క్రీజ్‌లో ఉన్నారు.172 పరుగులకే కుప్పకూలిన పాక్బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ (5/43), నహిద్ రాణా (4/44), తస్కిన్ అహ్మద్ (1/40) ధాటికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (20), షాన్ మసూద్ (20), బాబర్ ఆజమ్ (11), మొహమ్మద్ రిజ్వాన్ (43), అఘా సల్మాన్ (47) రెండంకెల స్కోర్లు చేశారు.అంతకుముందు లిటన్ దాస్ (138) వీరోచితంగా పోరాడి శతకం చేయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. దాస్‌కు మెహిది హసన్ మిరజ్ (78) సహకారం అందించాడు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 6 వికెట్లు పడగొట్టాడు. దీనికి ముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. -
రాటుదేలుతున్న సిరాజ్.. బుమ్రాను మరిపిస్తూ, టీమిండియా గర్వపడేలా..!
Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలి కాలంలో టీమిండియా ప్రధాన బౌలర్‌గా మారిపోయాడనడం అతిశయోక్తి కాదు. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా అతని ప్రదర్శనను ఓసారి గమనిస్తే ఈ విషయం ఇట్టే స్పష్టమవుతుంది. 2017లో అతడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి 2021 ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ వరకు సిరాజ్‌పై పలు అపవాదులు ఉండేవి. పరుగులు ధారాళంగా సమర్పించుకుంటాడు, వికెట్లు పడగొట్టలేడు, పవర్ ప్లేలో పూర్తిగా చేతులెత్తేస్తాడు, లైన్ అండ్ లెంగ్త్ మెయింటెయిన్ చేయడు.. ఇలా తనలోని లోపాలన్నిటినీ ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు సైతం వేలెత్తి చూపేవారు. దీనికి తోడు నాటి జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మెహర్భానిపై జట్టులో నెట్టుకొస్తున్నాడు అన్న పుకార్లు ఉండేవి. అయితే గత ఏడాదిన్నర కాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సిరాజ్.. తనలోని లోపాలను అధిగమించి, టీమిండియా ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. తనకు మద్దతుగా నిలిచిన కోహ్లిని కాలర్ ఎగరేసుకునేలా చేయడంతో పాటు యావత్ భారతావని గర్వపడేలా రాటుదేలాడు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా లేని లోటును సైతం పూడుస్తూ, జనాలు పేసు గుర్రాన్ని (బుమ్రా) మరిచిపోయేలా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. నిన్న తన సొంత మైదానమైన ఉప్పల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ నుంచి.. అంతకుముందు అతనాడిన 10 మ్యాచ్‌లపై ఓ లుక్కేస్తే సిరాజ్ ఇటీవలి కాలంలో ఎంతలా రాటుదేలాడో అర్ధమవుతుంది. కివీస్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్న సిరాజ్.. తన కోటా ఓవర్లు మొత్తం పూరిచేసి 4 కీలక వికెట్లు పడగొట్టి, టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతకుమందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో 2/30, రెండో వన్డేలో 3/30, మూడో వన్డేలో 4/32.. ఇలా మ్యాచ్ మ్యాచ్‌కు తనలోని టాలెంట్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అంతకుమందు బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో 4, రెండో టెస్ట్‌లో 2 వికెట్లు.. అదే జట్టుతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 3/32, రెండో మ్యాచ్‌లో 2/73, మూడో మ్యాచ్‌లో 1/27 గణాంకాలతో ఈ పర్యటన మొత్తంలో 12 వికెట్లు నేలకూల్చాడు. బంగ్లా పర్యటనకు ముందు జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో ఆకాశమే హద్దుగా చెలరేగిన సిరాజ్.. రెండో టీ20లో 2/24, మూడో టీ20లో 4/17 గణాంకాలు నమోదు చేసి పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్న ఈ హైదరాబాదీ పేసర్.. టీమిండియా తరఫున 15 టెస్ట్‌ల్లో 46 వికెట్లు, 20 వన్డేల్లో 37 వికెట్లు, 8 టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. సీనియర్ల గైర్హాజరీలో భారత పేస్ అటాక్‌ను అద్భుతంగా లీడ్ చేస్తున్న సిరాజ్ మున్ముందు మరింత రాణించాలని ఆశిద్దాం. -
‘ప్రపంచకప్ గెలవకపోవడమే లోటు’
లండన్: రెండు దశాబ్దాలకు పైగా భారత మహిళా క్రికెట్ మూలస్థంభాల్లో ఒకరిగా నిలిచిన దిగ్గజ పేస్ బౌలర్ జులన్ గోస్వామి ఆటకు ముగింపు పలుకుతోంది. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే చివరి వన్డేతో రిటైర్ కానున్న జులన్ ఆఖరిసారిగా లార్డ్స్ మైదానంలో బరిలోకి దిగనుంది. భారత్ ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న నేపథ్యంలో అందరి దృష్టీ జులన్పైనే ఉంది. ఆమెకు విజయంతో ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని హర్మన్ బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ విశేషాల గురించి జులన్ శుక్రవారం మీడియాతో మాట్లాడింది. వన్డే లేదా టి20 ప్రపంచకప్‌లలో తాము ఒకటి గెలిచి ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘2005, 2017 వన్డే వరల్డ్‌కప్‌లలో మేం ఫైనల్ చేరాం. వీటిలో ఒకటి గెలిచి ఉండాల్సింది. ప్రతీ క్రికెటర్‌కి అదే లక్ష్యం ఉంటుంది. నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి అక్కడి దాకా వచ్చాక కప్ గెలిస్తే కల నిజమయ్యేది. టి20 ప్రపంచకప్ సహా మేం మూడు ఫైనల్స్ ఆడినా ఒక్కటి గెలవలేకపోయాం. అది చాలా బాధిస్తుంది. నా కెరీర్లో అదే లోటు’ అని జులన్ చెప్పింది. గత రెండేళ్లుగా చాలా సార్లు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తూ వచ్చానని, చివరకు ఇప్పుడు తప్పుకుంటున్నానని జులన్ భావోద్వేగంతో చెప్పింది. ‘రెండేళ్లుగా ప్రతీ సిరీస్ నాకు చివరి సిరీస్‌లాగానే అనిపించేది. కోవిడ్ వల్ల మ్యాచ్‌లు వాయిదాపడుతూ రావడంతో పాటు వరుసగా గాయాలపాలయ్యాను. శ్రీలంక సిరీస్‌తోనే ముగిద్దామనుకున్నా. అయితే ఫిట్‌గా లేక ఆ సిరీస్ ఆడలేదు. దాంతో మళ్లీ ఎన్సీఏకు వెళ్లాను. రాబోయే టి20 వరల్డ్‌కప్‌కు ముందు ఇదే చివరి వన్డే సిరీస్ కాబట్టి ఆటను ముగిస్తున్నా’ అని ఈ బెంగాల్ పేసర్ పేర్కొంది. కోల్‌కతాలో 1997 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో బాల్‌బాయ్‌గా పని చేసిన తర్వాత దేశానికి ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇన్నేళ్లు కొనసాగగలనని అనుకోలేదన్న జులన్... కెరీర్లో తొలి మ్యాచే అన్నింటికంటే ప్రత్యేకమైందని గుర్తు చేసుకుంది. వచ్చే ఏడాది జరి గే తొలి మహిళల ఐపీఎల్లో పాల్గొనడం గురించి తాను ఇప్పుడే చెప్పలేనని జులన్ స్పష్టం చేసింది. -
ఆండర్సన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. పేసర్లలో మొనగాడిగా..!
James Andersdon: దక్షిణాఫ్రికాతో తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్లు జేమ్స్ ఆండర్సన్ (6/62), ఓలీ రాబిన్సన్ (5/91), స్టువర్ట్ బ్రాడ్ (4/61), బెన్ స్టోక్స్ (4/47) చెలరేగి సఫారీలను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 330 పరుగులకే (151, 179) పరిమితం చేయగా.. బెన్ స్టోక్స్ (103), బెన్ ఫోక్స్ (113 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 415/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, సఫారీలతో జరిగిన రెండో టెస్ట్‌లో 6 వికెట్లతో సత్తా చాటిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ ప్లేయర్ సైమన్ హార్మర్ వికెట్ పడగొట్టడం ద్వారా ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు (951, టెస్ట్‌ల్లో 664, వన్డేల్లో 269, టీ20ల్లో 18) సాధించిన పేస్ బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉండేది. మెక్‌గ్రాత్.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 949 వికెట్లు సాధించాడు. తాజాగా ఆండర్సన్.. మెక్‌గ్రాత్ రికార్డు బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన పేస్ బౌలర్‌గా అవతరించాడు. 40 ఏళ్ల ఆండర్సన్ మరో 5 వికెట్లు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల (పేసర్లు, స్పిన్నర్లు) జాబితాలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను (955 వికెట్లు) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకుతాడు. ఇంగ్లండ్-సఫారీల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్ కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా సెప్టెంబర్ 8న ప్రారంభమవుతుంది. చదవండి: జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు -
ఆంధ్ర ఆటగాడు అమెరికా తరఫున...
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దువ్వారపు శివకుమార్ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ బరిలోకి దిగిన అతనికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. సిద్ధాంతంకు చెందిన శివకుమార్ ఆంధ్ర తరఫున 42 రంజీ మ్యాచ్‌లలో 1061 పరుగులు చేసి 133 వికెట్లు పడగొట్టాడు. అతను 40 వన్డేలు, 16 టి20లు కూడా ఆడాడు. కోహ్లి కెప్టెన్సీలో 2008లో అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడినా ఉన్నా...అతనికి మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. ఆఖరిసారిగా 2018లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన శివకుమార్ అమెరికాకు వలస వెళ్లాడు. కనీసం మూడేళ్లు నివాసం ఉండాలన్న ఐసీసీ నిబంధన పూర్తి చేసుకున్న అనంతరం ఇటీవలే 32 ఏళ్ల శివకుమార్‌కు టీమ్‌లో చోటు లభించింది. చదవండి: IRE Vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
‘కెంట్’ తరఫున కౌంటీల్లో నవదీప్ సైనీ
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో మరో భారత పేస్ బౌలర్‌కు అవకాశం దక్కింది. 29 ఏళ్ల ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ ‘కెంట్’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్లో 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 5 వన్డేలలో అతను ‘కెంట్’కు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ టీమ్‌కు ఆడనున్న రెండో భారత క్రికెటర్ సైనీ. తాజా సీజన్లో కౌంటీలు ఆడుతున్న భారత ఆటగాళ్ల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే పుజారా, సుందర్, కృనాల్, ఉమేశ్ యాదవ్ ఒప్పందాలు చేసుకున్నారు. భారత్‌కు 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన సైనీ మూడు ఫార్మాట్లలో కలిపి 23 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. అతను జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు ఏడాదవుతోంది. చరిత్రాత్మక ‘బ్రిస్బేన్ టెస్టు’ విజయం తర్వాత సైనీకి మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. -
'శ్రేయస్ స్పిన్నర్లకు అద్భుతంగా ఆడుతాడు.. కానీ పేసర్లకు'
టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఫాస్ట్ బౌలర్లనుఎదుర్కొవడానికి ఇబ్బంది పడుతున్నాడని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడుతున్నాడు. అదే విధంగా స్పిన్నర్లకు, మీడియం పేస్ బౌలర్లకు అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నాడని అతడు తెలిపాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన అయ్యర్.. ప్రస్తుతం దక్షిణాప్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో అంతగా రాణించ లేకపోతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 94 పరుగులు మాత్రమే చేశాడు. "అయ్యర్ పేస్ బౌలింగ్‌కు ఆడటానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఒక్క సిరీస్‌లోనే కాదు గత కొన్ని మ్యాచ్‌ల నుంచి కూడా ఫాస్ట్ బౌలర్లకే తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. ఐపీఎల్లో 140 కిమీ కంటే ఎక్కువ వేగంతో వచ్చే బంతుల్ల్ని ఆడిన సందర్భాల్లో అతడి స్ట్రైక్ రేట్ భారీగా తగ్గింది. అయితే అతడు స్పిన్నర్లు, 140 కిమీ కంటే తక్కువ వేగంతో వేసే బౌలర్లపై అతడు తేలిగ్గా ఆడుతాడు. అతడు తన భుజాలపైకి వచ్చే బంతులను ఎదర్కొవడంపై ప్రాక్టీస్ చేయాలి" అని ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. చదవండి: Former Cricketer Salil Ankola: దిగ్గజ క్రికెటర్‌తో పాటే అరంగేట్రం.. క్రికెట్‌పై అసూయ పెంచుకొని -
ఎవరీ వైభవ్ అరోరా.. తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు!
ఐపీఎల్-2022లో భాగంగా చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పంజాబ్ విజయంలో ఆజట్టు యువ పేసర్ వైభవ్ అరోరా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అరోరా ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అరోరా.. 21 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ వంటి స్టార్ ఆటగాళ్లను పెవిలియన్ పంపి పంజాబ్‌కు ఆరోరా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ జట్టు పేసర్ సందీప్ శర్మ స్థానంలో అరోరా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా పంజాబ్ జట్టు తీసుకున్న నిర్ణయం సరైనది అని అరోరా నిరూపించాడు. ఈ క్రమంలో వైభవ్ అరోరా గురుంచి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ►వైభవ్ అరోరా డిసెంబర్ 14, 1997న అంబాలాలో జన్మించాడు. ► అరోరా దేశీయ స్థాయిలో హిమాచల్ ప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ► 2019లో సౌరాష్ట్రపై ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ► ఆరోరా టీ20ల్లో 2021లో ఛత్తీస్‌గఢ్‌పై అరంగేట్రం చేశాడు. ► 2020 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ నెట్‌బౌలర్‌గా అరోరాను ఎంపిక చేసింది. ►2021 ఐపీఎల్ సీజన్లో వైభవ్ అరోరా కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగంగా ఉన్నాడు. కానీ అతనికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ►ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆరోరాని రూ. 2 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ►తన కెరీర్లో 12 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆరోరా 12 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఆర్సీబీకి భారీ షాక్.. యువ ఆటగాడు దూరం! -
వీడియో కాల్లో చూసి కోవిడ్ అని చెప్పేసింది..
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ సందర్బంగా కరోనా బారిన పడి, ఇటీవలే కోలుకున్న కేకేఆర్ ఆటగాడు సందీప్ వారియర్.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మే 2న అతని భార్యతో వీడియో కాల్ మాట్లాడుతుండగా.. ఆమె అతనికి కరోనా సోకిందని చెప్పినట్లు తెలిపాడు. భార్య ఆర్తి కరోనా రోగులకు చికిత్స అందించే డాక్టర్ కావడంతో.. ఆమె ఈ విషయాన్ని చూపులతో పసికట్టిందని, అంతే కాకుండా ఆమె కూడా గతేడాది కరోనా బారిన పడిందని సందీప్ చెప్పుకొచ్చాడు. కరోనా బారిన పడినప్పుడు ఆమెకున్న లక్షణాలే తనకున్నాయని చెప్పడంతో, టెస్టు రిపోర్ట్ రాకముందే తనకు కరోనాగా నిర్దారించిందని గుర్తు చేసుకున్నాడు. కాగా, సందీప్ వారియర్.. అంతకు ముందే ఓ సారి కరోనా టెస్ట్ చేయించాడు. దీంట్లో అతనికి నెగిటివ్ వచ్చింది. అయితే ఆతర్వాత అతని భార్య సలహా మేరకు రెండో సారి టెస్ట్ చేయించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. నాటి నుంచి దాదాపు నాలుగు వారాలు మహమ్మారితో పోరాడిన సందీప్.. ఇటీవలే కోలుకొని, పాత విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఇదిలా ఉంటే, సందీప్‌తో పాటు మరో కోల్‌కతా ఆటగాడు వరుణ్ చక్రవర్తి కూడా కరోనా బారిన పడి కొద్ది రోజుల క్రితమే కోలుకున్నాడు. కాగా, ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ అర్దాంతరంగా ముగిసింది. ఈ సీజన్లో కోల్ కతా 7 మ్యాచ్‌లు ఆడగా 2 విజయాలు, 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. చదవండి: సచిన్.. నన్ను ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడు: భార్య అంజలీ -
వన్డేల్లోనూ సత్తా చాటుతా పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అరుంధతి రెడ్డి... భారత మహిళల టి20 టీమ్‌లో సత్తా చాటి తన స్థానం పదిలం చేసుకున్న పేస్ బౌలర్. గత మూడేళ్లుగా టి20 ఫార్మాట్లో కీలక ప్లేయర్‌గా ఎదిగిన అరుంధతి తొలిసారి వన్డే, టెస్టు జట్టులోకి ఎంపికైంది. రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొనే టీమ్‌లో ఆమెకు అవకాశం లభించింది.ఇకపై వన్డేల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమంటున్న 23 ఏళ్ల పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కావడంపై... చాలా సంతోషంగా ఉంది. భారత జట్టుకు ఇప్పటికే ప్రాతినిధ్యం వహించినా... మరో ఫార్మాట్లో నాకు కొత్తగా అవకాశం దక్కుతోంది. టి20ల్లో నిలకడగా రాణించడం వల్లే నాకు ఈ చాన్స్ వచ్చిందని నమ్ముతున్నా. వన్డేల్లోనూ రాణించి జట్టు విజయంలో నేనూ పాత్ర పోషించగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఇంగ్లండ్‌లో ఆడాలనేది నా కల. ఇప్పుడు అక్కడికే భారత జట్టు తరఫున వెళుతుండటం గర్వకారణం. టి20ల్లో ప్రదర్శనపై... హైదరాబాద్ టీమ్‌నుంచి మొదలు పెట్టి ఇండియా ‘ఎ’ వరకు మెరుగైన ప్రదర్శన ఇచ్చిన తర్వాతే నాకు జాతీయ జట్టులో అవకాశం లభించింది. మూడేళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్‌నుంచి చూస్తే ఇప్పుడు నా ఆట ఎంతో మెరుగైంది. నా తొలి సిరీస్‌లో శ్రీలంకతో ఆడిన మూడో మ్యాచ్‌తోనే నాకు మంచి గుర్తింపు దక్కింది. కొత్త బంతితో ఇన్నింగ్స్ ప్రారంభించిన నేను రెండు కీలక వికెట్లతో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాను. అయితే ఇంకా నేను ఆశించిన ‘అత్యుత్తమ మ్యాచ్’ ఇంకా రాలేదనేది నా అభిప్రాయం. కొన్ని సార్లు మనం ఎంతగా శ్రమించినా చివరకు ఫలితం లభించదు. అయితే నా ఆటను సెలక్టర్లు గుర్తించారు కాబట్టే టి20ల్లో రెగ్యులర్‌గా మారడంతో పాటు ఇప్పుడు వన్డేల్లోనూ పిలుపు లభించింది. ఇక తక్కువ సమయంలోనే రెండు ప్రపంచకప్‌లలో ఆడే అవకాశం రావడం నా అదృష్టం. పేస్ బౌలింగ్ పదునుపై... అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన తర్వాత నా బౌలింగ్‌లో వేగం, కచ్చితత్వం పెంచేందుకు ఎంతో శ్రమించా. కెరీర్ ఆరంభ రోజులతో పోలిస్తే ఇప్పుడు నా బౌలింగ్‌లో చాలా మార్పు వచ్చింది. నెట్స్‌లో సుదీర్ఘ సమయం పాటు సాధనతో లోపాలు సరిదిద్దుకుంటున్నా. ఇన్‌స్వింగర్ నా ‘స్టాక్ బాల్’ కాగా...అవుట్ స్వింగర్లు, ఆఫ్ కట్టర్లను సమర్థంగా ప్రయోగించగలుగుతున్నా. ఎన్ఎస్ గణేశ్ వద్ద కోచింగ్ మొదలు పెట్టిన నాకు రైల్వేస్ టీమ్‌కు ఆడే సమయంలో మూర్తి సహకరిస్తున్నారు. ఇతర సమయంలో ఆల్ఫ్రెడ్ అబ్సలమ్ వద్ద ప్రాక్టీస్ కొనసాగిస్తున్నా. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టా. మిథాలీ రాజ్ ప్రభావం... నాకు క్రికెట్‌పై ఆసక్తి కలగడానికి, ఆటలో ఎదిగేందుకు కూడా ఆమెనే స్ఫూర్తి. ఆమె ఆటను బాగా దగ్గరినుంచి చూశాను. నేను జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన సమయంలో జట్టులో మిథాలీ అక్క కూడా ఉంది. రైల్వేస్ జట్టు తరఫున ఆమె కెప్టెన్సీలో ఆడుతున్నా. సీనియర్ ప్లేయర్‌గా, మన హైదరాబాదీగా కూడా అన్ని సందర్భాల్లో మిథాలీ సహకారం నాకు లభించింది. నన్ను బాగా ప్రోత్సహిస్తూ తగిన విధంగా మార్గనిర్దేశం చేస్తోంది. కరోనా కాలంలో సుదీర్ఘ విరామంపై... ఎన్నో ఇతర క్రీడల్లాగే మహిళల క్రికెటర్లందరం కూడా గత ఏడాదంతా ఆటపరంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. టి20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు సంవత్సరం పాటు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేకపోయింది. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఫిట్నెస్ సౌకర్యాలు కూడా వాడుకునే పరిస్థితి లేకపోయింది. ఇక ప్రాక్టీస్ చేద్దామంటే అకాడమీలూ మూసేశారు. పైగా కరోనాతో భయం కూడా. దాంతో ఆ సమయంలో క్రికెట్‌ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. చివరకు నేను ప్రాక్టీస్ కోసం వరంగల్‌కు వెళ్లిపోయాను. నా సహచర ప్లేయర్ ప్రణీషకు సొంత పిచ్, నెట్స్ ఉండటంతో అక్కడకు వెళ్లి సాధన చేసేదాన్ని. ఈ సారి జాగ్రత్తలూ తీసుకుంటూ ఆటపై దృష్టి పెట్టగలుగుతున్నాం. ‘పాఠాలు నేర్చుకుంటా’ ‘ఇటీవల లక్నోలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి అనుభవంతో మున్ముందు తప్పులు సరిదిద్దుకుంటా. నేను గెలిపించాల్సిన మ్యాచ్‌లో విఫలమయ్యాను. చివరి ఓవర్లో సఫారీ జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా...తొలి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాను. తర్వాతి 3 బంతుల్లో 6 పరుగులు కావాలి. అయితే ఐదో బంతి ‘నోబాల్’గా వేశాను. అదనపు బంతితో వారికి మరో అవకాశం లభించి చివరి బంతికి విజయం సాధించగలిగారు. నేను ‘నోబాల్’ వేయకుంటే మా జట్టు గెలిచేదేమో’ -
క్రికెట్‌కు ఉమర్ గుల్ గుడ్‌బై
కరాచీ: పాకిస్తాన్ సీనియర్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ ఆటకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న పాక్ దేశవాళీ టోర్నీ టి20 కప్‌లో చివరి మ్యాచ్ ఆడిన గుల్... అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 47 టెస్టుల్లో 163 వికెట్లు పడగొట్టిన గుల్... 130 వన్డేల్లో 179 వికెట్లు తీశాడు. 60 అంతర్జాతీయ టి20ల్లో గుల్ మరో 85 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సుమారు దశాబ్దకాలం పాటు పాక్ జట్టు ప్రధాన పేసర్‌గా పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమైన గుల్ కెరీర్ వరుస గాయాలతో ఒడిదుడుకులకు లోనైంది. అంతర్జాతీయ టి20ల్లో టాప్–10లో రెండు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (5/6, 5/6) నమోదు చేసిన బౌలర్‌గా అతను గుర్తింపు పొందాడు. యార్కర్ స్పెషలిస్ట్‌గా ప్రత్యేకత ప్రదర్శించిన గుల్... 2007 టి20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. రెండేళ్ల తర్వాత పాక్ గెలుచుకున్న టి20 వరల్డ్ కప్‌లో కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గుల్ కావడం విశేషం. పాకిస్తాన్ తరఫున తన చివరి మ్యాచ్‌ను అతను నాలుగేళ్ల క్రితం 2016లో ఆడాడు. -
గంభీర్ కెరీర్‌పై వ్యాఖ్యలు : పాక్ బౌలర్ వివరణ
ఇస్లామాబాద్ : టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కెరీర్ తన వల్లే ముగిసిందని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న పాకిస్తాన్ పేస్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 2012లో పాకిస్తాన్లో భారత పర్యటన సందర్భంగా గంభీర్ వైట్ బాల్ కెరీర్‌కు తానే తెరిదించానని ఆయన ఇర్ఫాన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గంభీర్‌ను టీమిండియా నుంచి తప్పించకమునుపు తాను అతడిని షార్ట్ బంతులు, బౌన్సర్లతో ఇబ్బందులు పెట్టానని చెప్పారు. ఈ టూర్లో ఇర్ఫాన్ రెండు సార్లు గంభీర్‌ను అవుట్ చేశాడు. గంభీర్ తన చివరి టీ20ని ఆ సిరీస్‌లోనే ఆడి ఆ తర్వాత టీ20లో ఎన్నడూ తిరిగి అడుగుపెట్టలేదు ఇక గంభీర్ 2013 జనవరిలో ఇంగ్లండ్‌పై తన చివరి వన్డే ఆడాడు. కాగా పాకిస్తాన్ స్పోర్ట్స్ ప్రెజంటర్ సవేరా పాషాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ గంభీర్‌పై చేసిన ప్రకటన గురించి వివరణ ఇచ్చారు. తన బౌన్సర్లను ఆడేందుకు గౌతం గంభీర్ చాలా ఇబ్బంది పడ్డాడని, తన సహజ సిద్ధమైన ఆటను ఆడలేకపోయాడని చెప్పాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ల్లో బాగా ఆడేవారిని హీరోలుగా చూస్తే..