Sarfaraz Khan
-
టీమిండియాకు బ్యాడ్‌న్యూస్.. మిడిలార్డర్ ఆటగాడికి గాయం..?
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్ అందింది. ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా మిడిలార్డర్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ గాయపడ్డాడని తెలుస్తుంది. సర్ఫరాజ్ మోచేతికి గాయమైనట్లు కనిపిస్తున్న ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. గాయం అనంతరం సర్ఫరాజ్ మోచేతిని పట్టుకుని నెట్స్‌ను వీడాడు. ఈ వీడియోలో సర్ఫరాజ్ నొప్పితో బాధపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.ఒకవేళ సర్ఫరాజ్ ఖాన్ గాయం నిజంగా పెద్దదై అతను తొలి టెస్ట్‌కు దూరమైతే టీమిండియా కూర్పులో తేడాలొస్తాయి. ఇది భారత జట్టుకు శుభ పరిణామం కాదు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. ఆసీస్ పిచ్‌లపై అతడు తప్పక రాణిస్తాడని టీమిండియా మేనేజ్మెంట్ నమ్మకంగా ఉంది. 27 ఏళ్ల సర్ఫరాజ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో టెస్ట్ అరంగేట్రం చేశాడు. వరుస హాఫ్ సెంచరీలు చేసి కెరీర్‌ను ఘనంగా ప్రారంభించిన సర్ఫరాజ్.. న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్ట్‌లో సూపర్ సెంచరీతో (150) మెరిశాడు. అయితే ఆతర్వాత అతను కాస్త లయ తప్పాడు. సెంచరీ తర్వాత ఏడు ఇన్నింగ్స్‌ల్లో సర్ఫరాజ్ ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు.కాగా, భారత జట్టు కొద్ది రోజుల కిందట రెండు బ్యాచ్‌లుగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మిగతా జట్టంతా ఆస్ట్రేలియాకు చేరుకుంది. తొలి టెస్ట్‌కు వేదిక అయిన పెర్త్ వాకా స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. ఇక్కడి ఫాస్ట్ మరియు బౌన్సీ పిచ్‌లపై భారత ప్లేయర్లు నిర్విరామంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల చేత రోహిత్ శర్మ తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉండడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం ఇప్పటికే టీమిండియాకు తలనొప్పిగా మారింది. రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా ఎవరిని పంపాలని జట్టు మేనేజ్మెంట్ తలలు పట్టుకుంది. ఇప్పుడు సర్ఫరాజ్‌కు కూడా గాయమైతే టీమిండియా సమస్యలు తీవ్రతరమవుతాయి.ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.ట్రావెలింగ్ రిజర్వ్: ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్. -
కివీస్‌తో రెండో టెస్ట్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే
న్యూజిలాండ్‌తో సిరీస్‌ను పరాజయంతో ప్రారంభించిన టీమిండియా.. రెండో టెస్టులో విజయానికి గురిపెట్టింది. పుణెలో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. భారత్- కివీస్ జట్ల మధ్య గురువారం నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా శుబ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. గిల్ కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరిని తప్పిస్తారని విలేకరులు అడుగగా.. ‘‘శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. బెంగళూరులో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఇక తుదిజట్టులో ఎవరు ఉండాలన్న అంశంపై పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటాం.జట్టులో ఒకరికి చోటు నిరాకరించడం అనేది ఉండదు. సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులో అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ కాస్త నిరాపరిచిన మాట వాస్తవమే. అయితే, తను ఎన్ని బంతులు మిస్ చేశాడని అడిగినపుడు అందుకు బదులుగా ఒక్కటి కూడా మిస్ చేయలేదనే సమాధానమే వచ్చింది.ఒక్కోసారి ఇలాగే జరుగుతుంది. బాగా ఆడినా పరుగులు రాబట్టలేకపోవచ్చు. కాబట్టి కేఎల్ రాహుల్ గురించి ఆందోళన అక్కర్లేదు. తను మానసికంగానూ ఏమాత్రం అలసటకు గురికాలేదు. అయితే, అందుబాటులో ఉన్న ఆరు స్థానాల్లో ఏడుగురిని ఇరికించడం కుదరదు. కాబట్టి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌నే ఎంచుకుంటాం.ఇప్పటికైతే కేఎల్ రాహుల్ ఫామ గురించి మాకెలాంటి బెంగా లేదు. అతడి ఆట తీరుపై పూర్తి నమ్మకం ఉంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా గౌతీ(హెడ్‌కోచ్ గౌతం గంభీర్) తనకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్.. అతడు బెంగళూరులో 150 పరుగులు చేశాడు. ఇరానీ కప్ ఫైనల్లో డబుల్ సెంచరీ చేశాడు. కాబట్టి మిడిలార్డర్లో చోటు కోసం ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంది’’ అని టెన్ డష్కాటే తెలిపాడు.ఇక రిషభ్ పంత్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని పుణెలో జరుగనున్న రెండో టెస్టులో అతడే వికెట్ కీపింగ్ చేస్తాడని ఈ సందర్భంగా డష్కాటే సంకేతాలు ఇచ్చాడు. కాగా మెడనొప్పి కారణంగా శుబ్‌మన్ గిల్ బెంగళూరలో జరిగిన తొలి టెస్టుకు దూరం కాగా.. వన్‌డౌన్‌లో అతడి స్థానంలో విరాట్ కోహ్లి వచ్చాడు. కోహ్లి ఆడే నాలుగో స్థానంలో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ 0, 12 పరుగులు చేశాడు. -
ఇట్స్ బేబీ బాయ్: సర్ఫరాజ్ ఖాన్‌కు ప్రమోషన్(ఫొటోలు)
-
మాస్ హిట్టింగ్ తో న్యూజీలాండ్ కి చుక్కలు
-
బెంగళూరు టెస్టు.. ఆధిక్యంలోకి భారత్
Update: బెంగళూరు టెస్టులో భారత్ 32 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. దాదాపు రెండు గంటల విరామం తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. 79 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(85), సర్ఫరాజ్ ఖాన్(144) పరుగులతో ఉన్నారు.న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా అదరగొడుతోంది. భారత యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ కివీస్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.మరోవైపు గాయం నుంచి కోలుకుని బ్యాటింగ్ చేస్తున్న పంత్ కూడా తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే భారత్ జోరుకు వరుణుడు బ్రేక్‌లు వేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దీంతో 20 నిమిషాల ముందే లంచ్‌కు ఆటగాళ్లు వెళ్లిపోయారు.వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి టీమిండియా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 344 పరుగుల స్కోర్ చేసింది. ప్రస్తుతం భారత్ ఇంకా 12 పరుగులు వెనకంజలో ఉంది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(125), రిషబ్ పంత్(53) పరుగులతో ఉన్నారు. పంత్, ఖాన్ నాలుగో వికెట్‌కు ఇప్పటికే 113 పరుగులు జోడించారు. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అనంతరం కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.చదవండి: IND vs NZ: 'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు' -
'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు'
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్నతొలి టెస్టులో భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తాచాటుతున్నాడు. శుబ్‌మన్ గిల్ స్దానంలో జట్టులోకి వచ్చిన 26 ఏళ్ల ముంబైకర్.. మూడో రోజు ఆటలో దుమ్ములేపాడు.భారత పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. స్వీప్, ర్యాంప్ షాట్లు ఆడుతూ సర్ఫరాజ్ అలరించాడు. మూడు రోజు ఆట ముగిసే సమయానికి 70 పరుగులతో ఖాన్ అజేయంగా నిలిచాడు. నాలుగో రోజు భారత్ తమ రిథమ్‌ను కొనసాగించాలంటే వీలైనంత సమయం పాటు సర్ఫరాజ్ క్రీజులో ఉండాలి. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సర్ఫరాజ్‌ను భారత దిగ్గజ బ్యాటర్ జావేద్ మియాందాద్‌తో మంజ్రేకర్ పోల్చాడు."సర్పరాజ్ జావేద్ మియాందాద్‌ని గుర్తు చేస్తున్నాడు. 1980లలో జావేద్ ఈ విధంగానే ఆడేవాడు. సర్పరాజ్ మియాందాద్ 2024 వెర్షన్. అతడు ఆట తీరు నన్ను ఎంతోగానే ఆకట్టుకుంది. అతను స్పిన్‌ను బాగా ఆడతాడని మాకు తెలుసు, కానీ ఫాస్ట్ బౌలర్లను కూడా ఈ విధంగా ఆడుతాడని నేను అనుకోలేదు.అతడికి అద్భుతమైన గేమ్ ప్లాన్ ఉంది.మూడో రోజు ఆట ముగిసే సమయంలో తన వికెట్‌ను కోల్పోకుండా జాగ్రత్తపడ్డాడు. ఆఖరిలో డిఫెన్స్ ఆడుతూ మూడో రోజు ఆటను ముగించాడు. నాలుగో రోజు ఆటలో సర్ఫరాజ్ కీలకం కానున్నాడు. బౌన్సర్లను కూడా సర్ఫరాజ్ అద్బుతంగా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత్‌కు ఇది నిజంగా శుభసూచకమని" ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. భారత్ ఇంకా 125 పరుగుల వెనకంజలో ఉంది.చదవండి: IND vs AUS: ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రుతురాజ్! తెలుగోడికి చోటు? -
IND vs NZ: ఆ అద్భుతం సాధ్యమా!
బెంగళూరు: న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఓడిపోయి 37 ఏళ్లు గడిచాయి. 1987లో చివరిసారి భారత జట్టుకు న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై పరాజయం ఎదురైంది. సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి భారత జట్టుకు న్యూజిలాండ్ చేతిలో ఓటమి ముప్పు పొంచి ఉంది. అయితే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం... క్రీజులోకి రావాల్సిన భారత బ్యాటర్లకు భారీ స్కోర్లు చేసే సత్తా ఉండటంతో అద్భుతం జరుగుతుందా అనే ఆశ అభిమానుల్లో ఉంది. ఎందుకంటే 2001లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆ్రస్టేలియాతో జరిగిన టెస్టులోనూ భారత జట్టు ఇలాగే ప్రత్యరి్థకి తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సమరి్పంచుకొని... ఆ తర్వాత తిరిగి పుంజుకుని విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌కు 274 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ అసాధారణ ఆటతీరుతో కంగారూల నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఇప్పుడు తాజా మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌కు 356 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంత భారీ లోటును పూడ్చాలంటే... రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతం జరగాల్సింది. అలాంటి అరుదైన సందర్భానికి శుక్రవారం బ్యాటింగ్ చేసిన నలుగురు నాంది పలకగా... నాలుగో రోజు మిగిలిన వాళ్లు దాన్ని కొనసాగించాల్సి ఉంది. దేశవాళీల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన అనుభవం ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశి్వన్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. అయితే కీపింగ్ చేస్తూ గాయపడ్డ పంత్ బ్యాటింగ్ చేయడంపై స్పష్టత లేదు. సొంతగడ్డపై పూర్తిస్థాయి బ్యాటర్ల కన్నా మంచి ఇన్నింగ్స్‌లు ఆడే ఆల్‌రౌండర్లు అశి్వన్, జడేజా రాణించాల్సిన అవసరం ఉంది. టీమిండియాకు కనీసం రెండొందల పరుగుల ఆధిక్యం దక్కితే తప్ప... బెంగళూరులో బౌలర్లు కూడా పెద్దగా చేయగలిగిందేమీ లేదు! -
ముగిసిన మూడో రోజు ఆట.. 125 పరుగుల వెనుకంజలో భారత్
బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. మూడో రోజు చివరి బంతికి విరాట్ కోహ్లి (70) ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (70) క్రీజ్‌లో ఉన్నాడు.న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 125 పరుగులు వెనుకపడి ఉంది. భారత్ చేతిలో మరో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా రెండు రోజు ఆట మిగిలి ఉంది. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (35), రోహిత్ శర్మ (52), విరాట్ కోహ్లి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 2, గ్లెన్ ఫిలిప్స్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (134) సెంచరీతో, డెవాన్ కాన్వే (91), టిమ్ సౌథీ (65) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, అశ్విన్, బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46 పరుగులకే కుప్పకూలింది. మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఓరూర్కీ (4/22), సౌథీ (1/8) టీమిండియా పతనాన్ని శాశించారు. భారత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు (కోహ్లి, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్) డకౌట్ కాగా.. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రోహిత్ 2, కుల్దీప్ 2, బుమ్రా 1, సిరాజ్ 4 పరుగులు చేశారు.చదవండి: మరో అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్ -
IND VS NZ 1st Test: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో (సెకెండ్ ఇన్నింగ్స్) టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సర్ఫరాజ్ కేవలం 42 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో సర్ఫరాజ్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. కష్టాల్లో ఉన్న భారత్‌ను సర్ఫరాజ్, విరాట్ (49) గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (35), రోహిత్ శర్మ (52) ఔట్ కాగా.. విరాట్, సర్ఫరాజ్ (51) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 167 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కాలంటే మరో రెండు రోజులు బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచాల్సి ఉంది.కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఓరూర్కీ (4/22), సౌథీ (1/8) టీమిండియా పతనాన్ని శాశించారు. భారత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు (కోహ్లి, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్) డకౌట్ కాగా.. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రోహిత్ 2, కుల్దీప్ 2, బుమ్రా 1, సిరాజ్ 4 పరుగులు చేశారు.అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (134) సెంచరీతో, డెవాన్ కాన్వే (91), టిమ్ సౌథీ (65) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, అశ్విన్, బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్న యశస్వి -
Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్
ఇరానీ కప్ 2024లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఈ మార్కును తాకాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి సర్ఫరాజ్ 218 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్ (25) క్రీజ్‌లో ఉన్నాడు. 133.4 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 522/8గా ఉంది. ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అజింక్య రహానే (97), శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు వికెట్లు తీశారు.సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్రెస్ట్ ఆఫ్ ఇండియాపై సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు. సర్ఫరాజ్‌కు ఇరానీ కప్‌లో ఇది రెండో సెంచరీ కాగా.. సచిన్, ద్రవిడ్ కూడా ఇరానీ కప్‌లో తలో రెండు సెంచరీలు చేశారు. ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత దిలీప్ వెంగ్‌సర్కార్, గుండప్ప విశ్వనాథ్‌కు దక్కుతుంది. ఈ ఇద్దరు ఇరానీ కప్‌లో తలో నాలుగు సెంచరీలు చేశారు. వెంగ్‌సర్కార్, విశ్వనాథ్ తర్వాత ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత హనుమ విహారి, అభినవ్ ముకుంద్, సునీల్ గవాస్కర్, వసీం జాఫర్‌లకు దక్కుతుంది. వీరంతా ఈ టోర్నీలో తలో మూడు సెంచరీలు చేశారు.చదవండి: డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్ -
శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్
రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో కదంతొక్కాడు. సర్ఫరాజ్ 150 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సర్ఫరాజ్ సెంచరీతో సత్తా చాటడంతో రెండో రోజు లంచ్ సమయానికి (94 ఓవర్లలో) ముంబై జట్టు 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌తో పాటు తనుశ్ కోటియన్ (26) క్రీజ్‌లో ఉన్నాడు.SARFARAZ KHAN - THE STAR. ⭐- Yet Another day and yet another Hundred by Sarfaraz Khan in first Class, He has 15 Hundreds & 14 Fifties in First Class. 🤯pic.twitter.com/xIVR7ZV3TX— Tanuj Singh (@ImTanujSingh) October 2, 2024ముంబై ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే (97), శ్రేయస్ అయ్యర్ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. పృథ్వీ షా 4, ఆయుశ్ మాత్రే 19, హార్దిక్ తామోర్ 0, షమ్స్ ములానీ 5 పరుగులకు ఔటయ్యారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్ రెండు వికెట్లు తీశాడు. ఓవర్‌నైట్ స్కోర్ 237/4 వద్ద ముంబై రెండో రోజు ఆట మొదలుపెట్టిన విషయం తెలిసిందే.15వ ఫస్ట్ క్లాస్ సెంచరీరెస్ట్ ఆఫ్ ఇండియాపై చేసిన సెంచరీ సర్ఫరాజ్ ఖాన్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 15వది. ఈ సెంచరీతో సర్ఫరాజ్ యావరేజ్ 67 దాటింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇది ఐదో అత్యుత్తమ యావరేజ్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అతనికి ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా ఇరానీ కప్‌లోనూ అతనికి ఇది రెండో సెంచరీ.చదవండి: ఇరానీ కప్.. రాణించిన రహానే, సర్ఫరాజ్ -
ఇరానీ కప్.. రాణించిన రహానే, సర్ఫరాజ్
లక్నో: సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే (197 బంతుల్లో 86 బ్యాటింగ్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా, రంజీ చాంపియన్ ముంబై జట్ల మధ్య మంగళవారం ప్రారంభమైన ఇరానీక కప్ మ్యాచ్‌లో ముంబై సారథి రహానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రహానేతో పాటు టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్ (84 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (88 బంతుల్లో 54 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా అర్ధ శతకాలతో మెరిశారు.ఫలితంగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన రహానే చక్కటి ఇన్నింగ్స్ ఆడగా... ఓపెనర్ పృథ్వీ షా (4), ఆయుష్ మాత్రే (19), హార్దిక్ తమోర్ (0) విఫలమయ్యారు. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు బౌలర్లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లు తీయగా, యశ్ దయాళ్ ఒక వికెట్ పడగొట్టాడు. రహానేతో పాటు సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. -
అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0 క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి బంగ్లా-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను రిలీజ్ చేయాలని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయించుకున్నట్లు సమచారం. దేశవాళీ టోర్నీ ఇరానీ ట్రోఫీ కోసం సర్ఫరాజ్ పంపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆక్టోబర్ 1 నుంచి లక్నో వేదికగా ముంబై- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ ప్రారంభం కానుంది.ఇందులో సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరపున ఆడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ రెండు టెస్టుకు ముందు ఆఖరి నిమషంలో భారత జట్టులో ఎవరైనా గాయపడితే సర్ఫరాజ్ మళ్లీ వెనక్కి వచ్చే అవకాశముంది. కాగా తొలి టెస్టు తుది జట్టులో కూడా సర్ఫరాజ్‌కు చోటు దక్కలేదు. ఇప్పుడు రెండో టెస్టులో కూడా దాదాపు చెపాక్‌లో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్‌నే భారత జట్టు మెనెజ్‌మెంట్ కొనసాగించే ఛాన్స్ ఉంది."భారత జట్టులోని ప్రధాన బ్యాటర్లలో ఎవరికైనా ఫిట్నెస్ సమస్యలు లేదా గాయపడితే సర్ఫరాజ్‌కు రెండో టెస్టులో ఆడే అవకాశం కచ్చితంగా దక్కుతుంది. లేనియెడల ఇరానీ ట్రోఫీ కోసం అతడిని ప్రధాన జట్టు నుంచి రిలీజ్ చేసేందుకు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సిద్దంగా ఉన్నాడు. కాన్పూర్ నుంచి లక్నోకు ప్రయాణానికి కేవలం ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. తుది జట్టును ఎంపిక మ్యాచ్‌కు ముందే ఎంపిక చేస్తారు. కాబట్టి కాన్పూర్ టెస్ట్ ప్రారంభమైన తర్వాత కూడా సర్ఫరాజ్ లక్నోకు బయలుదేరవచ్చు అని బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. -
ఎట్టకేలకు నెరవేరిన కల.. కెప్టెన్‌గా సర్ఫరాజ్ ఖాన్
సీనియర్ల గైర్హాజరీ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు బంపరాఫర్ వచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించి కెప్టెన్ కావాలన్న అతడి కల నెరవేరింది. బుచ్చిబాబు టోర్నమెంట్-2024లో సర్ఫరాజ్‌ను ముంబై జట్టు కెప్టెన్‌గా నియమించింది యాజమాన్యం.కాగా దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలో గత రంజీ సీజన్ ట్రోఫీని ముంబై గెలుచుకుంది. ఇక ఆ సమయంలో షామ్స్ ములానీ రహానే డిప్యూటీగా.. వైస్ కెప్టెన్‌గా వ్యహరించాడు. అయితే, రహానే ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీలతో బిజీగా ఉన్నాడు. లీసెస్టర్‌షైర్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.మరోవైపు.. షామ్స్ ములానీ జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఇక పృథ్వీ షా సైతం ఇంగ్లండ్‌లో బిజీగా ఉండగా.. శ్రేయస్ అయ్యర్ శ్రీలంకతో వన్డే సిరీస్ ద్వారా టీమిండియాలో పునరాగమనం చేసి ప్రస్తుతం జట్టుతో పాటు కొనసాగుతున్నాడు.కెప్టెన్‌గా సర్ఫరాజ్ ఖాన్ఇలా సీనియర్లంతా తమ తమ షెడ్యూల్‌తో బిజీగా ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్‌కు కెప్టెన్‌గా అవకాశం దక్కింది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ ధ్రువీకరించాడు. ‘‘అజింక్య రహానే అందుబాటులో ఉంటే అతడే కెప్టెన్‌గా ఉండేవాడు. ఒకవేళ అతడు జట్టుతో లేకపోయినా మాకు కావాల్సినన్ని ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం జట్టులో సర్ఫరాజ్ ఖాన్ సీనియర్ మోస్ట్ ప్లేయర్. అతడే ఈ టోర్నీలో మా కెప్టెన్‌గా ఉంటాడు’’ అని సంజయ్ పాటిల్ ‘మిడ్ డే’తో పేర్కొన్నాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తుదిజట్టులో కూడా చోటు దక్కించుకుని హాఫ్ సెంచరీలతో మెరిశాడు. మూడు టెస్టులాడి 200 పరుగులు సాధించాడు. అయితే, కేఎల్‌రాహుల్, రిషభ్ పంత్ వంటి సీనియర్ల రాకతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికవుతాడా?లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.బుచ్చిబాబు టోర్నమెంట్-2024కు ముంబై జట్టుసర్ఫరాజ్ ఖాన్ (కెప్టెన్), సిద్ధేశ్ లాడ్, దివ్యాంశ్ సక్సేనా, అమోగ్ భత్కల్, అఖిల్ హెర్వాద్కర్, ముషీర్ ఖాన్, నూతన్ గోయల్, సూర్యాన్ష్ షెడ్గే, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, తనూష్ కొటియన్, అథర్వ అంకోలేకర్, హిమాన్షు సింగ్, ధనిత్ రౌత్, సిల్వెస్టర్ డిసౌజా, జునైద్ ఖాన్, హర్ష్ తనా.కాగా నాటి మద్రాస్ ప్రెసిడెన్సీకి మోతవరపు మహిపతి నాయుడు బుచ్చిబాబు నాయుడుగా సుపరిచితులు. 1868లో జన్మించిన ఆయన.. స్వదేశీయులకు క్రికెట్ క్లబ్లో అవకాశాలు కల్పించారు. క్రికెట్ జట్లలో వివక్షకు తావులేకుండా గొంతెత్తారు. ఆయన పేరు మీదుగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బుచ్చిబాబు నాయుడు టోర్నమెంట్ నిర్వహిస్తోంది. రెడ్‌బాల్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. -
ఈ టీమిండియా స్టార్ల సక్సెస్ వెనుక హీరోలు తండ్రులే..!
ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి హీరో, మొదటి గురువు నాన్నే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాలంటే అందులో కీలకపాత్ర తండ్రిదే. నాన్న పిల్లల చేయి పట్టుకుని ప్రపంచానికి పరిచయం చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. పిల్లల ఉన్నతి కోసం అహర్నిశలూ శ్రమించి సర్వస్వం ధారపోస్తాడు.తాను పడ్డ కష్టాలు, తాను చేసిన త్యాగాలకు ఏనాడూ ప్రతిఫలం ఆశించని నిస్వార్థ వ్యక్తి నాన్న. అలాంటి త్యాగమూర్తికి 'ఫాదర్స్ డే'ను (జూన్ 16) పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేద్దాం.ప్రతి మనిషి సక్సెస్ వెనుక నిజమైన హీరో తండ్రే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాడంటే దాని వెనుక తండ్రిదే ప్రధానపాత్ర. ఫాదర్స్ డే సందర్భంగా క్రీడారంగానికి (క్రికెట్) సంబంధించి బిడ్డల కోసం త్యాగాలు చేసిన తండ్రులపై ఓ ప్రత్యేక కథనం.శుభ్‌మన్ గిల్-లఖ్విందర్ సింగ్: భారత క్రికెట్ జట్టు ప్రిన్స్‌గా పిలువబడే శుభ్‌మన్ గిల్ తండ్రి పేరు లఖ్విందర్ సింగ్. లఖ్విందర్ సింగ్ తన కొడుకు క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. గిల్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో రాణిస్తున్నాడంటే అది తండ్రి లఖ్విందర్ చలువే. గిల్ కెరీర్ కోసం లఖ్విందర్ ఎన్నో త్యాగాలు చేశాడు. ఇండియా-పాకిస్తాన్ బోర్డర్లోని ఫాజిల్కా అనే కుగ్రామానికి చెందిన లఖ్విందర్.. కొడుకు కెరీర్లో కోసం 300 కిమీ దూరంలో ఉన్న మొహాలీ నగరానికి మకాం మార్చాడు. గిల్‌ను క్రికెటర్ చేసేందుకు లఖ్విందర్ 15 సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్నాడు. తిండి పెట్టే వ్యవసాయాన్ని సైతం వదిలి పెట్టి నగరవాసం చేశాడు.గిల్ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో లఖ్విందర్ తన గ్రామంలో జరిగే ఏ శుభకార్యానికి హాజరుకాలేదు. తాను ఫంక్షన్లకు వెళితే కొడుకు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఏవో కారణాలు చెప్పి హాజరయ్యేవాడు కాదు. గిల్‌కు ఆటపై ఉన్న ఆసక్తిని గమనించిన లఖ్విందర్ ఊరిలో ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు. తానే కోచ్‌గా మారి గిల్‌ను ప్రతి రోజు 500-700 బంతులు ఆడేలా చేసేవాడు. బ్యాట్‌తో ఆడేప్పుడు మిడిల్ చేసేందుకు తోడ్పడుతుందని వికెట్‌తో ప్రాక్టీస్ చేయించేవాడు. గిల్ ప్రస్తుత తరం క్రికెటర్లలో అగ్రగణ్యుడిగా ఉన్నాడంటే దాని వెనుక తండ్రి లఖ్విందర్ చేసిన ఇలాంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి.యువరాజ్ సింగ్-యోగ్రాజ్ సింగ్: టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్, టు టైమ్ వరల్డ్‌కప్ విన్నర్ యువరాజ్ సింగ్ తండ్రి పేరు యోగ్రాజ్ సింగ్. స్వతాహాగా క్రికెటర్ అయిన యోగ్రాజ్ సింగ్.. యువరాజ్ క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. భారత్ తరఫున ఆరు వన్డేలు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడిన యోగ్రాజ్.. క్రికెట్లో తాను సాధించలేని ఉన్నతిని తన కొడుకు ద్వారా సాకారం చేసుకోవాలని కోరుకున్నాడు. ఇందుకోసం తన కొడుకు చాలా కష్టపెట్టాడు. యువరాజ్‌కు చిన్నతనంలో క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. యువరాజ్ స్కేటింగ్‌లో రాణించాలని అనుకున్నాడు. ఇందులో ఓ గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. తన కొడుకు క్రికెటర్‌గానే రాణించాలని భీష్మించుకు కూర్చున్న యోగ్రాజ్.. యువరాజ్ సాధించిన గోల్డ్ మెడల్‌ను విసిరికొట్టి, క్రికెట్‌పై ఏకగ్రాత సాధించేలా చేశాడు. తొలుత అయిష్టంగానే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన యువరాజ్ నెమ్మదిగా ఆటపై పట్టు సాధించి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కించుకున్నాడు. యువరాజ్ తండ్రి మాట పెడచెవిన పెట్టి ఉంటే భారత్ క్రికెట్ ఓ గొప్ప యోధుడి సేవలను కోల్పోయి ఉండేది. యువరాజ్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టైటిళ్లను సొంతం చేసుకుంది.సర్ఫరాజ్ ఖాన్-నౌషద్ ఖాన్: టీమిండియా యంగ్ తరంగ్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి పేరు నౌషద్ ఖాన్. సర్ఫరాజ్ అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో (టెస్ట్‌ల్లో) అడుగుపెట్టిన తొలినాళ్లలోనే గుర్తింపు తెచ్చుకున్నాడంటే దాని వెనుక అతని తండ్రి ఊహకందని త్యాగం, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉన్నాయి. చిన్నతనం నుంచి సర్ఫరాజ్‌ను క్రికెటర్ చేయాలని పరితపించిన నౌషద్ ఖాన్ తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన కొడుకు ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించాడు. ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు నౌషద్ తన కొడుకును ఎంతో కష్టపెట్టాడు, బాధించాడు. సర్ఫరాజ్‌కు తండ్రే కోచ్‌గా, మెంటార్ వ్యవహరించాడు. సర్ఫరాజ్‌కు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నౌషద్ బిడ్డతో పాటు శ్రమించి తాననుకున్న లక్ష్యాన్ని నేరవేర్చుకున్నాడు. సర్ఫరాజ్ టీమిండియా అరంగేట్రం ప్రతి క్రికెట్ అభిమానిని భావోద్వేగానికి గురి చేసింది. సర్ఫరాజ్ తొలి టెస్ట్‌కు ముందు నౌషద్ మైదానంలో కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రతి భారతీయుడి మనసును హత్తుకున్నాయి. -
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి సర్ప్రైజ్ గిఫ్ట్! వీడియో
టీమిండియా తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన బ్యాటర్లలో ఒకడిగా పేరొందాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీల్లో పరుగుల వరద పారించినా.. భారత జట్టులో చోటు కోసం మాత్రం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది ఈ ముంబై ప్లేయర్‌కి! అయితేనేం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్.. మెరుపు అర్ధ శతకం సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్‌కు తన తండ్రి నౌషద్ ఖాన్ కోచ్, మెంటార్ అన్న విషయం తెలిసిందే. అరంగేట్రం సందర్భంగా టీమిండియా క్యాప్‌ను ముద్దాడి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు నౌషద్. కుమారుడి కోసం తాను చేసిన త్యాగాలు ఫలించినందుకు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత గొప్ప వ్యక్తికి బహుమతిగా ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును మెలిపెట్టగా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘ఎప్పుడూ ధైర్యం కోల్పోకూడదు. కఠిన శ్రమ, ఓపిక ఉండాలి. తండ్రి కంటే తన పిల్లలను ఇంత బాగా ఇన్స్పైర్ చేయగల వ్యక్తి ఎవరు ఉంటారు? అలాంటి గొప్ప వ్యక్తి నౌషద్ ఖాన్.. ఆయన గనుక ఒప్పుకొంటే.. మహీంద్రా థార్‌తో సత్కరించాలనుకుంటున్నా’’ అని బహుమతి ప్రకటించారు. తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్ర. సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం సందర్భంగా చెప్పినట్లుగా నౌషద్ ఖాన్‌కు మహీంద్రా కారును అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 200 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సర్ఫరాజ్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఇటీవలే అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేర్చింది. గ్రేడ్- సీ ప్లేయర్‌గా సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశమిచ్చింది. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి ఇది తగునా కోహ్లి? Anand Mahindra fulfilled his promise and gifted a Mahindra Thar to Sarfaraz Khan's father, Naushad. Mahindra had promised to give the gift following Sarfaraz's Test debut. His father played a key role in Sarfaraz's success and coached him right from childhood. pic.twitter.com/Ktf070Qf5U — Sanjay Kishore (@saintkishore) March 23, 2024 -
ధనాధన్ దంచికొట్టుడు.. పులి ఆకలి మీదున్నట్లు ఉంది!
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అర్ధ శతకం సాధించాడు. కేవలం 55 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని రెండో రోజు ఆటలో తనదైన ముద్ర వేశాడు. కాగా ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ కెరీర్లో ఇది మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక ధర్మశాలలో జరుగుతున్న తాజా మ్యాచ్‌లో మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 56 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇవ్వడంతో సర్ఫరాజ్ సూపర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అయితే, క్రీజులో ఉన్నది కాసేపే అయినా తనదైన షాట్లతో అలరించిన సర్ఫరాజ్ ఖాన్‌పై మరో ముంబై బ్యాటర్, టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘పులి బాగా ఆకలి మీద ఉన్నట్లుంది’’ అని సూర్య పేర్కొన్నాడు. సర్ఫరాజ్ పరుగుల దాహం తీరనిదంటూ ఆట పట్ల అతడి అంకితభావాన్ని చాటిచెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌లో ఆఖరిదైన ధర్మశాల టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుబ్‌మన్ గిల్(110) సెంచరీలకు తోడు.. అరంగేట్ర బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆట ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 255 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. Wood's got pace? Sarfaraz has the answer 😎#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSport pic.twitter.com/htRkcp57X1 — JioCinema (@JioCinema) March 8, 2024 చదవండి: అది ముమ్మాటికి తప్పే.. తనిప్పుడు పెద్దవాడు అయ్యాడు కాబట్టే: గిల్ తండ్రి -
అద్భుతమైన ర్యాంప్ షాట్ ఆడిన సర్ఫరాజ్.. సహనం కోల్పోయిన మార్క్ వుడ్
IND VS ENG 5th Test Day 2: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్ కేవలం 55 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో కెరీర్లో మూడో అర్ధశతకాన్ని సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్దసెంచరీలు (62, 68 నాటౌట్) చేసిన సర్ఫరాజ్.. తన రెండో టెస్ట్‌లో విఫలమైనా (14, 0) తిరిగి మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనే మెరుపు అర్దసెంచరీతో సత్తా చాటాడు. టీ విరామం సమయానికి సర్ఫరాజ్ 56 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా పడిక్కల్ (44) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 376 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, ఆండర్సన్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు కుప్పకూలింది. Showing his shots 🔥pic.twitter.com/h4I1Jks4lt — CricTracker (@Cricketracker) March 8, 2024 ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, రెండో రోజు ఆటలో మార్క్ వుడ్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఆడిన అద్భుతమైన ర్యాంప్ షాట్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఈ షాట్‌కు టీమిండియా అభిమానులు ముగ్దులవుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇది ట్రేడ్ మార్క్ షాట్. ఇతను చాలా సందర్భాల్లో ఇలాంటి షాట్లు ఆడాడు. నాలుగో టెస్ట్‌లో దృవ్ జురెల్ సైతం వుడ్ బౌలింగ్‌లో ఇదే తరహా ర్యాంప్ షాట్ ఆడాడు. సర్ఫరాజ్ ర్యాంప్ షాట్‌ను అద్భుతంగా ఆడటంతో సహనం కోల్పోయిన వుడ్ అతనిపై స్లెడ్జింగ్‌కు దిగాడు. వుడ్ స్టెడ్జింగ్ను ఏమాత్రం పట్టించుకోని సర్ఫరాజ్ తన సహజశైలిలో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. -
సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్‌లకు జాక్‌పాట్
టీమిండియా బ్యాటింగ్ సంచలనాలు సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్‌లకు జాక్‌పాట్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇంగ్లండ్‌తో జరుగబోయే తదుపరి టెస్ట్‌లో ఈ ఇద్దరు తుది జట్టులో ఉంటే, వీరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు దక్కనున్నాయి. బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కాలంటే ఆటగాళ్లు టీమిండియా తరఫున కనీసం 3 టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే వీరిద్దరు ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లే ఆడారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వీరిద్దరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. మూడు మ్యాచ్‌ల అనంతరం వీరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల తాజా ఫామ్‌ను బట్టి చూస్తే వీరు ఐదో టెస్ట్‌కు తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖాయమేనని చెప్పాలి. దీంతో వీరికి గ్రేడ్ సి కింద బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడం దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. కాగా, 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. రంజీల్లో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్‌లను కోల్పోగా.. రింకూ సింగ్ (సి), తిలక్ వర్మ (సి), ప్రసిద్ద్ కృష్ణ (సి), అవేశ్ ఖాన్ (సి), రజత్ పాటిదార్ (సి), జితేశ్ శర్మ (సి), ముకేశ్ కుమార్ (సి), రవి బిష్ణోయ్‌కు (సి) కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. శ్రేయస్ (బి), ఇషాన్‌లతో (సి) పాటు యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
Ind vs Eng: గోల్డెన్ డకౌట్.. ఇదేంటి సర్ఫరాజ్? నువ్విలా..
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులే చేసిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై పెద్ద ఎత్తున మీమ్స్ వస్తున్నాయి. ‘‘నిన్ను పొగిడితేనే బ్యాట్ ఝులిపించగలవా ఏంటి? అయినా ఇప్పటికే నీకు రావాల్సిన దానికంటే.. చాలా ఎక్కువ క్రెడిట్ వచ్చేసింది భయ్యా! ఇంకా పొగడటం మా వల్ల కాదు’’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో ధ్రువ్ జురెల్ పేరును ప్రస్తావిస్తూ కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టు సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో వరుసగా రెండు అర్ధ శతకాలు(62, 68 నాటౌట్) బాదాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. తద్వారా తొలి టెస్టులోనే ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా దిలావర్ హుసేన్, సునిల్ గావస్కర్, శ్రేయస్ అయ్యర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అయితే, తన రెండో మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ పూర్తిగా తేలిపోవడం గమనార్హం. రాంచి టెస్టులో రెండుసార్లూ ఇంగ్లండ్ స్పిన్నర్ల చేతికే చిక్కాడు. రెండు ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్ వికెట్‌ను.. టామ్ హార్లే, షోయబ్ బషీర్ దక్కించుకున్నారు. కాగా రాంచి మ్యాచ్‌లో విజయానికి టీమిండియా 52 పరుగుల దూరంలో ఉన్న సమయంలో సర్ఫరాజ్ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో అభిమానులు విమర్శలు గుప్పించారు. అయితే, సర్ఫరాజ్ మాత్రం డగౌట్లో కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ మధ్య కూర్చుని చిల్ అవుతూ కనిపించాడు. "Mauj masti rukni nahi chahiye" vibes. pic.twitter.com/C2jRAfcrql — Silly Point (@FarziCricketer) February 26, 2024 ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్(52- నాటౌట్), ధ్రువ్ జురెల్(39 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. మొత్తంగా 129 పరుగులు చేసిన జురెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 -
ఓ పక్క అన్న.. మరో పక్క తమ్ముడు.. రఫ్ఫాడిస్తున్న ఖాన్ బ్రదర్స్
ప్రస్తుతం భారత క్రికెట్లో రెండు పేర్లు మార్మోగిపోతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా ముంబై ఆటగాళ్లు, అన్నదమ్ములు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ ఖాన్ బ్రదర్స్ ప్రపంచ క్రికెట్లోనూ హాట్ టాపిక్‌గా మారారు. వచ్చీ రాగానే ఇరగదీసిన సర్ఫరాజ్.. దేశవాలీ క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగి అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడిన సర్ఫరాజ్ ఖాన్.. అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చీ రాగానే తనదైన మార్కును చూపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్ట్‌తో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తొలి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసి టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. సంచలనాల ముషీర్.. సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ విషయానికొస్తే.. 18 ఏళ్ల ఈ కుడి చేతి వాటం బ్యాటర్ అన్న అడుగుజాడల్లోనే నడుస్తూ అద్భుతాలు చేస్తున్నాడు. ఇటీవల ముగిసిన అండర్ 19 వరల్డ్‌కప్‌లో సెంచరీల మోత మోగించి, పరుగుల వరద (7 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 360 పరుగులు) పారించిన ముషీర్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ క్వార్టర్ ఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగి అద్భుతమైన సెంచరీతో ఇరగదీశాడు. శివమ్ దూబే, శ్రేయస్ అయ్యర్ తప్పుకోవడంతో చివరి నిమిషంలో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ముషీర్.. బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి సెంచరీతో మెరిశాడు. ఈ సెంచరీని ముషీర్ 179 బంతుల్లో పూర్తి చేశాడు. ముషీర్ సెంచరీతో కదంతొక్కడంతో ముంబై సేఫ్ జోన్లోకి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఎందుకంత హైప్.. క్రికెట్లో అన్నదమ్ములు కలిసి ఆడటం, ఇద్దరూ అద్భుతంగా రాణించడం వంటి ఘటనలు గతంలో చాలా సందర్భాల్లో చూశాం. అయితే ఈ ఖాన్ బ్రదర్స్ పరిస్థితి ఇందుకు భిన్నం. ఎందుకంటే సర్ఫరాజ్, ముషీర్లకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి వెనుక చాలా కష్టం దాగి ఉంది. సర్ఫరాజ్, ముషీర్ల తండ్రి నౌషద్ ఖాన్ పేదరికంతో పోరాడి ఈ ఇద్దరి కెరీర్ల కోసం జీవితాన్నే త్యాగం చేశాడు. సర్ఫరాజ్ టీమిండియా తరఫున అరంగ్రేటం చేశాక నౌషద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. -
సర్పరాజ్ తండ్రికి బహుమతిగా థార్ జీప్
-
టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికేశాడు.. వన్డేల్లో కూడా ఎంట్రీ పక్కా?
సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తన తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం 68 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఓవరాల్‌గా రెండో ఇన్నింగ్స్‌లు 130 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటకీ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక అరంగేట్రంలోనే అకట్టుకున్న సర్ఫరాజ్‌పై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టుకు సరైన మిడిలార్డర్ బ్యాటర్ దొరికేశాడని మంజ్రేకర్ కొనియాడాడు. "సర్ఫరాజ్ తన తొలి మ్యాచ్‌లోనే సంచలన ప్రదర్శన కనబరిచాడు. నా వరకు అయితే భారత్‌కు మరో అద్భుతమైన మిడిలార్డర్ బ్యాటర్ దొరికాడని అనుకుంటున్నాను. టెస్టుల్లోనే కాదు వన్డేల్లో కూడా సర్ఫరాజ్ మంచి ఎంపికనే. వైట్‌బాల్ ఫార్మాట్లో కూడా మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి అద్బుతాలు సృష్టిస్తాడని భావిస్తున్నానని" ఎక్స్‌లో మంజ్రేకర్ రాసుకొచ్చాడు. కాగా సర్ఫరాజ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో దుమ్మురేపి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 46 మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబై ఆటగాడు 70.91 సగటుతో 4042 పరుగులు చేశాడు. చదవండి: ధోని కెప్టెన్సీలో అరంగేట్రం.. రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఓపెనర్! I think India have found a very good 50 overs middle order batter option, to bat in the middle stages, with 5 fielders inside the circle, it’s Sarfraz Khan. — Sanjay Manjrekar (@sanjaymanjrekar) February 18, 2024 -
మొన్న సర్ఫరాజ్.. ఇవాళ గిల్
సహచర ఆటగాళ్ల తప్పిదాల కారణంగా రనౌట్లు కావడం ఇటీవలికాలంలో చాలా ఎక్కువైంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సహచరుడు రవీంద్ర జడేజా తప్పిదానికి బలైపోగా.. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. నాలుగో రోజు ఆటలో టీమిండియా యంగ్ గన్ శుభ్‌మన్ గిల్.. సహచరుడు కుల్దీప్ యాదవ్ రాంగ్ కాల్ కారణంగా రనౌటయ్యాడు. A heart-breaking run-out for Shubman Gill....!!!!pic.twitter.com/GoFZ3OEeOl — Johns. (@CricCrazyJohns) February 18, 2024 ఈ రెండు ఘటనల్లో స్ట్రయికింగ్‌లో ఉన్న ఆటగాళ్లే (జడేజా, కుల్దీప్) తొలుత పరుగుకు పిలుపున్చి ఆ తర్వాత వెనక్కు తగ్గారు. ఈ రెండు సందర్భాల్లో రాంగ్ కాల్‌కు బలైపోయిన ఆటగాళ్లు మాంచి ఊపులో ఉన్నప్పుడు రనౌటయ్యారు. సర్ఫరాజ్ ఖాన్ రనౌటయ్యే సమయానికి మెరుపు అర్ధసెంచరీ (66 బంతుల్లో 62 పరుగులు; 9 ఫోర్లు, సిక్స్) చేసి జోరు మీదుండగా.. ఇవాళ జరిగిన దురదృష్ట ఘటనలో గిల్ సెంచరీకి తొమ్మిది పరుగులు దూరంలో (151 బంతుల్లో 91; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నప్పుడు ఔటయ్యాడు. సర్ఫరాజ్, గిల్ రనౌట్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. కాగా, రాజ్‌కోట్ టెస్ట్ నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 440 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (149), సర్ఫరాజ్ ఖాన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. ఇవాల్టి ఆటలో శుభ్‌మన్ గిల్‌తో పాటు కుల్దీప్ యాదవ్ (27) ఔటయ్యాడు. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) -
సర్ఫరాజ్‌ను ముంచేశాడు.. రోహిత్‌కు నచ్చలేదు!
టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు.. మరొకరికి సాయం చేసే క్రమంలో అన్యాయంగా అవుటయ్యాడని పేర్కొన్నాడు. కాగా రంజీల్లో పరుగుల వరద పారించి.. ఎన్నో రికార్డులు సృష్టించిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా అతడు టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ప్రత్యర్థి జట్టు ఎంతటి పటిష్ట బౌలింగ్ దళం కలిగి ఉన్నా.. తనకు లెక్కలేదన్నట్లుగా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించాడు. తొలి రోజు ఆటలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్.. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 అయితే, దురదృష్టవశాత్తూ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. నిజానికి స్ట్రైకర్ ఎండ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన తప్పిదానికి సర్ఫరాజ్ బలైపోయాడు. పరుగు తీస్తే సెంచరీ పూర్తి చేసుకోవచ్చన తొందరలో లేని పరుగు కోసం జడ్డూ.. పిలుపునివ్వగా సర్ఫరాజ్ క్రీజును వీడాడు. అయితే, బంతిని గమనించిన జడ్డూ మళ్లీ వెనక్కి వెళ్లగా.. అంతలోనే ఫీల్డర్ మార్క్ వుడ్ బాల్‌ను అందుకుని స్టంప్‌నకు గిరాటేశాడు. ఫలితంగా సర్ఫరాజ్ రనౌట్ అయ్యాడు. ఈ ఘటన గురించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ స్పందిస్తూ.. ‘‘తన స్వార్థం కోసం రవీంద్ర జడేజా .. యువ బ్యాటర్ అద్భుత ఇన్నింగ్స్‌ను నాశనం చేశాడు. పాపం.. ఆ యంగ్‌స్టర్ సింగిల్‌కు రమ్మనగానే పరిగెత్తాడు. అంతలో జడేజా తాను వెనక్కి వెళ్లి పోయి, అతడినీ వెళ్లమన్నాడు. వుడ్ మాత్రం వేగంగా స్పందించి స్టంప్స్‌ను గిరాటేశాడు. నిజానికి జడ్డూ చేసిన పని రోహిత్ శర్మకు ఎంతమాత్రం నచ్చలేదు’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ ఖాన్ తన కారణంగా రనౌట్ అయ్యాడంటూ జడ్డూ మ్యాచ్ అనంతరం క్షమాపణలు చెప్పాడు. ఇందుకు బదులుగా.. భయ్యా వల్లే నేను స్వేచ్ఛగా ఆడగలిగానంటూ సర్ఫరాజ్.. జడేజాకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ సెంచరీ(112) సాధించాడు. టెస్టుల్లో ఈ ఆల్‌రౌండర్‌కు ఇది నాలుగో శతకం కావడం విశేషం. చదవండి: Virat Kohli: లండన్‌లోనే ఆ బిడ్డ జననం.. మీకు ఆ హక్కు లేదు! మరీ చెత్తగా.. -
రోహిత్‌కు సర్ఫరాజ్ తండ్రి రిక్వెస్ట్.. రియాక్షన్ వైరల్
Dhyan Rakhna Sir- Sarfaraz Khan's Father: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జట్టులో స్థానం సంపాదించిన భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రంతోనే క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ అడుగుపెట్టిన ఈ ముంబై ఆటగాడు అర్ధ శతకంతో ఆగమనాన్ని ఘనంగా చాటాడు. రాజ్‌కోట్ మ్యాచ్‌లో 48 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. సెంచరీకి ఒక పరుగుకు దూరంగా ఉన్న సమయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పిలుపు మేరకు.. క్రీజును వీడి మూల్యం చెల్లించాడు. ఫలితంగా 62 పరుగుల వద్ద సర్ఫరాజ్ ధనాధన్ ఇన్నింగ్స్(66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్) ముగిసిపోయింది. అయితే, ఆ తర్వాత జడ్డూ తన తప్పునకు సర్ఫరాజ్‌కు క్షమాపణ చెప్పగా.. అతడు కూడా హుందాగా బదులిచ్చాడు. జడ్డూ భయ్యా ఇచ్చిన ప్రోత్సాహం వల్లే స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించానని పేర్కొన్నాడు. ఇలా తొలి రోజే ఆటగాడిగా తనదైన మార్కు వేయగలిగాడు సర్ఫరాజ్ ఖాన్. అయితే, అంతకంటే ముందు.. అరంగేట్రం సందర్భంగా సర్ఫరాజ్ కంటే కూడా అతడి తండ్రి నౌషద్ ఖాన్ అభిమానుల దృష్టిని ఆకర్షించారు. The way his father kissed the cap 🧢😭🤌❤️🔥🫀🥺 No one will pass without liking this ♥️#INDvsENGTest #SarfarazKhan #INDvsENG #Sora #LoveIsBlind #rohitsharma #Ashwin 500 Test pic.twitter.com/vF4FpjZBJy — Guru Choudhary (@_guru_choudhary) February 16, 2024 కుమారులను అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అనేక కష్టనష్టాలకు ఓర్చి.. తానే కోచ్‌గా, మెంటార్‌గా ఉన్న నౌషద్.. పెద్ద కొడుకు సర్ఫరాజ్‌ను చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. సర్ఫరాజ్ అనిల్ కుంబ్లే నుంచి టెస్టు క్యాప్ అందుకోగానే కన్నీటి పర్యంతమయ్యారు. క్యాప్‌ను ముద్దాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. నౌషద్ ఖాన్ పట్ల వ్యవహరించిన తీరు అభిమానుల మనసు దోచుకుంది. ‘‘సర్ఫరాజ్ కోసం మీరెన్ని త్యాగాలు చేశారో, ఎంత కఠిన శ్రమకోర్చారో అందరికీ తెలుసు. మీ ఇద్దరికి శుభాకాంక్షలు’’... అని రోహిత్.. నౌషద్ ఖాన్‌ను అభినందించాడు. ఇందుకు అతడు స్పందిస్తూ.. ‘‘దయచేసి.. మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి సర్’’ అని అభ్యర్థించాడు. బదులుగా.. ‘‘తప్పకుండా.. మీరేం బాధపడకండి’’ అంటూ హిట్‌మ్యాన్ హుందాతనాన్ని చాటుకున్నాడు. అంతేగాకుండా నౌషద్ ఖాన్‌ను ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మీరూ చూసేయండి! అన్నట్లు రోహిత్ శర్మ అవుట్ కాగానే.. అతడి ప్లేస్‌లో సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి రావడం విశేషం. ఈ సందర్భంగా యువ బ్యాటర్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ హిట్‌మ్యాన్ అతడి వెన్నుతట్టాడు. చదవండి: #Dhruv Jurel: 146 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బౌన్సర్.. కొడితే సిక్సరే! వీడియో A journey that is all heart 🫶🥹 Hear from a proud father on a very memorable day for Sarfaraz Khan 🤗 - By @ameyatilak#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/Imk7OTuSVM — BCCI (@BCCI) February 15, 2024 -
శతకాలతో శుభారంభం
బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌పై టాస్ గెలిచిన భారత్ ఒక దశలో 33/3 స్కోరు వద్ద నిలిచింది. ఈ స్థితిలో రోహిత్, జడేజా 204 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే గురువారం ఆటలో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆటగాడు మాత్రం సర్ఫరాజ్ ఖాన్. సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ తన అవకాశం కోసం ఎదురు చూస్తున్న అతను ఎట్టకేలకు భావోద్వేగాల నడుమ భారత క్రికెటర్‌గా అరంగేట్రం చేశాడు. అంచనాలకు తగినట్లుగా చూడచక్కటి షాట్లతో అలవోకగా అర్ధ సెంచరీని అందుకున్నాడు. జోరు మీదున్న దశలో దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగినా...తానేంటో అతను నిరూపించుకున్నాడు. ఇక మిగిలిన ఐదు వికెట్లతో రెండో రోజు భారత్ ఇంకా ఎన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం. రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో భారత్‌కు శుభారంభం లభించింది. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (196 బంతుల్లో 131; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (212 బంతుల్లో 110 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించగా... సర్ఫరాజ్ ఖాన్ (66 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. ద్విశతక భాగస్వామ్యం... అండర్సన్ వేసిన మ్యాచ్ తొలి బంతిని యశస్వి (10) ఫోర్‌గా మలచడంలో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అయితే వుడ్ జోరులో భారత్ రెండు పరుగుల తేడాతో యశస్వి, గిల్ (0) వికెట్లు కోల్పోయింది. హార్ట్లీ బంతిని ఆడలేక రజత్ పటిదార్ (5) కూడా సునాయాస క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో సర్ఫరాజ్ వస్తే ఒత్తిడిలో మరో వికెట్ పోయేదేమో! కానీ జట్టు వ్యూహాత్మకంగా కుడి, ఎడమ కాంబినేషన్ కోసం ఐదో స్థానంలో జడేజాను పంపించడం అద్భుతంగా పని చేసింది. రోహిత్, జడేజా కలిసి జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. 29 పరుగుల వద్ద స్లిప్‌లో రూట్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్ లంచ్‌కు ముందు 71 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరామం తర్వాత పూర్తిగా భారత్ హవా సాగింది. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రోహిత్, జడేజా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. 97 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ సెషన్లో భారత్ 27 ఓవర్లలో 92 పరుగులు చేసింది. ఈ జోడీని విడదీయలేక ఇంగ్లండ్ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ సిరీస్‌లో ఒక్క వికెట్ కూడా పడని తొలి సెషన్ ఇదే కావడం విశేషం. టీ తర్వాత తొలి ఓవర్లోనే రోహిత్ 157 బంతుల్లో తన కెరీర్లో 11వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పార్ట్నర్íÙప్ 200 పరుగులు దాటాక ఎట్టకేలకు ఇంగ్లండ్‌కు వికెట్ దక్కింది. షార్ట్ బంతులకు వరుసగా పరుగులు రాబట్టిన రోహిత్ చివరకు అదే షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. సర్ఫరాజ్ రనౌట్... కొత్త ఆటగాడు సర్ఫరాజ్, జడేజా భాగస్వామ్యం జట్టును నడిపించింది. ముఖ్యంగా తన కెరీర్ తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్వీప్, లాఫ్టెడ్ షాట్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. సర్ఫరాజ్ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు జడేజా స్కోరు 84 కాగా... సర్ఫరాజ్ వెనుదిరిగే సమయానికి 99 మాత్రమే! 77 పరుగుల ఈ ఐదో వికెట్ భాగస్వామ్యంలో జడేజా 15 పరుగులు చేయగా, సర్ఫరాజ్ 62 పరుగులు చేశాడంటేనే అతని జోరు అర్థమవుతుంది. 93 పరుగుల వద్ద హార్ట్లీ బంతి జడేజా ప్యాడ్‌ను ముందుగా తగిలినా... ఇంగ్లండ్ బలంగా అప్పీల్ చేయలేదు. రీప్లేలో అతను అవుటయ్యేవాడని తేలింది! ధాటిగా ఆడిన సర్ఫరాజ్ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ జడేజాతో సమన్వయ లోపం అతని ఆటను ముగించింది. జడేజా 99 వద్ద అండర్సన్ బౌలింగ్‌లో సింగిల్ కోసం ముందుకు వచ్చి మళ్లీ వెనక్కి తగ్గాడు. అప్పటికే ముందుకు వెళ్లిన సర్ఫరాజ్ వెనక్కి వచ్చేలోగా వుడ్ డైరెక్ట్ హిట్ వికెట్లను తాకింది. తర్వాతి బంతికే సింగిల్‌తో జడేజా టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తయింది. భావోద్వేగ క్షణాలు... రాజ్‌కోట్ టెస్టు ద్వారా ఇద్దరు ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. సర్ఫరాజ్‌కు అనిల్ కుంబ్లే, జురేల్‌కు దినేశ్ కార్తీక్ టెస్టు క్యాప్‌లు అందించారు. రెండేళ్ల వ్యవధిలో 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల తర్వాత అవకాశం లభించిన వికెట్ కీపర్ జురేల్‌తో పోలిస్తే సర్ఫరాజ్ ప్రస్థానం భావోద్వేగభరితమైంది. అందుకే మ్యాచ్‌కు ముందు మైదానంలో అలాంటి దృశ్యాలు కనిపించాయి. ఎనిమిదేళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో దేశవాళీలో 70 సగటుతో భారీగా పరుగులు సాధించిన సర్ఫరాజ్ భారత్ తరఫున ఆడేందుకు ఎంతో కాలంగా ఎదురు చూశాడు. పలుమార్లు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. అందుకే అరంగేట్రం ఖాయమైన క్షణాన కోచ్, మెంటార్ అయిన తండ్రి నౌషాద్ ఖాన్ తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. చిన్నప్పటినుంచి అన్నీ తానే అయి సర్ఫరాజ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దిన ఆయన టెస్టు క్యాప్‌ను ముద్దాడి తన కొడుకును హత్తుకున్నాడు. సర్ఫరాజ్ అర్ధసెంచరీ పూర్తయినప్పుడు అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. జడేజా కూడా ఆట ముగిసిన తర్వాత రనౌట్‌లో తనదే తప్పంటూ బాధపడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు! స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) రూట్ (బి) వుడ్ 10; రోహిత్ (సి) స్టోక్స్ (బి) వుడ్ 131; గిల్ (సి) ఫోక్స్ (బి) వుడ్ 0; పటిదార్ (సి) డకెట్ (బి) హార్ట్లీ 5; జడేజా (బ్యాటింగ్) 110; సర్ఫరాజ్ (రనౌట్) 62; కుల్దీప్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (86 ఓవర్లలో 5 వికెట్లకు) 326. వికెట్ల పతనం: 1–22, 2–24, 3–33, 4–237, 5–314. బౌలింగ్: అండర్సన్ 19–5–51–0, వుడ్ 17–2–69–3, హార్ట్లీ 23–3–81–1, రూట్ 13–1–68–0, రేహన్ 14–0–53–0. -
సర్ఫరాజ్ ఖాన్‌కు సారీ చెప్పిన జడేజా
రాజ్‌కోట్ టెస్ట్‌లో తన కారణంగా రనౌటైన అరంగ్రేటం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా క్షమాపణలు చెప్పాడు. అలాగే తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టినందుకు సర్ఫరాజ్‌ను ఆకాశానికెత్తాడు. మ్యాచ్ అనంతరం జడ్డూ తన ఇన్‌స్టా స్టోరీలో క్షమాపణ, అభినందన సందేశాన్ని కలగలిపి షేర్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ విషయంలో చాలా బాధగా ఉంది. తప్పు నాదే. లేని పరుగు కోసం పిలుపునిచ్చాను. బాగా ఆడావు సర్ఫరాజ్ అంటూ జడ్డూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. రనౌట్ ఉదంతంపై సర్ఫరాజ్ ఖాన్ కూడా స్పందించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఇలా అన్నాడు. మిస్ కమ్యూనికేషన్ వల్ల అలా జరిగింది. జడ్డూ భాయ్ నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. నేను పర్లేదు అని చెప్పాను. దీనికంటే ముందు నేను జడేజాకు థ్యాంక్స్ చెప్పాలి. క్రీజ్‌లో ఉన్నంతసేపు అతను నాకు అండగా నిలిచాడు. విలువైన సలహాలు ఇచ్చి నన్ను గైడ్ చేశాడు. కాగా, అరంగేట్రం మ్యాచ్‌లోనే ఏ బెదురు లేకుండా యధేచ్చగా షాట్లు ఆడి మెరుపు వేగంతో అర్దసెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్.. జడేజా చేసిన పొరపాటు కారణంగా రనౌటయ్యాడు. జడేజా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు లేని పరుగుకు కోసం సర్ఫరాజ్‌ను పిలిచి రనౌట్ చేయించాడు. సర్ఫరాజ్‌ను అనవసరంగా ఔట్ చేయించానన్న బాధలో జడేజా సెంచరీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (110 నాటౌట్) బాధ్యతాయుతమైన సెంచరీలు చేసి భారత జట్టును ఆదుకున్నారు. వీరికి అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్దశతకం (62) తోడైంది. ఈ ముగ్గురు కలిసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులుగా ఉంది. యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పాటిదార్ (5) నిరాశపరిచారు. జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ (1) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, టామ్ హార్ల్టీ ఓ వికెట్ పడగొట్టగా.. సర్ఫరాజ్ ఖాన్ రనౌటయ్యాడు. -
రోహిత్, జడ్డూ శతకాలు.. మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న సర్ఫరాజ్
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (110 నాటౌట్) బాధ్యతాయుతమైన సెంచరీలు చేసి భారత జట్టును ఆదుకున్నారు. వీరికి అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్దశతకం తోడైంది. ఈ ముగ్గురు కలిసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులుగా ఉంది. యువ బ్యాటర్లు, రెండో టెస్ట్ హీరోలు యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0) నిరాశపరిచారు. మరో యువ ఆటగాడు రజత్ పాటిదార్ (5) అందివచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నాడు. జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ (1) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, టామ్ హార్ల్టీ ఓ వికెట్ పడగొట్టగా.. సర్ఫరాజ్ ఖాన్ రనౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హిట్‌మ్యాన్ షో.. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన సెంచరీతో ఆదుకున్నాడు. హిట్‌మ్యాన్ 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి ఔటయ్యాడు. రోహిత్ చాలాకాలం తర్వాత టెస్ట్‌ల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికిది 11వ టెస్ట్ సెంచరీ. హిట్‌మ్యాన్ దాదాపు ఏడాది తర్వాత స్వదేశంలో టెస్ట్ సెంచరీ చేశాడు. రోహిత్ ఈ సెంచరీతో భారత్ తరఫున సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన సారధిగా రికార్డుల్లోకెక్కాడు. హిట్‌మ్యాన్ 36 ఏళ్ల 291 రోజుల వయసులో సెంచరీ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సర్ఫరాజ్ .. ఈ మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లోనే మెరుపు అర్దశతకం బాది ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాక ఆరో స్థానంలో బరిలోకి దిగిన సర్ఫరాజ్ కేవలం 48 బంతుల్లోనే అర్దసెంచరీ బాది అభిమానులకు కనువిందు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 7 ఫోర్లు, సిక్సర్ బాదాడు. దేశవాలీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉన్న సర్ఫరాజ్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకుని, తొలి ఇన్నింగ్స్‌లోనే తన మార్కు ప్రభావం చూపాడు. సర్ఫరాజ్‌కు దేశవాలీ క్రికెట్లో చిచ్చరపిడుగుగా పేరుంది. ఆ బిరదును సర్ఫరాజ్ తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే నిజం చేశాడు. సర్ఫరాజ్ క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి ఏమాత్రం బెరుకు లేకుండా షాట్లు ఆడి, అనుభవజ్ఞుడైన ఆటగాళ్లను తలపించాడు. జడ్డూ బాధ్యతాయుతమైన సెంచరీ.. జట్టు కష్టాల్లో (33/3) ఉన్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మతో జతకట్టిన జడ్డూ.. కెరీర్లో నాలుగో సెంచరీతో చెలరేగాడు. 198 బంతుల్లో 7 ఫోర్లు, 2స సిక్సర్ల సాయంతో సెంచరీ మార్కును తాకాడు. జడ్డూ బాధ్యతాయుతమైన సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా పటిష్ట స్థితికి చేరింది. జడ్డూ.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 234 పరుగులు జోడించాడు. పాపం సర్ఫరాజ్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఏ బెదురు లేకుండా యదేచ్చగా షాట్లు ఆడుతూ మెరుపు వేగంతో అర్దసెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్.. జడేజా చేసిన పొరపాటు కారణంగా రనౌటయ్యాడు. జడేజా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు లేని పరుగుకు కోసం సర్ఫరాజ్‌ను పిలిచి రనౌట్ చేయించాడు. సర్ఫరాజ్‌ను అనవసరంగా ఔట్ చేయించానన్న బాధలో జడేజా సెంచరీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. కోపంతో ఊగిపోయిన హిట్‌మ్యాన్.. జడేజా కారణంగా సర్ఫరాజ్ ఖాన్ అనవసరంగా రనౌట్ కావడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. క్యాప్‌ను నేలకేసి కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు. రోహిత్ కోపపడిన విధానాన్ని చూస్తే అతనికి సర్ఫరాజ్‌పై భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం అర్దమవుతుంది. -
టీమిండియాను ఆదుకున్న రవీంద్ర జడేజా.. బాధ్యతాయుతమైన సెంచరీ
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్‌తో విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో (33/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో జడ్డూ కెరీర్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా 198 బంతుల్లో 7 ఫోర్లు, 2స సిక్సర్ల సాయంతో సెంచరీ మార్కును తాకాడు. జడ్డూ బాధ్యతాయుతమైన సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా పటిష్ట స్థితికి చేరింది. 85 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు స్కోర్ 324/5గా ఉంది. జడ్డూ.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 234 పరుగులు జోడించాడు. జడ్డూకు ముందు రోహిత శర్మ సైతం బాధ్యతాయుతమైన సెంచరీతో (131) మెరిశాడు. వీరిద్దరు నిలబడకపోయుంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా పరిస్థితి దయనీయంగా ఉండేది. జడేజా పొరపాటు వల్ల.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నప్పుడు జడ్డూ ఓ తప్పు చేశాడు. అప్పటికి మాంచి టచ్‌లో ఉన్న అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌ను లేని పరుగుకు పిలిచి రనౌట్ చేయించాడు. సర్ఫరాజ్‌ను అనవసరంగా ఔట్ చేయించానన్న బాధలో జడేజా సెంచరీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. జడేజా వల్ల సర్ఫరాజ్ అనవసరంగా ఔట్ కావడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. కోపంతో ఊగిపోతూ క్యాప్‌ను నేలకేసి కొట్డాడు. అనుభవజ్ఞుడిలా రెచ్చిపోయిన సర్ఫరాజ్.. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం మ్యాచ్ అన్న విషయాన్ని మరిచిపోయి అనుభవజ్ఞుడిలా యధేచ్ఛగా షాట్లు ఆడాడు. సర్ఫరాజ్ కేవలం 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల రనౌటయ్యాడు. కాగా, 326/5 స్కోర్ వద్ద తొలి రోజు ఆట ముగిసింది. జడేజా (110), కుల్దీప్ యాదవ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పాటిదార్ (5) నిరాశపరిచగా.. కెప్టెన్ రోహిత్ సెంచరీతో కదంతొక్కాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, టామ్ హార్ల్టీ ఓ వికెట్ పడగొట్టారు. -
చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్.. తొలి మ్యాచ్‌లోనే మెరుపు అర్ధసెంచరీ
భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్ట్‌లోనే (తొలి ఇన్నింగ్స్) మెరుపు అర్దసెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాక ఆరో స్థానంలో బరిలోకి దిగిన సర్ఫరాజ్ కేవలం 48 బంతుల్లోనే అర్దసెంచరీ బాది క్రికెట్ అభిమానులకు కనువిందు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 7 ఫోర్లు, సిక్సర్ బాదాడు. దేశవాలీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉన్న సర్ఫరాజ్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకుని, తొలి ఇన్నింగ్స్‌లోనే తన మార్కు ప్రభావం చూపాడు. సర్ఫరాజ్‌కు దేశవాలీ క్రికెట్లో చిచ్చరపిడుగుగా పేరుంది. ఆ బిరదును సర్ఫరాజ్ తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే నిజం చేశాడు. సర్ఫరాజ్ క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి ఏమాత్రం బెరుకు లేకుండా షాట్లు ఆడి, అనుభవజ్ఞుడైన ఆటగాళ్లను తలపించాడు. సర్ఫరాజ్ దగ్గర దూకుడుతో పాటు మంచి టెక్నిక్ కూడా ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో అతను షాట్లు ఆడిన విధానం చూస్తే ఈ విషయం సృస్పష్టం అవుతుంది. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్ భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించాడు. ఇవాళ సర్ఫరాజ్ అరంగేట్రానికి ముందు అతని తండ్రి నౌషధ్ ఖాన్, భార్య రొమానా జహూర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వీరిద్దరూ సర్ఫరాజ్ ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా క్రికెటర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ముగిసిన అండర్ 19 వరల్డ్‌కప్‌లో ముషీర్ వరుస సెంచరీలు బాది వార్తల్లో నిలిచాడు. ఈ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరడంలో ముషీర్ కీలకపాత్ర పోషించాడు. సర్ఫరాజ్, ముషీర్ క్రికెటర్లుగా రాణించడంలో తండ్రి నౌషద్ ఖాన్‌ది కీలక పాత్ర. మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. 80 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. లోకల్ బాయ్ రవీంద్ర జడేజా 96, సర్ఫరాజ్ ఖాన్ 61 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పాటిదార్ (5) నిరాశపరిచగా.. కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతాయుతమై సెంచరీతో (131) మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, టామ్ హార్ల్టీ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: #Sarfaraz Khan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రి, భార్య కన్నీటి పర్యంతం -
#Sarfaraz Khan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రి, భార్య కన్నీటి పర్యంతం
Ind vs Eng 3rd Test- Sarfaraz Khan Debut- Beautiful moment: టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలని ఆశగా ఎదురుచూస్తున్న అతడి నిరీక్షణకు గురువారం(ఫిబ్రవరి 15) తెరపడింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ భారత తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆ సమయంలో తండ్రి నౌషధ్ ఖాన్, సర్ఫరాజ్ భార్య రొమానా జహూర్ అతడి పక్కనే ఉన్నారు. ఈ క్రమంలో తన క్యాప్‌ను తండ్రికి చూపించగా.. అతడు దానిని ఆప్యాయంగా ముద్దాడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. వెంటనే సర్ఫరాజ్ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఇక రొమానా సైతం కంటతడి పెట్టగా.. సర్ఫరాజ్ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్నాదమ్ముళిద్దరూ క్రికెటర్లే మహారాష్ట్రలో 1997లో జన్మించిన సర్ఫరాజ్ ఖాన్ క్రికెటర్‌గా ఎదగడంలో అతడి తండ్రి నౌషద్ ఖాన్‌ది కీలక పాత్ర. సర్ఫరాజ్‌తో పాటు అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా క్రికెటరే. ఇటీవలే అతడు అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆడాడు. యువ భారత్ ఫైనల్ చేరుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అందుకే ఆలస్యం! ఇక సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో ముఖ్యంగా రంజీల్లో అద్భుతంగా రాణించినప్పటికీ టీమిండియా ఎంట్రీ ఆలస్యమైంది. అతడి దూకుడు, ఆటిట్యూడ్ కారణంగానే టీమిండియా సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కనపెట్టారనే వార్తలు వినిపించాయి. అయితే, అభిమానులు మాత్రం ప్రతిభావంతుడైన ఆటగాడికి అన్యాయం జరుగుతోందంటూ అనేక సందర్భాల్లో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోవడంతో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రానికి మార్గం సుగమమైంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ద్వారా ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. చదవండి: Dhruv Jurel: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి బంగారు గొలుసు అమ్మి మరీ! From The Huddle! 🔊 A Test cap is special! 🫡 Words of wisdom from Anil Kumble & Dinesh Karthik that Sarfaraz Khan & Dhruv Jurel will remember for a long time 🗣️ 🗣️ You Can Not Miss This! Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @dhruvjurel21 |… pic.twitter.com/mVptzhW1v7 — BCCI (@BCCI) February 15, 2024 -
Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్.. ఇద్దరు ప్లేయర్ల అరంగ్రేటం
India vs England, 3rd Test: రాజ్‌కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక, ఈ టెస్టులో టీమిండియా తరఫున సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధృవ్ జూరెల్‌కు అవకాశం కల్పించడంతో వీరిద్దరూ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరగ్రేటం చేశారు. ఇక ఇంగ్లండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో వెటరన్ పేసర్ మార్క్ వుడ్ తుదిజట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇద్దరు పేసర్లు జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్‌లను ఆడించనుంది. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ హైదరాబాద్ టెస్టులో.. టీమిండియా విశాఖపట్నం టెస్టులో గెలిచాయి. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తుది జట్ల వివరాలు.. టీమిండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ -
సర్ఫరాజ్, జురెల్ అరంగేట్రం!
రాజ్‌కోట్: కీలక ఆటగాళ్లు గాయాల పాలవడం... కోహ్లి విశ్రాంతి కొనసాగిస్తుండటం... యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లకు వరంగా మారనుంది. మూడో టెస్టులో వీరిద్దరు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో వీరిద్దరు మాత్రం గంటల తరబడి చెమటోడ్చడం చూస్తుంటే వారి అరంగేట్రానికి సూచనగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ వారి ప్రాక్టీస్‌ను దగ్గరుండి పరిశీలించాడు. శ్రేయస్ అయ్యర్‌ను మిగతా మూడు టెస్టుల నుంచి తప్పించగా, ఎంపిక చేసిన కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతనూ రాజ్‌కోట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇవన్నీ కూడా సర్ఫరాజ్, జురెల్‌లకు రాచబాటను పరిచింది. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ వరుసగా విఫలమవడం కీపర్ జురెల్‌కు కలిసి రానుంది. గత మ్యాచ్ ఆడిన రజత్ పటిదార్‌తోపాటు సర్ఫరాజ్, జురెల్ మిడిలార్డర్లో బరిలోకి దిగుతారు. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ ప్రాక్టీస్ చేయలేదు. అతని కుడిచేతి చూపుడు వేలు నొప్పి కారణంగా ట్రెయినింగ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే అతని గాయం ఏమాత్రం తీవ్రమైంది కాదని జట్టు వర్గాలు వెల్లడించాయి. ఆల్‌రౌండర్ జడేజా స్పిన్ బౌలింగ్ కంటే బ్యాటింగ్ ప్రాక్టీసే ఎక్కువ చేశాడు. పేసర్లు బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు బౌలింగ్‌లో శ్రమించారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు జరుగుతుంది. -
ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు..!
-
Sarfaraz Khan: చిన్న జట్ల మీద ఆడితే సరిపోతుందా?
Ex India Star's Blunt Take After Sarfaraz Khan's Test Selection: భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటర్ దీప్‌దాస్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు అతడిని ఎంపిక చేసిన విధానం సబబుకాదేమోనని అభిప్రాయపడ్డాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడి బ్యాటింగ్ గణాంకాలు మెరుగ్గానే కనిపిస్తున్నా.. కేవలం వాటి ప్రాతిపదికన సర్ఫరాజ్ గొప్ప ఆటగాడని చెప్పలేమన్నాడు. చిన్న జట్లను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదన్న దీప్‌దాస్ గుప్తా.. అలాంటి జట్లపై సాధించిన పరుగులను ఎంత వరకు లెక్కలోకి తీసుకవచ్చో ఆలోచించాలన్నాడు. తానేమీ సర్ఫరాజ్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్న ఈ బెంగాలీ క్రికెటర్.. ఓ బ్యాటర్ ఎన్ని పరుగులు తీశాడన్న దానికన్నా.. పటిష్ట ప్రత్యర్థిపై ఎలా ఆడాడన్న విషయాన్నే పరిగణనలోకి తీసుకోవాలన్నాడు. రెండో టెస్టుకు సర్ఫరాజ్‌ను ఎంపిక చేసినంత మాత్రాన అతడి ఆడిస్తారనే నమ్మకం లేదని దీప్‌దాస్ గుప్తా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తుదిజట్టులో పదకొండు మంది ఆటగాళ్లకే చోటు ఉంటుందని.. అలాంటపుడు కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటే మేనేజ్మెంట్ ఆచితూచి వ్యవహరిస్తుందన్నాడు. ఉదాహరణకు.. శుబ్‌మన్ గిల్ లేదంటే సర్ఫరాజ్.. ఇద్దరిలో ఒకరినే ఎంచుకోవాలంటే కచ్చితంగా కెప్టెన్ రోహిత్ శర్మ.. గిల్‌వైపే మొగ్గు చూపుతాడని దీప్‌దాస్ అభిప్రాయపడ్డాడు. ఆ జట్లను తక్కువ చేయాలని కాదు.. కానీ ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఫస్ట్‌క్లాస్ క్రికెట్ గురించి మాట్లాడతారు. అక్కడ 37 జట్లు ఉంటాయి. అందులో కొంతమంది యావరేజ్ జట్ల మీద పరుగుల వరద పారిస్తారు. అలా అని నేను చిన్నజట్లను అగౌరవపరచడం లేదు. అయితే, ఓ బ్యాటర్ ఎంపిక గురించి మాట్లాడేటపుడు క్వాలిటీ ఆఫ్ రన్స్ గురించి కూడా మాట్లాడాలి. నేను ఇదంతా సర్ఫరాజ్‌కు వ్యతిరేకంగా చెప్పడం లేదు. కానీ సెలక్షన్ సమయంలో మేనేజ్మెంట్ ఇవన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్లకు ఎవరిపై ఎక్కువ నమ్మకం ఉంటే వాళ్లకే అవకాశం ఇస్తుంది’’ అని దీప్‌దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా తరఫున దీప్‌దాస్ 8 టెస్టులాడి కేవలం 100 పరుగులు చేశాడు. ఆ ముగ్గురికి ఛాన్స్ ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరం కాగా.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు తొలిసారి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారత్, సహా పాకిస్తాన్ క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. దీప్‌దాస్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 2న మొదలుకానున్న రెండో టెస్టుకు సర్ఫరాజ్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ కూడా ఎంపికయ్యారు. చదవండి: సర్ఫరాజ్ ఎంట్రీ గ్యారెంటీ..? అతడు ఎందుకు స్పెషల్? -
Viral Video: ఆ ముగ్గురి షాట్లను ఎంత చక్కగా ఆడాడో చూడండి..!
గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న పేరు ముషీర్ ఖాన్. ఈ 18 ఏళ్ల ముంబై కుర్రాడు అండర్-19 ప్రపంచకప్‌లో వరుస సెంచరీలతో విరుచుకుపడుతూ టాక్ ఆఫ్ ద కంట్రీగా మారాడు. క్రికెట్‌కు సంబంధించి ఏ ఇద్దరు ముగ్గురి మధ్య డిస్కషన్ జరిగినా ముషీర్ ఖాన్ పేరు వినిపిస్తుంది. అంతలా ముషీర్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. అయితే, ముషీర్ ఇంత హైప్ ఊరికే రాలేదు. వరల్డ్‌కప్ అతను పారించిన పరుగుల వరద, అతను ఆడిన షాట్లు, దూకుడు, టెక్నిక్.. ఇలా ఎన్నో కారణాల వల్ల అతనికి ఈ స్థాయి క్రేజ్ వచ్చింది. తాజాగా ఓ అభిమాని వరల్డ్‌కప్‌లో ముషీర్ ఆడిన కొన్ని షాట్లను ఎడిట్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. అంతలా ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. Musheer khan channels his inner Ms Dhoni, Sachin Tendulkar, Suryakumar yadav #U19WorldCup2024 #IndianCricket pic.twitter.com/WJJLoyy4RU — Sahil (@Vijayfans45) January 31, 2024 నిలకడ, దూకుడు, వైవిధ్యంతో పాటు బలమైన టెక్నిక్ కలిగిన ముషీర్.. తనలో భారత క్రికెట్ దిగ్గజాల టాలెంట్ అంతా కలగలుపుకుని ఉన్నాడు. కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్న ముషీర్ ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తాను ఆడిన ప్రతి షాట్‌ను ఎంతో కాన్ఫిడెంట్‌గా ఆడాడు. ముషీర్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే.. అతను అచ్చుగుద్దినట్లు సచిన్, ధోని, సూర్యకుమార్ యాదవ్ ట్రేడ్‌మార్క్ షాట్లను ఆడాడు. ముషీర్ ఈ షాట్లు ఆడిన విధానం చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఈ కుర్రాడు దిగ్గజాలు ఆడిన షాట్లను ఎంత చక్కగా ఇమిటేట్ చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్‌లో ముషీర్‌తో పాటు అతని అన్న సర్ఫరాజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తుంది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి, అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడిన సర్ఫరాజ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా చోటు దక్కించుకున్నాడు. సర్ఫరాజ్ ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్‌లో అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తుంది. సర్ఫరాజ్, ముషీర్ల పేర్లు ఒకేసారి దేశం మొత్తం మార్మోగుతుండటంతో వీరి తండ్రి ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోతున్నాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు (ఐర్లాండ్‌పై 106 బంతుల్లో 118 పరుగులు, యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు), ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ముషీర్ అన్న సర్ఫరాజ్ సైతం 2016 అండర్-19 వరల్డ్‌కప్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుత అండర్-19 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత్.. అనధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యంగ్ ఇండియా తమ తదుపరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో (ఫిబ్రవరి 2) నేపాల్‌ను ఢీకొంటుంది. -
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్! సిరాజ్‌కు నో ప్లేస్
విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2నుంచి ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఇప్పటికే వైజాగ్‌కు చేరుకున్న భారత జట్టు.. ఈ మ్యాచ్ కోసం తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎంచుకున్నాడు. వైజాగ్ టెస్టులో భారత జట్టు నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని హర్భజన్ సూచించాడు. అదే విధంగా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వాలని భజ్జీ తెలిపాడు. సర్ఫరాజ్ ఖాన్‌కు దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉందని, ఐదో స్ధానానికి సరిపోతాడని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఇక హర్భజన్ తను ఎంపిక చేసిన జట్టులో కేవలం ఒకే పేసర్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో పేస్ గుర్రం బుమ్రా ఒక్కడికే చోటు దక్కింది. తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోకపోయిన మహ్మద్ సిరాజ్‌ను వైజాగ్ టెస్టుకు హర్భజన్ పక్కన పెట్టాడు. అతడి స్ధానంలో వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇచ్చాడు. కుల్దీప్ బంతితో అద్బుతాలు చేయగలడని హర్భజన్ సింగ్ తన యూట్యాబ్ ఛానల్లో పేర్కొన్నాడు. రెండో టెస్టుకు హర్భజన్ ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ కేఎస్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ -
12 ఏళ్లకే సచిన్ రికార్డ్ బద్దలుకొట్టిన ఆటగాడు
-
అత్యంత అరుదైన ఘనత సాధించిన టీమిండియా బ్యాటర్
అండర్-19 వరల్డ్‌కప్‌లో సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తూ, పరుగుల వరద పారిస్తున్న యంగ్ ఇండియా బ్యాటర్ ముషీర్ ఖాన్.. న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్‌లో ఇప్పటికే ఓ సెంచరీతో (ఐర్లాండ్‌పై 106 బంతుల్లో 118 పరుగులు) చెలరేగిన ముషీర్.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీతో (126 బంతుల్లో 131 పరుగులు) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో ముషీర్ సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఒకటికంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ముషీర్‌కు ముందు టీమిండియా తరఫున సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ మాత్రమే సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేశాడు. తాజా ప్రదర్శనతో ముషీర్.. శిఖర్ సరసన నిలిచాడు. న్యూజిలాండ్‌పై సెంచరీతో ముషీర్ మరో ఘనతను కూడా సాధించాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా అవతరించాడు. ముషీర్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేశాడు. అన్న అడుగుజాడల్లో.. ఇటీవలే టీమిండియాకు ఎంపికైన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు సొంత తమ్ముడైన ముషీర్ అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు. 2016 అండర్-19 వరల్డ్‌కప్‌లో సర్ఫరాజ్ కూడా లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్న ముషీర్.. తర్వలో టీమిండియా తలుపులు కూడా తట్టే అవకాశం ఉంది. తాజా ప్రదర్శనలతో ముషీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని సైతం ఆకర్శించాడు. 2024 సీజన్ వేలంలో అన్ సోల్డ్‌గా మిగిలిపోయిన ముషీర్‌ను అవకాశం ఉంటే పంచన చేర్చుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన 18 ఏళ్ల ముషీర్.. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన ముషీర్.. ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 96 పరుగలు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన గ్రూప్-1 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో యువ భారత్ 214 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 2న ఆడనుంది. ఆ మ్యాచ్‌లో భారత్.. నేపాల్‌తో తలపడుతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న భారత్.. సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
చాలా సంతోషంగా ఉంది.. సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్: సూర్య
భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండు టెస్టుకు సర్ఫరాజ్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వైజాగ్ టెస్టుకు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరం కావడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్ఫరాజ్‌తో పాటు యూపీ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అభినంధనలు తెలిపాడు. భారత జట్టు నుంచి తొలిసారి పిలుపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. వీరిద్దరూ దేశీవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 45 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 69.85 సగటుతో 3,912 రన్స్ చేశాడు. 14 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: Ind vs Eng: ఆఖరి 3 టెస్టులకు జట్టు ఎంపిక?.. కోహ్లి రీఎంట్రీ డౌటే!? -
IND VS ENG 2nd Test: సర్ఫరాజ్ ఎంట్రీ గ్యారెంటీ..?
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్‌లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ దాదాపుగా ఖరారైపోయింది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడిన నేపథ్యంలో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ రెండో టెస్ట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. సర్ఫరాజ్ ఎంట్రీతో శుభ్‌మన్ గిల్‌పై వేటు పడనుంది. శుభ్‌మన్ గిల్ ఇటీవలి కాలంలో వరుసగా విఫలవుతుండటంతో అతనికి ఇచ్చిన అవకాశాలు చాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. గిల్ స్థానంలో వన్‌డౌన్ ఆటగాడిగా రజత్ పాటిదార్‌ను బరిలోకి దించనున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు రెండో టెస్ట్‌లో వాషింగ్టన్ సుందర్ కూడా బరిలోకి దిగడం ఖాయమని సమాచారం. కండరాల సమస్యతో బాధపడుతున్న రవీంద్ర జడేజా స్థానంలో సుందర్ బరిలోకి దిగేందకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. విశాఖ టెస్ట్‌లో భారత్ ఈ మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్, రజత్ పాటిదార్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. మేనేజ్మెంట్ ఏదైనా సాహసం చేయాలని భావిస్తే తప్ప వీరిద్దరి ఎంట్రీని ఎవరూ అడ్డుకోలేరు. దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్న సర్ఫరాజ్ దేశవాలీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న ఈ ఇద్దరూ చాలాకాలంగా టీమిండియాలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కీలక ఆటగాళ్లు గాయపడంతో ఎట్టకేలకు వీరి కలలు సాకారాం కానున్నాయి. 26 ఏళ్ల సర్ఫరాజ్ 2014, 2016 అండర్ వరల్డ్‌కప్‌లలో మెరిసి దేశవాలీ క్రికెట్లో స్టార్‌గా ఎదిగాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇతనికి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో సర్ఫరాజ్ 66 ఇన్నింగ్స్‌ల్లో 69.85 సగటున 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 3912 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఇక ఐపీఎల్‌లోనూ సర్ఫరాజ్ తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పటి దాకా మొత్తంగా 37 ఇన్నింగ్స్ ఆడి 585 పరుగులు చేశాడు. గత సీజన్లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. పాటిదార్ ఇలా మరోవైపు పాటిదార్‌కు కూడా దేశీవాళీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు అతను ఆడిన 55 మ్యాచ్‌ల్లో 45.97 సగటున 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీల సాయంతో 4000 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా వీరు సెంచరీలతో కదంతొక్కారు. 30 ఏళ్ల పాటిదార్ ఇటీవలే వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. గతేడాది చివర్లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో పాటిదార్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
సర్ఫరాజ్ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు టీమిండియాలో చోటు
దేశీవాళీ క్రికెట్లో అదరగొడుతున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరగున్న రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో దీంతో చాలా కాలంగా సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ నిరీక్షణ ఫలించింది. కాగా రెండో టెస్టుకు భారత స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమయ్యారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు యూపీ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరు ముగ్గురు నేరుగా విశాఖపట్నంలో భారత జట్టుతో కలవనున్నారు. కాగా గత కొంత కాలంగా సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీల్లో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 45 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 69.85 సగటుతో 3,912 రన్స్ చేశాడు. 14 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఈ ముంబైకర్ ఇండియా-ఎ జట్టు తరపున కూడా అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అయితే సర్ఫరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక యూపీ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్‌కు దేశీవాళీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనే 290 వికెట్లతో సత్తాచాటాడు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరిగిన అనధికార టెస్టులో ఆరు వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు సీనియర్ జట్టుకు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. -
సెంచరీలతో విరుచుకుపడిన పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా-ఏ ఆటగాళ్లు దేవ్‌దత్ పడిక్కల్ (105), సర్ఫరాజ్ ఖాన్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. నిన్న (జనవరి 24) ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ లయన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల ధాటికి లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే కుప్పకూలింది. పేసర్ ఆకాశ్‌దీప్ సింగ్ 4 వికెట్లతో లయన్స్ పతనాన్ని శాశించగా.. వాషింగ్టన్ సుందర్, యశ్ దయాల్ చెరో 2 వికెట్లు, అర్షదీప్ సింగ్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. లయన్స్ ఇన్నింగ్స్‌లో ఒలివర్ ప్రైస్ (48), బ్రైడన్ కార్స్ (31), టామ్ లేవ్స్ (15), జెన్నింగ్స్ (11) మత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-ఏ జట్టు రెండో రోజు రెండో సెషన్ సమయానికి (73 ఓవర్లు) 4 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. పడిక్కల్ 118 బంతుల్లోనే 17 ఫోర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేయగా.. ఆతర్వాత సర్ఫరాజ్ ఖాన్ 89 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (58) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (6), రింకూ సింగ్ (0) నిరాశపరిచారు. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ (35) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్-ఏ 161 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కాగా, ఇంగ్లండ్ లయన్స్ జట్టు మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్!
India A vs England Lions, 2-day Practice Match: ఇంగ్లండ్ లయన్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్ రజత్ పాటిదార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లయన్స్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ శతక్కొట్టాడు. మొత్తంగా 141 బంతులు ఎదుర్కొన్న ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్... 18 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 111 పరుగులు సాధించాడు. సర్ఫరాజ్ సెంచరీ మిస్ పాటిదార్‌కు తోడు సర్ఫరాజ్ ఖాన్ కూడా రాణించాడు. అయితే, సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి 96 పరుగుల వద్దే నిలిచిపోయాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు భారత్-ఏ, ఇంగ్లండ్-ఏ(లయన్స్) జట్లు అనధికారిక టెస్టు ఆడనున్నాయి. 223 ఇంగ్లండ్ ఆలౌట్ ఇందులో భాగంగా అహ్మదబాద్ వేదికగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాయి. శుక్రవారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో... భారత బౌలర్లు మెరుగ్గా రాణించి 233 పరుగులకే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేశారు. మానవ్ సుతార్ మూడు, ఆకాశ్ దీప్ రెండు- తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, పులకిత్ నారంగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 32 పరుగులు చేయగా.. రజత్ సెంచరీ(111) సాధించాడు. భరత్, ధ్రువ్ ఫిఫ్టీలు మిగిలిన వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ (96), శ్రీకర్ భరత్(64), ధ్రువ్ జురెల్ (50) అర్ధ శతకాలతో దుమ్ములేపారు. దీంతో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 91ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత్-ఏ జట్టు 462 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. ఇక భారత్-ఏ- ఇంగ్లండ్-ఏ జట్ల మధ్య జనవరి 17 నుంచి నాలుగు రోజుల అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. సర్ఫరాజ్‌ను ఇకనైనా టీమిండియాలోకి? మరోవైపు.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 5 నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించి రెండు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, మిగిలిన మ్యాచ్‌లకు జట్టును ఎంపిక చేసేటపుడైనా సర్ఫరాజ్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవాళీ, భారత్- ఏ జట్ల తరఫున ఇంత మంచి ప్రదర్శనలు ఇస్తున్నా అతడిని పక్కనపెట్టడం సరికాదని సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. చదవండి: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
Ind vs SA: టెస్టు సిరీస్‌కు స్టార్ ఓపెనర్ దూరం! ముంబై ఆటగాడికి లక్కీ ఛాన్స్?
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్టార్ రుతురాజ్ గైక్వాడ్ చేతి వేలి గాయం కారణంగా ప్రోటీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా గాయపడిన రుతు.. ఇంకా పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు పయనమైనట్లు సమాచారం. ఈ క్రమంలో రుతురాజ్ స్ధానాన్ని ఎప్పటి నుంచో జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ముంబైకర్ సర్ఫరాజ్ ఖాన్‌తో భర్తీ చేయాలని జట్టు మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. భారత-ఏ జట్టు తరపున ప్రోటీస్ పర్యటనకు వెళ్లిన సర్ఫరాజ్ దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాడు. అనంతరం అక్కడే ఉన్న భారత్ సీనియర్ జట్టుతో ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 61 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అంతకుముందు సౌతాఫ్రికా-ఏతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో రాణించాడు. కాగా దేశీవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. గత మూడు రంజీ సీజన్లలో సర్ఫరాజ్ పరుగులు వరద పారించాడు. 2019-20 సీజన్లో 900 పరుగులు, 2020-21 సీజన్లోనూ 900 పరుగులు, 2022-23 సీజన్లో 600పైగా పరుగులు చేశాడు. మూడు సీజన్లలో అతడి సగటు కూడా 100కి పైగా ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడిన సర్ఫారాజ్.. 3175 పరుగులు చేశాడు. దక్క్షిణాఫ్రికాతో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ -
IND Tour Of SA: గిల్, సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలు
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ముందు ప్రిటోరియాలో జరిగిన మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్, ఇండియా-ఏ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో కదంతొక్కారు. ఈ మ్యాచ్ రెండో రోజు గిల్ సెంచరీతో మెరవగా.. మూడో రోజు ఆటలో సర్ఫరాజ్ ఖాన్ మూడంకెల స్కోర్‌ను చేశాడు. గిల్ ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడన్న విషయం తెలియలేదు కానీ.. సర్ఫరాజ్ మాత్రం 61 బంతుల్లోనే మెరుపు శతకం బాదినట్లు సమాచారం. ఇదే మ్యాచ్‌లో మరో టీమిండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ అర్ధసెంచరీ చేసినట్లు తెలుస్తుంది. ఈ వార్మప్ మ్యాచ్‌కు ప్రేక్షకులను కానీ, మీడియాను కానీ అనుమతించలేదు. కాగా, సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి 30 వరకు తొలి టెస్ట్ సెంచూరియన్ వేదికగా జరుగనుండగా.. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ కేప్‌టౌన్‌లో జరుగుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడగా.. టీ20 సిరీస్ 1-1తో సమం కాగా, వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. పార్ల్ వేదికగా నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 78 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (108) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) తనదైన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. అర్ష్‌దీప్ సింగ్ (4/30), వాషింగ్టన్ సుందర్ (2/38), ఆవేశ్ ఖాన్ (2/45), అక్షర్ పటేల్ (1/48), ముకేశ్ కుమార్ (1/56) రాణించడంతో 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. -
టెస్టు మ్యాచ్‌లోనూ భారత జట్టును వదలని వర్షం! ఎట్టకేలకు..
South Africa A vs India A, 1st unofficial Test: భారత్ ‘ఎ’- దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరగాల్సిన తొలి అనధికారిక టెస్టుకూ వర్షం అడ్డుపడింది. ఎడతెరిపిలేని వాన కారణంగా సోమవారం నాటి తొలి రోజు ఆట రద్దయింది. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. సఫారీ గడ్డపై మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు భారత ప్రధాన జట్టు అక్కడ అడుగుపెట్టింది. ఈ క్రమంలో డిసెంబరు 10 నాటి తొలి టీ20 వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. టీమిండియాతో పాటు భారత- ‘ఎ’ జట్టు కూడా సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లింది. ఇందులో భాగంగా.. ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో మూడు అనధికారిక టెస్టులు ఆడనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టెస్టు మ్యాచ్‌లలో మొదటిది డిసెంబరు 11న బ్లూమ్ఫౌంటేన్ వేదికగా మొదలైంది. తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత-ఎ జట్టు కెప్టెన్ శ్రీకర్ భరత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్- సౌతాఫ్రికా జట్లు మైదానంలో దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వరుణ దేవుడు స్వాగతం పలికాడు. ఈ క్రమంలో వర్షం ఎంతసేపటికీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటకైనా వర్షం అడ్డుపడకుంటే బాగుండునని ఆటగాళ్లతో సహా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆశించినట్లుగానే వాన జాడ లేకపోవడంతో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు రెండో రోజు ఆట మొదలైంది. మరోవైపు.. ఈరోజే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా రెండో టీ20 ఆడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. సౌతాఫ్రికా-ఎ జట్టుతో భారత- ఎ జట్టు తొలి అనధికారిక టెస్టు.. తుది జట్లు ఇవే భారత్: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ప్రదోష్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, ప్రసిధ్ కృష్ణ, విద్వత్ కావేరప్ప. సౌతాఫ్రికా: కామెరాన్ షెక్లెటన్, యాసీన్ వల్లి, రూబిన్ హెర్మన్, జీన్ డుప్లెసిస్, బ్రైస్ పార్సన్స్ (కెప్టెన్), కానర్ ఎస్టెర్హుయిసెన్ (వికెట్ కీపర్), ఇవాన్ జోన్స్, ఎథాన్ బాష్, కర్ట్లిన్ మానికమ్, సియా ప్లాట్జీ, ఒడిరిల్ మోడిమోకోనే. -
కశ్మీర్ యువతిని పెళ్లాడిన ముంబై క్రికెటర్.. ఫోటోలు, వీడియోలు వైరల్!
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన యువతిని సర్ఫరాజ్ పెళ్లాడాడు. వీరి వివాహ వేడుక వధువు స్వస్థలం షోపియాన్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. వీరి వివాహ వేడుకకు కొందరు క్రికెటర్లు కూడా హజరై ఈ జంటను ఆశ్వీరాదించారు. వీరి వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ హర్షిత్ రాణా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన విహహం అనంతరం స్ధానిక విలేకరులతో సర్ఫరాజ్ మాట్లాడాడు. టీమిండియా ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నించగా.. "దేవుడు దయ వుంటే కచ్చితంగా ఎదో ఒక రోజు భారత్‌కు ఆడుతాను" అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. అదే విధంగా కాశ్మీర్ యువతిని పెళ్లిచేసుకోవడం విధి అని సర్ఫరాజ్ అన్నాడు. Wishing a happy married life for Sarfaraz Khan & his wife. Congratulations to both of them. pic.twitter.com/BqwXiGGWtd — Johns. (@CricCrazyJohns) August 6, 2023 అదరగొడుతున్నా కానీ.. కాగా దేశీవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు అతడికి భారత జట్టులో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పరిగిణలోకి తీసుకోలేదు. అయితే అతడి ఫిట్నెస్ కారణంగానే జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదని బీసీసీఐ వర్గాలు సృష్టం చేశాయి. కాగా సర్ఫరాజ్ ప్రస్తుతం అద్భుతమై ఫామ్‌లో ఉన్నాడు. గత మూడు రంజీ సీజన్లలో సర్ఫరాజ్ పరుగులు వరద పారించాడు. 2019-20 సీజన్లో 900 పరుగులు, 2020-21 సీజన్లోనూ 900 పరుగులు, 2022-23 సీజన్లో 600పైగా పరుగులు చేశాడు. మూడు సీజన్లలో అతడి సగటు కూడా 100కి పైగా ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడిన సర్ఫారాజ్.. 3175 పరుగులు చేశాడు. చదవండి: అస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి: హార్దిక్ Indian cricketer sarfaraz khan got married in shopian pic.twitter.com/inEvFiWk6t — Mastaan🇵🇸 (@Sartaj_4u) August 6, 2023 -
SL VS PAK 2nd Test Day 3: టెస్ట్ క్రికెట్లో పాక్ తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆప్షన్‌ను వినియోగించుకుంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో లంక పేసర్ అసిత ఫెర్నాండో వేసిన బంతి పాక్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తలకు బలంగా తాకగా, అతను మైదానాన్ని వీడాడు. దీంతో సర్ఫరాజ్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. రిజ్వాన్ పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు, ఆతర్వాత లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపింగ్ కూడా చేస్తాడు. ప్రస్తుతం పీసీబీ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ సమయానికి కోలుకుంటే తిరిగి అతను బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంటుంది. Sarfaraz Ahmed Retired Hurt. #SarfarazAhmed #PAKvSL pic.twitter.com/T7yVo2tNlH — Syed Haris Aamir (@_smharis_) July 26, 2023 సర్ఫరాజ్ మైదానాన్ని వీడే సమయానికి 22 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ స్థానంలో బరిలోకి దిగిన రిజ్వాన్ 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టెస్ట్‌ల్లో తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆప్షన్‌ను వినియోగించున్న పాక్.. వన్డేల్లో తొలిసారి న్యూజిలాండ్‌పై ఈ ఆప్షన్‌ను వినియోగించుకుంది. ఐసీసీ 2019లో తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే దీన్ని వినియోగించుకుంది మాత్రం 2021లో. ఆ ఏడాది ఆగస్ట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ గాయపడిన స్టీవ్ స్మిత్ స్థానంలో మార్నస్ లబూషేన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. కాగా, పాక్ టీమ్ విన్నపం మేరకు మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్ అవకాశాన్ని వినియోగించుకునే వెసలుబాటు కల్పించాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు ఆటలో పాక్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ హాఫ్‌సెంచరీ పూర్తి చేయగానే 576 పరుగుల స్కోర్ వద్ద పాక్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టుకు 410 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రిజ్వాన్‌తో పాటు అఘా సల్మాన్ (132 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. అనంతరం 411 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండ్రోజుల ఆట (27, 28) మిగిలి ఉంది. -
నిరాశపరచిన తిలక్ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్
వెస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 67 పరుగుల లీడ్‌తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ (10), విజయ్‌కుమార్ వైశాఖ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్ అగర్వాల్ (35), హనుమ విహారి (42), రికీ భుయ్ (27) పర్వాలేదనిపించారు. కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్ జోన్.. ఈ మ్యాచ్‌లో కర్ణాటక పేసర్ విధ్వత్ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలం కాగా.. అప్‌కమింగ్ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్ వైశాఖ్ (2/33), కౌశిక్ (1/26) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28), వాషింగ్టన్ సుందర్ (22 నాటౌట్) పర్వాలేదనిపించారు. షమ్స్ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్ (1/47) సౌత్ జోన్‌ను దెబ్బకొట్టారు. -
రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్, నిరాశపరిచిన పృథ్వీ షా
సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, 241 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చతేశ్వర్ పుజారా (50), సర్ఫరాజ్ ఖాన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. పృథ్వీ షా (25) నిరాశపరిచాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో సౌరభ్ కుమార్ 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
అతడి గురించి మీకేం తెలుసు? ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరా?: గంగూలీ ఆగ్రహం
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు వ్యవహరించిన తీరుపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విమర్శలు సంధించాడు. దేశవాళీ క్రికెట్లో గత మూడేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లకు చోటు ఇవ్వకపోవడం దారుణమన్నాడు. సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదని, అవకాశం ఇస్తేనే కదా ఎవరేంటో తెలిసేదంటూ ఫైర్ అయ్యాడు. తాజా సైకిల్లో తొలి సిరీస్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత రోహిత్ సేన వెస్టిండీస్ పర్యటనలో బిజీ కానుంది. జూలై 12న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ఈ టూర్ ఆరంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీసీసీఐ టెస్టు జట్టును ప్రకటించింది. వాళ్లిద్దరికీ మొండిచేయి రోహిత్ శర్మ కెప్టెన్‌గా, అతడి డిప్యూటీగా అజింక్య రహానే వ్యవహరించనుండగా.. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్‌లకు కూడా జట్టులో చోటు లభించింది. ఇక మూడేళ్ల తర్వాత పేసర్ నవదీప్ సైనీ కూడా పునరాగమనం చేసే అవకాశం వచ్చింది. అయితే, గత కొన్నేళ్లుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో సెలక్టర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సర్ఫరాజ్‌లో క్రమశిక్షణ లోపించిందని, అతడు పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేడంటూ బీసీసీఐ వర్గాలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. యశస్వి ఓకే.. కానీ వాళ్లేం పాపం చేశారు? ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. సర్ఫరాజ్‌కు మద్దతుగా నిలిచాడు. అతడికి కనీసం ఒక్క అవకాశమైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు.. ‘‘రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీలో యశస్వి జైశ్వాల్ టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. అతడిని జట్టులోకి తీసుకోవడం బాగుంది. అయితే, నేను సర్ఫరాజ్ విషయంలో బాధపడుతున్నా. గత మూడేళ్లుగా అతడు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. కానీ ఒక్క అవకాశం కూడా రావడం లేదు. కనీసం ఒక్క ఛాన్స్ అదే విధంగా అభిమన్యు ఈశ్వరన్ విషయంలో కూడా ఇలాగే జరగుతోంది. ఐదారేళ్లుగా అతడు రాణిస్తున్నాడు.అయినా నో ఛాన్స్. వీళ్లిద్దరి విషయంలో సెలక్టర్ల తీరు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఫాస్ట్ బౌలింగ్‌లో సరిగ్గా ఆడలేడన్న కారణంతో సర్ఫరాజ్‌ను ఎలా పక్కనపెడతారు? అతడు పేసర్లను ఎదుర్కోలేడని మీకెవరు చెప్పారు? నాకు తెలిసినంత వరకు సర్ఫరాజ్‌కు పేసర్ల బౌలింగ్‌లో ఆడేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒక్క అవకాశం ఇవ్వండి. తనను తాను నిరూపించుకుంటాడు’’అని గంగూలీ సెలక్టర్ల తీరును తూర్పారబట్టాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ! -
భారత జట్టులో నో ఛాన్స్.. సెలక్టర్లకు కౌంటర్ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్
వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌కు సెలక్టర్లు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు కల్పించారు. అయితే గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. ఈ క్రమంలో భారత సెలక్షన్ కమిటీపై విమర్శల వర్షం కురుస్తోంది. రుత్‌రాజ్ స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్ ఎంపిక చేయాల్సింది అని పలువురు మాజీ క్రికెటర్లు అభిఫ్రాయపడుతున్నారు. కాగా టెస్టు జట్టుకు తనని ఎంపిక చేయకపోవడంపై సర్ఫరాజ్ ఎట్టకేలకు మౌనం వీడాడు. సర్ఫరాజ్ రంజీ ట్రోఫీలో తన బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియోకు సర్ఫరాజ్ ఎటువంటి క్యాప్షన్‌ను జోడించలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదుర్స్.. సర్ఫరాజ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత మూడు రంజీ సీజన్లలో సర్ఫరాజ్ పరుగులు వరద పారించాడు. 2019-20 సీజన్లో 900 పరుగులు, 2020-21 సీజన్లోనూ 900 పరుగులు, 2022-23 సీజన్లో 600పైగా పరుగులు చేశాడు. మూడు సీజన్లలో అతడి సగటు కూడా 100కి పైగా ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడిన సర్ఫారాజ్.. 3175 పరుగులు చేశాడు. విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. చదవండి: #ViralVideo: 'అయ్యో శివుడా ఏమాయే'.. ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడితే! Sarfaraz Khan's latest Instagram Story after he wasn't selected for West Indies Tests. 👇🏻👇🏻 pic.twitter.com/ITzJMl7QUD — Harshit Bisht (@rk_harshit29) June 25, 2023 -
'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్‌తోనే కానిచ్చేయండి!'
దేశవాలీ టోర్నీ అయిన రంజీ ట్రోపీలో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ పేరు కచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. కానీ అతనికి మరోసారి మొండిచేయి ఎదురైంది. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. టెస్టు క్రికెట్లోకి తీసుకునేది రంజీల్లో చేసే ప్రదర్శనతోనే కానీ ఐపీఎల్‌తో కాదు కదా అంటూ చురకలు అంటించాడు. అలాంటప్పుడు పనిగట్టుకొని ప్రతీ ఏడాది రంజీ ట్రోపీ ఆడించడం ఎందుకు.. ఐపీఎల్ ప్రదర్శనతోనే జట్టులోకి ఎంపిక చేస్తామంటే అలానే కానియ్యండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ''సర్ఫరాజ్ ఖాన్ రంజీల్లో అదరగొడుతున్నాడు. మూడు సీజన్లలో అతని పర్ఫామెన్స్ రికార్డు లెవెల్లో ఉంది. దాదాపు 100 సగటుతో పరుగులు చేస్తున్నాడు. అయినా అతనికి చోటు దక్కడం లేదు. టీమ్‌లోకి రావాలంటే అతను ఇంకేం చేయాలి. తుది జట్టులో చోటు ఇవ్వకపోయినా కనీసం అతన్ని ఎంపిక చేస్తే, రంజీల్లో ఆడుతున్నదానికి గుర్తింపు దక్కిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెలక్టర్లు మాత్రం ఐపీఎల్ ఆడిన వాళ్లకే టీమ్‌లో చోటు ఇస్తున్నారు. రెడ్ బాల్ క్రికెట్‌కి కూడా ఐపీఎల్ ఆటే కొలమానం అయితే రంజీ ట్రోఫీ పెట్టడం ఎందుకు? దాన్ని ఆపేయండి. రంజీల్లో ఏ ప్లేయర్ కూడా ఆడకండి. ఫలితం లేనప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీకి అంత ఖర్చు పెట్టి దండగే'' అంటూ కామెంట్ చేశాడు. ఓవరాల్‌గా సర్ఫరాజ్ ఖాన్ రంజీ క్రికెట్లో ఇప్పటివరకు 37 మ్యాచులు ఆడి 79.65 సగటుతో 13 సెంచరీలతో 3505 పరుగులు చేశాడు. ఇక 2022-23 రంజీ ట్రోఫీలో 6 మ్యాచుల్లో 92.66 సగటుతో 556 పరుగులు చేశాడు. అంతకుముందు 2021-22 సీజన్లో 4 సెంచరీలతో 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు. చదవండి: యార్కర్ల కింగ్ అన్నారు.. ఇప్పుడు జట్టు నుంచి ఏకంగా పక్కన పెట్టేశారు! -
Ind Vs WI: ఆ ముగ్గురు దూరం.. యువ సంచలనం ఎంట్రీ!
