Saurabh Kumar
-
సీబీఐ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డీఆర్ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. వరుసగా నాలుగో రోజు శనివారం ఏడీఆర్ఎం పేషీలో ఉద్యోగులు, అధికారులను సీబీఐ బృందం విచారించింది. డీఆర్ఎం అనధికార వ్యవహారాలను పర్యవేక్షించే ఇద్దరు ఉద్యోగులపై సీబీఐ ఆరా తీసింది. ప్రొటోకాల్–స్పోర్ట్స్ విభాగంలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ఒకరు డీఆర్ఎం వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఫైళ్ల లావాదేవీలు పూర్తి చేసే విషయంలో ముందుగా సదరు ఉద్యోగితో సంప్రదింపులు జరిగేవి.ఎవరైనా విదేశీ కరెన్సీ లంచంగా ఇస్తే అతనే వాటిని మార్పిడి చేసేవారని సమాచారం. ఈ విషయాలపైనా సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అదేవిధంగా డీఆర్ఎం అక్రమ వ్యవహారాలను దగ్గరుండి చక్కబెట్టే ఒక గ్రూప్–4 ఉద్యోగి పాత్రపైనా సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసి విచారించారు. మొత్తం మెకానికల్, ఇంజినీరింగ్, మెడికల్‌తోపాటు 8 విభాగాల ఉద్యోగులను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు. అనంతరం ‘కేసు దర్యాప్తులో ఉంది.గత డీఆర్ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ ఆమోదించిన, ఆమోదించబోయే ఫైళ్లను ఎవరూ కదిలించొద్దు. మేం ఈ నెల 27 తర్వాత వచ్చి పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతాం’ అని సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డీఆర్ఎం లంచాల వ్యవహారంలో ఓ సీనియర్ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు అధికారిని కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. కొన్ని ఫైళ్లు స్వాదీనంఈ కేసులో ఇప్పటికే డీఆర్ఎం కార్యాలయంతోపాటు విశాఖ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న డీఆర్ఎం బంగ్లాలోను సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఎం లంచం తీసుకుంటూ దొరకడానికి కారణమైన సంస్థలతోపాటు ఇంకా ఏ సంస్థలకైనా అనుకూలంగా టెండర్లలో మార్పులు చేయడం, పెనాల్టీ తగ్గించడం వంటి వ్యవహారాలకు పాల్పడి ఉండవచ్చని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతి టెండర్ ఫైల్‌ను పరిశీలించాలని నిర్ణయించారు. సౌరభ్‌కుమార్ వాల్తేరు డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏయే ఫైళ్లపై సంతకాలు చేశారన్న విషయాలపై పూర్తిస్థాయిలో ఈ నెల 27వ తేదీ తర్వాత దర్యాప్తు చేయనున్నారు. -
వాల్తేరులో వణుకు
సాక్షి, విశాఖపట్నం : ‘ఈయన మంచి డీఆర్ఎం.. మాకు టెండరు కావాలని అడిగితే.. ఎంతిచ్చినా తీసుకొని ఆ పనులు మాకే వచ్చేటట్లు చూసేవాళ్లు. అలాంటి మంచివ్యక్తిని సీబీఐ పట్టుకోవడమేంటి సార్..?’’.. రైల్వే సంబంధిత పనులు చేపట్టే ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలివీ.. సదరు కాంట్రాక్టర్.. తనకు రావాల్సిన పనులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో చెప్పినా.. వాల్తేరు డీఆర్ఎం వ్యవహారమేంటనేది ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్‌కుమార్ ప్రసాద్.. ముంబైలో శనివారం ఉదయం లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. డీఆర్ఎంపై దర్యాప్తు బృందం దాడితో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు తమ పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నారు. రెండేళ్ల నుంచీ సీబీఐ నిఘా...! వాస్తవానికి.. సీబీఐతో డీఆర్ఎం సౌరభ్‌కు కొత్త పరిచయం కాదని తెలుస్తోంది. గతంలో వాల్తేరు డీఆర్ఎంగా రాకమునుపు సెంట్రల్ రైల్వే జోన్లో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఈ)గా విధులు నిర్వర్తించే వారు. ఈయనకు ముందు పీసీఎంఈగా వ్యవహరించిన అధికారి.. రూ.లక్ష లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.23 లక్షలు, రూ.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు, సింగపూర్, యూఎస్ బ్యాంకుల్లో రూ.1.63 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో పీసీఎంఈగా విధుల్లోకి వెళ్లిన సౌరభ్‌పై అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు బృందం నిఘా పెట్టింది. పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. వైజాగ్ నుంచి ఫాలో చేస్తూ.. టెండర్ పాస్ చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించారు. దీంతో విశాఖ నుంచి దర్యాప్తు బృందం అధికారులు డీఆర్ఎం కదలికలపై నిఘాపెట్టారు. ముంబై వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడ బృందాల్ని అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకోవడం.. మెర్సిడెస్ కారులో ఇంటికి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు డీఆర్ఎంను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల నుంచి నిఘా కొనసాగించిన సీబీఐ అధికారులకు ఎట్టకేలకు శనివారం చిక్కారని సమాచారం. సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంతిచ్చినా ఓకే.?? లంచం వ్యవహారంలో సౌరభ్ చిక్కడంతో.. ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో నిరంతరం..డీఆర్ఎం కార్యాలయం బిజీ బిజీగా ఉండేదని తెలుస్తోంది. సివిల్, మెకానికల్ విభాగాలకు సంబంధించి టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుల వసూళ్లకు డీఆర్ఎం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. టెండర్లు ఎవరికి రావాలంటే.. పని విలువ బట్టి వసూళ్లు రాబట్టేవారని వాల్తేరు డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.50 వేల నుంచి వసూళ్ల పర్వం మొదలయ్యేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. డబ్బులిచ్చిన వారికే పనులకు సంబంధించిన టెండర్లు దక్కేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్ఎం అండ్ కో బ్యాచ్‌పై పలుమార్లు ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. విశాఖ రైల్వే పరువు తీసేశారు.! వాల్తేరు డివిజన్ చరిత్రలో సీబీఐ దాడుల్లో ఒక ఉద్యోగి, లేదా అధికారి పట్టుబడటం ఇదే మొదటిసారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో డీఆర్ఎంలుగా వ్యవహరించిన అనూప్‌కుమార్ సత్పతి, చేతన్‌కుమార్ శ్రీవాత్సవ్.. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అంటున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసిన ఉద్యోగులను బదిలీలు, సస్పెన్షన్లు చేసేవారని చెబుతున్నారు. సదరు సౌరభ్ వచి్చన తర్వాత.. ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో మిలాఖత్ అయిపోయేవారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీబీఐ వ్యవహారంతో విశాఖ రైల్వే డివిజన్‌పై మచ్చపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిలో టెన్షన్ డీఆర్ఎంపై సీబీఐ దాడులతో.. డివిజన్లో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఇద్దరు ఉద్యోగులు.. సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే.. సెలవులో వెళ్తే.. సీబీఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
Ind vs Eng: అతడు జడేజా కాదు కదా.. టీమిండియాకు కష్టమే
India vs England 2nd Test: ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ జడ్డూ అని.. అతడు లేని లోటును ప్రస్తుత జట్టులోని ఏ ఆటగాడూ తీర్చలేడని పేర్కొన్నాడు. కాగా స్టోక్స్ బృందంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో రోహిత్ సేన 28 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత మ్యాచ్ టీమిండియా చేతిలో ఉందనిపించినప్పటికీ.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఇంగ్లండ్ గెలిచి సత్తా చాటింది. మొదటి టెస్టులో అదరగొట్టాడు అయితే, ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్లలో స్పిన్ ఆల్‌రౌండర్ జడేజా పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఉప్పల్ టెస్టులో మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 89 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో జడ్డూ వైజాగ్‌లో జరుగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్ కూడా గాయం బారిన పడటంతో వీరి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్‌లకు పిలుపునిచ్చారు బీసీసీఐ సెలక్టర్లు. టీమిండియాకు కష్టమే ఈ విషయంపై స్పందించిన మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. ‘‘జడ్డూ ఉంటేనే టీమిండియాకు బలం. బ్యాటర్‌గా.. బౌలర్‌గా.. గన్ ఫీల్డర్‌గా అతడి సేవలను జట్టు కచ్చితంగా మిస్సవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో అతడే నంబర్ వన్ టెస్టు ఆల్‌రౌండర్ అనడంలో సందేహం లేదు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యంలో నిలిచిందంటే అందుకు కారణం జడేజానే. అతడు ఉన్నా.. మరో జడ్డూ కాలేడు కదా జట్టులో ఉంటే అతడు కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీయడం కూడా గ్యారెంటీ. జడ్డూ స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగల బ్యాటర్‌ను తీసుకోవాలని మేనేజ్మెంట్ భావించడం సహజం. కాబట్టి వాషింగ్టన్ సుందర్‌కే ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అతడు పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేయగలడేమో గానీ వికెట్లు మాత్రం తీయలేడు. బ్యాటింగ్ పరంగా అతడు మెరుగైన ఆటగాడే. అయితే, వాషీ జడ్డూ మాత్రం కాలేడు కదా’’ అని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులో ఆడించినా జడ్డూ లేని లోటును మాత్రం పూడ్చలేడని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా - ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Rishabh Pant: చచ్చిపోయానేమో అనుకున్నా.. -
టీమిండియాకు బిగ్ షాక్! రాహుల్, జడేజా దూరం: బీసీసీఐ ప్రకటన
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. "వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. జడేజా తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా రాహుల్ సైతం కుడి కాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం జట్టు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని" బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో వేగంగా పరిగెత్తిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. అనంతరం మైదానాన్ని ఇబ్బంది పడుతూ వీడాడు. అయితే జడేజా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు రాహుల్ కూడా ఫీల్డింగ్‌లో కండరాల నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. ఇక రెండో టెస్టుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముగ్గురి ఆటగాళ్లను ప్రధాన జట్టులో చేర్చింది. ఎప్పటినుంచో జట్టులో ఛాన్స్‌కు ఎదురుచూస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫారాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. రెండో టెస్టుకు రాహుల్, జడ్డూ దూరం కావడంతో సర్ఫారాజ్‌కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అతడితో పాటు యూపీ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. The Men's Selection Committee have added Sarfaraz Khan, Sourabh Kumar and Washington Sundar to India's squad.#INDvENG https://t.co/xgxI8NsxpV — BCCI (@BCCI) January 29, 2024 -
INDA Vs ENGA: 5 వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్.. ఇంగ్లండ్ చిత్తు
England Lions vs India A, 2nd unofficial Test: ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక రెండో టెస్టులో భారత-ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లిష్ యువ జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సిరీస్‌లో తొలి గెలుపు నమోదు చేసింది. భారత్-ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్లిద్దరి అద్భుత సెంచరీల కారణంగా భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52.4 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలి రోజే బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(58) అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీ(105)తో సత్తా చాటాడు. తిలక్ వర్మ 6 పరుగులకే అవుటై నిరాశ పరచగా.. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. Dear Sarfraz khan You deserves much better ball knowledge management, But unfortunately we don't have we have crupt management ever,#SarfrazKhan #INDvsENG #INDAvENGA #INDvENG#ViratKohli #Ashwin #Jadejapic.twitter.com/fPB49WhrV4 — Captain of DC - PC (RP¹⁷ ) (@Branded_Tweet) January 24, 2024 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 161 పరుగులు రాబట్టాడు. మిగతా వాళ్లలో స్పిన్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్(57), సౌరభ్ కుమార్(77) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. నిరాశ పరిచిన తిలక్, రింకూ రింకూ సింగ్ మాత్రం డకౌట్‌గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 489 పరుగుల వద్ద యువ భారత్ తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 337 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 321 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది. ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ లయన్స్ పతనాన్ని శాసించాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1 నుంచి మూడో అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Eng 1st Test: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్‌ను సమర్థించిన రవిశాస్త్రి -
11 వికెట్లతో చెలరేగిన సౌరభ్ కుమార్.. సెమీస్‌లో నార్త్, సెంట్రల్ జోన్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం ముగిసిన క్వార్టర్ ఫైనల్స్‌లో నార్త్ జోన్ 511 పరుగుల తేడాతో నార్త్ ఈస్ట్ జోన్ జట్టుపై... సెంట్రల్ జోన్ 170 పరుగుల తేడాతో ఈస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించాయి. ఈనెల 5 నుంచి జరిగే సెమీఫైనల్స్‌లో సౌత్ జోన్‌తో నార్త్ జోన్; వెస్ట్ జోన్‌తో సెంట్రల్ జోన్ తలపడతాయి. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో 129 పరుగులకే కుప్ప కూలింది. ఎడంచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్ 64 పరుగులిచ్చి 8 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు) పడగొట్టి సెంట్రల్ జోన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నార్త్ జోన్‌తో మ్యాచ్‌లో 666 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ 47.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. నార్త్ జోన్ బౌలర్లలో పుల్కిత్ నారంగ్ నాలుగు, నిశాంత్ రెండు వికెట్లు పడగొట్టారు. -
రాణించిన మంత్రి.. తిప్పేసిన సౌరభ్ కుమార్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో సెంట్రల్ జోన్, నార్త్‌జోన్ జట్లు గెలుపు దిశగా పయనిస్తున్నాయి. ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న పోరులో సెంట్రల్ ఆటగాళ్లు హిమాన్షు మంత్రి (68; 7 ఫోర్లు), వివేక్ సింగ్ (56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌లో రాణించగా, సౌరభ్ కుమార్ (4/33) స్పిన్ బౌలింగ్‌తో తిప్పేశాడు. శుక్రవారం 64/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటప్రారంభించిన సెంట్రల్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 87.5 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు హిమాన్షు మంత్రి, వివేక్‌సింగ్ తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించారు. అనంతరం 300 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈస్ట్‌జోన్ సౌరభ్ స్పిన్ ఉచ్చులో పడింది. ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 69 పరుగులే చేసింది. నార్త్ ఆల్‌రౌండ్ దెబ్బకు... నార్త్‌జోన్ ఆల్‌రౌండ్ దెబ్బకు నార్త్ ఈస్ట్‌జోన్ కుదేలైంది. దీంతో మూడో రోజు ఆటలోనే నార్త్ ఈస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లను కోల్పోయింది. మొదట 65/3 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్ ఈస్ట్‌జోన్ 39.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో నార్త్‌కు 406 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను నార్త్‌జోన్ 55.1 ఓవర్లలో 259/6 వద్ద డిక్లేర్ చేసింది. ప్రభ్ సిమ్రన్‌సింగ్ (59; 9 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ (70; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో ప్రత్యర్థికి 666 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, నార్త్ ఈస్ట్‌జోన్ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. టీమిండియాతో చేరనున్న వాషింగ్టన్ సుందర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా మొదలుకానున్న మొదటి టెస్ట్ కోసం టీమిండియా సెలెక్టర్లు నలుగురు నెట్ బౌలర్లను ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా ఈ నలుగురు స్పిన్ బౌలర్లే కావడం విశేషం. సెలెక్టర్లు ఎంపిక చేసిన నలుగురిలో టీమిండియా పరిమిత ఓవర్ల ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఉత్తర్‌ప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్, రాజస్థాన్ లెగ్ స్పిన్నర్, టీమిండియా బౌలర్ రాహుల్ చాహర్, తమిళనాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్ ఉన్నారు. ఈ నలుగురు స్పిన్నర్లు నాగ్‌పూర్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో టీమిండియాతో రేపటి నుంచి కలుస్తారిన సెలెక్టర్లు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రకటించారు. ఆసీస్ బౌలర్లను, ముఖ్యంగా స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వైవిధ్యమైన స్పిన్నర్లు అవసరమనే ఉద్దేశంతో వీరిని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు. ఇప్పటికే తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక జట్టులో నలుగురు స్పిన్నర్లు (కుల్దీప్, అశ్విన్, అక్షర్, జడేజా) ఉన్నప్పటికీ.. సెలెక్టర్లు అదనంగా మరో నలుగురు స్పిన్నర్లను (నెట్ బౌలర్లు) ఎంపిక చేశారు. ఎందుకంటే ఆసీస్ స్పిన్ విభాగంలో (నాథన్ లయోన్ (ఆఫ్ స్పిన్నర్), మిచెల్ స్వెప్సన్ (లెగ్ స్పిన్నర్), టాడ్ మర్ఫీ (ఆఫ్ స్పిన్నర్), ట్రవిస్ హెడ్ (ఆఫ్ స్పిన్నర్), అస్టన్ అగర్ (లెఫ్ ఆర్మ్ ఆర్థోడాక్స్)) ముగ్గురు ఆఫ్ స్పిన్నర్లు, ఓ లెగ్ స్పిన్నర్, ఓ లెఫ్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ ఉన్నారు. వీరిని ఎదుర్కోవాలంటే అదే వాటం ఉన్న బౌలర్లయితే ప్రయోజనకరంగా ఉంటుందని సెలెక్టర్లు ఈ ఎత్తుగడ వేశారు. భారత స్పిన్ విభాగంలో ఒక్క అశ్విన్ మినహా మిగతా ముగ్గురు లెఫ్ ఆర్మ్ బౌలర్లే కావడంతో ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్లతో నెట్స్‌లో ప్రాక్టీస్ చేయిస్తే బాగుంటుందని జట్టు కోచ్ సెలక్టర్లను కోరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆసీస్ బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ల కంటే పేసర్ల (కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, బోలాండ్) డామినేషనే అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నెట్స్‌లో స్పిన్నర్లతో సమానంగా పేసర్లతో బౌలింగ్ చేయిస్తే, టీమిండియాకు ప్రయోజనకరంగా ఉంటుంది. -
బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్.. అశ్విన్ స్థానంలో సౌరభ్ కుమార్..?
IND VS BAN 2nd Test: ఢాకా వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రేపటి నుంచి (డిసెంబర్ 22) రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు వాతావరణం పూర్తిగా అనుకూలిస్తుందని ఢాకా వాతావరణ శాఖ వెల్లడించింది. 2 టెస్ట్‌ల ఈ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్ట్‌లోనూ అదే జోరును కొనసాగించి బంగ్లాను వారి సొంతగడ్డపై ఊడ్చేయాలని పట్టుదలగా ఉంది. అలాగే వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి (1-2) కూడా ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది. పనిలో పనిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే అవకాశాలను కూడా మెరుగుపర్చుకోవాలని రాహుల్ సేన భావిస్తుంది. కాగా, రెండో టెస్ట్‌లో భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. తొలి టెస్ట్ ప్రదర్శన ఆధారంగా ఎలాంటి మార్పులకు అవకాశం లేనప్పటికీ అశ్విన్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ సౌరభ్ కుమార్‌కు అవకాశం కల్పిస్తారని కొందరు భావిస్తున్నారు. షేర్ ఏ బంగ్లా స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో టీమిండియా ముగ్గురు స్పిన్నర్ల ఆప్షన్‌కు కట్టుబడి ఉండటం ఖాయమని తెలిస్తోంది. సౌరభ్ కుమార్.. బౌలింగ్‌తో పాటు ప్రామిసింగ్ బ్యాటర్ కావడంతో అతనికి ఛాన్స్ ఇవ్వడం సబబేనని మరికొందరు భావిస్తున్నారు. ఈ ఒక్క మార్పు మినహాయించి తొలి టెస్ట్ ఆడిన జట్టులో మరో మార్పు చేసే అస్కారం లేదు. జట్టులో ఇదివరకే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి తొలి టెస్ట్‌లో బ్యాట్‌తో రాణించిన అశ్విన్‌ను కొనసాగించాలని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాల నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం ఎలాంటి ప్రయోగాలు చేయరాదని మరికొందరు కోరుకుంటున్నారు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్/ సౌరభ్ కుమార్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్! ఆల్‌రౌండర్ అరంగేట్రం
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఛాటోగ్రామ్ వేదికగా బుధవారం(డిసెంబర్14) ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్‌కు భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా దూరమయ్యారు. వీరి స్థానంలో అభిమాన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, నవ్‌దీప్ సైనీను బీసీసీఐ ఎంపిక చేసింది. అదే విధంగా 12 ఏళ్ల తర్వాత పేసర్ జయదేవ్ ఉనద్కట్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ఈ సిరీస్‌లో భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించున్నాడు. ప్రస్తుతం ఛాటోగ్రామ్‌లో ఉన్న భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చమటోడుస్తున్నారు. సౌరభ్ కుమార్‌కు తుది జట్టులో ఛాన్స్ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. బంగ్లాతో తొలి టెస్టుకు ఆల్‌రౌండర్ కోటాలో సౌరభ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని జట్టు మేనేజెమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్-'ఎ'తో అనధికార టెస్టు సిరీస్‌లో కూడా సౌరభ్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక రోహిత్ దూరం కావడంతో భారత ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్లో కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌కు చోటు దక్కనుంది. జట్టులో స్పెషలిస్టు స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉండనున్నాడు. అయితే మరో స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను తొలి టెస్టుకు పక్కన పెట్టే అవకాశం ఉంది. అక్షర్ స్థానంలో సౌరభ్ కుమార్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. ఇక పేసర్ల కోటాలో శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ చోటు దక్కే ఛాన్స్ ఉంది. తొలి టెస్టుకు భారత తుది జట్టు(అంచనా): శుబ్మాన్ గిల్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, సౌరబ్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్. ఉమేష్ యాదవ్ -
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం వదిలి భారత జట్టుకు.. ఎవరీ సౌరభ్ కుమార్?
మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్ కుమార్ భారత తరపున అరంగేట్రం చేసేందుకు అతృతగా ఎదురు చూస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టులో సౌరభ్ కుమార్‌కు చోటు దక్కింది. అయితే అతడికి తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు . ఇక తాజాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో సౌరభ్ కుమార్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ క్రమంలో భారత తరపున సత్తా చాటేందుకు సౌరభ్ కుమార్ ఊవ్విళ్లరూతున్నాడు. కాగా సౌరభ్ కుమార్ దేశీవాళీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్-'ఎ'తో అనధికార టెస్టు సిరీస్‌లో కూడా సౌరభ్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సౌరబ్‌ను బంగ్లాతో సిరీస్‌కు సెలక్టర్లు ఎంపికచేశారు. ఎవరీ సౌరభ్ కుమార్? 29 ఏళ్ల సౌరభ్ కుమార్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని భగ్పాట్లో జన్మించాడు. కాగా తన రాష్ట్ర సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించేముందు అతడు అండర్-19, అండర్-22 డివిజన్స్‌లో ఆడాడు. అనంతరం క్రికెట్‌పై మక్కువ ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితి దృష్ట్యా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగంలో చేరాడు. అయినప్పటికీ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదగాలన్న తన పట్టుదలను మాత్రం వదలలేదు. ఈ క్రమంలో 2014లో సర్వీసెస్ తరపున హిమాచల్ ప్రదేశ్‌పై సౌరభ్ ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. అనంతరం 2015లో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం నుంచి వైదొలిగిన సౌరభ్ తన సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన రంజీ అరంగేట్ర సీజన్లోనే 17 వికెట్లతో పాటు 304 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్-2013 సీజన్లో సౌరభ్‌ను పుణే వారియర్స్ కొనుగోలు చేసింది. అయినప్పటికీ అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. చదవండి: ENG Vs PAK: పాకిస్తాన్ గడ్డపై ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర.. 22 ఏళ్ల తర్వాత తొలి సారిగా -
