
బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో మొదటి రోజు భారత్ ‘ఎ’కు ఎనిమిది పరుగుల ఆధిక్యం దక్కింది. కాక్స్ బజార్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సౌరభ్ కుమార్ (4/23), నవదీప్ సైని (3/21) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులుచేసింది. యశస్వి (61 బ్యాటింగ్), ఈశ్వరన్ (53 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment