venkatesh prasad
-
రామ మందిర ప్రతిష్టాపనా ఆహ్వానం: మాజీ క్రికెటర్ భావోద్వేగం
"India's Greatest Moment...": టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టంలో తాను భాగం కాబోతున్నానంటూ హర్షం వ్యక్తం చేశాడు. జీవితకాలంలో తనకు దక్కిన గొప్ప అదృష్టం ఇదేనంటూ మురిసిపోతున్నాడు. ఇందుకు గల కారణం ఏమిటంటే.. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టానికి జనవరి 22న ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో గల ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో నిర్మించిన ఆలయంలో మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఆరోజే జరుగనుంది. మధ్యాహ్నం 12.20 నిమిషాలకు భవ్య రామ మందిరంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఇంటింటా రామజ్యోతి.. ఈ నేపథ్యంలో జనవరి 22న ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. అదే విధంగా.. ఆలయ ట్రస్టు అక్షతల పంపిణీకి ఏర్పాట్లు చేయడంతో పాటు.. ప్రతిష్టాపన కార్యక్రమ ఆహ్వానితులకు పిలుపులు అందజేస్తోంది. ఆహ్వానం అందింది ఆ ఆహ్వానితుల జాబితాలో వెంకటేశ్ ప్రసాద్ పేరు కూడా ఉంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు ఈ మాజీ ఫాస్ట్ బౌలర్. ‘‘రామ మందిర ప్రతిష్టాపన చూడాలనేది నా జీవితాశయం. ఆ అద్భుతమైన క్షణం రానే వచ్చింది. జనవరి 22న కేవలం ప్రతిష్టాపనను చూడటం మాత్రమే కాదు.. అక్కడికి వెళ్లి ఆ దేవుడి ఆశీసులు తీసుకునే గొప్ప అవకాశం దక్కింది. భారతదేశ చరిత్రలోని గొప్ప క్షణంలో భాగమయ్యే వరం. ఆహ్వానం అందించినందుకు ధన్యవాదాలు. జై శ్రీరాం’’ అని వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. అదే విధంగా.. రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన సందర్భంగా.. తాను ఆహ్వానం అందుకుంటున్న ఫొటోను ఇందుకు జతచేశాడు. కాగా టీమిండియా తరఫున 33 టెస్టులు, 161 వన్డేలు ఆడిన కర్ణాటక బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 96, 196 వికెట్లు పడగొట్టాడు. చదవండి: కెప్టెన్‌గా అజింక్య రహానే.. పృథ్వీ షాకు నో ఛాన్స్.. కారణమిదే It was a hope and a desire, that in my lifetime Ram Mandir consecration happens. And what a moment, not only is the consecration happening on 22nd January, but have the great fortune and blessings to be able to attend India’s greatest moment in my lifetime. Thank you for the… pic.twitter.com/Sq1bjEZUxE — Venkatesh Prasad (@venkateshprasad) January 2, 2024 -
Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!!
WC 2023- Virat Kohli 49th Century: తొమ్మిది వేర్వేరు దేశాలపై సెంచరీలు... శ్రీలంకపై అత్యధికంగా 10... వెస్టిండీస్‌పై 9, ఆస్ట్రేలియాపై 8, న్యూజిలాండ్‌పై 5, బంగ్లాదేశ్‌పై 5, దక్షిణాఫ్రికాపై 5, పాకిస్తాన్‌పై 3, ఇంగ్లండ్‌పై 3, జింబాబ్వేపై ఒకటి.. అంతర్జాతీయ వన్డేల్లో.. టీమిండియా ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లి శతకాల రికార్డు ఇది.. అద్భుతమైన తన ఆట తీరుతో.. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఒంటిచేత్తో గెలుపు తీరాలకు చేర్చడమెలాగో తనకు తెలుసు.. కీలక సమయంలో అనవసరపు షాట్లకు పోయి వికెట్ పారేసుకోవడం తనకు ఇష్టం ఉండదు.. సింగిల్స్ తీస్తూ అయినా సరే లక్ష్యానికి చేరుకోవడంపై మాత్రమే తన దృష్టి.. మిగతా బ్యాటర్లు విఫలమైన చోట తాను ఒక్కడైనా పట్టుదలగా నిలబడి టీమ్‌ను గెలిపించాలనే తపన తప్ప తనకు ఇంకేమీ పట్టదు.. ఈ క్రమంలోనే వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు, అరుదైన మైలురాళ్లను చేరుకున్న సందర్భాలు.. క్రికెట్ కింగ్‌కు ఎదురులేదు ఇలా ఇప్పటికే క్రికెట్ ‘కింగ్’ అన్న బిరుదును సార్థకం చేసుకున్న కోహ్లి.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పటిష్ట సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 49వ సెంచరీ సాధించి క్రికెట్ దేవుడు, టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. తన సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి శిఖరాగ్రాన నిలిచాడు. స్వార్థపరుడంటూ విమర్శలు దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటగా.. కొంతమంది విమర్శకులు మాత్రం కోహ్లిని స్వార్థపూరితమైన క్రికెటర్‌గా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వ్యక్తిగత మైలురాళ్ల కోసం కోహ్లి జట్టు ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నాడనేది వారి అభిప్రాయం. అయితే, కోహ్లి కెరీర్, అతడి ఆట తీరును సునిశితంగా గమనించిన వాళ్లకు ఇలాంటి మాటలు ఆగ్రహం తెప్పిస్తాయనడంలో సందేహం లేదు. టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. కోహ్లి స్వార్థపరుడన్న వాళ్లకు దిమ్మతిరిగేలా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘‘వ్యక్తిగత రికార్డుల కోసం కోహ్లి పరితపించిపోతున్నాడు. అతడొక స్వార్థపరుడు అంటూ కొంతమంది హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. అవును.. కోహ్లి స్వార్థపరుడే.. కోట్లాది మంది కలలను నిజం చేయడంలో అతడు పూర్తి స్థార్థంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించినా.. కొత్త కొత్త బెంచ్మార్కులు సెట్చేస్తూ ముందుకు సాగుతున్నందుకు అరుదైన ఘనతలెన్నో సాధించినా... జట్టును గెలిపించేందుకు ఇప్పటికీ శాయశక్తులా కృషి చేస్తున్నందుకు.. అవును.. నిజంగానే కోహ్లి స్వార్థపరుడు’’ అంటూ జట్టు గురించే ఎక్కువగా ఆలోచించే కోహ్లిని ఇలా అనడం సరికాదంటూ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్(ట్విటర్) వేదికగా ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారగా.. విరాట్ కోహ్లి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మాకు ఎటువంటి స్పెషల్ ప్లాన్స్ లేవు.. అతడొక ఛాంపియన్! జడ్డూ కూడా: రోహిత్ శర్మ మాకు ముందే తెలుసు.. వారిద్దరూ అద్బుతం! సెమీస్‌లో కూడా: దక్షిణాఫ్రికా కెప్టెన్ View this post on Instagram A post shared by ICC (@icc) Hearing funny arguments about Virat Kohli being Selfish and obsessed with personal milestone. Yes Kohli is selfish, selfish enough to follow the dream of a billion people, selfish enough to strive for excellence even after achieving so much, selfish enough to set new benchmarks,… pic.twitter.com/l5RZRf7dNx — Venkatesh Prasad (@venkateshprasad) November 6, 2023 -
అది నిజంగా సిగ్గుచేటు.. భారత్- పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డేపై టీమిండియా లెజెండ్ ఫైర్
ఆసియాకప్-2023లో మరోసారి దాయాదుల పోరు జరగనుంది. సూపర్-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ రిజర్వ్‌డే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా సూపర్-లో మిగితా మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్‌డేను ఏసీసీ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో కేవలం భారత్-పాక్ మ్యాచ్ మాత్రమే రిజర్వ్ డేను పెట్టడాన్ని భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తప్పుబట్టాడు. ఈ నిర్ణయం తీసుకున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్‌పై వెంకటేశ్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. "ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం నిజంగా సిగ్గు చేటు. నిర్వాహకులు ఈ టోర్నీని అపహస్యం చేశారు. ఇతర రెండు జట్లకు వేర్వేరు నిబంధనలతో టోర్నమెంట్ నిర్వహించడం అనైతికం. అన్ని జట్లకు ఒకే రూల్, ఒకే న్యాయం ఉండాలి. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరిగితే జరిగింది లేకపోతే ఆ రోజే రద్దు చేయాలి. అంతేగాని ఈ పనికిమాలిన నిర్ణయాలు ఎందుకు? రెండో రోజైన రిజర్వ్ డేలో కూడా వర్షం పడితే ఏం చేస్తారు? ఇటువంటి దురుద్దేశపూరితమైన ప్లాన్స్ విజయవంతం కావు" అని ట్విటర్(ఎక్స్)లో వెంకటేశ్ ప్రసాద్ రాసుకొచ్చాడు. కాగా అంతకుముందు బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ చండికా హతురుసింఘ ఏసీసీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు మాత్రం రిజర్వ్ డే ఉండటం సరైన నిర్ణయం కాదని హతురుసింఘ అన్నాడు. చదవండి: ODI World cup 2023: వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఊహించని షాక్! -
అసలు గెలవాలన్న కసి లేనేలేదు.. కెప్టెన్ వెర్రిమొహం వేస్తున్నాడు! ఇకనైనా..