Test: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారీ విజయం
India A tour of Bangladesh, 2022- Bangladesh A vs India A, 2nd unofficial Test: బంగ్లాదేశ్- ఎ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత- ఎ జట్టు ఘన విజయం సాధించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమిండియా ఇన్నింగ్స్ మీద 123 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. సిల్హెట్ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. విజృంభించిన బౌలర్లు ఈ క్రమంలో పేసర్ ముకేశ్ కుమార్ ఆరు వికెట్లతో చెలరేగగా.. జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మేరకు భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో బంగ్లా- ఎ జట్టు 252 పరుగులకు ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కదం తొక్కిన బ్యాటర్లు ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచినా(12).. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 248 బంతులు ఎదుర్కొని 157 పరుగులు సాధించాడు. అభిమన్యు కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు మిగతా వాళ్లలో ఛతేశ్వర్ పుజారా 52, వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ 77, జయంత్ యాదవ్ 83, సౌరభ్ కుమార్ 55, నవదీప్ సైనీ 50(నాటౌట్) సైతం అర్ధ శతకాలతో రాణించారు. మెరిసిన సౌరభ్ ఈ నేపథ్యంలో 147.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 562 పరుగుల భారీ స్కోరు చేసిన అభిమన్యు సేన.. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్‌బౌలర్ ముకేశ్ కుమార్ బంగ్లాను దెబ్బకొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ సౌరభ్ కుమార్ 6 వికెట్లతో చెలరేగాడు. సమిష్టి కృషితో విజయభేరి ఉమేశ్ యాదవ్ రెండు, నవదీప్ సైనీ 2 వికెట్లు కూల్చారు. దీంతో.. నాలుగో రోజు ఆటలో భాగంగా శుక్రవారం నాటి రెండో సెషన్లోనే 8 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య బంగ్లా జట్టు కథ ముగిసింది. ఇన్నింగ్స్ మీద 123 పరుగుల భారీ తేడాతో భారత- ఎ జట్టు జయభేరి మోగించింది. కాగా రెండు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టులో సమిష్టి కృషితో గెలుపొందిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్- ఎ వర్సెస్ బంగ్లాదేశ్- ఎ రెండో అనధికారిక టెస్టు స్కోర్లు: భారత్-ఎ: 562/9 డిక్లేర్డ్ బంగ్లాదేశ్- ఎ: 252 & 187 చదవండి: Ind Vs Ban: మరీ బంగ్లా చేతిలో ఓడిపోతుందని ఊహించలేదు.. బీసీసీఐ ఆగ్రహం?! తిరిగి రాగానే రోహిత్‌తో.. IND Vs AUS: 12 ఏళ్ల తర్వాత.. ఎగిరి గంతేస్తున్న అభిమానులు -
భారత బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో మొదటి రోజు భారత్ ‘ఎ’కు ఎనిమిది పరుగుల ఆధిక్యం దక్కింది. కాక్స్ బజార్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సౌరభ్ కుమార్ (4/23), నవదీప్ సైని (3/21) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులుచేసింది. యశస్వి (61 బ్యాటింగ్), ఈశ్వరన్ (53 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
అదరగొట్టిన సౌరభ్, నవదీప్.. 112 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్
Bangladesh A vs India A, 1st unofficial Test: బంగ్లాదేశ్- ఏతో అనధికారిక టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మెరిశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ 4 వికెట్లతో చెలరేగగా.. పేసర్ నవదీప్ సైనీ 3 వికెట్లు కూల్చాడు. వీరిద్దరికి తోడు ముకేశ్ కుమార్ రాణించడంతో బంగ్లా జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. కాగా టీమిండియా కంటే ముందు భారత- ఏ జట్టు బంగ్లాదేశ్‌కు పయనమైన విషయం తెలిసిందే. ఈ టూర్లో భాగంగా బంగ్లాదేశ్- ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్టు(నాలుగు రోజుల మ్యాచ్)లు ఆడనుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి కాక్స్ బజార్ వేదికగా ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ అభిమన్య ఈశ్వరన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సారథి నమ్మకాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు విజృంభించారు. నవదీప్ సైనీ, ముకేశ్ కుమార్ చెలరేగడంతో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ కకావిలకమైంది. ఓపెనర్లు మహ్మదుల్ హసన్ జాయ్ 1, జాకిర్ హసన్ 0 పరుగులకే అవుట్ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన షాంటో 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మొమినుల్ 4 పరుగులకే అవుట్ కాగా.. కెప్టెన్ మహ్మద్ మిథున్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మొసద్దెక్ ఒంటరి పోరాటం ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మొసద్దెక్ హొసేన్ 63 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే సౌరభ్ కుమార్ అతడిని పెవిలియన్‌కు పంపడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగింపునకు చేరుకుంది. ఈ క్రమంలో 45 ఓవర్లలో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి బంగ్లా- ఏ జట్టు ఆలౌట్ అయింది. సౌరభ్‌కు 4, నవదీప్‌నకు మూడు, ముకేశ్ కుమార్‌కు రెండు, అతిత్ షేత్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8! SL Vs AFG: ఒకేరోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు లంక యువ క్రికెటర్లు! ఓవైపు సిరీస్ ఆడుతూనే.. -
టీమిండియాకు భారీ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్..!
India Tour Of Bangladesh 2022: బంగ్లాదేశ్ పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. అందరూ ఊహించిన విధంగానే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరం కానున్నాడని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఓ కథనంలో పేర్కొంది. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని జడ్డూ.. బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌లకు అందుబాటులో ఉండడని సదరు వెబ్సైట్ వెల్లడించింది. వన్డేల్లో జడేజా స్థానాన్ని షాబాజ్ అహ్మద్, టెస్ట్‌ల్లో సౌరభ్ కుమార్ భర్తీ చేసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. Sourabh Kumar likely to replace Ravindra Jadeja in the Bangladesh Test Series. Shahbaz Ahmed to replace Jadeja in the ODI series. (Reported by EspnCricinfo). — Mufaddal Vohra (@mufaddal_vohra) November 23, 2022 కాగా, గాయపడిన జడ్డూ స్థానంపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జడేజా స్థానాన్ని మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ భర్తీ చేస్తాడని అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్య.. బంగ్లా సిరీస్‌లో టెస్ట్ అరంగేట్రం చేయడం ఖాయమని పందెలు సైతం కాస్తున్నారు. అయితే, తాత్కాలిక సెలెక్షన్ కమిటీ మాత్రం ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్ పేరునే పరిశీలస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రవీంద్ర జడేజా.. బంగ్లాదేశ్ టూర్‌కు అందుబాటులో ఉండకపోవడంపై మరో ప్రచారం కూడా నడుస్తుంది. జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది కాబట్టి, కావాలనే జడ్డూ గాయాన్ని బూచిగా చూపించి బంగ్లా టూర్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడని అనుకుంటున్నారు. గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, 5 తేదీల్లో జరుగనుండగా.. బంగ్లాదేశ్ సిరీస్ డిసెంబర్ 4న మొదలుకానున్న విషయం తెలిసిందే. -
ఐదేసిన సౌరభ్ కుమార్.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్-ఏతో జరిగిన మూడో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆటలో స్పిన్నర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో (5/103) చెలరేగడంతో టీమిండియా 113 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ అద్భుతమైన పోరాటం కనబర్చి 302 పరుగుల వద్ద ఆలౌటైంది. కివీస్ బ్యాటర్ జో కార్టర్ (230 బంతుల్లో 111; 12 ఫోర్లు, సిక్స్) అద్భుతమై శతకంతో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేయగా.. డీన్ క్లీవర్ (60 బంతుల్లో 44; 9 ఫోర్లు), మార్క్ చాప్మన్ (61 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) తమ వంతు ప్రయత్నం చేశారు. భారత బౌలర్లలో సౌరభ్ కుమార్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్ (2/48), ఉమ్రాన్ మాలిక్ (1/62), శార్ధూల్ ఠాకూర్ (1/44), ముకేశ్ కుమార్ (1/39) రాణించారు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు డ్రా కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. ఈ సిరీస్ తర్వాత భారత్ ఇదే జట్టుతో మూడు అనధికారిక వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో ఈ మ్యాచ్‌లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. స్కోర్ వివరాలు.. భారత్-ఏ తొలి ఇన్నింగ్స్: 293 ఆలౌట్ (రుతురాజ్ గైక్వాడ్ 108, ఉపేంద్ర యాదవ్ 76; మ్యాథ్యూ ఫిషర్ 4/52) న్యూజిలాండ్-ఏ తొలి ఇన్నింగ్స్: 237 ఆలౌట్ (మార్క్ చాప్మన్ 92, సోలియా 54; సౌరభ్ కుమార్ 4/48, రాహుల్ చాహర్ 3/53) భారత్-ఏ రెండో ఇన్నింగ్స్: 359/7 డిక్లేర్ (రజత్ పాటిదార్ 109, రుతురాజ్ 94, ప్రియాంక్ పంచల్ 62; రచిన్ రవీంద్ర 3/65) న్యూజిలాండ్-ఏ రెండో ఇన్నింగ్స్: 302 ఆలౌట్ (జో కార్టర్ 111, మార్క్ చాప్మన్ 45; సౌరభ్ కుమార్ 5/103) -
రూ.200 కోట్లకు ఈఈఎస్ఎల్ ఐపీఓ
♦ వచ్చే నెల్లో మర్చంట్ బ్యాంకర్ల నియామకం ♦ దీనికోసం 20 శాతం వాటాను డైల్యూట్ చేస్తాం ♦ ఈ ఏడాది రూ.6 వేల కోట్లతో విస్తరణ ప్రణాళిక ♦ రూ.4,800 కోట్లు రుణాల రూపంలో సేకరణ ♦ ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ (ఈఈఎస్ఎల్) ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూకు రానుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.200 కోట్లు సమీకరించే యోచన చేస్తున్నట్లు సంస్థ ఎండీ సౌరభ్ కుమార్ బుధవారమిక్కడ విలేకరులతో చెప్పారు. 20 శాతం వాటాను డైల్యూట్ చేయటం ద్వారా ఈ నిధులను సమీకరించనున్నట్లు తెలిపారాయన. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది రూ.6 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారాయన. ‘‘ఈ రూ.6వేల కోట్లలో రూ.1,200 కోట్లు మా వాటాగా పెడతాం. మిగిలిన రూ.4,800 కోట్లనూ రుణాల ద్వారా సమీకరిస్తాం. దీనికోసం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాం. దీన్లో భాగంగా యూకే మార్కెట్లో 10 కోట్ల డాలర్ల విలువైన రూపీ బాండ్లను (మసాలా) కూడా జారీ చేస్తాం’’ అని సౌరభ్ కుమార్ వివరించారు. ప్రస్తుతం తమ సంస్థ చెల్లించిన మూలధనం రూ.460 కోట్లుగా ఉందని, మరో రూ.540 కోట్లను ప్రమోటర్ల ద్వారా సమీకరిస్తామని చెప్పారాయన. ‘‘మిగిలిన రూ.200 కోట్లనూ ఐపీఓ ద్వారా సమీకరిస్తాం. దీనికోసం 20 శాతం వాటాను డైల్యూట్ చేస్తాం. ఐపీఓకు సంబంధించి మర్చంట్ బ్యాంకర్లను నెల రోజుల్లోగా ఎంపిక చేస్తాం’’ అని చెప్పారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో... కేంద్ర విద్యుత్ శాఖ సారథ్యంలో ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కలిసి ఈఈఎస్ఎల్ను జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పాటు చేశాయి. దేశవ్యాప్తంగా ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకునే ప్రాజెక్టుల్ని ఇది అమలు చేస్తుంది. దీన్లో భాగంగా రెండేళ్ల కిందట ‘ఉజాలా’ పథకాన్ని కూడా ఆరంభించింది. ఈ పథకం కింద ఇప్పటికే సాధారణ బల్బుల స్థానంలో విద్యుత్‌ను ఆదా చేసే 24 కోట్ల పైచిలుకు ఎల్ఈడీ బల్బులు ఏర్పాటయ్యాయి. 24 లక్షల ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, 8.5 లక్షల ఫ్యాన్లను విక్రయించారు. ఈ ఏడాది మరో 15 కోట్ల ఎల్ఈడీ బల్బులను జోడిస్తామని సౌరభ్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. 2019 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 77 కోట్ల ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయడం సంస్థ లక్ష్యమన్నారు. కంపెనీ ఒక్కో బల్బును రూ.70కే విక్రయిస్తోంది. మూడేళ్లలో పాడైతే కొత్తది ఇస్తారు. అలాగే ఎల్ఈడీ ట్యూబ్‌లైట్ రూ.230, విద్యుత్‌ను ఆదాచేసే ఫ్యాన్ రూ.1,150లకు అందుబాటులోకి తెచ్చింది. మీసేవా, రెవెన్యూ కేంద్రాలు, పోస్టాఫీసులు, స్వయం సహాయక సంఘాల ద్వారా, విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద వీటిని విక్రయిస్తున్నారు. జీహెచ్ఎంసీతో భారీ ప్రాజెక్టు.. గ్రేటర్ హైదరాబాద్‌లో 4.5 లక్షల వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ లైట్లను ఆరు నెలల్లో ఏర్పాటు చేయనున్నట్టు సౌరభ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీకి వీధి దీపాల విద్యుత్ బిల్లు ఏటా రూ.200 కోట్లు వస్తోంది. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతో ఈ బిల్లు సగానికి పడిపోతుంది. ఈ ప్రాజెక్టు కోసం ఈఈఎస్ఎల్ రూ.270 కోట్లు వెచ్చిస్తోంది. నిర్వహణ కూడా మాదే. జీహెచ్ఎంసీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టడం లేదు. ఆదా అవుతున్న విద్యుత్ బిల్లు నుంచి మాత్రమే లైట్ల ఏర్పాటు, నిర్వహణకుగాను ఏటా సుమారు రూ.70 కోట్లు జీహెచ్ఎంసీ ఏడేళ్లపాటు ఈఈఎస్ఎల్కు చెల్లిస్తుంది’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రాజెక్టులు మరిన్ని చేయబోతున్నాం అని వివరించారు.