WC 2023- Virat Kohli 49th Century: తొమ్మిది వేర్వేరు దేశాలపై సెంచరీలు... శ్రీలంకపై అత్యధికంగా 10... వెస్టిండీస్‌పై 9, ఆస్ట్రేలియాపై 8, న్యూజిలాండ్‌పై 5, బంగ్లాదేశ్‌పై 5, దక్షిణాఫ్రికాపై 5, పాకిస్తాన్‌పై 3, ఇంగ్లండ్‌పై 3, జింబాబ్వేపై ఒకటి..
అంతర్జాతీయ వన్డేల్లో.. టీమిండియా ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లి శతకాల రికార్డు ఇది.. అద్భుతమైన తన ఆట తీరుతో.. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఒంటిచేత్తో గెలుపు తీరాలకు చేర్చడమెలాగో తనకు తెలుసు..
కీలక సమయంలో అనవసరపు షాట్లకు పోయి వికెట్ పారేసుకోవడం తనకు ఇష్టం ఉండదు.. సింగిల్స్ తీస్తూ అయినా సరే లక్ష్యానికి చేరుకోవడంపై మాత్రమే తన దృష్టి..
మిగతా బ్యాటర్లు విఫలమైన చోట తాను ఒక్కడైనా పట్టుదలగా నిలబడి టీమ్‌ను గెలిపించాలనే తపన తప్ప తనకు ఇంకేమీ పట్టదు.. ఈ క్రమంలోనే వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు, అరుదైన మైలురాళ్లను చేరుకున్న సందర్భాలు..
క్రికెట్ కింగ్‌కు ఎదురులేదు
ఇలా ఇప్పటికే క్రికెట్ ‘కింగ్’ అన్న బిరుదును సార్థకం చేసుకున్న కోహ్లి.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు.
పటిష్ట సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 49వ సెంచరీ సాధించి క్రికెట్ దేవుడు, టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. తన సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి శిఖరాగ్రాన నిలిచాడు.
స్వార్థపరుడంటూ విమర్శలు
దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటగా.. కొంతమంది విమర్శకులు మాత్రం కోహ్లిని స్వార్థపూరితమైన క్రికెటర్‌గా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వ్యక్తిగత మైలురాళ్ల కోసం కోహ్లి జట్టు ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నాడనేది వారి అభిప్రాయం.
అయితే, కోహ్లి కెరీర్, అతడి ఆట తీరును సునిశితంగా గమనించిన వాళ్లకు ఇలాంటి మాటలు ఆగ్రహం తెప్పిస్తాయనడంలో సందేహం లేదు. టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు.
కోహ్లి స్వార్థపరుడన్న వాళ్లకు దిమ్మతిరిగేలా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘‘వ్యక్తిగత రికార్డుల కోసం కోహ్లి పరితపించిపోతున్నాడు. అతడొక స్వార్థపరుడు అంటూ కొంతమంది హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు.
అవును.. కోహ్లి స్వార్థపరుడే..
కోట్లాది మంది కలలను నిజం చేయడంలో అతడు పూర్తి స్థార్థంగా వ్యవహరిస్తున్నాడు.
ఇప్పటికే ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించినా..
కొత్త కొత్త బెంచ్‌మార్కులు సెట్‌చేస్తూ ముందుకు సాగుతున్నందుకు
అరుదైన ఘనతలెన్నో సాధించినా...
జట్టును గెలిపించేందుకు ఇప్పటికీ శాయశక్తులా కృషి చేస్తున్నందుకు..
అవును.. నిజంగానే కోహ్లి స్వార్థపరుడు’’
అంటూ జట్టు గురించే ఎక్కువగా ఆలోచించే కోహ్లిని ఇలా అనడం సరికాదంటూ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్(ట్విటర్) వేదికగా ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారగా.. విరాట్ కోహ్లి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: మాకు ఎటువంటి స్పెషల్ ప్లాన్స్ లేవు.. అతడొక ఛాంపియన్! జడ్డూ కూడా: రోహిత్ శర్మ
మాకు ముందే తెలుసు.. వారిద్దరూ అద్బుతం! సెమీస్‌లో కూడా: దక్షిణాఫ్రికా కెప్టెన్
Hearing funny arguments about Virat Kohli being Selfish and obsessed with personal milestone.
— Venkatesh Prasad (@venkateshprasad) November 6, 2023
Yes Kohli is selfish, selfish enough to follow the dream of a billion people, selfish enough to strive for excellence even after achieving so much, selfish enough to set new benchmarks,… pic.twitter.com/l5RZRf7dNx
Comments
Please login to add a commentAdd a comment