ఆడని వారిని జీరోలుగా చూస్తారని అన్నాడు. తన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో గంభీర్ తడబడ్డాడని, గంభీర్ సహజసిద్ధంగా ఆడలేకపోతున్నాడని ప్రతిఒక్కరూ అన్నారని క్రిక్ కాస్ట్ చాట్ షోలో ఇర్ఫాన్ వివరణ ఇచ్చారు. గంభీర్ పేలవ ప్రదర్శనతో అతడిని జట్టునుంచి తప్పించారని, ఆ తర్వాత ఆయన ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లో కూడా సరైన సామర్ధ్యం కనబర్చలేదని, అందుకే తాను అలా వ్యాఖ్యానించానని చెప్పారు. చదవండి : ‘ఆ తరహా క్రికెటర్ భారత్‌లో లేడు’ -
6 అడుగుల 8 అంగుళాలు!
భారత్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. ఇందులో అవకాశం దక్కించుకున్న పేస్ బౌలర్ కైల్ జేమీసన్‌పై ఇప్పుడు అందరి దృష్టీ నిలిచింది. జేమీసన్ ఎత్తు 6 అడుగుల 8 అంగుళాలు కావడం విశేషం. ‘టూ మీటర్ పీటర్’గా పిలిచే కివీస్ జట్టు బ్యాటింగ్ కోచ్ పీటర్ ఫల్టన్కంటే అతను ఎక్కువ (2.03 మీటర్లు) పొడగరి. జేమీసన్ ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. గత ఏడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు మ్యాచ్ దక్కలేదు. అయితే ‘ఎ’ జట్ల తరఫున మాత్రం రెగ్యులర్ సభ్యుడైన అతనికి దేశవాళీలో మంచి రికార్డు ఉంది. భారత ‘ఎ’ జట్టుతో ఇటీవల కివీస్ వన్డే సిరీస్ నెగ్గడంలో జేమీసన్ కీలక పాత్ర పోషించాడు. -
‘భారత్‌లోను మమ్మల్ని ఆరాధిస్తారు’
న్యూఢిల్లీ : భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుంది. ఇక ఈ దాయాదీ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే యాషెస్ సిరీస్ కన్నా ఎక్కువ ఉత్కంఠ. ఇరు దేశాల పోరులో రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్న క్రికెటర్లు ఉన్నారు. అదే కోవకు చెందిన పాక్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ ఇదే విషయంపై స్పందించాడు. ‘సరిహద్దుల సమస్యలతో ఇరు దేశాల క్రికెటర్లు ద్వైపాక్షిక సిరీస్‌లో లభించే గొప్ప అనుభవాన్ని కోల్పోతున్నారు. యాషెస్ సిరీస్‌తో సమానంగా జరిగే గొప్ప సిరీస్‌కు దూరమవుతున్నారు. అంతేకాకుండా రాత్రికి రాత్రే హీరో అయ్యే అవకాశాలు కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కోల్పోతున్నారు. భారత్‌లో పాక్ క్రికెటర్లను సైతం ఆరాధిస్తారు. ఇలా నేను భారత అభిమానుల ప్రేమను చాల అందుకున్నాను. మరో సారి పాక్ క్రికెటర్లు ఇలాంటి ప్రేమను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. దేశ రాజకీయాలతో క్రీడా సంబంధాలు దెబ్బతీనడం విచారకరమైన విషయం. ఇరు జట్ల క్రికెట్ బోర్డులు చొరువ తీసుకొని ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేలా కృషి చేయాలని’ అక్తర్ అభిప్రాయపడ్డారు. 1999 ఏషియన్ టెస్ట్ చాంపియన్ షిప్లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో అప్పటి భారత ఆటగాళ్లైన రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్లను తన వేగమైన బంతులతో పెలిలియన్ చేర్చి రాత్రికి రాత్రే అక్తర్ హీరో అయ్యాడు. ఇక 2007 నుంచి భారత్-పాక్ మధ్య క్రీడా సంబందాలు దెబ్బతిన్నాయి. 2012లో ఓ చిన్న సిరీస్ మినహా ఈ దాయదీ జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలబడ్డ విషయం తెలిసిందే. ఉగ్రవాద చర్యలు ఆపేంత వరకు పాక్ క్రీడా సంబందాలు ఉండయని భారత ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. -
డ్రింక్స్ బ్రేక్‌లో శుభవార్త!
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీలో భాగంగా పంజాబ్, సర్వీసెస్ మధ్య మ్యాచ్... వేదిక అమృత్‌సర్‌లోని గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్. డ్రింక్స్ బ్రేక్‌లో రిఫరీ సూచన మేరకు అంపైర్ పంజాబ్ జట్టులోని ఓ ఆటగాడిని పిలిచి ఏదో సమాచారమిచ్చాడు. అంతటితో ఆ క్రికెటర్ ఆనందానికి అవధుల్లేవు. అతనే పంజాబ్ పేస్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్. భారత వన్డే జట్టులో కౌల్ ఎంపికైన విషయం ఫీల్డ్ అంపైర్ ద్వారానే అతనికి తెలిసింది. టీమిండియాలో చోటు కోసం కౌల్ నిరీక్షణ సుదీర్ఘ కాలంగా కొనసాగింది. కోహ్లి నాయకత్వంలో 2008 అండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కౌల్ కూడా సభ్యుడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయానికి దక్షిణాఫ్రికా చివరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా... కౌల్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టును విజేతగా నిలిపాడు. కోహ్లి స్టార్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగి కెప్టెన్‌గా మారినా... నాటి జట్టులోని జడేజా ప్రస్తుతం కీలక ఆటగాడిగా ఎదగడంతో పాటు అభినవ్ ముకుంద్, సౌరభ్ తివారీ వంటి వారు ఇప్పటికే భారత్‌కు ప్రాతినిధ్యం వహించినా... సిద్ధార్థ్ కౌల్‌కు మాత్రం జాతీయ సీనియర్ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. అయినా నమ్మకం కోల్పోకుండా దేశవాళీలో స్థిరమైన ప్రతిభతో రాణిస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్లకు కౌల్‌కు భారత జట్టు నుంచి పిలుపొచ్చింది. సర్వీసెస్‌తో రంజీ మ్యాచ్ ఆడుతుండగానే శ్రీలంకతో వన్డేలకు ఎంపికైనట్లు తెలిసిందని... గ్రౌండ్లో ఉండగానే ఇంత గొప్ప వార్త వినడాన్ని జీవితంలో మరిచిపోలేనని కౌల్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అతను ఐదు వికెట్లు తీసుకున్నాడు. పంజాబ్‌కు ఆడుతున్న సమయంలో యువరాజ్, హర్భజన్ సింగ్‌ల సలహాలతో మరింత రాటుదేలానని సిద్ధార్థ్ పేర్కొన్నాడు. ఆలస్యంగానైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నాడు. -
ఢిల్లీకి తాహిర్, బెంగళూరుకు రోసో
న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో గాయపడిన ఆటగాళ్ల స్థానాల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు కొత్త ఆటగాళ్లను తీసుకున్నాయి. ఢిల్లీ జట్టులో పేస్ బౌలర్ కౌల్టర్ నైల్, బెంగళూరులో ఓపెనర్ నిక్ మ్యాడిన్సన్తోపాటు చెన్నై ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోలు గాయాలపాలై టోర్నీ నుంచి నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. కౌల్టర్ నైల్ స్థానంలో ఢిల్లీ.. దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్‌లో తాహిర్ 12 వికెట్లతో రాణించాడు. బెంగళూరు జట్టు మ్యాడిన్సన్ స్థానంలో దక్షిణాఫ్రికాకే చెందిన రిలీ రోసోను జట్టులో చేర్చుకుంది. దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుకు మాత్రమే ఆడిన రోసో.. దేశవాళీల్లో భారీ స్కోర్లు సాధించాడు. ఇక బ్రేవో స్థానంలో ఎవరిని తీసుకోవాలన్న విషయంపై చెన్నై ఇంకా తుదినిర్ణయానికి రాలేదు.