Venkatesh Prasad Slams BCCI Selectors For Ignoring Sarfaraz Khan In Indian Team - Sakshi
Sakshi News home page

Sarfaraz Khan: 'ఎంత బరువుంటే అన్ని సెంచరీలు చేస్తాడు'

Published Wed, Jan 18 2023 2:46 PM | Last Updated on Wed, Jan 18 2023 3:24 PM

Venkatesh Prasad Slams Selectors Sarfaraz Khan Not-Selecting India - Sakshi

దేశ‌వాళీ క్రికెట్‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ దుమ్మురేపుతున్నాడు. ఈ ఏడాది రంజీ సీజన్‌లో ఇప్పటికే మూడు సెంచరీలు బాదిన సర్ఫరాజ్‌ ఖాన్‌ నిలకడగా ఆడుతున్నప్పటికి జాతీయ జట్టు నుంచి పిలుపు మాత్రం రావడం లేదు. వయసు రిత్యా 25 ఏళ్లు అయినప్పటికి బారీ కాయంగా కనిపించే సర్ఫరాజ్‌ ఫిట్‌నెస్‌ విషయంలో మాత్రం ది బెస్ట్‌ అనిపిస్తున్నాడు.

రంజీల్లో ముంబై తరపున ఆడుతున్న సర్ఫరాజ్‌ బరువున్నా బ్యాటింగ్ మాత్రం సులువుగా చేస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ ప‌రుగుల ప్ర‌వాహం సృష్టిస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జ‌రిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయ‌క‌పోవ‌డం ప‌ట్ల సెలెక్ట‌ర్ల‌ను మాజీ క్రికెట‌ర్లు త‌ప్పుప‌డుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ బౌలర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''దేశ‌వాళీ క్రికెట్‌లో వ‌రుస‌గా మూడో సీజ‌న్‌లో కూడా స‌ర్ఫ‌రాజ్ బెంబేలెత్తిస్తున్నాడు. అలాంటి బ్యాట‌ర్‌ను టెస్టు జ‌ట్టుకు ఎంపిక చేయ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌ం.  సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడం దేశవాలీ క్రికెట్‌ను అవమానించ‌డ‌మేనని.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ప్లాట్‌ఫామ్‌ను ప‌ట్టించుకోకపోవ‌డ‌మే అవుతుంది. ప‌రుగులు సాధించేందుకు స‌ర్ఫ‌రాజ్ ఫిట్‌గా ఉన్నాడు.  అత‌ను ఎంత బ‌రువున్నాడో.. అన్ని సెంచ‌రీలు కొట్ట‌గ‌ల‌డు '' అని ప్ర‌సాద్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

చదవండి: ఓర్వలేనితనం అంటే ఇదే.. 

దుమ్మురేపుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌.. సీజన్‌లో మూడో సెంచరీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement