Ind A Vs Ban A 2nd Test: India Beat Bangladesh Won By Innings 123 Runs - Sakshi
Sakshi News home page

Ind A Vs Ban A: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్‌.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారీ విజయం

Published Fri, Dec 9 2022 1:19 PM | Last Updated on Fri, Dec 9 2022 3:04 PM

Ind A Vs Ban A 2nd Test: India Beat Bangladesh Won By Innings 123 Runs - Sakshi

భారత్‌- ఎ వర్సెస్‌ బంగ్లా- ఎ (PC: BCCI/BCB)

India A tour of Bangladesh, 2022- Bangladesh A vs India A, 2nd unofficial Test: బంగ్లాదేశ్‌- ఎ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత- ఎ జట్టు ఘన విజయం సాధించింది. అభిమన్యు ఈశ్వరన్‌ సారథ్యంలోని టీమిండియా ఇన్నింగ్స్‌ మీద 123 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. సిల్హెట్‌ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

విజృంభించిన బౌలర్లు
ఈ క్రమంలో పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ ఆరు వికెట్లతో చెలరేగగా.. జయంత్‌ యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మేరకు భారత బౌలర్ల విజృం‍భణ నేపథ్యంలో బంగ్లా- ఎ జట్టు 252 పరుగులకు ఆలౌట్‌ అయి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.

కదం తొక్కిన బ్యాటర్లు
ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ నిరాశపరిచినా(12).. మరో ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ అద్భుత సెంచరీతో మెరిశాడు. 248 బంతులు ఎదుర్కొని 157 పరుగులు సాధించాడు. అభిమన్యు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు తోడు మిగతా వాళ్లలో ఛతేశ్వర్‌ పుజారా 52, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ 77, జయంత్‌ యాదవ్‌ 83, సౌరభ్‌ కుమార్‌ 55, నవదీప్‌ సైనీ 50(నాటౌట్‌) సైతం అర్ధ శతకాలతో రాణించారు.

మెరిసిన సౌరభ్‌
ఈ నేపథ్యంలో 147.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 562 పరుగుల భారీ స్కోరు చేసిన అభిమన్యు సేన.. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్‌బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ బంగ్లాను దెబ్బకొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌ 6 వికెట్లతో చెలరేగాడు.

సమిష్టి కృషితో విజయభేరి
ఉమేశ్‌ యాదవ్‌ రెండు, నవదీప్‌ సైనీ 2 వికెట్లు కూల్చారు. దీంతో.. నాలుగో రోజు ఆటలో భాగంగా శుక్రవారం నాటి రెండో సెషన్‌లోనే 8 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య బంగ్లా జట్టు కథ ముగిసింది. ఇన్నింగ్స్‌ మీద 123 పరుగుల భారీ తేడాతో భారత- ఎ జట్టు జయభేరి మోగించింది. కాగా రెండు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టులో సమిష్టి కృషితో గెలుపొందిన భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది.  

భారత్‌- ఎ వర్సెస్‌ బంగ్లాదేశ్‌- ఎ రెండో అనధికారిక టెస్టు స్కోర్లు:
భారత్‌-ఎ: 562/9 డిక్లేర్డ్‌
బంగ్లాదేశ్‌- ఎ: 252 & 187

చదవండి: Ind Vs Ban: మరీ బంగ్లా చేతిలో ఓడిపోతుందని ఊహించలేదు.. బీసీసీఐ ఆగ్రహం?! తిరిగి రాగానే రోహిత్‌తో..
IND Vs AUS: 12 ఏళ్ల తర్వాత.. ఎగిరి గంతేస్తున్న అభిమానులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement