ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో మరో భారత పేస్ బౌలర్‌కు అవకాశం దక్కింది. 29 ఏళ్ల ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ ‘కెంట్’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్‌లో 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 5 వన్డేలలో అతను ‘కెంట్’కు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ టీమ్‌కు ఆడనున్న రెండో భారత క్రికెటర్ సైనీ. తాజా సీజన్‌లో కౌంటీలు ఆడుతున్న భారత ఆటగాళ్ల సంఖ్య ఐదుకు చేరింది.
ఇప్పటికే పుజారా, సుందర్, కృనాల్, ఉమేశ్ యాదవ్ ఒప్పందాలు చేసుకున్నారు. భారత్‌కు 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన సైనీ మూడు ఫార్మాట్‌లలో కలిపి 23 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. అతను జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు ఏడాదవుతోంది. చరిత్రాత్మక ‘బ్రిస్బేన్ టెస్టు’ విజయం తర్వాత సైనీకి మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment