Srikar Bharat
-
శ్రీకర్ భరత్ పోరాటం
అహ్మదాబాద్: సహచరులు విఫలమైన చోట వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (72 బంతుల్లో 78 బ్యాటంగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఫలితంగా గుజరాత్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తేరుకోగలిగింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శనివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్‌తో పాటు... ఇటీవల బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లో మెరుపులు మెరిపించిన నితీశ్ కుమార్ రెడ్డి (34; 6 ఫోర్లు) సత్తా చాటాడు. కెప్టెన్ రికీ భుయ్ (9), హనుమ విహారి (0), షేక్ రషీద్ (1), మహీప్ కుమార్ (0), అభిõÙక్ రెడ్డి (15) విఫలమయ్యారు. దీంతో ఒక దశలో ఆంధ్ర జట్టు 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు గుజరాత్ బౌలర్లు విజృంభిస్తుంటే... ఆంధ్ర బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఈ దశలో ఆత్మరక్షణ ధోరణి వీడిన శ్రీకర్ భరత్ ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. అతడికి నితీశ్ కుమార్ రెడ్డి కూడా తోడవడంతో ఆంధ్ర జట్టు కోలుకోగలిగింది. ఈ జంట అబేధ్యమైన ఆరో వికెట్‌కు 107 పరుగులు జోడించింది. గుజరాత్ బౌలర్లలో చింతన్ గాజా 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 289/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ చివరకు 106 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ చింతన్ గాజా (152 బంఉత్లో 92; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా... అర్జాన్ నాగ్వస్వల్లా (82 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయంగా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, లలిత్ మోహన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో ఐదు వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 230 పరుగులు వెనుకబడి ఉంది. శ్రీకర్ భరత్, నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 367; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: అభిõÙక్ రెడ్డి (సి) మనన్ హింగ్రాజియా (బి) జడేజా 15; మహీప్ కుమార్ (సి) ఉర్విల్ పటేల్ (బి) అర్జాన్ 0; షేక్ రషీద్ (సి) మనన్ హింగ్రాజియా (బి) చింతన్ గాజా 1; హనుమ విహారి (బి) చింతన్ గాజా 0; రికీ భుయ్ (సి) ఉర్విల్ పటేల్ (బి) చింతన్ గాజా 9; శ్రీకర్ భరత్ (నాటౌట్) 78; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (32 ఓవర్లలో 5 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–4, 2–5, 3–5, 4–25, 5–29, బౌలింగ్: చింతన్ గాజా 9–1–40–3; అర్జాన్ 7–1–22–1; ప్రియాజిత్సింగ్ జడేజా 3.5–0–25–1; సిద్ధార్థ్ దేశాయ్ 8–1–27–0; జయ్‌మీత్ పటేల్ 0.1–0–0–0, రవి బిష్ణోయ్ 4–0–23–0 -
పాపం సంజూ.. ఇక్కడ కూడా అవకాశం దక్కలే..!
దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు ఇవాల్టి (సెప్టెంబర్) నుంచి ప్రారంభమయ్యాయి. ఇండియా-ఏ, ఇండియా-బి మధ్య తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా జరుగుతుండగా.. ఇండియా-సి, ఇండియా-డి మధ్య రెండో మ్యాచ్ అనంతపురంలో జరుగుతుంది.తొలి మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బి మూడో సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్ కోసం ప్రాకులాడుతుంది. ముషీర్ ఖాన్ (77), నవ్‌దీప్ సైనీ (7) ఇండియా-బిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 30, అభిమన్యు ఈశ్వరన్ 13, సర్ఫరాజ్ ఖాన్ 9, రిషబ్ పంత్ 7, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.రెండో మ్యాచ్ విషయానికొస్తే.. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్‌దీప్ సింగ్‌తో (13) కలిసి తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు.అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్‌దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్‌దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12) ఔట్ కాగా.. రజత్ పాటిదార్ (13), బాబా ఇంద్రజిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు.పాపం సంజూ.. ఇక్కడ కూడా అవకాశం దక్కలే..!రెండో మ్యాచ్‌కు ముందు ఇండియా-డి ఆటగాడు ఇషాన్ కిషన్ గాయపడటంతో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. సంజూ తుది జట్టులో ఉండటం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే మేనేజ్మెంట్ అనూహ్యంగా సంజూను పక్కన పెట్టి శ్రీకర్ భరత్‌కు తుది జట్టులోకి తీసుకుంది. ఇండియా-సితో మ్యాచ్‌లో సంజూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో అవకాశం వస్తే తనను తాను నిరూపించుకుని టెస్ట్ జట్టులో చోటు కొట్టేయాలని సంజూ భావించాడు. చివరికి అతని ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. -
ఐపీఎల్ ‘హిట్’ షోకు తెలుగు క్రికెటర్లు రెడీ!
ఐపీఎల్ 2024 సీజన్లో సత్తా చాటేందుకు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్ వేలంలో మొత్తం 11 మంది పాల్గొనగా.. ఆరుగురు క్రికెటర్లు వివిధ జట్లకు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతుండగా.. విశాఖకు చెందిన కాకి నితీశ్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు.. విశాఖకు చెందిన కోన శ్రీకర్ భరత్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు.. హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ రియాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు.. హైదరాబాద్‌కే చెందిన తిలక్ వర్మ ముంబై ఇండియన్స్‌కు.. హైదరాబాద్‌కే చెందిన అరవెల్లి అవినీశ్ రావు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంపికయ్యారు. తెలుగోళ్ల సత్తా చాటడానికి సిద్ధం అని స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఓ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి తెలుగు వారియర్స్‌కు శుభాంకాంక్షలు తెలిపింది. పై పేర్కొన్న ఆరుగురే కాక తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఇద్దరు కూడా ఈ సీజన్ ఐపీఎల్లో ఆడుతున్నారు. ‘తగ్గేదే లే’ అంటూ తెలుగు సత్తా చూపేందుకు 💥 మన స్టార్స్ వచ్చేస్తున్నారు 🤩 మరి వీరిలో ఈ సీజన్ ఎవరు మెరిపిస్తారు? చూడండి#TATAIPL | Chennai v Bengaluru | 5 PM నుండి మీ #StarSportsTelugu లో#IPLonStar pic.twitter.com/E4CW9z7aMj — StarSportsTelugu (@StarSportsTel) March 22, 2024 ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు సారథ్యం వహిస్తున్న రికీ భుయ్ (మధ్యప్రదేశ్) ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనుండగా.. హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడుతున్న తనయ్ త్యాగరాజన్ (బెంగళూరు) పంజాబ్ కింగ్స్‌కు ఎంపికయ్యారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిది మంది క్రికెటర్లు ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ఇవాల్లి (మార్చి 22) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న సీజన్ తొలి మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
ఆంధ్ర ఆటగాడి వీరోచిత పోరాటం.. భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టుడు
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో భాగంగా పంజాబ్‌తో నిన్న (అక్టోబర్ 17) జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రికీ భుయ్ వీరోచితంగా పోరాడాడు. భారీ లక్ష్య ఛేదనలో భుయ్ అజేయ శతకంతో (52 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరిశాడు. అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. అభిషేక్ శర్మ (51 బంతుల్లో 112; 9 ఫోర్లు, 9 సిక్సర్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (26 బంతుల్లో 87; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోర్ చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆంధ్రప్రదేశ్.. పంజాబ్ బౌలర్లు హర్‌ప్రీత్ బ్రార్ (4-1-18-3), సిద్దార్థ్ కౌల్ (2/40), అర్షదీప్ సింగ్ (1/37), ప్రేరిత్ దత్తా (1/25) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్ (104 నాటౌట్) ఒక్కడే ఒంటిపోరాటం చేసి శతక్కొట్టగా.. అశ్విన్ హెబ్బర్ (17), త్రిపురన విజయ్ (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. భరత్‌కు అవకాశం దక్కేనా? మరి అశ్విన్!
భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. మరో కొన్ని గంటల్లో ఈ మెగా ఫైనల్ ప్రారంభం కానుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్రంపంచ చాంపియన్స్‌గా నిలవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ క్రమంలో పటిష్ట ఆసీస్‌ను ఢీకొట్టేందుకు భారత్ కూడా బలమైన జట్టుతో బరిలోకి దిగాలని యోచిస్తోంది. అయితే ఓవల్ మైదానంలో పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి చూస్తే తుది జట్టు ఎంపిక విషయంలో టీమ్ మేనేజ్మెంట్లో సందిగ్ధత కొనసాగుతోంది. కేఎస్ భరత్‌కు అవకాశం దక్కేనా! ఆడిన ఆఖరి టెస్టులో (ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు) తుది జట్టును చూస్తే ఒకటి, రెండు స్థానాలు మినహా ఇతర ఆటగాళ్లందరికీ చోటు ఖాయం. టాప్–4లో రోహిత్, గిల్, పుజారా, కోహ్లి ఉండగా, శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో ఐదో స్థానంలో రహానే ఆడతాడు. ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకు చోటు ఖాయం. అయితే ఓవల్ మైదానాన్ని బట్టి చూస్తే భారత్ నలుగురు పేసర్లతో ఆడుతుందా లేదా రెండో స్పిన్నర్‌కు అవకాశం దక్కుతుందా చూడాలి. మ్యాచ్‌కు ముందు రోజు రోహిత్ కూడా సీనియర్ బౌలర్ అశ్విన్ స్థానంపై హామీ ఇవ్వలేకపోయాడు. షమీ, సిరాజ్‌లతో పాటు ఉమేశ్ యాదవ్, జైదేవ్ ఉనాద్కట్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. రెండో స్పిన్నర్ అవసరం లేదనుకుంటే శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం ఉంది. అయితే ప్రధానంగా వికెట్ కీపర్‌పైనే చర్చ కొనసాగుతోంది. కీపింగ్ నైపుణ్యాన్ని బట్టి చూస్తే ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ (కేఎస్) భరత్‌ను ఎంచుకోవాలి. అయితే దూకుడైన బ్యాటింగ్‌తో పాటు ఎడంచేతి వాటం కావడం ఇషాన్ కిషన్ అవకాశాలు పెంచుతోంది. అయితే ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడని ఇషాన్‌ను కీలకపోరులో అరంగేట్రం చేయిస్తారా అనేది సందేహమే. ఐపీఎల్ కారణంగా భారత ఆటగాళ్లంతా టి20ల్లోనే ఆడినా, ఆటతో ‘టచ్’లోనే ఉన్నారు. కీలక ఆటగాడు పుజారా ఇటీవలి కౌంటీ క్రికెట్ అనుభవం జట్టుకు ఉపయోగపడనుంది. చదవండి: WTC Final: సచిన్, ద్రవిడ్ రికార్డులకు ఎసరు పెట్టిన కోహ్లి -
పంత్ పని అయిపోయింది.. ఇక మిగిలింది అదే..!
భావి భారత కెప్టెన్‌గా చిత్రీకరించబడి, అనతి కాలంలోనే ఏ భారత క్రికెటర్‌కు దక్కనంత హైప్ దక్కించుకుని, ప్రస్తుతం కెరీర్లో దుర్దశను ఎదుర్కొంటున్న రిషబ్ పంత్‌ను త్వరలోనే జట్టు నుంచి తప్పించబోతున్నారా..? అంటే ఔననే సమాధానమే వినిపిస్తుంది. తాజాగా పంత్‌ను వైస్ కెప్టెన్సీ (బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్) నుంచి తప్పించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది. బంగ్లాతో వన్డే సిరీస్‌కు సైతం పంత్ ఫిట్‌గానే ఉన్నప్పటికీ.. గాయం నెపంతో బీసీసీఐ కావాలనే పంత్‌ను పక్కకు పెట్టిందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి పంత్‌ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన బీసీసీఐ.. మున్ముందు అతన్ని జట్టులో నుంచి పూర్తిగా తొలగిస్తుందని భారత క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. బంగ్లాతో ఆఖరి వన్డే వరకు పంత్ (టీమిండియా వికెట్‌కీపర్ స్థానానికి)కు సంజూ శాంసన్ నుంచి మాత్రమే పోటీ ఉండేది. అయితే బంగ్లాతో మూడో వన్డేలో అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ మెరుపు డబుల్ సెంచరీతో చెలరేగడంతో పంత్ కూసాలు కదలడం పక్కా అని తేలిపోయింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సంజూ, ఇషాన్ కిషన్ల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న పంత్.. తనకు మంచి ట్రాక్ రికార్డు కలిగిన టెస్ట్‌ల్లో సైతం తన స్థానాన్ని ప్రమాదంలోకి పడేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతనికి శ్రీకర్ భరత్ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు పంత్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించిన మేనేజ్మెంట్.. తుది జట్టులో ఆడించడం కూడా కష్టమేనన్న పరోక్ష సంకేతాలు పంపింది. వరుస అవకాశాలు ఇచ్చినా పంత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాడని గుర్రుగా ఉన్న బీసీసీఐ.. టెస్ట్‌ల్లో శ్రీకర్ భరత్‌ను పరీక్షించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బంగ్లాతో తొలి టెస్ట్‌లో పంత్‌కు స్థానం లభించకపోతే, అతని కెరీర్ సమాప్తమైనట్టేనని క్రికెట్ అభిమానులు చర్చించకుంటున్నారు. పంత్ వ్యతిరేకులు అయితే.. అతని పని అయిపోయిందని, ఇక మిగిలింది అతన్ని జట్టు నుంచి గెంటివేయడమేనని బహిరంగ కామెంట్లు చేస్తున్నారు. భారత క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్‌కు దక్కనన్ని అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేని పంత్‌కు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనని శాపనార్ధాలు పెడుతున్నారు. -
Test: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారీ విజయం
India A tour of Bangladesh, 2022- Bangladesh A vs India A, 2nd unofficial Test: బంగ్లాదేశ్- ఎ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత- ఎ జట్టు ఘన విజయం సాధించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమిండియా ఇన్నింగ్స్ మీద 123 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. సిల్హెట్ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. విజృంభించిన బౌలర్లు ఈ క్రమంలో పేసర్ ముకేశ్ కుమార్ ఆరు వికెట్లతో చెలరేగగా.. జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మేరకు భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో బంగ్లా- ఎ జట్టు 252 పరుగులకు ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కదం తొక్కిన బ్యాటర్లు ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచినా(12).. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 248 బంతులు ఎదుర్కొని 157 పరుగులు సాధించాడు. అభిమన్యు కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు మిగతా వాళ్లలో ఛతేశ్వర్ పుజారా 52, వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ 77, జయంత్ యాదవ్ 83, సౌరభ్ కుమార్ 55, నవదీప్ సైనీ 50(నాటౌట్) సైతం అర్ధ శతకాలతో రాణించారు. మెరిసిన సౌరభ్ ఈ నేపథ్యంలో 147.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 562 పరుగుల భారీ స్కోరు చేసిన అభిమన్యు సేన.. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్‌బౌలర్ ముకేశ్ కుమార్ బంగ్లాను దెబ్బకొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ సౌరభ్ కుమార్ 6 వికెట్లతో చెలరేగాడు. సమిష్టి కృషితో విజయభేరి ఉమేశ్ యాదవ్ రెండు, నవదీప్ సైనీ 2 వికెట్లు కూల్చారు. దీంతో.. నాలుగో రోజు ఆటలో భాగంగా శుక్రవారం నాటి రెండో సెషన్లోనే 8 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య బంగ్లా జట్టు కథ ముగిసింది. ఇన్నింగ్స్ మీద 123 పరుగుల భారీ తేడాతో భారత- ఎ జట్టు జయభేరి మోగించింది. కాగా రెండు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టులో సమిష్టి కృషితో గెలుపొందిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్- ఎ వర్సెస్ బంగ్లాదేశ్- ఎ రెండో అనధికారిక టెస్టు స్కోర్లు: భారత్-ఎ: 562/9 డిక్లేర్డ్ బంగ్లాదేశ్- ఎ: 252 & 187 చదవండి: Ind Vs Ban: మరీ బంగ్లా చేతిలో ఓడిపోతుందని ఊహించలేదు.. బీసీసీఐ ఆగ్రహం?! తిరిగి రాగానే రోహిత్‌తో.. IND Vs AUS: 12 ఏళ్ల తర్వాత.. ఎగిరి గంతేస్తున్న అభిమానులు -
తెలుగు ఆటగాళ్ల సెంచరీల మోత.. ఒకే రోజు ముగ్గురు శతక్కొట్టుడు
బెంగళూరు: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర తొలి విజయం నమోదు చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 261 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (133 బంతుల్లో 136; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), కోన శ్రీకర్ భరత్ (84 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ 38 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. కమ్ష(18)దే అత్యధిక స్కోరు. అయ్యప్ప 3 వికెట్లు పడగొట్టగా... షోయబ్, హరిశంకర్, ఆశిష్ తలా 2 వికెట్లు తీశారు. పరుగుల పరంగా ఈ టోర్నీ చరిత్రలో ఆంధ్రకిదే పెద్ద విజయం. తన్మయ్ అగర్వాల్ శతకం... న్యూఢిల్లీ: సౌరాష్ట్రతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా సౌరాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (120 బంతుల్లో 102; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం సాధించాడు. సంకేత్ 4 వికెట్లు పడగొట్టగా, అనికేత్ రెడ్డికి 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత హైదరాబాద్ 48.5 ఓవర్లలో 5 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (119 బంతుల్లో 124; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ రాయుడు (97 బంతుల్లో 83; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 214 పరుగులు జోడించి హైదరాబాద్ విజయాన్ని సులువుగా మార్చగా, తిలక్ వర్మ (45; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. -
భారత ‘ఎ’ వన్డే జట్టులో తిలక్ వర్మ
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్‌తో హైదరాబాద్ యువ క్రికెటర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ చాన్స్ మీద చాన్స్ కొట్టేస్తున్నాడు. తొలుత న్యూజిలాండ్ ‘ఎ’తో 3 మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపికైన అతన్ని తాజాగా న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కూ కొనసాగిస్తున్నారు. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. కెప్టెన్‌గా సంజూ సామ్సన్ వ్యవహరిస్తాడు. చెన్నై వేదికగా ఈ మూడు వన్డేలు ఈనెల 22, 25, 27 తేదీల్లో జరుగుతాయి. భారత్ ‘ఎ’ వన్డే జట్టు: సంజూ సామ్సన్ (కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటిదార్, తిలక్ వర్మ, శ్రీకర్ భరత్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, శార్దుల్ ఠాకూర్, ఉమ్రాన్ మలిక్, నవ్‌దీప్ సైనీ, రాజ్ అంగద్, రాహుల్ చహర్, షహబాజ్ అహ్మద్. -
రాణించిన శ్రీకర్ భరత్.. టీమిండియా స్కోర్: 246/8
లీస్టర్: ఆంధ్ర బ్యాట్స్‌మన్ కోన శ్రీకర్ భరత్ (111 బంతుల్లో 70 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. లీస్టర్‌షైర్ బౌలర్లకు స్టార్ బ్యాటర్లంతా తలొగ్గితే తను మాత్రం చక్కని పోరాటం చేశాడు. సన్నాహక మ్యాచ్‌లో మొదటి రోజు కౌంటీ జట్టు బౌలర్ల ప్రతాపమే పూర్తి పైచేయి కాకుండా భరత్ అడ్డుగా, అజేయంగా నిలిచాడు. దీంతో గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (25; 3 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (21; 4 ఫోర్లు) పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. టెస్టు స్పెషలిస్ట్ హనుమ విహారి (3), శ్రేయస్ అయ్యర్ (0) నిరాశ పరిచారు. విరాట్ కోహ్లి (69 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆడినంతసేపు తన శైలి షాట్లతో అలరించాడు. రవీంద్ర జడేజా (13) కూడా చేతులెత్తేయగా 81 పరుగులకే భారత్ 5 ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కోహ్లితో జతకట్టిన శ్రీకర్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలతో చప్పగా సాగుతున్న స్కోరు బోర్డుకు ఊపుతెచ్చారు. ఆరో వికెట్‌కు 57 పరుగులు జోడించాక కోహ్లి నిష్క్రమించాడు. శార్దుల్ ఠాకూర్ (6) ఓ ఫోర్‌కొట్టి పెవిలియన్ బాట పట్టగా... టెయిలెండర్లలో ఉమేశ్ యాదవ్ (23; 4 ఫోర్లు) నిలబడటంతో శ్రీకర్ భరత్ జట్టు స్కోరును 200 పరుగులు దాటించగలిగాడు. తర్వాత షమీ (18 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఓర్పుగా బ్యాటింగ్ చేయడంతో భరత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లీస్టర్‌షైర్ బౌలర్లలో రోమన్ వాకర్ 5 వికెట్లు పడగొట్టగా, విల్ డేవిస్‌కు 2 వికెట్లు దక్కాయి. భారత ఆటగాళ్లలో అందరికీ ప్రాక్టీస్ కల్పించాలన్న ఉద్దేశంతో నలుగురు ప్రధాన ఆటగాళ్లు బుమ్రా, రిషభ్ పంత్, చతేశ్వర్ పుజారా, ప్రసిధ్ కృష్ణలను లీస్టర్‌షైర్ తరఫున ఆడించారు. వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో తొలిరోజు 60.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది. జట్టుతో చేరిన అశ్విన్ కరోనా నుంచి కోలుకున్న ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాడు. బుధవారమే లీస్టర్ చేరుకున్న అశ్విన్ గురువారం ఉదయమే భారత జట్టు సహచరులతో టీమ్ డ్రెస్‌లో మైదానానికి వచ్చినా ప్రాక్టీస్ మ్యాచ్ బరిలోకి దిగలేదు. రెండు జట్లలోనూ అశ్విన్ పేరు కనిపించలేదు. అతని పూర్తి స్థాయిలో కోలుకోలేదు కాబట్టి విశ్రాంతి అవసరమని భారత జట్టు మేనేజ్మెంట్ భావించి ఉండవచ్చు. చదవండి:SL vs AUS: శ్రీలంకతో టెస్టు సిరీస్.. ఐదేళ్ల తర్వాత మాక్స్వెల్ రీ ఎంట్రీ..! -
India Vs Leicestershire: భారత జట్టులో విహారి, శ్రీకర్ భరత్.. మరి పంత్?
India Vs Leicestershire Warm Up Match: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు లీసెస్టర్‌షైర్ కౌంటీతో టీమిండియా వార్మప్ మ్యాచ్ మొదలైంది. లీసెస్టర్‌లోని గ్రేస్‌రోడ్ స్టేడియంలో నాలుగు రోజుల పాటు ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ లీసెస్టర్‌ఫైర్ తరఫున బరిలోకి దిగారు. మరోవైపు రోహిత్ శర్మలో సారథ్యంలోని భారత జట్టులో తెలుగు క్రికెటర్లు హనుమ విహారి, వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ భాగమయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. కాగా గతేడాది పర్యటన సందర్భంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా తాజా పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టుతో పాటు మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. కాగా గత టూర్లో భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన భారత్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ రీషెడ్యూల్డ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభమైన వార్మప్ మ్యాచ్.. లీసెస్టర్‌షైర్ కౌంటీ అఫీషియల్ యూట్యూబ్ చానల్ ‘ఫాక్సెస్ టీవీ’లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. లీసెస్టర్‌షైర్ వర్సెస్ భారత్ వార్మప్ మ్యాచ్ జట్ల వివరాలు ఇలా: లీసెస్టర్‌షైర్ జట్టు: సామ్యూల్ ఈవన్స్(కెప్టెన్), లూయీస్ కింబర్, ఛతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, రేహాన్ అహ్మద్, సామ్యూల్ బేట్స్(వికెట్ కీపర్), రోమన్ వాకర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, విల్ డేవిస్, నాథన్ బౌలే, అబిడినే సకాండే, జోయ్ ఎవిసన్. భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, హనుమ విహారి, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్. 📺 | 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌 Watch @Jaspritbumrah93 bowling to @imro45 and @ShubmanGill live on Foxes TV. ⤵️https://t.co/adbXpwig48@BCCI 14/0 after four overs. 🦊 #IndiaTourMatch | #LEIvIND — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 23, 2022 That is some welcome for a practice game. Leicester is buzzing. #TeamIndia pic.twitter.com/uI5R6mafFV — BCCI (@BCCI) June 23, 2022 -
ఐపీఎల్లో తెలుగోళ్లు... తొలి సారిగా అంపైర్!
విశాఖ స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విశాఖ నుంచి ప్రాతినిధ్యం లభించింది. ఢిల్లీ కాపిటల్స్ తరఫున ఆడేందుకు కేఎస్ భరత్ సిద్ధమవుతుండగా...మ్యాచ్‌లకు అంపైర్‌గా సీహెచ్ రవికాంత్ బయలుదేరనున్నారు. భరత్‌కు ఇప్పటికే ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరఫున ఆడిన అనుభవం ఉంది. బీసీసీఐ పానెల్ అంపైర్ రవికాంత్ మాత్రం తొలిసారిగా ఐపీఎల్ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన వీరిద్దరికి క్రికెట్ సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈసారి ఢిల్లీ కాపిటల్స్ తరఫున ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ కె. శ్రీకర్ భరత్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్లో ఆడనున్నాడు. రంజీల్లో ట్రిపుల్ సెంచరీ, వికెట్ కీపర్ బాటర్‌గా రికార్డు సాధించి భరత్ తొలిసారిగా 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తరఫున ఐపీఎల్ మ్యాచ్‌లాడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌కు తొలిసారిగా జట్టుకూర్పులో స్థానం సాధించాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలకు ఎంపికైనా జాతీయ జట్టు తరఫున పూర్తిస్థాయిలో ఆడే అవకాశం దక్కలేదు. ఇటీవలే న్యూజిలాండ్‌తో ఆడిన టెస్ట్ మ్యాచ్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా జట్టు తరఫున ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్‌లోనూ జట్టుతోనే ఉన్నాడు. అయితే ఐపీఎల్లో మాత్రం మరోసారి ఆడేందుకు అహ్వానం అందుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ తరఫున చివరి బంతిని గాల్లో బౌండరీకి తరలించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఐపీఎల్‌లోనూ భరత్‌కు మంచి గుర్తింపు వచ్చింది. సిక్సర్‌ను ఢిల్లీ కాపిటల్స్ జట్టుపైనే సాధించగా...ఈసారి ఆదే ఢిల్లీ కేపిటల్స్ తరఫున జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. టీ20 మ్యాచ్‌ల్లోనూ అర్ధసెంచరీ నమోదు చేసిన భరత్ వికెట్ల వెనుక నిలబడి 29 స్టంపింగ్స్ చేశాడు. ప్యానెల్ అంపైర్‌గా 250 మ్యాచ్‌లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల్లో 250 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన సీహెచ్ రవికాంత్ తొలిసారిగా ఐపీఎల్లో అంపైరింగ్‌కు ఆహ్వానం అందుకున్నాడు. పలు టీ20 మ్యాచ్‌లు అంపైరింగ్ చేశారు. తొలిసారి జిల్లా ప్యానల్ అంపైర్‌గా పిచ్‌పైకి వచ్చిన రవికాంత్ అనతికాలంలోనే అనంతపురంలో తొలిసారిగా స్టేట్ ప్యానల్ అంపైర్ అయ్యారు. ఇక 2008లో బీసీసీఐ ప్యానల్ అంపైర్ కావడంతో దేశవాళీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసే స్థాయికి ఎదిగారు. 2015 నుంచి రంజీల్లో 39 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. తొలిసారిగా ఇండియా ఏతో తలపడిన న్యూజిలాండ్ ఏ నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేయడంతో అంతర్జాతీయ మ్యాచ్ అరంగేట్రం జరిగింది. దక్షిణాఫ్రికా అండర్–19 జట్టుతో భారత్ ఆడిన మ్యాచ్‌లకు, మహిళల దక్షిణాఫ్రికా–భారత్ టీ20 సిరీస్‌కు అంపైరింగ్ చేశారు. -
Srikar Bharat: 16 ఫోర్లు, 7 సిక్స్‌లతో 156.. ప్చ్.. గెలిచినా నిరాశే!
Srikar Bharat Scored 156 Runs In 138 Balls: కెప్టెన్ కోన శ్రీకర్ భరత్ మరో అద్భుత సెంచరీతో జట్టుకు విజయం అందించినా... రన్‌రేట్‌లో వెనుకబడటంతో విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు పోరాటం ముగిసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గుజరాత్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 81 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 253 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 7 సిక్స్‌లతో 158 పరుగులు సాధించి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. గిరినాథ్ రెడ్డి (34; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి భరత్ ఏడో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. అనంతరం గుజరాత్ జట్టు 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆంధ్ర బౌలర్లలో జి.మనీశ్ నాలుగు, గిరినాథ్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. ఆరు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక హిమాచల్‌ప్రదేశ్, విదర్భ, ఆంధ్ర, ఒడిశా జట్లు మూడు విజయాలతో 12 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధా రంగా హిమాచల్‌ప్రదేశ్ (+0.551), విదర్భ (+0.210) నాకౌట్ దశకు అర్హత పొందాయి. ఆంధ్ర (+0.042) మూడో స్థానంలో, ఒడిశా (–0.200) నాలుగో స్థానంలో నిలిచాయి. చదవండి: LPL 2021: 6 బంతుల్లో ఐదు సిక్సర్లు.. వీడియో వైరల్ Ruturaj Gaikwad: సెలక్టర్లకు తలనొప్పిగా మారుతున్న రుతురాజ్.. తాజా ఫీట్‌తో కోహ్లి సరసన -
IND VS NZ: అతడు టీమిండియా ఓపెనర్‌గా రావాలి...
MSK Prasad Backs KS Bharat To Play As An Opener For India In Tests ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టుకు టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రా యువ ఆటగాడు శ్రీకర్ భరత్ టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంస్కే ప్రసాద్.. భరత్‌ను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్లో భారత జట్టుకు ఓపెనర్‌గా రాణించే సత్తా భరత్‌కు ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. దేశీవాళీ క్రికెట్లో ఓపెనర్‌గా ఆంధ్రా తరుపున భరత్ అద్బుతంగా రాణించాడని అతడు తెలిపాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో భరత్ 123 మ్యాచ్‌లు ఆడితే అందులో 77 ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేశాడు. అంతేకాకుండా ఓపెనర్‌గా భరత్ ట్రిపుల్ సెంచరీ కూడా సాధించాడు. “అతనికి ఓపెనింగ్ కొత్త విషయం కాదు. నిజానికి అతను ఒక స్పెషలిస్ట్ ఓపెనర్. ఓపెనర్‌గా ఆంధ్రా తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అతను ఓపెనర్‌గా మూడు సెంచరీలు కూడా చేశాడు. ఒక అవకాశం ఇస్తే, అతడు భారత్‌కు ఓపెనింగ్ చేసే సత్తా ఉంది" అని ఎంస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. కాన్పూర్ వేదికగా జరిగిన మెదటి టెస్ట్‌లో సాహాకు ప్రత్యామ్నాయంగా(సబ్‌స్ట్యూట్)గా వచ్చిన భరత్ రెండు అద్బుతమైన క్యాచ్‌లతో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్ట్‌లో శ్రీకర్ భరత్‌కు టీమిండియా క్యాప్ ఇవ్వవచ్చు అని అతడు తెలిపాడు. ఒకవేళ మయాంక్ అగర్వాల్ స్ధానంలో విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తే.. భరత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వచ్చు అని అతడు అభిప్రాయ పడ్డాడు. ఒకవేళ భరత్‌కు అవకాశం వస్తే తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటాడని ఎంస్కే ప్రసాద్ జోస్యం చెప్పాడు. చదవండి: Ind Vs SA 2021- Virat Kohli: వారం రోజుల్లో తేలనున్న కోహ్లి భవితవ్యం.. కొనసాగిస్తారా? లేదంటే! -
న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో మెరిసిన శ్రీకర్ భరత్.. విశాఖలో సంబరాలు
విశాఖ స్పోర్ట్స్ : విశాఖ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో రోజు టెస్ట్ మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కింది. వాస్తవానికి తొలిరోజే ఆడాల్సిఉండగా సీనియర్ వికెట్‌కీపర్ వృదిమాన్ సాహా తుది 11 మంది ఆటగాళ్లలో స్థానం సాధించడంతో శ్రీకర్ భరత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే అనుహ్యంగా రెండోరోజు ఆటలో వృద్దిమాన్ మెడ కండరం పట్టేయడంతో అతని స్థానంలో మూడో రోజు ఆటకు శ్రీకర్ భరత్ బరిలో దిగాడు. ఆకట్టుకున్న శ్రీకర్ భరత్ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 67వ ఓవర్లో అశ్విన్ వేసిన తొలిబంతిని ఓపెనర్ యంగ్ ఆడగా... ఔట్‌సైడ్ ఎడ్జ్‌గా వచ్చిన బంతిని భరత్ లోలెవల్‌లో ఒడిసి పట్టుకున్నాడు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో భారత్ రివ్యూకు వెళ్లింది. యంగ్‌ను ఔట్‌గా ప్రకటించడంతో భరత్‌కు కాట్బిహైండ్గా తొలి వికెట్ దొరికింది. 89వ ఓవర్లో అక్షర్ వేసిన బంతిని ఇన్సైడ్ ఎడ్జ్‌గా టేలర్ ఇచ్చినా... భరత్ మిస్ అయ్యాడు. తిరిగి 94.3 ఓవర్లో అక్షర్ బంతినే టేలర్ ముందుకువచ్చి డిఫెండ్ చేసుకోబోయి వికెట్ల వెనుక కాట్ బిహైండ్‌గా భరత్‌కు దొరికిపోయాడు. ఓపెనర్ లాథమ్ వికెట్ల వెనుక దొరికిపోయి భరత్‌కు తొలి స్టంపౌట్ ఆటగాడయ్యాడు. దీంతో ప్రత్యమ్నాయంగా బరిలోకి వచ్చిన విశాఖ కుర్రాడు శ్రీకర్ భరత్ సత్తాచాటాడు. గతంలోనే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు స్టాండ్‌బైగా ఎంపికైన భరత్ ఆడే అవకాశాన్ని అందుకోలేకపోయినా నిరుత్సాహపడకుండా ఈసారి నేరుగా జాతీయ తుది జట్టులో ఆడేందుకే అవకాశాన్ని సుగమం చేసుకున్నాడు. శనివారం భారత్ తరఫున శ్రీకర్ భరత్ చేసిన మూడు డిస్మిసల్స్ అధికారిక టెస్ట్ లెక్కల్లోకి చేరకున్నా ప్రత్యమ్నాయ ఆటగాడిగా చక్కటి గుర్తింపు పొందాడు. ఇలా అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని భరత్ అందిపుచ్చుకోవడంతో విశాఖ క్రీడాభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చాలా థ్రిల్లింగ్‌గా వుంది... జాతీయ జట్టుకు టెస్ట్ మ్యాచ్‌లో ఆడటమనేది కల. ఆ కల ఈరోజు నెరవేరింది. మూడోరోజు ఆట ఆరంభం నుంచే వికెట్ల వెనుక నిలబడటం...తొలి క్యాచ్‌ను, తొలి స్టంపౌట్ చేయడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. టీ20 సిరీస్ ప్రారంభం నుంచే జట్టుతో ఉన్నాను. – శ్రీకర్ భరత్, వికెట్ కీపర్,బ్యాటర్ చదవండి: KS Bharat: ఒక్క వికెట్ పడగొట్టు అక్షర్.. అశూ.. నువ్వు బాగా బౌలింగ్ చేస్తున్నావు! -
ఒక్క వికెట్ పడగొట్టు అక్షర్.. అశూ.. నువ్వు బాగా బౌలింగ్ చేస్తున్నావు!
KS Bharat makes a cheeky remark to Axar Patel during Kanpur Test: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ అద్బుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మూడో రోజు ఆటను న్యూజిలాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. అయితే ఆశ్విన్ బౌలింగ్‌లో విల్ యంగ్‌ను అద్బుతమైన క్యాచ్‌తో భరత్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. అంతేకాకుండా భరత్.. టామ్ లాథమ్‌ను స్టంప్ ఔట్ చేయగా, రాస్ టేలర్ క్యాచ్ కూడా అందుకున్నాడు. కాగా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతున్న న్యూజిలాండ్‌ను టామ్ బ్లండెల్, కైల్ జామీసన్ అదుకోనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్టంప్స్ వెనుక నుంచి భరత్.. బౌలింగ్ చేస్తున్న అక్షర్ పటేల్‌ను ఉత్సాహపరుస్తూ హిందీలో సరదాగా కామెంట్ చేశాడు. 'ఏక్ గిర్నే సే లైన్ లాగేగీ పీచే'( ఒకే ఒక వికెట్ తీయు అక్షర్, తరువాత లైన్ కడతారు) అంటూ ఉత్సాహపరిచాడు. ఆ తరువాత కొద్ది సేపటికే.. అక్షర్ బౌలింగ్‌లో బ్లండెల్ క్లీన్ బౌల్డయ్యాడు. అంతేకాకుండా ఆశ్విన్ బౌలింగ్‌లో కూడా నల్ల పోద్రియే( నువ్వు మంచిగా బౌలింగ్ చేస్తున్నావు) అంటూ భరత్ తమిళంలో వాఖ్యలు చేశాడు. మెడ నొప్పితో మూడో రోజు ఆటకు దూరమైన వృద్దిమాన్ సహా స్ధానంలో శ్రీకర్ భరత్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చాడు. చదవండి: Ind Vs Nz 1st Test Day 4: సౌథీ దెబ్బ.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్ -
Ind Vs Nz:ఆ క్యాచ్ నిజంగా సూపర్.. ఒకవేళ భరత్ పట్టుబట్టకపోయి ఉంటేనా!
Ind Vs Nz 1st Test: Srikar Bharat Utilizes Most Of His Surprise Opportunity: 78 మ్యాచ్‌లు... 9 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు సహా 4,283 పరుగులు... అందులో ఒక ట్రిపుల్ సెంచరీ కూడా... కీపర్‌గా 270 క్యాచ్‌లు... 28 ఏళ్ల కోన శ్రీకర్ భరత్ ఫస్ట్ క్లాస్ కెరీర్ ఇది... టెస్టుల్లో అవకాశం అందుకునేందుకు ఈ ప్రదర్శన చాలు. చాలా రోజులుగా సీనియర్ టీమ్ తరఫున ఆడేందుకు ఎదురు చూస్తున్న భరత్ సమయం ఇప్పుడు వచ్చిందా! అత్యుత్తమ వికెట్ కీపింగ్ ప్రతిభతో పాటు బ్యాటింగ్‌లో కూడా పదును ఉన్న భరత్ భారత్ ‘ఎ’ జట్టులో రెగ్యులర్ ఆటగాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లకు చెందిన ‘ఎ’ జట్లపై అతను సత్తా చాటుతూ వచ్చాడు. గత కొన్ని సిరీస్‌లలో అదనపు ఆటగాడిగా భారత సీనియర్ టీమ్‌తో ఉంటూ వచ్చిన భరత్ తొలిసారి టెస్టు టీమ్‌లోకి ఎంపికయ్యాడు. కాన్పూర్ మ్యాచ్‌లో తుది జట్టులోకి ఎంపిక కాకపోయినా, అనూహ్యంగా వచ్చిన అవకాశంతో ఇప్పుడు ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. కొద్ది రోజుల క్రితం ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీపై చివరి బంతికి సిక్సర్ కొట్టి ఎవరీ భరత్... అనిపించుకున్న ఈ ఆంధ్ర ఆటగాడు తాను టెస్టుల కు ఎలా సరిపోతానో శనివారం చూపించాడు. మెడ పట్టేయడంతో వృద్ధిమాన్ సాహా మూడో రోజు ఆటకు దూరం కాగా, భరత్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అనూహ్య బౌన్స్ ఉన్న ఈ పిచ్‌పై అశ్విన్ బంతులు అర్థం చేసుకోవడమే కష్టం. అలాంటిది యంగ్ క్యాచ్‌ను అతను అందుకున్న తీరు నిజంగా సూపర్. బ్యాట్‌కు తగిలి బాగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని మోకాలిపై కూర్చొని భరత్ పట్టేశాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా, తన క్యాచ్‌పై గట్టి నమ్మకంతో రహానేను రివ్యూకు ఒప్పించి అతను ఫలితం సాధించగలిగాడు. ఆ తర్వాత టేలర్ క్యాచ్, లాథమ్‌ను స్టంపౌంట్ చేసిన తీరు ప్రశంసార్హం. 37 ఏళ్ల వయసులో తరచూ గాయాలపాలవుతున్న సాహా 2017లో సాధించిన అర్ధ సెంచరీ తర్వాత 14 ఇన్నింగ్స్‌లలో 29 అత్యధిక స్కోరుతో 156 పరుగులే చేయగలిగాడు. బెస్ట్ కీపర్ అయినా అతని పేలవ బ్యాటింగ్ జట్టును ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి స్థితిలో సెలక్టర్లు మార్పు కోరుకుంటే భరత్‌కు అవకాశం దక్కుతుంది. ముంబైలో జరిగే రెండో టెస్టులోగా సాహా కోలుకోకపోతే భరత్ టెస్టు కెరీర్ శ్రీకారం చుట్టడం ఖాయం! చదవండి: Axar Patel: వారెవ్వా అక్షర్ పటేల్.. టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో బౌలర్‌గా WHAT. A. CATCH! 🙌 Let's relive this brilliant glovework & DRS call from @KonaBharat 🎥 https://t.co/MkkXnnuc6M #TeamIndia #INDvNZ @Paytm — BCCI (@BCCI) November 27, 2021 -
Ind Vs Nz 2021 1st Test: విలియమ్సన్ విఫలం.. ఆట మార్చిన అక్షర్ ‘ఐదు’
Ind Vs Nz 2021 1st Test: India Dominated End Day 3 Axar 5 Wicket Haul: తొలి టెస్టులో రెండో రోజు చేజారిన పట్టును మూడో రోజుకు వచ్చేసరికి భారత్ చేజిక్కించుకుంది. శుక్రవారం ఒక్క న్యూజిలాండ్ వికెట్ కూడా తీయలేకపోయిన భారత బౌలర్లు శనివారం ఒకే రోజు పది వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం తర్వాత గిల్ వికెట్ చేజార్చుకున్నా... నాలుగో రోజు మంచి స్కోరు సాధించి కివీస్‌కు సవాల్ విసిరే అవకాశం టీమిండియా ముందుంది. కెరీర్ నాలుగో టెస్టులోనే ఐదు వికెట్ల ఘనతను ఐదో సారి నమోదు చేసిన అక్షర్ పటేల్ బౌలింగే మూడో రోజు ఆటలో హైలైట్. కాన్పూర్: భారీ స్కోరు దిశగా సాగిపోతున్న న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో రహానే బృందం కట్టడి చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 129/0తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ 296 పరుగులకే ఆలౌటైంది. లాథమ్ (95; 10 ఫోర్లు), విల్ యంగ్ (89; 15 ఫోర్లు) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ (5/62)తోపాటు అశ్విన్ (3/82) ప్రత్యర్థిని పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో ఓవర్ తొలి బంతికే గిల్ (1) వికెట్ కోల్పోయింది. మయాంక్ (4 బ్యా టింగ్), పుజారా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. విలియమ్సన్ విఫలం... కివీస్ ఓపెనర్లు లాథమ్, యంగ్ రెండో రోజు కూడా తడబాటు లేకుండా ఆడారు. అయితే తొలి వికెట్ తీసేందుకు భారత్ చేస్తూ వచ్చిన ప్రయత్నం ఎట్టకేలకు శనివారం వేసిన పదో ఓవర్లో ఫలించింది. అశ్విన్ బంతిని ఆడబోయిన యంగ్... సబ్‌స్టిట్యూట్ కీపర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కివీస్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది. లంచ్‌కు ముందు చివరి ఓవర్లో కెప్టెన్ విలియమ్సన్ (18)ను ఉమేశ్ అవుట్ చేశాడు. విరామం తర్వాత భారత్ మరింత పట్టు బిగించింది. ఈ సెషన్లో అక్షర్ చెలరేగిపోయాడు. తన 11 ఓవర్ల స్పెల్‌లో అతను 14 పరుగులు మాత్రమే ఇచ్చి టేలర్, నికోల్స్, లాథమ్ వికెట్లు పడగొట్టాడు. అనంతరం రచన్(13)ను జడేజా బౌల్డ్ చేయడంతో టీ సమయానికి కివీస్ స్కోరు 249/6కు చేరింది. చివరి సెషన్లో జేమీసన్ (23) ప్రతిఘటించడంతో కివీస్ స్కోరులో మరికొన్ని పరుగులు చేరాయి. సౌతీ (5)ని బౌల్డ్ చేసిన అక్షర్ ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకోగా ... చివరి రెండు వికెట్లు అశ్విన్ ఖాతాలో చేరాయి. ఒక దశలో 197/1తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్ 99 పరుగులకే మిగిలిన 9 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 345; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (స్టంప్డ్) (సబ్) భరత్ (బి) అక్షర్ 95; యంగ్ (సి) (సబ్) భరత్ (బి) అశ్విన్ 89; విలియమ్సన్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 18; రాస్ టేలర్ (సి) (సబ్) భరత్ (బి) అక్షర్ 11; నికోల్స్ (ఎల్బీ) (బి) అక్షర్ 2; బ్లన్‌డెల్ (బి) అక్షర్ 13; రచిన్ రవీంద్ర (బి) జడేజా 13; జేమీసన్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 23; సౌతీ (బి) అక్షర్ 5; సోమర్‌విలే (బి) అశ్విన్ 6; ఎజాజ్ పటేల్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (142.3 ఓవర్లలో ఆలౌట్) 296. వికెట్ల పతనం: 1–151, 2–197, 3–214, 4–218, 5–227, 6–241, 7–258, 8–270, 9–284, 10–296. బౌలింగ్: ఇషాంత్ 15–5–35–0, ఉమేశ్ 18–3–50–1, అశ్విన్ 42.3–10–82–3, జడేజా 33–10–57–1, అక్షర్ 34–6–62–5. భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (బ్యాటింగ్) 4; గిల్ (బి) జేమీసన్ 1; పుజారా (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 14. వికెట్ల పతనం: 1–2. బౌలింగ్: సౌతీ 2–1–2–0, జేమీసన్ 2–0–8–1, ఎజాజ్ పటేల్ 1–0–4–0. చదవండి: Krunal Pandya: కృనాల్ పాండ్యా కీలక నిర్ణయం... తప్పుకొంటున్నా.. అయితే.. Special: @ashwinravi99 takes centre stage to interview Mr. Fifer @akshar2026 & Super sub @KonaBharat. 👏 You don't want to miss this rendezvous with the #TeamIndia trio after Day 3 of the Kanpur Test. 👌- By @28anand Full interview 🎥 ⬇️ #INDvNZ @Paytm https://t.co/KAycXfmiJG pic.twitter.com/jZcAmU41Nf — BCCI (@BCCI) November 27, 2021 -
సూపర్ భరత్... సాహా స్థానంలో వచ్చీరాగానే..
IND Vs NZ Highlights Superb low catch by KS Bharat: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఎట్టకేలకు విల్ యంగ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్ట్యూట్గా వచ్చిన వికెట్ కీపర్ కేఎస్ భరత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 66 ఓవర్ వేసిన ఆశ్విన్ బౌలింగ్‌లో.. విల్ యంగ్ బ్యాట్‌ను తాకి బంతి వికెట్ కీపర్ కేఎస్ భరత్ చేతికి వెళ్లింది. అయితే ఆప్పీల్ చేయగా అంపైర్ దాన్ని తిరస్కరించాడు. వెంటనే భరత్ పట్టు పట్టిమరీ కెప్టెన్ రహానే సహాయంతో రివ్యూకు వెళ్లాడు. ఈ క్రమంలో రీ ప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు సృష్టంగా కన్పించింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కు తీసుకుని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఎట్టకేలకు ఒక్క వికెట్ దక్కడంతో భారత శిబిరంలో ఆనందం నెలకొంది. కాగా వృద్ధిమాన్ సాహా మెడ నొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. మెడికల్ టీం అతడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో సాహా స్థానంలో తెలుగు క్రికెటర్ భరత్‌ను మైదానంలోకి పంపినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి సాహా తీవ్రంగా నిరాశపరచడంతో భరత్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదృచ్చికంగా మూడో రోజు ఆటలో భాగంగా భరత్ కీపింగ్ చేయడం గమనార్హం. చదవండి: India Vs Nz 1st Test: వారెవ్వా భరత్... విల్ యంగ్ అవుట్ KS Bharat takes a good low catch to dismiss Will Young 👏🔥 Ravi Ashwin the wicket taker ❤️#INDvNZ #INDvsNZ#NZvIND #NZvsINDpic.twitter.com/Fo4JOdtn7T — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) November 27, 2021 WHAT. A. CATCH! 🙌 Let's relive this brilliant glovework & DRS call from @KonaBharat 🎥 https://t.co/MkkXnnuc6M #TeamIndia #INDvNZ @Paytm — BCCI (@BCCI) November 27, 2021 UPDATE - Wriddhiman Saha has stiffness in his neck. The BCCI medical team is treating him and monitoring his progress. KS Bharat will be keeping wickets in his absence.#INDvNZ @Paytm — BCCI (@BCCI) November 27, 2021 -
Srikar Bharat: శ్రీకర్ భరత్ గురించి ఈ విషయాలు తెలుసా?
Ind Vs Nz Test Series- Who Is Srikar Bharat Interesting Facts: న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టులో ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్‌కు చోటుదక్కింది. కొంతకాలంగా భారత్ ‘ఎ’ జట్లకు ఆడుతున్న ఈ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. టీమిండియా సంచలనం, టెస్టుల్లో పరిస్థితులకు తగ్గట్టు హిట్టింగ్ చేసే రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో రెండో కీపర్‌గానే భరత్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. శ్రీకర్ భరత్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు ►ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన శ్రీకర్ భరత్ 1993, అక్టోబరు 3న జన్మించాడు. ►2012లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో శ్రీకర్ భరత్ అరంగేట్రం చేశాడు. ►28 ఏళ్ల శ్రీకర్ భరత్ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటున్నాడు. ►78 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన భరత్ 9 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో 4,283 పరుగులు సాధించాడు. ►2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో భరత్ 308 పరుగులు చేసి రంజీల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ►రంజీల్లో ఈ ఘనత సాధించిన తొలి కీపర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ►దూకుడైన బ్యాటర్‌గా పేరొందిన శ్రీకర్ భరత్‌ను ఐపీఎల్ మినీ వేలం-2021లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. 20 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. అంతకుముందు అతడు ఢిల్లీ డేర్‌డెవిల్స్(ఢిల్లీ క్యాపిటల్స్)కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ►ఐపీఎల్-2021 సీజన్లో కోహ్లి కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భరత్ 191 పరుగులు సాధించాడు. ►ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి బెంగళూరు జట్టును గెలిపించాడు. ►ఇక న్యూజిలాండ్‌తో భారత్ తొలి టెస్టు ఈ నెల 25 నుంచి 29 వరకు కాన్పూర్‌లో... రెండో టెస్టు డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబైలో జరుగుతుంది. భారత టెస్టు జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శ్రీకర్ భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ. చదవండి: Ind Vs Nz Test Series: విహారిపై ఎందుకింత వివక్ష.. దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. ట్వీట్‌తో.. కానీ.. -
Ind Vs Nz Test Series: విహారిపై ఎందుకింత వివక్ష.. దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ!
Ind Vs Nz Test Series- Why Hanuma Vihari Not Selected: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ చిత్రంగా సంప్రదాయ ఫార్మాట్లో ఇంటాబయటా రాణిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారిపై వేటు వేసింది. మొత్తం టెస్టు సిరీస్ నుంచే అతన్ని తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే మరో తెలుగు ప్లేయర్, కొంతకాలంగా భారత్ ‘ఎ’ జట్లకు ఆడుతున్న ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు కట్టబెట్టారు. ఇతనితో పాటు బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్, బౌలర్ ప్రసిధ్ కృష్ణలకూ తొలి సారి టెస్టు జట్టులో స్థానం లభించింది. అయితే వీరిద్దరు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇది వరకే టీమిండియా జెర్సీ వేసుకున్నారు. దీంతో పూర్తిగా కొత్త ముఖమైతే శ్రీకర్ భరత్‌దే! నాలుగేళ్ల తర్వాత ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి గైర్హాజరు కానున్న మొదటి మ్యాచ్‌కు రహానే సారథ్యం వహించనున్నాడు. తిరిగి రెండో టెస్టుకు కోహ్లినే పగ్గాలు చేపడతాడు. రోహిత్, పంత్, బుమ్రా, షమీలకు విశ్రాంతి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్టార్ ఆటగాళ్లపై క్రికెట్ భారం తగ్గించే పనిలో పడింది. ఇందులో భాగంగానే టి20 కొత్త సారథి రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్, పేసర్లు బుమ్రా, షమీలకు ఐదు రోజుల ఫార్మాట్లో సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ నెల 17 నుంచి జరిగే మూడు టి20ల సిరీస్ నుంచి కోహ్లికి కూడా ఇది వరకే రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంటే భారత్‌లో పర్యటించే న్యూజిలాండ్‌తో కోహ్లి కేవలం రెండో టెస్టు మాత్రమే ఆడతాడు. టెస్టుల్లో పరిస్థితులకు తగ్గట్టు హిట్టింగ్ చేసే రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో రెండో కీపర్‌గానే భరత్‌ను తీసుకున్నట్లు తెలిసింది. భారత టెస్టు జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సాహా (వికెట్ కీపర్), శ్రీకర్ భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ. దెబ్బకు దిగొచ్చారు.. ట్వీట్‌తో సరిపెట్టారు... టెస్టుల్లో అది కూడా ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ వికెట్లపై రాణించిన ఘనత మన విహారిది. తొడ కండరాల గాయం బాధిస్తున్నా... జట్టు అవసరాల కోసం గాయాన్ని పంటిబిగువన భరించి మరీ ఓ టెయిలెండర్ (అశ్విన్)తో కలిసి ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో భారత్‌ను ‘డ్రా’తో గట్టెక్కించాడు. అందరి నుంచీ ప్రశంసలందుకున్నాడు. తర్వాత ఇంగ్లండ్ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపిక చేసినా తుది జట్టులో ఆడించలేదు. ఫైనల్లో భారత ఓటమికి విహారిలాంటి నిలబడే బ్యాట్స్‌మన్ లేకపోవడం కూడా ఒక కారణం. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ విహారిని పక్కన బెట్టారు. ఈసారి సెలెక్షన్ కమిటీ ఏకంగా జట్టు నుంచే తప్పించింది. దీనికి సరైన కారణం కూడా సెలక్షన్ కమిటీ, బోర్డు దగ్గర లేదు. దీనిపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విమర్శల నుంచి తప్పించుకునేందుకు విహారిని భారత్ ‘ఎ’ తరఫున దక్షిణాఫ్రికా పర్యటనకు పంపిస్తున్నామని శుక్రవారం సాయంత్రం బీసీసీఐ ఒక ట్వీట్ చేసింది. వాస్తవానికి ఈనెల 9న భారత ‘ఎ’ జట్టును ప్రకటించినపుడు అందులో విహారి పేరు లేకపోవడం గమనార్హం. విహారి తన కెరీర్లో 12 టెస్టులు ఆడి 32.84 సగటుతో 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Virat Kohli: మిగిలిన ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్‌గా గుడ్‌బై చెప్పే అవకాశం! 🚨 UPDATE: @Hanumavihari has been added to the India 'A' squad for the South Africa tour. https://t.co/ISYgtlw1S1 pic.twitter.com/uy3UD1pCN5 — BCCI (@BCCI) November 12, 2021 -
సిక్స్‌తో గెలిపించిన శ్రీకర్ భరత్.. కోహ్లి రచ్చ రచ్చ
Kohli Celebrations After Srikar Bharath Six Last ball.. ఐపీఎల్ 2021లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన శ్రీకర్ భరత్ మ్యాచ్ హీరోగా మారిపోయాడు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 6 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన ఆర్సీబీని శ్రీకర్ భరత్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. డివిలియర్స్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన భరత్.. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఓవరాల్‌గా 52 బంతుల్లో 78 పరుగులు చేసిన భరత్‌కు ఐపీఎల్లో ఇదే మొయిడెన్ ఫిఫ్టీ కావడం విశేషం. భరత్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో భరత్ లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టడంతో ఆర్సీబీ సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా కోహ్లి విజయద్వానాలు చేస్తూ మైదానంలోకి పరిగెత్తి మిగిలిన ఆటగాళ్లతో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. pic.twitter.com/wAdG4KlKo2 — Sardar Khan (@SardarK07004661) October 8, 2021 Finishes it offf with a SIXxxxx ! Ks bharat 👏#RCBvDC pic.twitter.com/ivaBCGEH3c — 🤙 (@imAkhi18_) October 8, 2021 -
సౌరాష్ట్రతో ఆంధ్ర సై!
సాక్షి, ఒంగోలు: రంజీ ట్రోఫీలో ఐదేళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్ చేరిన ఆంధ్ర ఇప్పుడు సెమీస్ బెర్తుపై కన్నేసింది. నేటి నుంచి స్థానిక సీఎస్ఆర్ శర్మ కాలేజీ మైదానంలో జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకర్ భరత్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు గత రన్నరప్ సౌరాష్ట్రతో తలపడుతుంది. సెమీస్ బెర్త్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆంధ్రకు సౌరాష్ట్రను ఎదుర్కోవడం అంత సులభం కాదు కానీ... సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లో స్థానిక అనుకూలతలతో పైచేయి సాధించాలని ఆంధ్ర భావిస్తోంది. నిజానికి ఈ సీజన్ ఆరంభంలో ఆంధ్ర నిలకడగా రాణించింది. దీంతో ఎలైట్ ‘ఎ అండ్ బి’ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. అయితే లీగ్ దశ సాగేకొద్దీ ప్రతికూల ఫలితాలతో వెనుకబడింది. ఇక ముగింపుకొచ్చేసరికి వరుసగా రెండు పరాజయాలతో ఐదో స్థానానికి పడిపోయింది. టాపార్డర్‌లో జ్ఞానేశ్వర్, ప్రశాంత్‌లతోపాటు రికీ భుయ్, శ్రీకర్ భరత్‌లు రాణిస్తే ఆంధ్ర భారీస్కోరు సాధించే అవకాశముంటుంది. బౌలింగ్‌లో శశికాంత్, స్టీఫెన్, రఫీ మళ్లీ మెరిపించాలి. గత రన్నరప్ సౌరాష్ట్ర మేటి ఆల్‌రౌండ్ జట్టు. ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ చేతిలో ఓడింది. మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందిన సౌరాష్ట్ర నాలుగు మ్యాచ్‌ల్ని ‘డ్రా’ చేసుకుంది. -
కోహ్లి అలా చేసేసరికి కంగారు పడ్డా: శ్రీకర్ భరత్
‘తపన.. పట్టుదల.. క్రమశిక్షణ.. శ్రమ.. అన్నింటినీ మించి ఇష్టమైన రంగంపై ఎనలేని మక్కువ.. ఇవే దేశం తరఫున క్రికెట్ ఆడేందుకు అవకాశం కల్పించాయి. ఈ ప్రయాణంలో కుటుంబం వెన్నుదన్నుగా నిలిచింది. గురువులు సరైన దిశా నిర్దేశం చేశారు. నా ఆట మీద పూర్తి విశ్వాసంతో ఉన్నా.. బాగా రాణించి భారత జట్టులో నా స్థానాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా కష్టపడతాను’ అని అన్నారు క్రికెట్ యువ కెరటం, విశాఖ ఆణిముత్యం కోన శ్రీకర్ భరత్. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పాల్గొని.. నగరానికి తొలిసారిగా విచ్చేసిన ఆయనకు విశాఖ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. నగరంలో మధురవాడ బక్కన్నపాలెం సమీపంలో తన నివాసానికి వచ్చిన ఆయన తన అంతరంగాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి: భారత జట్టులో స్థానం లభించడంపై ఎలా ఫీల్ అవుతున్నారు? భరత్: లక్ష్యం నెరవేరిన తర్వాత ఆ ఆనందమే వేరు. ఇప్పటితో అయిపోలేదు. ఇది నాకు ప్రారంభం మాత్రమే.. సాధించాల్సింది చాలా ఉంది. సాక్షి: ఈ రంగంలోకి ఎలా వచ్చారు? భరత్: నేను చిన్నతనంలో చాలా చలాకీగా ఉండేవాడినట. చుట్టు పక్కల పిల్లలతో ఆడుతున్నప్పుడు నా ఆసక్తిని నాన్న గమనించారు. కోచ్ కష్ణారావు దగ్గర శిక్షణలో చేర్పించారు. రోజూ శిక్షణకు తీసుకెళ్లేవారు. అలా ఎనిమిదేళ్లలోనే నా క్రికెట్ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత వీడీసీఏ కోచ్‌లు బాగా తర్ఫీదు ఇచ్చి ప్రోత్సహించారు. సాక్షి: ఈ స్థాయికి ఎలా ఎదిగారు? భరత్: నా తల్లి దండ్రులు, అక్క. నేను ఈ స్థాయికి ప్రోత్సాహించిన అందరినీ నేను కుటుంబంగానే భావిస్తాను. మొదట నాకు శిక్షణ ఇచ్చిన కోచ్.. ఇప్పుడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చీఫ్ కోచ్ జయకష్ణారావు, భారత్–ఎ కోచ్ రాహుల్ ద్రావిడ్, భారత్ జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. ఇలా చాలా మంది నన్ను ప్రోత్సహించారు. నేను రంజీలో ఆడుతున్నప్పుడే భారత్ జట్టుకు కచ్చితంగా ఆడతావని.. బాగా సాధన చేయమని ద్రావిడ్ చేప్పేవారు. సాక్షి: కోచ్ మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దారు? భరత్: నేను మొదట బ్యాట్స్‌మన్ మాత్రమే. ఫీల్డింగ్‌లో చురుకుదనం, బంతిని ఒడిసి పట్టే విధానం, స్పందించే తీరు చూసిన కోచ్ నన్ను వికెట్ కీపర్‌గా మార్చారు. మొదట్లో కొన్ని ఓవర్లు కీపింగ్ చేసిన నేను.. తర్వాత పూర్తిస్థాయి కీపర్‌గా స్థిరపడ్డాను. ఆటలో క్రమశిక్షణ, ఒత్తిడిని తట్టుకోవడం, నైతిక విలువలు, జట్టు, ఆటగాళ్లతో ఎలా నడుచుకోవాలి.. అనే అంశాలపై కోచ్ పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాయిని శిల్పంలా తయారు చేసింది కోచ్ జయకష్ణారావు. సాక్షి: ఇతరుల ప్రోత్సాహం ఎలా ఉంది? భరత్: నాకు స్నేహితులు చాలా తక్కువ. ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా గడుపుతాను. నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించింది నా కుటుంబ సభ్యులే. నా కుటుంబమే నా బలం. ఏ విషయంలోనూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. కోచ్, కుటుంబ సభ్యులతో చెప్పుకోలేని విషయాలను నా బెస్ట్ ఫ్రెండ్ విమల్‌తో చెబుతాను. తను చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఎలాగైనా టీం ఇండియాలో ఆడాలని ప్రోత్సహించేవాడు. అపజయాలు ఎదురైనప్పుడు తోడుగా నిలిచేవాడు. మాకు రాని అవకాశం నీకు వచ్చిందంటూ నిత్యం ప్రేరణ కలిగించేవాడు. సాక్షి: మీ విజయ రహస్యం? భరత్: క్రికెట్లో విజయాలతో పాటు అపజయాలు ఉంటాయి. ఎప్పడూ ఒకేలా ఆడలేం. అలాంటప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్లడమే విజయ రహస్యం. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించేందుకు కషి చేస్తాను. కష్ట పడకుండా ఫలితం ఆశించకూడదు. ఒకవేళ అలాంటి ఫలితం వచ్చినా ఎక్కువ కాలం నిలవదు. నా ఆట మీద నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాను. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలి. ఇదే నా ముందున్న లక్ష్యం. సాక్షి: కోహ్లీ ట్రోఫీ అందివ్వగానే మీ ఫీలింగ్ ఏంటి? భరత్: బంగ్లాదేశ్‌తో సిరీస్ గెలిచిన తర్వాత ట్రోఫీని కోహ్లి నేరుగా నా చేతుల్లో పెట్టారు. అప్పుడు ఎలా స్పందించాలో తెలియక కంగారు పడ్డాను. అప్పుడు కోహ్లి ఈ జట్టులోకి నిన్ను సాదరంగా ఆహా్వనిస్తున్నామని, దానికిది చిన్న సంకేతం లాంటిదని చెప్పారు. ఈ క్షణాలను ఆస్వాదించాలన్నారు. రోహిత్ శర్మ కూడా నా భుజం తట్టి ప్రొత్సహించారు. ఇది నీ రోజు, ఫుల్లుగా ఎంజాయ్ చేయ్’ అని చెప్పారు. ఆ క్షణాలు నాలో చాలా ఆనందం కలిగించాయి. ఇదీ కుటుంబ నేపథ్యం 1993 మార్చి 10వ తేదీన జన్మించిన భరత్ పాఠశాల విద్యను సెయింట్ అల్యోసిస్, ఇంటర్ వికాస్ కళాశాల, బి.కాం. బుల్లయ్య కళాశాలలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన భరత్ తండ్రి శ్రీనివాసరావు విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో ఉద్యోగం, ఇతర కారణాల వలన విశాఖలో స్థిరపడ్డారు. తల్లి మంగదేవి గహిణి. ఆయన సోదరి మనోజ్ఞ. 2002లోనే భరత్ క్రికెట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2012లో ఆంధ్ర రంజీ జట్టు మ్యాచ్‌లు ఆడారు. 2014–15 సీజన్ రంజీ ట్రోఫీలో గోవాపై 308 పరుగులు చేసి.. ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా చరిత్ర సష్టించారు. మొదట్లో భరత్ బ్యాట్స్‌మన్ మాత్రమే. కోచ్ సూచనలతో వికెట్ కీపర్‌గా మారారు. -
ప్రియాంక్ 206...భరత్ 142
వాయనాడ్: ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ భారీస్కోరు చేసింది. ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (313 బంతుల్లో 206; 26 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, ఆంధ్ర రంజీ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ (139 బంతుల్లో 142; 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కారు. దీంతో భారత్ ‘ఎ’ 134.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 540 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 219/1తో ఆటకొనసాగించిన భారత్ ఆదిలోనే ఓపెనర్ లోకేశ్ రాహుల్ (89; 11 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. క్రితం రోజు స్కోరుకు కేవలం పరుగు మాత్రమే జతచేసిన రాహుల్ రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన వారిలో కెప్టెన్ అంకిత్ బావ్నే (0) డకౌట్ కాగా, ఆంధ్ర బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (16) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో 262 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ‘ఎ’ను పాంచల్, శ్రీకర్ భరత్ నిలబెట్టారు. ముందుగా కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చినా... తర్వాత భరత్ వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 196 పరుగులు జోడించారు. ద్విశతకం పూర్తయ్యాక జట్టు స్కోరు 458 పరుగుల వద్ద పాంచల్ నిష్క్రమించాడు. జలజ్ సక్సేనా (28)తో కలిసి జట్టు స్కోరును 500 పరుగులు దాటించాక శ్రీకర్ భరత్ ఔటయ్యాడు. కాసేపటికే కెప్టెన్ బావ్నే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. దీంతో భారత్ ‘ఎ’కు 200 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లండ్ లయన్స్ ఆట నిలిచే సమయానికి 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 20 పరుగులు చేసింది. ఓపెనర్లు హోల్డన్ (9 బ్యాటింగ్), డకెట్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.