West Indies vs India, 5th T20I: టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ హార్దిక్ సేనపై విమర్శలు సంధించాడు. వెస్టిండీస్‌తో ఐదో టీ20లో గెలవాలన్న కసి భారత జట్టులో ఏమాత్రం కనిపించలేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లలో ఏకాగ్రత లోపించిందని.. గుడ్డిగా ముందుకు వెళ్తే ఇలాంటి పరాభవాలే ఎదురవుతాయని అభిప్రాయపడ్డాడు. కాగా విండీస్ పర్యటనలో 1-0తో టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, టీ20 సిరీస్‌లో మాత్రం అనూహ్య రీతిలో ఘోర ఓటమిపాలైంది. 3-2తో ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకుంది. అమెరికాలో ఫ్లోరిడాలో ఐదో టీ20లో సమిష్టి వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకోంది. వాళ్లు మినహా.. మిగతా వాళ్లంతా భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(61) అర్ధ శతకంతో రాణించగా.. తిలక్ వర్మ 27 పరుగులు చేయగలిగాడు. మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు మార్కు అందుకోలేదు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. దంచికొట్టారు లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్(85- నాటౌట్), వన్‌డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్(47)కు తోడు షాయీ హోప్(22- నాటౌట్) దంచికొట్టారు. దీంతో 18 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేసిన వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొంది టీమిండియాపై చేయి సాధించింది. పాండ్యా పూర్తిగా విఫలం ఇక ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాట్, బంతితోనూ విఫలమయ్యాడు. 18 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. మూడు ఓవర్లలో ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు. అదే విధంగా కెప్టెన్‌గానూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. ఎనిమిది మందితో బౌలింగ్ బ్రాండన్- పూరన్ జోడీని విడగొట్టడానికి పదే పదే బౌలర్లను మార్చాడు. యువ బ్యాటర్లు తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్‌తో కలిపి మొత్తంగా ఎనిమిది మంది ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేశారు. అర్ష్‌దీప్‌తో పాటు తిలక్ ఒక వికెట్ తీయగలిగాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్ వేదికగా హార్దిక్ పాండ్యా, జట్టుపై విమర్శలు గుప్పించాడు. ‘‘టీమిండియా కచ్చితగా తన నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాలి. అసలు గెలవాలన్న తపన వారిలో కనబడలేదు. గుడ్డిగా వెళ్లొద్దు కెప్టెన్ అయితే ఎప్పుడూ వెర్రిమొహం వేస్తున్నాడు. నిజానికి బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు. బ్యాటర్లు బౌలింగ్ చేయలేరు కదా! కానీ.. మనకు ఓ ప్లేయర్ ఇష్టమైనంత మాత్రాన గుడ్డిగా వాళ్లతో ప్రయోగాలు చేస్తే ఎలా? జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ల సేవలను వినియోగించుకోవాలి’’ అంటూ తనదైన శైలిలో చురకలు అంటించాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా అత్యంత సాధారణ జట్టులా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. గత టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించని జట్టు చేతిలో కూడా ఓటమి పాలయ్యారని విమర్శించాడు. గతంలో బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోయారు కూడా! కాబట్టి.. సిల్లీ కామెంట్లు చేసే బదులు ఆటపై దృష్టిపెడితే బాగుంటుందని హార్దిక్ పాండ్యాకు చురకలు వేశాడు. ఇప్పటికైనా భ్రమల్లోంచి బయటకు రావాలని సెటైర్లు వేశాడు. చదవండి: IND VS WI 5th T20: విండీస్ గెలిచినా.. పూరన్‌కు కమిలిపోయింది..! India needs to improve their skillset. Their is a hunger & intensity deficiency & often the captain looked clueless. Bowler’s can’t bat, batsmen can’t bowl. It’s important to not look for yes men and be blinded because someone is your favourite player but look at the larger good — Venkatesh Prasad (@venkateshprasad) August 13, 2023 Catch the extended highlights from the 5th T20I T20I only on FanCode 👉 https://t.co/6EDO1Ijfiw . .#INDvWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/lHj2sAbLsn — FanCode (@FanCode) August 13, 2023 -
విండీస్ చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాను ఏకి పారేసిన భారత మాజీ
విండీస్‌తో రెండో వన్డేలో ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకున్న టీమిండియాపై ముప్పేట దాడి జరుగుతుంది. అభిమానులు, మాజీలు భారత ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. రోహిత్, కోహ్లిలను రెస్ట్ ఇచ్చి టీమిండియా మేనేజ్మెంట్ పెద్ద తప్పిదమే చేసిందని మండిపడుతున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ చెత్త వ్యూహాల వల్ల వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేని జట్టు చేతిలో టీమిండియా ఓటమిపాలైందని ధ్వజమెత్తుతున్నారు. డబ్బు, గర్వం వల్ల భారత క్రికెటర్లు ఆటపై దృష్టి పెట్టడం లేదని 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ విమర్శిస్తే.. తాజాగా మరో భారత మాజీ (వెంకటేశ్ ప్రసాద్) టీమిండియాను తూర్పారబెట్టాడు. రెండో వన్డేలో విండీస్ చేతిలో ఓడిన భారత జట్టుపై అతను విరుచుకుపడ్డాడు. టెస్ట్ క్రికెట్‌ను పక్కన పెడితే, గత కొంతకాలంగా టీమిండియా మిగతా రెండు ఫార్మాట్లలో అతి సాధారణమైన జట్టుగా తయారైందని.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, చివరకు బంగ్లాదేశ్ చేతిలో కూడా సిరీస్‌లు కోల్పోయిందని దుయ్యబట్టాడు. గత రెండు టీ20 వరల్డ్‌కప్‌లలో టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉందని, మనకంటే చిన్న జట్లు చాలా మెరుగైన ప్రదర్శనలు చేసాయని గుర్తు చేశాడు. టీమిండియా పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని.. డబ్బు, అధికారం ఉండటంతో భారత జట్టు సాధారణ విజయాలకే పొంగిపోతుందని, ఛాంపియన్ జట్టుకు కావాల్సిన లక్షణాలు టీమిండియాలో అస్సలు కనిపించడం లేదని విమర్శలు గుప్పించాడు. Despite the money and power, we have become used to celebrating mediocrity and are far from how champion sides are. Every team plays to win and so does India but their approach and attitude is also a factor for underperformance over a period of time. — Venkatesh Prasad (@venkateshprasad) July 30, 2023 టీమిండియాలో ప్రస్తుత ఇంగ్లండ్ జట్టులోని దూకుడు కానీ, 90ల్లో ఆస్ట్రేలియా జట్టులోని భీకరత్వం కానీ లేవని అన్డాను. గతకొంతకాలంగా భారత పరిమిత ఓవర్ల జట్టు అతి సాధారణ జట్టులా ఉంటుందని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ప్రతి జట్టు గెలవడానికే ఆడుతుందని, టీమిండియా కూడా అదే లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నప్పటికీ.. ఆట విషయంలో వారి వైఖరి గత కొంత కాలంగా ఏమీ బాగోలేదని, ఇదే భారత జట్టు పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణమని ట్వీట్లో జోడించాడు. ఇదిలా ఉంటే, విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను విండీస్ 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. విండీస్ బౌలర్ల ధాటికి 40.5 ఓర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (55), శుభ్‌మన్ గిల్(34) మాత్రమే రాణించారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్, గుడకేశ్ మోటీ తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్ (63 నాటౌట్), కార్టీ (48 నాటౌట్) రాణించారు. -
'భోజన ప్రియుడ్ని చూశాం.. వాహన ప్రియుడ్ని చూడడం ఇదే తొలిసారి'
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని మంచి వాహన ప్రియుడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంచీలోని తన సొంత ఇంట్లో ధోని కార్లు, బైక్‌ల కోసం ప్రత్యేక గ్యారేజీనే ఏర్పాటు చేసుకున్నాడు. మార్కెట్లో కొత్త బైక్ లేదా కార్ వచ్చిన అది ధోని గ్యారేజీలోకి రావాల్సిందే. ధోని తన గ్యారేజీని ఎప్పుడు చూపించడానికి ఇష్టపడలేదు. అయితే మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ చొరవతో ధోని గ్యారేజీని తొలిసారి చూసే అవకాశం మనకు దక్కింది. ధోని గ్యారేజీకి సంబంధించిన వీడియోనూ చూస్తే కళ్లు బెర్లు కమ్మడం ఖాయం. పలు రకాల మోడల్స్‌కు సంబంధించిన కార్లు, బైక్‌లు లెక్కలేనన్ని ఉన్నాయి. గ్యారేజీ మొత్తం బైకులు, కార్లతో నిండిపోయింది. అవసరం అనుకుంటే ధోని ఒక చిన్నపాటి షోరూం అయినా నడిపించొచ్చు. ఏది ప్రత్యేకంగా కనిపించినా.. అది ధోని గ్యారేజ్‌లోకి రావాల్సిందే. బైక్‌లు, కార్లు అంటే ధోనీకి అంత పిచ్చి అన్నమాట. పాత కార్ల నుంచి లేటెస్ట్ మోడల్స్ వరకు ధోని గ్యారేజ్‌లో చూడొచ్చు. విషయంలోకి వెళితే.. టీమిండియా మాజీలు వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషిలు రాంచీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ధోనీ ఫామ్‌హౌస్‌కి చేరుకున్నారు. అక్కడే ఉన్న ధోని తొలిసారి తన గ్యారేజీని వారికి చూపించాడు. గ్యారేజీలో ఒక్కో కారు, బైకు చూస్తుంటే మతి పోవాల్సిందే. ధోని దగ్గర దాదాపు అన్ని రకాల మోడల్స్ వింటేజ్ బైక్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇది చూసిన తర్వాత వెంకటేష్ ప్రసాద్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. బైక్‌ల విస్తృత సేకరణతో పాటు, ధోనీకి పాతకాలపు కార్ల జాబితా కూడా ఉంది. వీటిలో కొన్ని ధోని దిగుమతి చేసుకున్న కార్లు కాగా, మరికొన్ని భారత ఆర్మీ నుంచి కొనుగోలు చేసినవి. అతిపెద్ద విషయం ఏమిటంటే, ధోని తన గ్యారేజీలో ఉన్న అన్ని బైక్‌లను చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. వీటికి సర్వీసింగ్ కూడా స్వయంగా తానే చేసుకుంటాడు. ధోని గ్యారేజీ చూడాలనుకుంటే వెంటనే వీడియోపై ఒక లుక్కేయండి. అయితే వీడియో చూసిన అభిమానులు.. ''ఇంత పిచ్చి ఏంటి ధోని భయ్యా.. నీ దగ్గరున్న బైక్‌లు, కార్లతో షోరుంనే ఏర్పాటు చేయొచ్చు''.. ''మంచి భోజన ప్రియుడ్ని చూశాం.. నీలాంటి వాహన ప్రియుడ్ని మాత్రం ఎక్కడా చూడలేదు'' అంటూ కామెంట్స్ చేశారు. One of the craziest passion i have seen in a person. What a collection and what a man MSD is . A great achiever and a even more incredible person. This is a glimpse of his collection of bikes and cars in his Ranchi house. Just blown away by the man and his passion @msdhoni pic.twitter.com/avtYwVNNOz — Venkatesh Prasad (@venkateshprasad) July 17, 2023 చదవండి: BAN Vs AFG: పుండు మీద కారం చల్లినట్లు..హెడ్‌కోచ్, ఆటగాడిని శిక్షించిన ఐసీసీ #MLC2023: దంచికొట్టిన సీఎస్కే ఓపెనర్.. సూపర్‌కింగ్స్‌కు రెండో విజయం -
భారత క్రికెట్ పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది.. సిగ్గుతో తలదించుకోవాలి..!
టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ భారత దేశవాలీ సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గడిచిన రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన కేరళ ఆఫ్ స్పిన్నర్ జలజ్ సక్సేనాను సౌత్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై ధ్వజమెత్తాడు. మధ్యప్రదేశ్, భారత-ఏ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా జలజ్‌ను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లను నిలదీశాడు. జట్ల ఎంపికలో సెలెక్టర్లు అవళింభిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్లో హాస్యాస్పదమైన విషయాలు చాలా జరుగుతున్నాయని, జలజ్ ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే అని అన్నాడు. రంజీల్లో రాణించినా మిగతా దేశవాలీ టోర్నీలకు ఎంపిక చేయకపోతే రంజీ ట్రోఫీ ఆడటంలో అర్ధమే లేదని తెలిపాడు. భారత క్రికెట్లో ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని వాపోయాడు. There are many laughable things happening in Indian cricket. The highest wicket taker in Ranji Trophy not being picked even for the South Zone team is as baffling as it gets. Just renders the Ranji Trophy useless..what a shame https://t.co/pI57RbrI81 — Venkatesh Prasad (@venkateshprasad) June 18, 2023 ఈ విషయాలను ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ఫోరమ్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ అయిన వెంకటేశ్ ప్రసాద్ ఈ ఏడాది ఆరంభంలో టీమిండియాకు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినప్పుడు కూడా ఇలాగే సెలెక్టర్లను నిలదీశాడు. కేఎల్ రాహుల్ ఫామ్‌లో లేకపోయినా టీమిండియాకు ఎలా ఎంపిక చేస్తారని ప్రసాద్ నాడు సెలెక్టర్లను ప్రశ్నించాడు. కాగా, 36 ఏళ్ల జలజ్ సక్సేనా 2022-23 రంజీ సీజన్లో 7 మ్యాచ్‌ల్లో 6 సార్లు 5 వికెట్ల ఘనత సాధించి 50 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్లో ఇతనే లీడింగ్ వికెట్‌టేకర్. ఓవరాల్‌గా జలజ్ తన దేశవాలీ కెరీర్లో 133 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 104 లిస్ట్-ఏ, 66 టీ20లు ఆడాడు. ఈ మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా ఓ మ్యాచ్ ఆడాడు. I DONT understand selection committee these days BABA INDRAJITH plays for Rest of India against MP in the first week of March 2023. There has been no first class matches post that , but he doesn't feature for SOUTH ZONE in the duleep trophy. Can someone tell me why??#bcci — DK (@DineshKarthik) June 14, 2023 ఇదిలా ఉంటే, దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ జట్టుపై టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమిళనాడు ఆటగాడు బాబా ఇంద్రజిత్‌ను జట్టుకు ఎంపిక చేయకపోవడంపై డీకే సౌత్ జోన్ సెలెక్టర్లను నిలదీశాడు. -
'రాహుల్ కూడా మనిషే.. కొంచెం ఆలోచించి మాట్లాడండి'
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్‌కు కొంత మంది మద్దతుగా నిలుస్తుంటే.. మరి కొంత మంది తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయంపై మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, ఆకాశ్ చోప్రా మధ్య మాటల యుద్దం కూడా నడిచింది. రాహుల్‌కి ఫేవరెటిజం వల్లే జట్టులో చోటు దక్కుతుందని వెంకటేశ్ ప్రసాద్ విమర్శించాడు. అందుకు బదులుగా రాహుల్‌ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతున్నారంటూ వెంకటేశ్ ప్రసాద్‌కు ఆకాష్ చోప్రా చురకలు అంటించాడు. ఇక తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆటగాడు పేలవ ఫామ్‌లో ఉన్నప్పుడు మన అభిప్రాయాలను వెల్లడించవచ్చు కానీ, అదే పనిగా విమర్శలు చేయడం సరికాదు అని హర్భజన్ అన్నాడు. "ఏ ఆటగాడైనా బాగా రాణించకపోతే ముందుగా బాధపడేది ఆ ఆటగాడు, అతని కుటుంబ సభ్యులే. మనమందరం ఆ క్రికెటర్లను ఇష్టపడతాం. కాబట్టి వాళ్లు సరిగా ఆడకపోతే మనకు కోపం రావడం సహజం. కానీ ఒకే ఆటగాడిని టార్గెట్ చేసి మరి విమర్శలు చేయకూడదు. అలా చేయడంతో ఆ ప్లేయర్ మెంటాలిటీ దెబ్బ తింటుంది. రాహుల్ స్థానంలో మీరుంటే ఏం చేసేవాళ్లు? అతడు పరుగులు చేయడానికి ప్రయత్నించడం లేదని అనుకుంటున్నారా? అతడు టీమిండియాకు అద్భుతమైన ఆటగాడు. అదే విధంగా అతడు అద్భుతమైన కమ్‌బ్యాక్ కూడా ఇస్తాడు" అని యూట్యూబ్ ఛానల్లో హర్భజన్ పేర్కొన్నాడు. చదవండి: ChatGPT: రాహుల్‌ను తప్పించాలా? అదీ మరీ..! నీకున్న పాటి బుద్ధి వాళ్లకు లేదు! -
కేఎల్ రాహుల్ విషయంలో మాజీల మధ్య తిట్ల పురాణం
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. వరుసగా అవకాశాలు ఇస్తున్నప్పటికి ఆటతీరు మాత్రం రోజురోజుకు మరింత నాసిరకంగా తయారైంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఘోర ప్రదర్శన కనబరుస్తున్న కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ పదవి కూడా మూడింది. అతన్ని జట్టులో నుంచి తీసేయాలని పెద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా కేఎల్ రాహుల్ విషయమై టీమిండియా మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, ఆకాశ్ చోప్రాల మధ్య వాడివేడి చర్చ నడుస్తోంది.రాహుల్ విషయంలో వెంకటేశ్ ప్రసాద్ వ్యక్తిగత ఎజెండాతోనే విమర్శలు గుప్పిస్తున్నాడని ఆకాశ్ చోప్రా విమర్శించాడు. దీనికి ట్విటర్ ద్వారా ప్రసాద్ కౌంటర్ వేశాడు. టెస్ట్ క్రికెట్ లో అతని ఫామ్ నానాటికి దిగజారుతుండటంపై తీవ్ర విమర్శలు చేశాడు. తుది జట్టులో ఉండే అర్హత అతనికి లేదని స్పష్టం చేశాడు. రాహుల్ లాగా మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ లకు ఎక్కువ అవకాశాలు దక్కలేదనీ అన్నాడు. అయితే దీనిపై ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో స్పందిస్తూ.. ''ప్రసాద్ తనకు అనుకూలంగా ఉండేలా మయాంక్, ధావన్, గిల్ గణాంకాలను చూపెట్టాడని'' విమర్శించాడు. ఇది ప్రసాద్ కు అస్సలు రుచించలేదు. ఎప్పుడో పదేళ్ల కిందట రోహిత్ శర్మ గురించి ఆకాశ్ చోప్రా వ్యంగ్యంగా చేసిన ఓ ట్వీట్ ను గుర్తు చేస్తూ అతనిపై ట్విటర్ ద్వారా విమర్శలు గుప్పించాడు. "యూట్యూబ్ లో నా ఫ్రెండ్ ఆకాశ్ చోప్రా ఓ చెత్త వీడియో చేసి నాది వ్యక్తిగత ఎజెండా అని విమర్శిస్తున్నాడు. స్వదేశంలో మయాంక్ సగటు 70 అన్న విషయాన్ని మరచిపోయి తన అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్న వారి అభిప్రాయాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇదే వ్యక్తి రోహిత్ కు జట్టులో చోటు వద్దని వాదించాడు" అని ఓ ట్వీట్ లో ప్రసాద్ అన్నాడు. "నాకు ఏ ప్లేయర్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఎజెండా లేదు. ఇతరులకే అలాంటి ఎజెండాలు ఉండొచ్చు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ ఇలా వ్యక్తిగత ఎజెండా అనే విమర్శలు సరి కాదు. కేఎల్ రాహుల్ పైనే కాదు ఏ ఇతర ఆటగాడికి నేను వ్యతిరేకం కాదు. అన్యాయమైన టీమ్ ఎంపికనే నేను సవాలు చేస్తున్నాను. సర్ఫరాజ్ అయినా, కుల్దీప్ అయినా మెరిట్ ఆధారంగానే నా గళం వినిపిస్తున్నాను. కానీ ఆకాశ్ దీనిని వ్యక్తిగత ఎజెండా అనడం నిరాశ కలిగించింది" అని ప్రసాద్ అన్నాడు. ఈ సందర్భంగా 2014లో రోహిత్ శర్మపై ఆకాశ్ చోప్రా చేసిన ఓ వ్యంగ్యమైన ట్వీట్ ను ప్రసాద్ తెరపైకి తెచ్చాడు. "రోహిత్ 24 ఏళ్ల వయసు, 4 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్నప్పుడు అతని గురించి ఆకాశ్ చోప్రా చేసిన ట్వీట్ ఇదీ. రోహిత్ పై తన వ్యంగ్యాన్ని అతడు ఉపయోగించవచ్చు కానీ నేను 8 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్న రాహుల్ సరిగా ఆడని సమయంలో మాత్రం విమర్శలు చేయకూడదు. ఇది సరైనదేనా?" అని ప్రసాద్ ప్రశ్నించాడు. Venky bhai, msgs are getting lost in translation. You here. Me on YT. I invite you to come on a Video Chat…we can do it Live. Difference on opinions is nice…lets do it properly 😊 I’ll not have any sponsors on it & nobody will make money out of it. Up for it? You have my number https://t.co/ZrAzWoJiTv — Aakash Chopra (@cricketaakash) February 21, 2023 I have no agenda against any player, maybe there are others who have. Difference of opinion is fine but calling contrary views as apna personal agenda and Twitter par mat laayein is funny for @cricketaakash , considering he has made a great career by airing his views. I have … — Venkatesh Prasad (@venkateshprasad) February 21, 2023 This is what Aakash had aired when Rohit was 24 with 4 yrs in international cross. He can use sarcasm for Rohit at 24, and I cannot point out underperforming Rahul at 31 with 8 years in International cricket. Yeh bhi sahi hai pic.twitter.com/caNnrbC5lj — Venkatesh Prasad (@venkateshprasad) February 21, 2023 KL Rahul: ఇక భరించలేం.. తొలగించాల్సిందే! -
ఫేవరెటిజం వల్లే అతడికి చోటు.. భారత మాజీ బౌలర్ వరుస ట్వీట్లు వైరల్
India vs Australia, 1st Test: ‘‘కేఎల్ రాహుల్ ప్రతిభాపాటవాల పట్ల నాకెంలాంటి సందేహం లేదు. కానీ.. అంచనాలకు తగ్గట్లు అతడు రాణించలేకపోవడం విచారకరం. అంతర్జాతీయ క్రికెట్లో గత 8 ఏళ్ల కాలంలో 46 టెస్టుల్లో.. సగటు 34.. ఓ బ్యాటర్ కెరీర్లో అత్యంత సాధారణమైన గణాంకాలు. నాకు తెలిసి వేరే ఎవరికి కూడా ఇన్ని అవకాశాలు లభించేవి కావు. ఎంతో మంది రెక్కలు కట్టుకుని ఎప్పుడెప్పుడు ఇక్కడ వాలిపోదామా.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందామా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. శుబ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. అతడిలాంటి ఇంకెంతో మంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి వాళ్లంతా రాహుల్ కంటే ఎంతో ముందున్నారు. జట్టులో స్థానం దక్కించేకునేందుకు అతడి కంటే ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నారు. కొంతమంది అదృష్టం కారణంగా సరిగ్గా ఆడకపోయినా అవకాశాలు దక్కించుకుంటారు. కేఎల్ రాహుల్ చెత్త విషయం ఏమిటంటే! మరికొంత మంది మాత్రం పాపం అలా మిగిలిపోతారు. ఇక్కడ ఇంకో చెత్త విషయం ఏమిటంటే.. రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం. నిజానికి అశ్విన్ ఎంతో చురుగ్గా, తెలివిగా ఆలోచించగలడు. టెస్టు ఫార్మాట్లో అతడిని వైస్ కెప్టెన్ చేయాల్సింది. లేదంటే పుజారా, జడేజాలలో ఒకరికి ఈ అవకాశం ఇవ్వాల్సింది. వెంకటేశ్ ప్రసాద్ టెస్టుల్లో రాహుల్ కంటే.. మయాంక్ అగర్వాల్, విహారి బెటర్. ప్రతిభ వల్ల కాకుండా కేవలం ఫేవరెటిజం వల్లే రాహుల్‌కు జట్టులో చోటు దక్కుతోంది. గత ఎనిమిదేళ్లుగా నిలకడలేమి కొనసాగించడంలో అతడు నిలకడగా ఉన్నాడు. అయితే, చాలా మంది మాజీ క్రికెటర్లు రాహుల్ పట్ల బోర్డుకు ఉన్న ఫేవరెటిజం కారణంగానే అతడికి వ్యతిరేకంగా తమ గళం వినిపించలేకపోతున్నారు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కేఎల్ రాహుల్‌పై విమర్శలు గుప్పించాడు. సెలక్టర్లపై ఫైర్ స్థాయికి తగ్గట్లు ప్రదర్శన కనబరచలేకపోతున్న రాహుల్‌ను ఉద్దేశించి వరుస ట్వీట్లు చేశాడు. టీమిండియా సెలక్టర్ల ఫేవరెటిజం కారణంగానే అతడికి అవకాశాలు వస్తున్నాయని ఘాటు విమర్శలు చేశాడు. విఫలమైన రాహుల్ కాగా శుబ్‌మన్ గిల్ వంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను పక్కన పెట్టి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో రాహుల్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 71 బంతులు ఎదుర్కొన్న ఈ కర్ణాటక బ్యాటర్ కేవలం 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ సైతం రాహుల్ ఆట తీరుపై పెదవి విరిచాడు. అతడికి సెలక్టర్లు ఎక్కువ అవకాశాలు ఇచ్చి.. మిగతా వాళ్లకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డాడు. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో రవీంద్ర జడేజా, అశ్విన్ స్పిన్ మాయాజాలానికి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో రాణించడంతో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. చదవండి: IND vs AUS: ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రవీంద్ర జడేజాకు భారీ షాకిచ్చిన ఐసీసీ Ind Vs Aus: పాపం.. అలా అయితే పాక్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేదేమో! తిక్క కుదిరిందా? Rahul’s selection is not based on performance but favouritism . Has been Consistently inconsistent and for someone who has been around for 8 years not converted potential into performances. One of the reasons why many ex-cricketers aren’t vocal despite seeing such favouritism.. — Venkatesh Prasad (@venkateshprasad) February 11, 2023 -
'మేం కాదు మీరే..' పాక్ మాజీ కెప్టెన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్‌కు టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఆసియాకప్ వేదికను మార్చడంలో బీసీసీఐ కీలకపాత్ర పోషించిదంటూ అసహనం వెళ్లగక్కిన మియాందాద్.. పాక్‌లో ఆడడానికి నిరాకరిస్తున్న టీమిండియాను ''గోటూ..హెల్(Go to Hell)'' అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నాడు. క్రికెట్లో పెద్దన్నలా వ్యవహరించాల్సిన ఐసీసీ.. బీసీసీఐకి తొత్తుల మారిందన్నాడు. బీసీసీఐ చెప్పినట్లు ఆడితే ఐసీసీ ఉండి ప్రయోజనం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు. మియాందాద్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్ వేదికగా భగ్గుమన్నాడు.'' పాకిస్తాన్‌తో ఆడకపోవడం వల్ల టీమిండియాకు ఒరిగేదేం ఉండదు. ఎటొచ్చి మనతో వాళ్లు ఆడకపోతే వాళ్లే తీవ్రంగా నష్టపోవడం ఖాయం. ఈ విషయం తెలుసుకుంటే బెటర్. మీ వ్యాఖ్యలతో పాక్ క్రికెట్‌ను మరింత ఊబిలోకి నెట్టేస్తున్నారు. నరకానికి వెళ్లేది మేం కాదు మీరే.. సిద్దంగా ఉండండి. ప్రపంచ క్రికెట్‌ను బీసీసీఐ శాసిస్తుందని నిరాధార ఆరోపణలు చేయడం తగదు. మీ వైఖరిని మార్చుకోండి. ప్రస్తుతం మీ దేశంలో శాంతి భద్రతలు సరిగా లేవు.. సెక్యూరిటీ కారణంగానే టీమిండియా ఆడేందుకు నిరాకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పేర్కొన్నారు. తటస్థ వేదికపై ఆడేందుకు భారత్ అంగీకరించినట్లు గుర్తించడం మానేసి ఇలా పనికిమాలిన ఆరోపణలు చేయడం సరికాదు'' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. But they are refusing to go to hell :) https://t.co/gX8gcWzWZE — Venkatesh Prasad (@venkateshprasad) February 6, 2023 చదవండి: టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్‌బాలర్ -
'ఎంత బరువుంటే అన్ని సెంచరీలు చేస్తాడు'
దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపుతున్నాడు. ఈ ఏడాది రంజీ సీజన్లో ఇప్పటికే మూడు సెంచరీలు బాదిన సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా ఆడుతున్నప్పటికి జాతీయ జట్టు నుంచి పిలుపు మాత్రం రావడం లేదు. వయసు రిత్యా 25 ఏళ్లు అయినప్పటికి బారీ కాయంగా కనిపించే సర్ఫరాజ్ ఫిట్నెస్ విషయంలో మాత్రం ది బెస్ట్ అనిపిస్తున్నాడు. రంజీల్లో ముంబై తరపున ఆడుతున్న సర్ఫరాజ్ బరువున్నా బ్యాటింగ్ మాత్రం సులువుగా చేస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ పరుగుల ప్రవాహం సృష్టిస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం పట్ల సెలెక్టర్లను మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ సర్ఫరాజ్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''దేశవాళీ క్రికెట్లో వరుసగా మూడో సీజన్లో కూడా సర్ఫరాజ్ బెంబేలెత్తిస్తున్నాడు. అలాంటి బ్యాటర్‌ను టెస్టు జట్టుకు ఎంపిక చేయకపోవడం శోచనీయం. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడం దేశవాలీ క్రికెట్‌ను అవమానించడమేనని.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ప్లాట్‌ఫామ్‌ను పట్టించుకోకపోవడమే అవుతుంది. పరుగులు సాధించేందుకు సర్ఫరాజ్ ఫిట్‌గా ఉన్నాడు. అతను ఎంత బరువున్నాడో.. అన్ని సెంచరీలు కొట్టగలడు '' అని ప్రసాద్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. Not having him in the Test Team despite 3 blockbuster domestic seasons is not only unfair on Sarfaraz Khan, but it’s an abuse to domestic cricket,almost as if this platform doesn’t matter. And he is FIT to score those runs. As far as body weight goes, there are many with more kgs https://t.co/kenO5uOlSp — Venkatesh Prasad (@venkateshprasad) January 17, 2023 చదవండి: ఓర్వలేనితనం అంటే ఇదే.. దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్.. సీజన్లో మూడో సెంచరీ -
రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా మళ్లీ అతడే!
Team India Chief Selector: టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సెలక్షన్ కమిటీ విషయంలో ఈ మాజీ పేసర్కే భారత క్రికెట్ నియంత్రణ మండలి మరోసారి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. కాగా 2020 డిసెంబరులో సునిల్ జోషి స్థానంలో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ నియమితుడయ్యాడు. ఈ క్రమంలో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన ఈ పంజాబ్ క్రికెటర్‌కు టీ20 ప్రపంచకప్-2022 తర్వాత చేదు అనుభవం ఎదురైంది. ఆసియా కప్, వరల్డ్‌కప్ ఈవెంట్లలో టీమిండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో అతడి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేసింది బీసీసీఐ. ప్రక్షాళన చర్యల్లో భాగంగా కొత్త కమిటీ ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, జాతీయ మీడియా తాజా కథనాల ప్రకారం.. చేతన్ శర్మనే మరోసారి చీఫ్ సెలక్టర్ చేసేందుకు బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చేతన్ శర్మను దరఖాస్తు చేసుకోవాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. నిబంధనలకు అనుగుణంగానే చేతన్‌తో పాటు హర్వీందర్ సింగ్ కూడా తన పదవిలో కొనసాగనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. సెలక్షన్ ప్యానెల్లో వీరితో పాటు 13 మంది పేర్లు షార్ట్‌లిస్టు అయినట్లు తెలుస్తోంది. అయితే, చీఫ్ సెలక్టర్ పదవి కోసం పోటీపడ్డ వెంకటేశ్ ప్రసాద్‌కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ సేన వైఫల్యం నేపథ్యంలో నవంబరులో సెలక్షన్ కమిటీని రద్దు చేశారు. సెమీస్‌లోనే భారత్ ఇంటిబాట పట్టిన తరుణంలో ఈ మేరకు సెలక్టర్లపై వేటు వేశారు. ఈ క్రమంలో ఖాళీ స్థానాల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రెస్‌నోట్ రిలీజ్లో.. ఇందుకు గల అర్హతలను ప్రస్తావించింది. ‘‘కనీసం ఏడు టెస్టు మ్యాచ్‌లు లేదంటే, 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు. అదే విధంగా ఆటకు వీడ్కోలు పలికి కనీసం ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు’’ అర్హులు అని పేర్కొంది. చదవండి: Ind Vs SL: ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! అర్ష్‌దీప్‌పైనే భారం! ఇషాన్, రుతు.. ఇంకా -
టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో మాజీ స్పీడ్ స్టర్..!
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే భారత జట్టు ఇంటిముఖం పట్టడంతో చేతన్ శర్మ నేతృత్వంలో సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ప్యానల్ కోసం దరఖాస్తులను బీసీసీఐ ఆహ్హానించింది. అయితే నామినేషన్ల గడువు సోమవారం(నవంబర్ 28)తో ముగిసింది. ఇక సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికోసం వెంకటేష్ ప్రసాద్, నయన్ మోంగియా, అజయ్ రాత్ర, మణిందర్ సింగ్, శివ సుందర్ దాస్ వంటి భారత మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోన్న చేతన్ శర్మతోపాటు సెలక్టర్ హర్విందర్ సైతం తిరిగి దరఖాస్తు చేశారు. సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వెంకటేష్ ప్రసాద్! ఇక టైమ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. సెలక్షన్ కమిటీ చైర్మన్ రేసులో టీమిండియా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత జానియర్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నందన బీసీసీఐ వెంకటేష్ ప్రసాద్ వైపే మెగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2016-18 మధ్య కాలంలో జూనియర్ ఇండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రసాద్ పనిచేశాడు. 2018లో అండర్-19 ప్రపంచకప్‌ను యువ భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక భారత తరపున 161 వన్డేలు, 33 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన వరుసగా.. వరుసగా 196, 96 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2007 కైవసం చేసుకున్న భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వెంకటేష్ ప్రసాద్ పనిచేశాడు. చదవండి: BCCI: సెలక్షన్ కమిటీ రేసులో ఉన్నారంటూ వార్తలు.. నేనసలు అప్లై చేయలేదు కదా! -
ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా అందుకున్న భారత మాజీ పేసర్
క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య వేళ్లపై లెక్కపెట్టవచ్చు. భారత క్రికెట్లో అయితే ఆ సంఖ్య మరీ తక్కువనే చెప్పాలి. భారత క్రికెట్ ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు కనీసం డిగ్రీ కూడా చదవలేదు. ఈ మధ్య జనరేషన్లో టీమిండియా తరఫున రాణించి, మేటి బౌలర్‌గా పేరు తెచ్చుకున్న ఓ క్రికెటర్ లేటు వయసులో చదువుపై దృష్టి సారించాడు. రిటైర్మెంట్ తర్వాత డిగ్రీ, పీజీ పూర్తి చేసి చదువు మధ్యలోనే ఆపేసిన చాలామంది క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. అతనే టీమిండియా మాజీ పేసర్, భారత మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్. కర్ణాటకకు చెందిన వెంకటేశ్ ప్రసాద్ ఇటీవలే ప్రతిష్టాత్మక లండన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్లో పీజీ పట్టా పొందాడు. Never stop learning, because life never stops teaching. It was an honour and privilege to receive PG Cert in International Sports Management from @UoLondon . Look forward to contributing more in the field of Sports. pic.twitter.com/NYkdxQ1QK1 — Venkatesh Prasad (@venkateshprasad) July 15, 2022 ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ‘నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో పీజీ పట్టా అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. స్పోర్ట్స్ ఫీల్డ్‌లో మరింత సేవ చేయడానికి ఎదురుచూస్తున్నా’ అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా, దాదాపు రెండు దశబ్దాల పాటు భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన ప్రసాద్.. 1996 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా హైలైట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ అమీర్ సోహైల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాత ప్రసాద్ ప్రదర్శించిన హావభావాలు భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ మ్యాచ్‌లో ప్రసాద్ బౌలింగ్‌లో సోహైల్ బౌండరీ బాది వార్నింగ్ ఇచ్చాడు. ఆ మరుసటి బంతికే ప్రసాద్.. సోహైల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. చదవండి: 'కోహ్లిని గాడిలో పెట్టగల వ్యక్తి సచిన్ మాత్రమే' -
అత్యుత్తమ వన్డే జట్టు ఎంపిక.. రోహిత్ శర్మకి నో ఛాన్స్!
టీమిండియా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ తన ఆల్-టైమ్ ఇండియన్ బెస్ట్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. అతడు ప్రకటించిన జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్‌లకు అతడు అవకాశం ఇచ్చాడు. ఇక భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి 3వ స్థానంలో చోటు దక్కగా, క్రికెట్ లెజెండ్ మహమ్మద్ అజారుద్దీన్‌కి నాలుగో స్ధానంలో చోటు దక్కింది. ఇక ఐదో స్ధానంలో యువరాజ్ సింగ్‌కి అవకాశం ఇవ్వగా, ఆరో స్ధానంలో ధోనికి చోటు ఇచ్చాడు. ఆల్‌రౌండర్ల కోటాలో భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌ను వెంకటేష్ ప్రసాద్ ఎంపిక చేశాడు. ఇక తన జట్టులో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్‌ను బౌలర్లుగా వెంకటేష్ ప్రసాద్ ఎంచకున్నాడు. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి వెంకటేష్ ప్రసాద్ ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. వెంకటేష్ ప్రసాద్ వన్డే అత్యత్తుమ జట్టు: వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహమ్మద్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్, ఎంస్ ధోనీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ చదవండి: 25 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు.. జట్టును ప్రకటించిన ఆసీస్ -
IND VS NZ: అతడు టీమిండియా ఓపెనర్‌గా రావాలి...
MSK Prasad Backs KS Bharat To Play As An Opener For India In Tests ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టుకు టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రా యువ ఆటగాడు శ్రీకర్ భరత్ టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంస్కే ప్రసాద్.. భరత్‌ను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్లో భారత జట్టుకు ఓపెనర్‌గా రాణించే సత్తా భరత్‌కు ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. దేశీవాళీ క్రికెట్లో ఓపెనర్‌గా ఆంధ్రా తరుపున భరత్ అద్బుతంగా రాణించాడని అతడు తెలిపాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో భరత్ 123 మ్యాచ్‌లు ఆడితే అందులో 77 ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేశాడు. అంతేకాకుండా ఓపెనర్‌గా భరత్ ట్రిపుల్ సెంచరీ కూడా సాధించాడు. “అతనికి ఓపెనింగ్ కొత్త విషయం కాదు. నిజానికి అతను ఒక స్పెషలిస్ట్ ఓపెనర్. ఓపెనర్‌గా ఆంధ్రా తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అతను ఓపెనర్‌గా మూడు సెంచరీలు కూడా చేశాడు. ఒక అవకాశం ఇస్తే, అతడు భారత్‌కు ఓపెనింగ్ చేసే సత్తా ఉంది" అని ఎంస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. కాన్పూర్ వేదికగా జరిగిన మెదటి టెస్ట్‌లో సాహాకు ప్రత్యామ్నాయంగా(సబ్‌స్ట్యూట్)గా వచ్చిన భరత్ రెండు అద్బుతమైన క్యాచ్‌లతో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్ట్‌లో శ్రీకర్ భరత్‌కు టీమిండియా క్యాప్ ఇవ్వవచ్చు అని అతడు తెలిపాడు. ఒకవేళ మయాంక్ అగర్వాల్ స్ధానంలో విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తే.. భరత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వచ్చు అని అతడు అభిప్రాయ పడ్డాడు. ఒకవేళ భరత్‌కు అవకాశం వస్తే తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటాడని ఎంస్కే ప్రసాద్ జోస్యం చెప్పాడు. చదవండి: Ind Vs SA 2021- Virat Kohli: వారం రోజుల్లో తేలనున్న కోహ్లి భవితవ్యం.. కొనసాగిస్తారా? లేదంటే! -
నాడు క్రికెట్‌కు పనికిరాడన్నారు.. రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో సెన్సేషనల్ బ్యాటింగ్‌తో (69 నాటౌట్) టీమిండియాకు అద్భుత విజయాన్నందించిన దీపక్ చాహర్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న వేళ భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. చాహర్.. తన 16వ ఏట (2008) రాజస్థాన్ క్రికెట్ అకాడమీలో చోటు దక్కించుకున్న సమయంలో అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న గ్రెగ్ చాపెల్.. అతని బౌలింగ్ సామర్థ్యాన్ని శంకిస్తూ, క్రికెట్‌కు పనికిరాడని రిజెక్ట్ చేశాడని పేర్కొన్నాడు. గ్రెగ్ చాపెల్ స్థాయి వ్యక్తి బౌలింగ్‌లో పసలేదని, క్రికెట్లో భవిష్యత్తు లేదని చెప్పడంతో చాహర్ నైరాశ్యంలోకి కూరుకుపోయాడని, అయితే తండ్రి లోకేంద్ర సింగ్ చాహర్ సహకారంతో తిరిగి గాడిలో పడ్డాడని వివరించాడు. కాగా, నాడు చాపెల్.. దీపక్ చాహర్‌పై చేసిన వ్యాఖ్యలపై వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ.. విదేశీ కోచ్‌లు చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మకూడదని, వాళ్లు చెప్పిన విషయాలన్నీ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. ఎత్తు కారణంగా నాడు క్రికెట్‌కు పనికిరాడన్న వ్యక్తి.. రాత్రికి రాత్రి హీరో అయిపోయాడని, అదే చాపెల్ మాటలు నమ్మి సెలెక్టర్లు చాహర్‌కు అవకాశం ఇచ్చుండకపోయుంటే టీమిండియా ఓ గొప్ప ఆల్‌రౌండర్ సేవలను కోల్పోయేదని తెలిపాడు. ఇకనైనా బీసీసీఐ.. విదేశీ కోచ్‌లపై మోజును తగ్గించుకోవాలని, వాళ్ల మాటలపైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను పోత్సహించాలని సూచించాడు. విదేశీ కోచ్‌లతో పోలిస్తే, స్వదేశీ కోచ్‌లకు భారత యువ క్రికెటర్లపై మంచి అవగాహన ఉంటుందని, అందుకే బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు స్వదేశీ కోచ్‌లకు తగినన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో వన్డేలో చాహర్ తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించిన విషయం తెలిసిందే. -
బౌలర్ గీత దాటితే చర్య.. బ్యాట్స్‌మన్ దాటితే మాత్రం
ముంబై: 2019 ఐపీఎల్ సీజన్లో అప్పటి కింగ్స్ పంజాబ్( పంజాబ్ కింగ్స్) బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. క్రికెట్ ప్రేమికులు రెండుగా చీలిపోయి.. అశ్విన్ చేసింది కరెక్టేనంటూ కొందరు సమర్థిస్తే.. మరికొందరు మాత్రం అశ్విన్ చర్య క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉందంటూ పేర్కొన్నారు. కొన్నాళ్ల పాటు మన్కడింగ్ వివాదంపై సోషల్ మీడియాలోనూ పెద్ద డిబేట్ నడిచింది. తాజాగా సోమవారం సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ బౌలింగ్ వేయడానికి ముందే డ్వేన్ బ్రావో క్రీజు దాటి ముందుకు వెళ్లిపోయాడు. వాస్తవానికి ఒక బౌలర్ బంతి విసిరేవరకు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ క్రీజు విడిచే అవకాశం లేదు. అయితే అప్పటికే బ్రావో క్రీజును దాటేయడం.. ముస్తాఫిజుర్ బంతిని విసరడం జరిగింది. అయితే బౌలర్ వేసిన బంతి నోబాల్ అని తేలడంతో రూల్ ప్రకారం అవతలి జట్టుకు ఫ్రీ హిట్ ఆడే అవకాశం వచ్చింది. ఈ విషయం పక్కనపెడితే.. టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ బ్రావో, ముస్తాఫిజుర్ ఉన్న ఫోటోను తన ట్విటర్లో షేర్ చేస్తూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. 