PC: Disney+ Hotstar
IND Vs NZ Highlights Superb low catch by KS Bharat: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఎట్టకేలకు విల్ యంగ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్‌ట్యూట్‌గా వచ్చిన వికెట్ కీపర్ కేఎస్ భరత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 66 ఓవర్ వేసిన ఆశ్విన్ బౌలింగ్‌లో.. విల్ యంగ్ బ్యాట్‌ను తాకి బంతి వికెట్ కీపర్ కేఎస్ భరత్ చేతికి వెళ్లింది.
అయితే ఆప్పీల్ చేయగా అంపైర్ దాన్ని తిరస్కరించాడు. వెంటనే భరత్ పట్టు పట్టిమరీ కెప్టెన్ రహానే సహాయంతో రివ్యూకు వెళ్లాడు. ఈ క్రమంలో రీ ప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు సృష్టంగా కన్పించింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కు తీసుకుని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఎట్టకేలకు ఒక్క వికెట్ దక్కడంతో భారత శిబిరంలో ఆనందం నెలకొంది. కాగా వృద్ధిమాన్ సాహా మెడ నొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. మెడికల్ టీం అతడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
ఈ క్రమంలో సాహా స్థానంలో తెలుగు క్రికెటర్ భరత్‌ను మైదానంలోకి పంపినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి సాహా తీవ్రంగా నిరాశపరచడంతో భరత్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదృచ్చికంగా మూడో రోజు ఆటలో భాగంగా భరత్ కీపింగ్ చేయడం గమనార్హం.
చదవండి: India Vs Nz 1st Test: వారెవ్వా భరత్... విల్ యంగ్ అవుట్
KS Bharat takes a good low catch to dismiss Will Young 👏🔥 Ravi Ashwin the wicket taker ❤️#INDvNZ #INDvsNZ#NZvIND #NZvsINDpic.twitter.com/Fo4JOdtn7T
— CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) November 27, 2021
WHAT. A. CATCH! 🙌
— BCCI (@BCCI) November 27, 2021
Let's relive this brilliant glovework & DRS call from @KonaBharat
🎥 https://t.co/MkkXnnuc6M #TeamIndia #INDvNZ @Paytm
UPDATE - Wriddhiman Saha has stiffness in his neck. The BCCI medical team is treating him and monitoring his progress. KS Bharat will be keeping wickets in his absence.#INDvNZ @Paytm
— BCCI (@BCCI) November 27, 2021
Comments
Please login to add a commentAdd a comment