Ind Vs Nz: MSK Prasad Back KS Bharat To Play As An Opener For India In Tests - Sakshi
Sakshi News home page

IND VS NZ: అతడు టీమిండియా ఓపెనర్‌గా రావాలి...

Published Thu, Dec 2 2021 3:27 PM | Last Updated on Fri, Dec 3 2021 10:39 AM

MSK Prasad Backs KS Bharat To Play As An Opener For India In Tests - Sakshi

MSK Prasad Backs KS Bharat To Play As An Opener For India In Tests  ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టుకు టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్ సాహా  గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రా యువ ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంస్‌కే ప్రసాద్‌.. భరత్‌ను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు.

టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టుకు ఓపెనర్‌గా రాణించే సత్తా భరత్‌కు ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. దేశీవాళీ క్రికెట్‌లో ఓపెనర్‌గా ఆంధ్రా తరుపున భరత్‌ అద్బుతంగా రాణించాడని అతడు తెలిపాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో భరత్‌ 123 మ్యాచ్‌లు ఆడితే అందులో 77 ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్‌ చేశాడు. అంతేకాకుండా ఓపెనర్‌గా భరత్‌  ట్రిపుల్ సెంచరీ కూడా సాధించాడు.

“అతనికి ఓపెనింగ్ కొత్త విషయం కాదు. నిజానికి అతను ఒక స్పెషలిస్ట్ ఓపెనర్. ఓపెనర్‌గా ఆంధ్రా తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అతను ఓపెనర్‌గా మూడు సెంచరీలు కూడా చేశాడు. ఒక అవకాశం ఇస్తే, అతడు భారత్‌కు ఓపెనింగ్‌ చేసే సత్తా ఉంది" అని ఎంస్‌కే ప్రసాద్‌ పేర్కొన్నాడు. కాన్పూర్ వేదికగా జరిగిన మెదటి టెస్ట్‌లో సాహాకు ప్రత్యామ్నాయంగా(సబ్‌స్ట్యూట్‌)గా వచ్చిన భరత్ రెండు అద్బుతమైన క్యాచ్‌లతో ఆకట్టుకున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్ట్‌లో శ్రీకర్‌ భరత్‌కు టీమిండియా క్యాప్‌ ఇవ్వవచ్చు అని అతడు తెలిపాడు. ఒకవేళ మయాంక్‌ అగర్వాల్‌ స్ధానంలో విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తే.. భరత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వచ్చు అని అతడు అభిప్రాయ పడ్డాడు. ఒకవేళ భరత్‌కు అవకాశం వస్తే తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటాడని ఎంస్‌కే ప్రసాద్‌ జోస్యం చెప్పాడు.

చదవండి: Ind Vs SA 2021- Virat Kohli: వారం రోజుల్లో తేలనున్న కోహ్లి భవితవ్యం.. కొనసాగిస్తారా? లేదంటే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement