టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే భారత జట్టు ఇంటిముఖం పట్టడంతో చేతన్ శర్మ నేతృత్వంలో సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ప్యానల్ కోసం దరఖాస్తులను బీసీసీఐ ఆహ్హానించింది. అయితే నామినేషన్ల గడువు సోమవారం(నవంబర్ 28)తో ముగిసింది.
ఇక సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికోసం వెంకటేష్ ప్రసాద్, నయన్ మోంగియా, అజయ్ రాత్ర, మణిందర్ సింగ్, శివ సుందర్ దాస్ వంటి భారత మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోన్న చేతన్ శర్మతోపాటు సెలక్టర్ హర్విందర్ సైతం తిరిగి దరఖాస్తు చేశారు.
సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వెంకటేష్ ప్రసాద్!
ఇక టైమ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. సెలక్షన్ కమిటీ చైర్మన్ రేసులో టీమిండియా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత జానియర్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నందన బీసీసీఐ వెంకటేష్ ప్రసాద్ వైపే మెగ్గు చూపుతున్నట్లు సమాచారం.
2016-18 మధ్య కాలంలో జూనియర్ ఇండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రసాద్ పనిచేశాడు. 2018లో అండర్-19 ప్రపంచకప్‌ను యువ భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక భారత తరపున 161 వన్డేలు, 33 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన వరుసగా.. వరుసగా 196, 96 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2007 కైవసం చేసుకున్న భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వెంకటేష్ ప్రసాద్ పనిచేశాడు.
చదవండి: BCCI: సెలక్షన్ కమిటీ రేసులో ఉన్నారంటూ వార్తలు.. నేనసలు అప్లై చేయలేదు కదా!
Comments
Please login to add a commentAdd a comment