'ఒక బౌలర్ గీత దాతి బంతిని వేస్తే నోబాల్‌గా పరిగణించి అతనికి పెనాల్టీ విధిస్తారు. మరి అదే సమయంలో బౌలర్ బంతిని విడవకుండానే బ్యాట్స్‌మన్ క్రీజు దాటి వెళితే దానికి ఎలాంటి చర్యలు ఉండవా... అక్కడ బౌలర్‌కు మన్కడింగ్ చేసే అవకాశం ఉన్నా.. క్రీడాస్పూర్తికి విరుద్ధమని మీరే కామెంట్స్ చేస్తారు. అయితే మరి ఇలాంటి చర్యలకు పరిష్కారం చూపండి అంటూ ఐసీసీనీ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. వెంకటేష్ ప్రసాద్ పెట్టిన ఫోటో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (17 బంతుల్లో 27; 3 సిక్స్‌లు), మొయిన్ అలీ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చెయ్యి వేశారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్‌ను చెన్నై బౌలర్లు మొయిన్ అలీ (3/7), స్యామ్ కరన్ (2/24), రవీంద్ర జడేజా (2/28) కట్టడి చేశారు. ఫలితంగా రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: ధోని బ్యాట్ నుంచి మరీ ఎక్కువ ఆశించకూడదు ధోని వారసుడు అతడే.. తనే నెక్ట్స్ కెప్టెన్: మైకేల్ వాన్ The bowler overstepping by a few inches is penalised, but a batsman backing up a few yards isn’t. The bowler has every right to run out a batsman backing up so far. PERIOD. Calling it against the spirit of the game is a joke @ICC .#CSKvRR pic.twitter.com/vIHqbe6fWU — Venkatesh Prasad (@venkateshprasad) April 20, 2021 -
పాక్ జర్నలిస్టు ట్రోలింగ్.. వెంకటేశ్ ప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా భారత-పాకిస్తాన్ జట్లు క్రికెట్ పోరులో ముఖాముఖి తలపడటం లేదు కానీ ఆయా జట్లు సమరం అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు జట్లు తలపడిన ప్రతీ సందర్భంలోనూ ఇరు జట్ల ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై ప్రధాన ఫోకస్ ఉంటుంది. అది వరల్డ్‌కప్ అయితే ఇక ఆ సమరమే వేరు. అలా ఇరు జట్లు తలపడిన వరల్డ్‌కప్ సమరాల్లోని బెస్ట్ మూమెంట్స్‌లో 1996 వరల్డ్‌కప్ ఒకటి. పాకిస్తాన్‌తో బెంగళూరులో జరిగిన ఆనాటి క్వార్టర్ ఫైనల్లో అమిర్ సొహైల్-వెంకటేశ్ ప్రసాద్‌ల పోరు ప్రత్యేకం. వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన సొహైల్.. ప్రతీ బంతిని ఇలానే కొడతానని, వెళ్లి తెచ్చుకో అంటూ బ్యాట్‌తో సంకేతాలివ్వగా, ఆ మరుసటి బంతికే వెంకటేశ్ ప్రసాద్ బౌల్డ్ చేయడం ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతూనే ఉంటుంది. ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంటూ వెంకటేశ్ ప్రసాద్ వారి మధ్య జరిగిన బ్యాట్-బంతి పోరును ట్వీటర్ వేదికగా ఫోటోతో సహా పోస్ట్ చేశాడు. దీనిపై పాకిస్తాన్ జర్నలిస్టు నజీబ్ ఉల్ హస్ననైన్ ట్రోలింగ్‌కు దిగాడు. ‘నువ్వు నీ కెరీర్లో సాధించిన ఘనత ఇదే కదా’ అంటూ వెటకారంగా స్పందించాడు. దానికి వెంకటేశ్ ప్రసాద్ కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చాడు. ‘ నజీబ్ భాయ్. నేను ఆ తర్వాత కూడా కొన్ని ఘనతలు సాధిచాను. ఆ తర్వాత 1999 ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో మీ పాకిస్తాన్ జట్టుపైనే ఐదు వికెట్లు సాధించి 27 పరుగులిచ్చా,. దాంతో పాకిస్తాన్ 228 పరుగుల్ని కూడా సాధించలేక చతికిలబడింది. గాడ్ బ్లెస్ యూ’ అని రిప్లే ఇచ్చాడు. Me to Aamir Sohail in Bangalore at 14.5- #IndiraNagarkaGunda hoon main 😊 pic.twitter.com/uF7xaPeTPl — Venkatesh Prasad (@venkateshprasad) April 11, 2021 Nahi Najeeb Bhai. Had reserved some achievements for later. In the very next World cup in Eng in 1999 , took 5/27 at Manchester against Pakistan and they were unable to chase 228. God bless you. — Venkatesh Prasad (@venkateshprasad) April 11, 2021 -
‘సొహైల్.. నా రక్తం మరిగేలా చేశాడు’
న్యూఢిల్లీ: టీమిండియా-పాకిస్తాన్ క్రికెట్ జట్ల సమరం అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు జట్లు తలపడిన ప్రతీ సందర్భంలోనూ ఇరు జట్ల ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై ప్రధాన ఫోకస్ ఉంటుంది. అది వరల్డ్‌కప్ అయితే ఇక ఆ సమరమే వేరు. అలా ఇరు జట్లు తలపడిన వరల్డ్‌కప్ సమరాల్లోని బెస్ట్ మూమెంట్స్‌లో 1996 వరల్డ్‌కప్ ఒకటి. పాకిస్తాన్‌తో జరిగిన ఆనాటి క్వార్టర్ ఫైనల్లో అమిర్ సొహైల్-వెంకటేశ్ ప్రసాద్‌ల పోరు ప్రత్యేకం. వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన సొహైల్.. ప్రతీ బంతిని ఇలానే కొడతానని, వెళ్లి తెచ్చుకో అంటూ బ్యాట్‌తో సంకేతాలివ్వగా, ఆ మరుసటి బంతికే వెంకటేశ్ ప్రసాద్ బౌల్డ్ చేయడం భారత అభిమానుల్లో ఫుల్ జోష్‌ను తీసుకొచ్చిందనేది వాస్తవం.(ఇక మా పని అయిపోయినట్లే: ఇషాంత్) అమిర్ ఔట్ కాగానే ఇక ‘నువ్వు పెవిలియన్‌కు వెళ్లు’ అనే అర్థం వచ్చేలా వెంకటేశ్ ప్రసాద్ చేయి చూపించడం ఇప్పటికీ హైలైట్. ఇదే విషయాన్ని తాజాగా వెంకటేశ్ ప్రసాద్ గుర్తు చేసుకున్నాడు. 24 ఏళ్ల క్రితం జరిగిన ఆ మ్యాచ్‌లో సొహైల్ తనను రక్తం మరిగేలా చేశాడన్నాడు. నా బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన తర్వాత సొహైల్ తీరు సరిగ్గా లేదు. సంజ్ఞ చేసిన తర్వాత వాగ్వాదానికి దిగే యత్నం చేశాడు. ఆ ఫోర్ కొట్టిన పిదప క్రీజ్‌లోకి వెళ్లాలి. కానీ ఇంకా ఏదో రెచ్చగొట్టే యత్నం చేశాడు. దాన్ని దేశం మొత్తం చూసింది. అది నా రక్తం మరిగేలా చేసింది. ఇంకా ఆ వికెట్ ఎంతో అవసరం కూడా. దాంతో తదుపరి బంతిని లైన్ లెంగ్త్‌లో వేయగా సొహైల్ ఆవేశపడి వికెట్ సమర్పించుకున్నాడు. దాంతో నాకు కూడా ఆవేశం వచ్చింది. సొహైల్ పెవిలియన్‌కు వెళుతున్న క్రమంలో నేను కూడా అదే తరహా సంజ్ఞతో వీడ్కోలు చెప్పా. ఏదో అనబోయి కాస్త కంట్రోల్లోకి వచ్చేశా. ఆ సమయంలో జవగళ్ శ్రీనాథ్, సచిన్ టెండూల్కర్, అజహర్ తదితరులు నా వద్దకు వచ్చి నన్ను రక్షించారనే చెప్పాలి. లేకపోతే నాకు భారీ జరిమానానే కాకుండా నిషేధం కూడా చూడాల్సి వచ్చేదేమో. అప్పుడు షెఫర్డ్ అంపైర్‌గా ఉన్నారు’ అని వెంకటేశ్ ప్రసాద్ మరొకసారి క్రికెట్ అభిమానుల ముందుకు తెచ్చాడు.(‘యువీ.. నువ్వు ఇంకా ఆడతావనుకున్నా’) -
అజిత్ అగార్కర్‌కు నిరాశ
ముంబై: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో అందరి కంటే ముందున్నాడనుకున్న భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌కు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) షాకిచ్చింది. మంగళవారం సమావేశమైన మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన సీఏసీ... అగార్కర్ దరఖాస్తును తిరస్కరించింది. రెండు ఖాళీల కోసం 44 మంది దరఖాస్తు చేసుకోగా... అందులో నుంచి వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషి, లక్ష్మణ్ శివరామకృష్ణన్, హర్విందర్ సింగ్, రాజేశ్ చౌహాన్లను ఇంటర్వ్యూల కోసం ఖరారు చేసింది. జోన్ల ప్రాతిపదికన సెలక్టర్లను ఎంపిక చేయాలని సీఏసీ సభ్యులు నిర్ణయించుకోవడంతో అగార్కర్‌ను పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. పదవీ కాలం ముగిసిన సెలెక్టర్లలో గగన్ ఖోడా సెంట్రల్ జోన్‌కు చెందిన వాడు కావడంతో ఆ జోన్ నుంచి హర్విందర్ సింగ్‌ను... ఎమ్మెస్కే ప్రసాద్‌ది సౌత్ జోన్ కావడంతో వెంకటేశ్ ప్రసాద్, శివరామకృష్ణన్, సునీల్ జోషిలను తదుపరి దశకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. (చదవండి: పాండ్యా సూపర్ ఇన్నింగ్స్) -
రేసులో మిగిలింది వీరే.. చీఫ్ సెలక్టర్ ఎవరో?
ముంబై: మార్చి మొదటి వారంలో టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్ వచ్చే అవకాశం ఉందని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్‌లాల్ వెల్లడించాడు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీ కాలం ముగియడంతో కొత్త సెలక్టర్లను ఎంపిక చేసే బాధ్యతను మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌లతో కూడిన సీఏసీకి బీసీసీఐ అప్పగించింది. కొత్త సెలక్టర్లను ఎప్పుడు ప్రకటించాలన్న విషయంలో నిర్దిష్ట సమయం ఏదీ లేదన్న మదన్ లాల్.. మార్చి 1, 2 నాటికి ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాల స్థానం కోసం పోటీపడుతున్న వారిలో చివరి దశ ఇంటర్వ్యూలకు మొత్తం నలుగురు మిగిలారు. వీరిలో మాజీ లెగ్‌స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, మాజీ పేసర్ అజిత్ అగార్కర్, మరో మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్లు ఉన్నారు. అయితే, చీఫ్ సెలక్టర్ పోస్టు కోసం అజిత్ అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్‌ల మధ్య పోటీ ఉండవచ్చు. అత్యంత అనుభవజ్ఞుడినే చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేస్తామన్న బీసీసీఐ చీఫ్ గంగూలీ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎవర్ని చీఫ్ సెలక్టర్‌గా చేస్తారో వేచిక చూడక తప్పదు. టెస్టుల పరంగా వెంకటేశ్ ప్రసాద్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే, వన్డేలు పరంగా అజిత్ అగార్కర్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. వెంకటేశ్ ప్రసాద్‌కు 33 టెస్టులు ఆడిన అనుభవం ఉంటే, అగార్కర్‌కు 26 టెస్టులు ఆడిన అనుభవం ఉంది. వన్డేల్లో వెంకటేశ్ ప్రసాద్ 161 మ్యాచ్‌లు ఆడితే, అగార్కర్ 191 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. నాలుగు అంతర్జాతీయ టీ20లు కూడా అగార్కర్ ఆడాడు. దీన్ని బట్టి చూస్తే చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం వెంకటేశ్ ప్రసాద్‌కు చాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. (ఇక్కడ చదవండి: ఆడకుండా.. నన్ను కిడ్నాప్ చేశారు: అశ్విన్) -
అతనికే చీఫ్ సెలక్టర్‌గా అవకాశం: గంగూలీ
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ బౌలర్ ఆర్పీ సింగ్‌కు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో చోటు దక్కిన విషయం తెలిసిందే. శుక్రవారం సౌరవ్ గంగూలీ అధ్యక్షతన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించిన ముగ్గురు సభ్యుల సీఏసీలో ఆర్పీ సింగ్ అనూహ్యంగా ఎంపికయ్యాడు. ఈ జాబితాలో మాజీ ఆటగాడు మదల్‌లాల్, సులక్షన్ నాయక్‌తో పాటు ఆర్పీ సింగ్‌లు ఉన్నారు. వీరి పదవీకాలం ఏడాది కాలం పాటు ఉండనుంది. మరొకవైపు సెలక్షన్ కమిటీలోకి ఇద్దరు సభ్యులను తీసుకోనున్నారు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో సందీప్ సింగ్ (నార్త్ జోన్), జతిన్ పరాంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్) మరో ఏడాది కొనసాగనుండగా, పదవీకాలం పూర్తి చేసుకున్న సెలెక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్ (సౌత్ జోన్), సెలెక్టర్ గగన్ ఖోడా (సెంట్రల్ జోన్) స్థానాలను బీసీసీఐ భర్తీ చేయనుంది. చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఎంఎస్కే ప్రసాద్ పదవీ కాలం గత సెప్టెంబర్‌తోనే ముగియగా, అతనికి మరో కొన్నినెలలు పని చేయడానికి అవకాశం కల్పించారు. (ఇక్కడ చదవండి: పంత్ తోపన్నారు.. మరి ఎందుకు తీసుకోరు?) సెలక్షన్ కమిటీలో సభ్యులను తీసుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానించేంత వరకూ ఎంఎస్కేను కొనసాగమని సూచించడంతో అతని మరిన్ని నెలలు పనిచేసే అవకాశం దక్కింది. కాగా, ప్రస్తుతం సెలక్టర్ల పదవికి పలు దరఖాస్తులు రావడంతో ఎవరు చీఫ్ సెలక్టర్ అవుతారనే విషయంపై కాస్త సందిగ్థత నెలకొంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ‘ ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌ను చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తాం. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న మాజీల్లో ఎక్కువగా టెస్టులు ఆడినవారే చీఫ్ సెలక్టర్ అవుతాడు. ఇది చీఫ్ సెలక్టర్‌ను ఎంపిక చేయడానికి ఉన్న ఒక నిబంధన’ అని గంగూలీ తెలిపాడు. కాగా, చీఫ్ సెలక్టర్ల రేసులో మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, శివరామకృష్ణన్, వెంకటేశ్‌ప్రసాద్, రాజేశ్ చౌహాన్, నయాన్ మోంగియా, చేతన్ చౌహాన్, నిఖిల్ చోప్రా, అబీ కురువిల్లాలు ప్రధానంగా పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ శివరామకృష్ణన్ తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఇక వెంకటేశ్ ప్రసాద్ 33 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా, అజిత్ అగార్కర్ 26 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. వెంకటేశ్ ప్రసాద్‌కు జూనియర్ సెలక్షన్ కమిటీలో చేసిన అనుభవం ఉండగా, ముంబై సీనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా పనిచేసిన అనుభవం అగార్కర్ సొంతం. దాంతో వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండవచ్చు. -
సెలక్టర్ రేసులో అగార్కర్
ముంబై: భారత సీనియర్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ పదవి కోసం భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ పోటీపడుతున్నాడు. గురువారమే అతడు దరఖాస్తు చేసుకున్నాడంటూ ఊహాగానాలు రాగా... అవి నిజమేనంటూ శుక్రవారం అగార్కర్ వివరణ ఇచ్చాడు. ఇతనితో పాటు ఇప్పటికే జూనియర్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన భారత మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా చీఫ్ సెలక్టర్ పదవి రేసులో ఉన్నాడు. దాంతో చీఫ్ సెలక్టర్ పదవి రేసులో ఇప్పటికే ఉన్న భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, ఆఫ్ స్పిన్నర్ రాజేశ్ చౌహాన్‌లకు అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్‌ల నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఇప్పటికే ముంబై సీనియర్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 349 వికెట్లు తీశాడు. సెలక్షన్ కమిటీలో ఏర్పడిన రెండు ఖాళీలల కోసం దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియగా... తొమ్మిది మంది పోటీ పడుతున్నారు. గడువులోపు దరఖాస్తు చేసుకున్న మాజీ భారత క్రికెటర్లు: అజిత్ అగార్కర్ (ముంబై), వెంకటేశ్ ప్రసాద్ (కర్ణాటక), చేతన్ శర్మ (హరియాణా), నయన్ మోంగియా (బరోడా), లక్ష్మణ్ శివరామకృష్ణన్ (తమిళనాడు), రాజేశ్ చౌహాన్ (మధ్య ప్రదేశ్), అమేయ్ ఖురాసియా (మధ్య ప్రదేశ్), జ్ఞానేంద్ర పాండే (ఉత్తర ప్రదేశ్), ప్రీతమ్ గాంధీ (విదర్భ).