Team India Selector
-
టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో మాజీ స్పీడ్ స్టర్..!
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే భారత జట్టు ఇంటిముఖం పట్టడంతో చేతన్ శర్మ నేతృత్వంలో సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ప్యానల్ కోసం దరఖాస్తులను బీసీసీఐ ఆహ్హానించింది. అయితే నామినేషన్ల గడువు సోమవారం(నవంబర్ 28)తో ముగిసింది. ఇక సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికోసం వెంకటేష్ ప్రసాద్, నయన్ మోంగియా, అజయ్ రాత్ర, మణిందర్ సింగ్, శివ సుందర్ దాస్ వంటి భారత మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోన్న చేతన్ శర్మతోపాటు సెలక్టర్ హర్విందర్ సైతం తిరిగి దరఖాస్తు చేశారు. సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వెంకటేష్ ప్రసాద్! ఇక టైమ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. సెలక్షన్ కమిటీ చైర్మన్ రేసులో టీమిండియా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత జానియర్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నందన బీసీసీఐ వెంకటేష్ ప్రసాద్ వైపే మెగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2016-18 మధ్య కాలంలో జూనియర్ ఇండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రసాద్ పనిచేశాడు. 2018లో అండర్-19 ప్రపంచకప్‌ను యువ భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక భారత తరపున 161 వన్డేలు, 33 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన వరుసగా.. వరుసగా 196, 96 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2007 కైవసం చేసుకున్న భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వెంకటేష్ ప్రసాద్ పనిచేశాడు. చదవండి: BCCI: సెలక్షన్ కమిటీ రేసులో ఉన్నారంటూ వార్తలు.. నేనసలు అప్లై చేయలేదు కదా! -
'అమ్మ ఆశీస్సులతో అత్యుత్తమ జట్టు ఎంపిక చేస్తా'
విజయవాడ : అమ్మవారి ఆశీస్సులతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తానని టీమిండియా సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. బుధవారం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప దంపతులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే దసరా ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఐదో రోజు అమ్మవారు కాత్యాయనీ దేవి రూపంలో దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
టీమిండియా సెలెక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్
ముంబై: తెలుగువాడైన మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ భారత జట్టు జాతీయ సెలెక్టర్ గా ఎంపికయ్యాడు. శశాంక్ మనోహర్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్ లకు ఉద్వాసన పలికారు. వీరి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాలను నియమించారు. దీంతో ఆంధ్రా నుంచి జాతీయ సెలెక్టర్ గా ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రసాద్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. 6 టెస్టులు, 17 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1999-2000లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తరపున అతడు ఆడాడు. టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రిని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి తొలగించారు. గవర్నింగ్ సభ్యుల సంఖ్య 5కు కుదించారు. రాజీవ్ శుక్లాను ఐపీఎల్ చైర్మన్ గా కొనసాగించాలని నిర్ణయించారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్ గా అనిల్ కుంబ్లీ స్థానంలో గంగూలీని నియమించారు. విశాఖపట్నం, రాంచీ, ఇండోర్, పుణే, రాజ్ కోట్ స్టేడియాలను టెస్టు మ్యాచ్ లకు కొత్త వేదికలుగా ఎంపిక చేశారు.