India Vs West Indies: ‘‘రోహిత్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతం తనకు కావాల్సినంత విశ్రాంతి లభించింది. కాబట్టి పనిభారం అన్న మాటకు తావే లేదు. వెస్టిండీస్ పర్యటనలో అతడే జట్టును ముందుకు నడిపిస్తాడు’’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. విండీస్‌తో సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశారు. కాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం కానున్నాడనే వార్తల నేపథ్యంలో ఇన్సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ ఈ మేరకు సదరు అధికారి స్పష్టతనిచ్చారు. ఐపీఎల్-2023, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేదని.. అయితే.. గత కొంతకాలంగా తన ప్రదర్శన బాగానే ఉందని పేర్కొన్నారు. ‘‘ఆస్ట్రేలియా నాగ్‌పూర్ టెస్టులో రోహిత్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం రోహిత్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. నిలకడలేమి ఫామ్ కారణంగా అతడి పట్ల దారుణమైన విమర్శలు చేయడం సరికాదు. రోహిత్ త్వరలోనే తిరిగి పుంజుకుంటాడు’’ అని సదరు అధికారి చెప్పుకొచ్చారు. కాగా జూలై 12న తొలి టెస్టుతో టీమిండియా.. వెస్టిండీస్ పర్యటన మొదలుకానున్న విషయం తెలిసిందే. ఆ ముగ్గురు దూరంగానే రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లతో కూడిన ఈ టూర్‌కు సంబంధించి జూన్ 27న బీసీసీఐ జట్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25 ఆరంభ మ్యాచ్‌లో భాగంగా కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కానున్నారు. యువ సంచలనం ఎంట్రీ గాయాల నుంచి కోలుకుంటున్న వీరు ముగ్గురు సెలక్షన్‌కు అందుబాటులో లేరని.. ఛతేశ్వర్ పుజారా మాత్రం జట్టుతో కొనసాగుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను విండీస్‌తో సిరీస్ సందర్భంగా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు రోహిత్ సారథ్యం వహించనుండగా.. హార్దిక్ పాండ్యా టీ20 సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక టెస్టు సిరీస్ నేపథ్యంలో సర్ఫరాజ్‌తో పాటు పేసర్ ముకేశ్ కుమార్‌కు సెలక్టర్లు పిలుపునివ్వనున్నట్లు సమాచారం. సీనియర్ పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లపై భారం తగ్గించే క్రమంలో ముకేశ్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ధోని చాలా గ్రేట్.. తన సమస్య గురించి ఎవరికీ చెప్పలేదు! ఆఖరికి లబుషేన్‌కు ఊహించని షాక్.. ప్రపంచ నంబర్ 1 అతడే! వారెవ్వా పంత్.. -
దేశంలో టెస్ట్‌లకు సూటయ్యే ఆటగాడే లేడనా, ఈ ఆణిముత్యాన్ని ఎంపిక చేశారు..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్ ప్లేయర్‌గా ముద్రపడిన ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇషాన్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసినందుకు గాను భారత క్రికెట్ అభిమానులు సెలెక్టర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దేశంలో టెస్ట్ ఫార్మాట్‌కు సూటయ్యే ఆటగాడే లేడనా, ఈ ఆణిముత్యాన్ని ఎంపిక చేశారంటూ ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. సెలెక్టర్లకు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవాలని లేనట్లుంది, అందుకే టీ20 ఆడుకునే వాడిని జట్టులో చేర్చుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ మేనేజ్మెంట్ ఇషాన్‌ను తుది జట్టులోకి (డబ్ల్యూటీసీ ఫైనల్) తీసుకుంటే, చాలాకాలం తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోతుందని అంటున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇషాన్ గణాంకాలు (48 మ్యాచ్‌ల్లో 38 సగటున 2985 పరుగులు) చూసే ఈ ఎంపిక చేశారా.. లేక ఎవరైనా రెకమెండ్ చేస్తే జట్టులోకి తీసుకున్నారా అంటూ సెలెక్టర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ కంటే వెయ్యి రెట్టు మెరుగైన గణాంకాలు కలిగి, దేశవాలీ టోర్నీల్లో పరుగుల పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ (37 మ్యాచ్‌ల్లో 79.65 సగటున 3505 పరుగులు) కానీ, టెస్ట్ ఫార్మాట్‌కు అతికినట్లు సరిపోయి, ప్రస్తుతం (ఐపీఎల్ 2023) సూపర్ ఫామ్‌లో ఉన్న అనుభవజ్ఞుడైన వృద్ధిమాన్ సాహా కానీ సెలెక్టర్లకు కనపడలేదా అని నిలదీస్తున్నారు. సర్ఫరాజ్‌కు అనుభవం లేదని వదిలేస్తే, సాహా గత రంజీ ట్రోఫీ ప్రదర్శననైనా (7 ఇన్నింగ్స్‌ల్లో 52.16 సగటున 313 పరుగులు) పరిగణలోకి తీసుకొని ఉండాల్సిందని అంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు ఇషాన్ కంటే సాహా బెటర్‌గా సూటవుతాడని, ఇషాన్‌ను ఎంపిక చేసి సెలెక్టర్లు పెద్ద తప్పే చేశారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడుతున్నారు. దేశంలో టెస్ట్ ఫార్మాట్‌కు సూటయ్యే ఆటగాళ్లే లేరని స్టాండ్ బై ప్లేయర్‌గా సూర్యకుమార్‌ను, వరల్డ్ గ్రేట్ ఆల్‌రౌండర్ లార్డ్ శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేశారంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: రుత్‌రాజ్ గైక్వాడ్‌కు బంపరాఫర్.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో! -
ఏంటి బ్రో టెస్టు మ్యాచ్ అనుకున్నావా.. జట్టులో ఇంకా ఎవరూ లేరా?
ఐపీఎల్-2023 ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సర్ఫరాజ్ విఫలమవుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సర్ఫరాజ్.. టెస్టు మ్యాచ్ కంటే దారుణంగా ఆడాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. కేవలం 10 బంతులు ఎదుర్కొని 9 పరుగులు మాత్రమే చేశాడు. నటరాజన్ బౌలింగ్‌లో అనవసరపు షాట్ ఆడి క్లీన్ బౌల్డయ్యాడు. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 53 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సర్ఫరాజ్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. టెస్టులు ఆడేవాడిని ఐపీఎల్లో ఆడిస్తే ఇలానే ఉంటుంది అని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంతమంది ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులో ఇంకా ఎవరూ లేరా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: IPL 2023: అదే మా కొంపముంచింది.. అందుకే అక్షర్‌ను ముందు పంపలేదు: వార్నర్ Sarfaraz Khan ko WTC me lo🙏 pic.twitter.com/lKVmHWPqJA — Pulkit🇮🇳 (@pulkit5Dx) April 29, 2023 #Sarfaraz Khan is one of the top Worst Player.. #DCvSRH #DelhiCapitals pic.twitter.com/a5e5x6beWu — Indian (@jatin_gulab) April 24, 2023 -
'రంజీ మ్యాచ్లనుకున్నావా.. ఇలా ఆడితే కష్టం'
సర్ఫరాజ్ ఖాన్.. ఇటీవలీ కాలంలో బాగా మారుమోగిన పేరు. దేశవాలీ క్రికెట్ అయిన రంజీ ట్రోఫీ సహా ఇతర క్రికెట్ లీగ్స్‌లో వరుస శతకాలతో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ఇలాంటి టాలెంటెడ్ ఆటగాడిని టీమిండియాలోకి ఎందుకు తీసుకోరని అభిమానులు ప్రశ్నించారు. చెత్త రాజకీయాలతో టాలెంటెడ్ ఆటగాడిని తొక్కేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. Photo: IPL Twitter అయితే ఐపీఎల్‌కు వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్ టాలెంట్‌ను పొగిడిన నోళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నాయి. అందుకు అతను బాగా ఆడలేకపోతున్నాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే విమర్శించేది అతని చేస్తున్న స్లో బ్యాటింగ్‌పై. రిషబ్ పంత్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమవ్వడంతో అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. ఇక బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 34 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ స్లో బ్యాటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ రన్‌రేట్ మధ్యలో దారుణంగా పడిపోయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ సర్ఫరాజ్ ఖాన్‌ను ట్రోల్ చేశారు. ''ఇలా అయితే ఐపీఎల్‌కు పనికిరావు.. రంజీలనుకుంటున్నావా కాస్త వేగం పెంచు.. సర్పరాజ్ కేవలం రెడ్‌బాల్ క్రికెట్‌కు మాత్రమే పనికొస్తాడు.'' అంటూ కామెంట్ చేశారు. He played this in a T20 match 🙂#DCvGT #IPL pic.twitter.com/5KUSnDwdqz — Om 🇮🇳 (@chadxomm) April 4, 2023 చదవండి: 'భయ్యా.. నీకున్న సౌలత్ మాకుంటే ఎంత బాగుండు' 'మాట తప్పాడు.. చాలా బ్యాడ్‌గా అనిపిస్తోంది' -
Ind Vs Aus: అతడు సెలక్షన్ కమిటీ డోర్లు బాదడం కాదు.. ఏకంగా..: అశ్విన్
India Vs Australia- Sarfaraz Khan: ‘‘ఈ బ్యాటర్ గురించి ఏమని, ఎక్కడని మొదలుపెట్టను? సర్ఫరాజ్ ఖాన్... అతడు టీమిండియాకు సెలక్ట్ అవుతాడా కాడా అన్న అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, తనకు ఇవేమీ పట్టవు. మీకు తెలుసా.. తను 2019-20 సీజన్లో 900 పరుగులు చేశాడు. 2020-21 సీజన్లోనూ 900 పరుగులు. ఇక ఈసారి సుమారుగా 600 రన్స్. తన అత్యద్భుత ప్రదర్శనతో సెలక్టర్లకు గట్టి సవాల్ విసురుతున్నాడు’’ అంటూ టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు కురిపించాడు. రంజీల్లో అతడి ఆటతీరును కొనియాడుతూ ఆకాశానికెత్తాడు. వాళ్లకు కేవలం తలనొప్పి మాత్రమే కాదు.. కోపం కూడా తెప్పిస్తున్నాడంటూ తనదైన శైలిలో బీసీసీఐ సెలక్టర్లపై సెటైర్లు వేశాడు. సర్ఫరాజ్ ఖాన్ విమర్శల వర్షం దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడం లేదన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు ఎంపికవుతాడని ఆశలు పెట్టుకుంటే.. ఇషాన్ కిషన్ అరంగేట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెలక్టర్లు.. సర్ఫరాజ్‌కు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తలనొప్పిలా తయారయ్యాడు ఈ క్రమంలో ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైన జట్టులో ఉన్న స్పిన్నర్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. ‘‘గత మూడు రంజీ సీజన్లలో అతడి స్ట్రైక్‌రేటు బాగుంది. సగటు 100కి పైగా ఉంది. ప్రతి సీజన్లోనూ మెరుస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ కేవలం సెలక్షన్ కమిటీ డోర్లను బాదడం కాదు.. సెలక్టర్లకు ఓ రకంగా కోపం తెప్పించేలా తలనొప్పిలా తయారయ్యాడు. కానీ దురదృష్టవశాత్తూ ఈసారి కూడా తను జట్టుకు ఎంపిక కాలేదు. అయితేనేం, తన ఆట తనది. దేనికి కుంగిపోకుండా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ తన పని తాను చేసుకుపోయాడు. ముఖ్యంగా ఢిల్లీ మ్యాచ్‌లో తన బ్యాటింగ్ అద్భుతం. ముంబై ఆ మ్యాచ్‌లో ఓడినప్పటికీ సర్ఫరాజ్ ఇన్నింగ్స్ మర్చిపోలేం’’ అని అశూ సర్ఫరాజ్‌ను ప్రశంసించాడు. చదవండి: IND VS NZ 2nd T20: ఆసీస్‌తో టెస్ట్ సిరీస్.. పని మొదలుపెట్టిన సూర్యకుమార్ యాదవ్ పాండ్యాది చెత్త నిర్ణయం.. నంబర్ 1 బౌలర్ విషయంలో ఎందుకలా? హుడాను మాత్రం.. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణమిదేనన్న బీసీసీఐ సెలక్టర్ -
అందుకే సర్ఫరాజ్‌ను ఎంపిక చేయలేదు! మౌనం వీడిన బీసీసీఐ సెలక్టర్
Sarfaraz Khan- Team India: గత కొన్నాళ్లుగా భారత క్రికెట్ వర్గాల్లో తరచుగా వినిపిస్తున్న పేరు సర్ఫరాజ్ ఖాన్. ఈ ముంబై బ్యాటర్ దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్నా జాతీయ జట్టుకు మాత్రం సెలక్ట్కావడం లేదు. సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదుతున్నా.. బీసీసీఐ సెలక్టర్లు అతడి ఎంట్రీకి తలుపులు తెరవడం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో సర్ఫరాజ్‌కు అవకాశం ఇస్తారని భావించినా అలా జరుగలేదు. రంజీ ట్రోఫీ 2022-23లో సత్తా చాటినా భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో తాను తీవ్ర నిరాశకు లోనయ్యానన్న సర్ఫరాజ్.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు తనను సిద్ధంగా ఉండమని చెప్పారంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. తాను కూడా మనిషేనని, తనకూ భావోద్వేగాలు ఉంటాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల సర్ఫరాజ్‌కు మద్దతుగా అభిమానులు, పలువురు మాజీలు.. సెలక్టర్ల తీరుపై విమర్శలు సంధించారు. ఈ క్రమంలో ఈ విషయంపై బీసీసీఐ సెలక్టర్ శ్రీధరన్ శరత్ తాజాగా స్పందించారు. బ్యాటింగ్ విభాగం పటిష్టం ‘‘కోహ్లి ఇంకా మ్యాచ్ విన్నరే. ఛతేశ్వర్ పుజారా ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడు. శ్రేయస్ అయ్యర్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక శుబ్‌మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేఎల్ రాహుల్ తనదైన రోజు ఎలా ఆడతాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం భారత బ్యాటింగ్ విభాగం బాగుంది. తనకూ ఓ రోజు ఛాన్స్ ఇక సర్ఫరాజ్ కూడా మా ప్రణాళికల్లో ఉన్నాడు. తనదైన రోజు తప్పకుండా అతడికి అవకాశం వస్తుంది. అయితే, జట్టును ఎంపిక చేసేటపుడు అన్ని విభాగాలను పరిశీలించి సమతుల్యంగా ఉండేట్లు చూసుకుంటాం’’ అంటూ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌స్టార్‌తో మాట్లాడుతున్న క్రమంలో సర్ఫరాజ్ గురించి శ్రీధరన్ శరత్‌కు ప్రశ్న ఎదురు కాగా ఇలా బదులిచ్చాడు. కాగా ఇటీవల చేతన్ శర్మ నాయకత్వంలో ఏర్పాటైన నేషనల్ ప్యానెల్లో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలాతో పాటు శ్రీధరన్ శరత్ కూడా ఉన్నారు. చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు Hyd Vs DEL: దంచికొట్టిన ఆయుశ్.. 7 వికెట్లతో చెలరేగిన హర్షిత్.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ హైదరాబాద్ ఓటమి -
అన్న బాటలో.. ట్రిపుల్ సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్
Sarfaraz Khan Brother Musheer Khan: దేశవాలీ టోర్నీల్లో ముఖ్యంగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తూ, అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడుతున్న ముంబై చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే అతను ఈసారి వార్తల్లోకెక్కింది తన వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించి కాదు. తన తమ్ముడు ముషీర్ ఖాన్ కారణంగా. రంజీల్లో ముంబైకే ప్రాతినిధ్యం వహించే 17 ఏళ్ల ముషీర్ ఖాన్.. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ-2023లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ బాదాడు. Sarfaraz Khan's younger brother Musheer Khan has smashed a triple century for Mumbai in CK Nayudu Trophy against Hyderabad.#CricTracker #SarfarazKhan #MusheerKhan pic.twitter.com/b7C6VtJoTp— CricTracker (@Cricketracker) January 23, 2023 ఈ మ్యాచ్‌లో 367 బంతులు ఎదుర్కొన్న ముషీర్.. 34 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 339 పరుగులు స్కోర్ చేశాడు. ముషీర్ కళాత్మకమైన ఇన్నింగ్స్‌లో 190 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో రావడం విశేషం. ట్రిపుల్ హండ్రెడ్‌తో ముషీర్ చెలరేగడంతో ముంబై తమ ఇన్నింగ్స్‌ను 704 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ముషీర్ గత నెలలోనే రంజీల్లోకి అరంగేట్రం చేసి ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేక జట్టులో స్థానం కోల్పోయాడు. సౌరాష్ట్రతో జరిగిన తన డెబ్యూ మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టకుండా కేవలం 35 (12, 23) పరుగులు చేసిన ముషీర్.. అస్సాంతో జరిగిన రెండో మ్యాచ్‌లో 42 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. అయితే అతికష్టం మీద లభించిన మూడో అవకాశంలోనూ ముషీర్ తనను తాను నిరూపించుకోలేకపోవడంతో వేటు తప్పలేదు. తన మూడో మ్యాచ్‌లో ఢిల్లీపై ముషీర్ వికెట్లు లేకుండా కేవలం 19 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. తద్వారా ముంబై యాజమాన్యం అతన్ని మరుసటి మ్యాచ్ నుంచి తప్పించింది. అయితే, అన్న సర్ఫరాజ్ లాగే పట్టువదలని ముషీర్.. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో హైదరాబాద్‌పై ట్రిపుల్ సెంచరీ బాది, ముంబై యాజమాన్యం తిరిగి తనవైపు చూసేలా చేశాడు. మరోపక్క రంజీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సెంచరీ మీద సెంచరీలు బాదుతూ, టీమిండియాలో చోటు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 92.66 సగటున 556 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అంతకుముందు సీజన్లలోనూ ఇదే తరహాలో రెచ్చిపోయిన సర్ఫరాజ్.. వరుసగా 928 (9 ఇన్నింగ్స్‌ల్లో 154.66 సగటున), 982 (9 ఇన్నింగ్స్‌ల్లో 122.75 సగటున) పరుగులు చేసి టీమిండియా నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. తన ప్రదర్శన కారణంగా సర్ఫరాజ్ ఇండియా-ఏ టీమ్‌లో అయితే చోటు దక్కించుకోగలిగాడు కానీ, జాతీయ సెలెక్టర్లు మాత్రం ఈ ముంబై కుర్రాన్ని కరుణించడం లేదు. ఆసీస్‌తో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన టీమిండియాలో చోటు ఆశించి భంగపడ్డ సర్ఫరాజ్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో అదృష్టం కలిసొస్తుందేమో వేచి చూడాలి. గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్న శ్రేయస్.. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ సమయానికి కోలుకోలేకపోతే, సెలెక్టర్లు సర్ఫరాజ్‌ను కటాక్షించే అవకాశాలు లేకపోలేదు. -
అర్జున్ దగ్గర అన్నీ ఉన్నాయి.. నా దగ్గర నువ్వు ఉన్నావు, చాలు నాన్న: సర్ఫరాజ్ ఖాన్
Sarfaraz Khan: అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడుతూ, దేశవాలీ టోర్నీల్లో సెంచరీల మీద సెంచరీలు బాదుతూ, పరుగుల వరద పారిస్తున్న ముంబై చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అతని తండ్రి నౌషద్ ఖాన్ ఇటీవలే మీడియాతో షేర్ చేసుకున్నాడు. తన కొడుకు సర్ఫరాజ్ ఖాన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌తో కూడిన ఓ యధార్థ సన్నివేశాన్ని నౌషద్ మీడియాకు వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. హృదయాన్ని కదిలించే ఈ సన్నివేశంలో సర్ఫరాజ్ తనతో అన్న మాటలను గుర్తు చేసుకుంటూ నౌషద్ కన్నీరుమున్నీరయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే (నౌషద్ కథనం మేరకు).. సర్ఫరాజ్ ఖాన్, సచిన్ తనయుడు అర్జున్ జూనియర్ లెవెల్ నుంచి ముంబై తరఫున కలిసి క్రికెట్ ఆడేవారు. ఒక రోజు సర్ఫరాజ్ తన తండ్రి నౌషద్ దగ్గరకు వచ్చి.. నాన్న.. అర్జున్ ఎంత అదృష్టవంతుడు కదా.. అతని దగ్గర కార్లు, ఐపాడ్స్ అన్నీ ఉన్నాయి అని అన్నాడు. కొడుకు అన్న మాటలకు నౌషద్ నోటి వెంట మాట రాలేదు. నిస్సహాయ స్థితిలో అలాగే మిన్నకుండిపోయాడు. తమ ఆర్థిక స్థోమత గురించి కొడుకుకు తెలుసో లేదో అని మనసులో అనుకున్నాడు. కొద్దిసేపటికి సర్ఫరాజ్ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుని.. అర్జున్ కంటే నేనే అదృష్టవంతున్ని నాన్న.. ఎందుకంటే, నా తండ్రి నాతో పాటు రోజంతా గడుపుతాడు, అర్జున్ తండ్రి అతనితో ఎక్కువ సేపు గడపలేడు అంటూ చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడాడు. ఈ విషయాన్ని నౌషద్ ఓ ప్రముఖ దినపత్రికతో షేర్ చేసుకున్నాడు. చిన్నతనం నుంచి తన కొడుకుకు ఉన్న పరిపక్వత గురించి వివరిస్తూ నౌషద్ తెగ మురిసిపోయాడు. తన కొడుకు తిరిగి వచ్చి తనను కౌగిలించుకున్న క్షణంలో తనకు ఏమని మాట్లాడాలో అర్ధం కాలేదని భావోద్వేగానికి లోనయ్యాడు. దిగువ మధ్య తరగతికి చెందిన నౌషద్.. కొడుకు సర్ఫరాజ్ కోసం చాలా త్యాగాలు చేశాడు. వర్షం పడితే గ్రౌండ్‌ను వెళ్లడం కుదరదని, ఇంటినే గ్రౌండ్‌గా మార్చేశాడు. క్రికెట్‌కు సంబంధించి కొడుకుకు కావాల్సిన సలహాలు ఇస్తూ అన్నీ తానై వ్యవహరిస్తుంటాడు. ఇదిలా ఉంటే, గత కొంత కాలంగా దేశవాలీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుత రంజీ సీజన్లోనూ 6 మ్యాచ్‌ల్లో 3 సెంచరీల సాయంతో 556 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ తాజా ప్రదర్శన నేపథ్యంలో భారత టెస్ట్ జట్టులో (ఆసీస్ సిరీస్) చోటు గ్యారెంటీ అని అంతా ఊహించారు. అయితే ఈ ముంబై ఆటగాడికి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. గత 24 ఇన్నింగ్స్‌ల్లో 71*, 36, 301*, 226*, 25, 78, 177, 6, 275, 63, 48, 165, 153, 40, 59*, 134, 45, 5, 126*, 75, 20, 162, 125, 0 ఓ ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీలు, 7 సెంచరీలు, 5 అర్ధసెంచరీ బాది పరుగల వరద పారించిన సర్ఫరాజ్‌ను కాదని టీ20ల్లో సత్తా చాటాడన్న కారణంగా సూర్యకుమార్‌ను టెస్ట్ జట్టుకు ఎంపిక చేశారు సెలెక్టర్లు. అయితే సర్ఫరాజ్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అయ్యర్ గాయపడ్డాడు. ఆసీస్‌తో తొలి టెస్ట్‌లకు ఎంపిక చేసిన జట్టులో అయ్యర్ కూడా ఉన్నాడు. ఒకవేళ ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ సమయానికి అయ్యర్ కోలుకోకపోతే సర్ఫరాజ్‌కు టీమిండియా నుంచి మెయిడిన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. -
జట్టులో చోటెక్కడుంది?! మీరేం మనిషి.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా?
Mumbai- Sarfaraz Khan: ‘‘ఆటను కొనసాగిస్తూ ఉండు. మెరుగైన ప్రదర్శన చేస్తూ ఉండాలి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం చేకూరదు. ఇప్పటికైనా సర్ఫరాజ్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి’’ అని ముంబై మాజీ కెప్టెన్, ప్రస్తుత చీఫ్ సెలక్టర్ మిలింద్ రేగె మండిపడ్డాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సెలక్షన్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదన్నాడు. అనవసర విషయాలపై కాకుండా బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని హితవు పలికాడు. పరుగులు సాధిస్తూ ఉండటమే బ్యాటర్ పని, ఎవరి పని వాళ్లు చేసుకుంటే బాగుంటుందంటూ సర్ఫరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్ని సెంచరీలు చేసినా.. రంజీ ట్రోఫీ 2022-23 టోర్నీలో వరుస సెంచరీలతో దుమ్ము రేపుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనైనా అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ మరోసారి అతడికి మొండిచేయే ఎదురైంది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన సర్ఫరాజ్ ఖాన్ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో తన ఆవేదన పంచుకున్నాడు. అప్పుడేమో అలా.. తానూ మనిషేనని, తనకూ భావోద్వేగాలు ఉంటాయని ఉద్వేగభరితంగా మాట్లాడాడు. గతంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తనను బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు సర్ఫరాజ్ పేర్కొన్నాడు. అదే విధంగా రంజీ టోర్నీలో భాగంగా అసోంతో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీలో ఉన్నపుడు తన తండ్రితో కలిసి ప్రాక్టీసు చేశానని పేర్కొన్నాడు. చోటు లేదు ఏం చేస్తాం? ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ వ్యాఖ్యలపై స్పందించిన మిలింద్ అతడిని విమర్శించాడు. ముంబై కోచ్ అమోల్ మజుందార్‌తో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘సర్ఫరాజ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో అతడికి చోటు లేదు. తను అత్యద్భుతంగా ఆడుతున్నాడనే నిజం. అయితే, ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. అప్పుడు తనను తాను నిరూపించుకోవాలి. కానీ ఇప్పుడు జాతీయ జట్టులో అసలు చోటెక్కడిది? అయినా, ఈ విషయంలో సర్ఫరాజ్ వ్యాఖ్యలు సరికావు. తన దృష్టి బ్యాటింగ్‌పై మాత్రమే ఉండాలి. అమోల్ నీ కోచ్‌గా ఉండగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 11 వేల పరుగులు సాధించిన అమోల్‌కు ఒక్కసారి కూడా జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. అప్పటికి టీమిండియాలో చోటు లేకపోవడంతో తనకు నిరాశే ఎదురైంది. అయినా తను ఆటను కొనసాగించాడు. అమోల్‌ను చూసి సర్ఫరాజ్ నేర్చుకోవాల్సి ఉంది. అయినా, అమోల్ నీ కోచ్‌గా ఉండగా.. మీ నాన్నతో ఏం పని? ఆయన నీకు కోచింగ్ ఇస్తున్నారని ఓ పత్రికలో చదివా! అసలు ఏంటిది?’’ అంటూ మిడ్- డేతో మాట్లాడుతూ 73 ఏళ్ల మిలింద్ అసహనం వ్యక్తం చేశాడు. అంటే ఎప్పటికీ టీమిండియాకు సెలక్ట్ కాడా? కాగా సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి మేటి ఆటగాళ్లు జట్టులో వరుస అవకాశాలు దక్కించుకున్న తరుణంలో అమోల్‌కు భంగపాటు తప్పలేదు. ఇక మిలింద్ రేగె వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘ఎంత గొప్పగా ఆడినా సరైన గుర్తింపు లేకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అయినా నువ్వేంటి.. అమోల్ మజూందార్ లాగే సర్ఫరాజ్ ఖాన్ ఎప్పటికీ టీమిండియాకు సెలక్ట్ కాడని అంటున్నావా? లేదంటే సెలక్ట్ కాకూడదని కోరుకుంటున్నావా? ఇదేం పద్ధతి? మీరేం మనిషి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలతో ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Sunrisers: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి.. Ind Vs NZ: రాయ్‌పూర్‌లో రోహిత్ సేనకు ఘన స్వాగతం.. వీడియో వైరల్ -
'ఎంత బరువుంటే అన్ని సెంచరీలు చేస్తాడు'
దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపుతున్నాడు. ఈ ఏడాది రంజీ సీజన్లో ఇప్పటికే మూడు సెంచరీలు బాదిన సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా ఆడుతున్నప్పటికి జాతీయ జట్టు నుంచి పిలుపు మాత్రం రావడం లేదు. వయసు రిత్యా 25 ఏళ్లు అయినప్పటికి బారీ కాయంగా కనిపించే సర్ఫరాజ్ ఫిట్నెస్ విషయంలో మాత్రం ది బెస్ట్ అనిపిస్తున్నాడు. రంజీల్లో ముంబై తరపున ఆడుతున్న సర్ఫరాజ్ బరువున్నా బ్యాటింగ్ మాత్రం సులువుగా చేస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ పరుగుల ప్రవాహం సృష్టిస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం పట్ల సెలెక్టర్లను మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ సర్ఫరాజ్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''దేశవాళీ క్రికెట్లో వరుసగా మూడో సీజన్లో కూడా సర్ఫరాజ్ బెంబేలెత్తిస్తున్నాడు. అలాంటి బ్యాటర్‌ను టెస్టు జట్టుకు ఎంపిక చేయకపోవడం శోచనీయం. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడం దేశవాలీ క్రికెట్‌ను అవమానించడమేనని.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ప్లాట్‌ఫామ్‌ను పట్టించుకోకపోవడమే అవుతుంది. పరుగులు సాధించేందుకు సర్ఫరాజ్ ఫిట్‌గా ఉన్నాడు. అతను ఎంత బరువున్నాడో.. అన్ని సెంచరీలు కొట్టగలడు '' అని ప్రసాద్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. Not having him in the Test Team despite 3 blockbuster domestic seasons is not only unfair on Sarfaraz Khan, but it’s an abuse to domestic cricket,almost as if this platform doesn’t matter. And he is FIT to score those runs. As far as body weight goes, there are many with more kgs https://t.co/kenO5uOlSp — Venkatesh Prasad (@venkateshprasad) January 17, 2023 చదవండి: ఓర్వలేనితనం అంటే ఇదే.. దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్.. సీజన్లో మూడో సెంచరీ -
శతకాల మోత.. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు మొత్తం 13 మంది
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఇవాళ (జనవరి 17) మొదలైన మ్యాచ్‌ల్లో వివిధ జట్లకు చెందిన ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. ముంబై చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు మొత్తం 13 మంది తొలి రోజు ఆటలో సెంచరీలు బాదారు. సెంచరీలు సాధించిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. మేఘాలయతో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో బిహార్ ఆటగాడు బిపిన్ సౌరభ్ (177) కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు సచిన్ బేబి (116 నాటౌట్) ఉత్తర్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒడిశా ఓపెనర్ శాంతాను మిశ్రా (107 నాటౌట్) హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు నౌషద్ షేక్ (145 నాటౌట్) ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్ (125) అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు ఓపెనర్ ఎన్ జగదీశన్ (125) చత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు సమర్పిత్ జోషి (123) మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు అన్మోల్ప్రీత్ సింగ్ (124), నేహల్ వధేరా (123 నాటౌట్) చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్ ఆటగాళ్లు వివేక్ సింగ్ (108), ఉపేంద్ర యాదవ్ (113) నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ ఆటగాడు అంకిత్ కల్సీ (116 నాటౌట్) హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాడు అనుస్తుప్ మజుందార్ (137 నాటౌట్) -
దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్.. సీజన్లో మూడో సెంచరీ
ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. జాతీయ జట్టు నుంచి పిలుపు రాకపోయినప్పటికి తన పరుగుల ప్రవాహం మాత్రం కొనసాగిస్తూనే వస్తున్నాడు. వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ తాజాగా ఈ సీజన్లో మూడో సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు చూసుకుంటే గత 23 రంజీ ఇన్నింగ్స్‌ల్లో సర్ఫరాజ్‌ఖాన్‌కు ఇది పదో సెంచరీ కావడం విశేషం. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు సర్ఫరాజ్ ఆరు మ్యాచ్‌లాడి 556 పరుగులతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి. ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఎలైట్ గ్రూప్-బిలో ఢిల్లీతో మ్యాచ్‌లో మంగళవారం సర్ఫరాజ్ సెంచరీ ఫీట్ సాధించాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై ఓపికగా నిలబడి బ్యాటింగ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ 135 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం అందుకున్నాడు. 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై జట్టును సర్ఫరాజ్ ఆదుకున్నాడు. సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నప్పటికి తాను మాత్రం ఓపికతో ఆడుతూ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ముంబై తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ 124, తనుష్ కొటెయిన్ క్రీజులో ఉన్నారు. Yet another 100 for Sarfaraz Khan. In testing conditions too at the Kotla pic.twitter.com/LkUWraNlHD — Vikrant Gupta (@vikrantgupta73) January 17, 2023 Sarfaraz Khan has 10 centuries in his last 23 innings in Ranji Trophy. Crazy run for Sarfaraz, he's insane! pic.twitter.com/xq3bTpnKHs — Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2023 చదవండి: స్టీవ్ స్మిత్‌కు పూనకం వచ్చింది.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు ఉప్పల్‌లో మ్యాచ్ అంటే కోహ్లికి పూనకాలే! -
నేనూ మనిషినే.. నాకూ భావోద్వేగాలు ఉంటాయి: సర్ఫరాజ్ ఖాన్
‘‘నేనెక్కడికి వెళ్లినా.. త్వరలోనే ఈ అబ్బాయి టీమిండియాకు ఆడతాడు అంటూ గుసగుసలు వినిపిస్తాయి. ఇక సోషల్ మీడియాలో అయితే, జట్టులో నా పేరు లేకపోవడం పట్ల విశేష స్పందన. వేలల్లో మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. నీకూ టైమ్ వస్తుంది. వేచి చూడక తప్పదు అని చాలా మంది సలహాలు ఇస్తుంటారు. స్వదేశంలో సిరీస్‌లకు జట్లను ప్రకటించిన సమయంలో.. అసోంతో మ్యాచ్ అనంతరం నేను ఢిల్లీకి వచ్చాను. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నేను ఎందుకు సెలక్ట్కాలేదు? రోజంతా ఇదే ఆలోచన. అయితే, మా నాన్నతో మాట్లాడిన తర్వాతే నార్మల్ అవ్వగలిగాను. ఏదేమైనా, నేను ప్రాక్టీసు వదలను. డిప్రెషన్లోకి వెళ్లను. అవకాశం వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను అని నాకు నేను సర్దిచెప్పుకొన్నాను’’ అంటూ భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తాను కూడా మనిషేనని, యంత్రాన్నైతే కాదు కదా అని ఉద్వేగానికి గురయ్యాడు. మరోసారి మొండిచేయి దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు గత కొంతకాలంగా బీసీసీఐ సెలక్టర్లు మొండిచేయి చూపిస్తున్నారు. పరుగుల వరద పారిస్తున్నా జాతీయ జట్టులో మాత్రం చోటుదక్కడం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వరుస సిరీస్‌ల నేపథ్యంలో బీసీసీఐ నుంచి పిలుపు వస్తుందని ఆశించిన అతడికి మరోసారి భంగపాటే ఎదురైంది. నేనూ మనిషినే! ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన సర్ఫరాజ్ ఖాన్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘జట్టును ప్రకటించిన సమయంలో అందులో నా పేరు ఉంటుందని ఆశగా ఎదురుచూశాను. కానీ అలా జరగకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాను. నేను కాదు.. నా స్థానంలో ఎవరున్నా అలాగే ఫీల్ అవుతారు. పరుగులు సాధిస్తూనే ఉన్నాను. అయినా, ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు. నేనూ మనిషినే కదా! మెషీన్‌ని కాదు. నాకూ భావోద్వేగాలు ఉంటాయి. బంగ్లాదేశ్ సిరీస్‌లో అవకాశం అన్నారు! నిజానికి బెంగళూరులో రంజీ ట్రోఫీ టోర్నీ ఫైనల్లో సెంచరీ బాదిన సమయంలో నేను టీమిండియా సెలక్టర్లను కలిశాను. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో నీకు కచ్చితంగా అవకాశం వస్తుంది. సిద్ధంగా ఉండు అని చెప్పారు. ఇటీవలే చేతన్ శర్మ సర్ని కూడా కలిశాను. (PC: sarfarazkhan Instagram) హోటల్ నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో ఆయనను చూశాను. నువ్వేమీ బాధపడొద్దు. నీకూ కచ్చితంగా అవకాశం వస్తుందని ఆయన చెప్పారు. ఏదేమైనా మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురుచూడాల్సిందే! గొప్ప ఇన్నింగ్స్ ఆడినపుడు ఇలాంటి అంచనాలు, ఆశలు సహజమే. డిప్రెషన్లోకి వెళ్లను కానీ ఏం చేస్తాం! ఇప్పటికే జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ఈ గడ్డుకాలం వెళ్లిపోతుందనే భావిస్తున్నా. నా చేతుల్లో ఏమీలేదు. అయితే, ఇలాంటి వాటి వల్ల డిప్రెషన్లో కూరుకుపోవాల్సిన అవసరం లేదు’’ అని 25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా.. ప్రస్తుత రంజీ సీజన్లో 5 మ్యాచ్‌ల్లో 431 పరుగులు (2 సెంచరీలు) చేశాడు సర్ఫరాజ్. ఈ నేపథ్యంలో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్‌కు అతడిని ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అలా జరుగలేదు. చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే! IND vs SL: వారెవ్వా సిరాజ్.. శ్రీలంక బ్యాటర్‌కు ఊహించని షాక్! వీడియో వైరల్ Team India: టెస్టులకు సూర్య.. టి20లకు పృథ్వీ షా, వన్డేల్లో శ్రీకర్ భరత్ -
పృథ్వీ షాకు మోక్షం.. అభినవ బ్రాడ్‌మన్‌కు లభించని కటాక్షం
Prithvi Shaw-Sarfaraz Khan: ఈనెల (జనవరి) 18 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు అలాగే ఆ్రస్టేలియాతో సొంతగడ్డపై జరిగే ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ’లోని తొలి రెండు టెస్టుల కోసం భారత జట్టును సెలెక్టర్లు నిన్న (జనవరి 13) ప్రకటించారు. వన్డే జట్టులో ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు తొలిసారి అవకాశం లభించగా.. శార్దుల్ ఠాకూర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ షహబాజ్ అహ్మద్ పునరాగమనం చేశారు. వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వన్డేతో పాటు టీ20 జట్ల ఎంపికకు దూరంగా ఉన్నారు. అర్షదీప్ సింగ్‌పై వేటు పడింది. ఈ మార్పులు మినహా ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న జట్టునే యధాతథంగా కొనసాగించారు సెలెక్టర్లు. ఈ నెల 18, 21, 24 తేదీల్లో వన్డేలు జరుగుతాయి. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ టీ20 జట్టు విషయానికొస్తే.. ఏడాదిన్నర క్రితం ఏకైక టీ20 ఆడిన పృథ్వీ షా తిరిగి జట్టులో చోటు లభించగా, తాజాగా శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడిన జట్టునే ఈ సిరీస్‌లోనూ యధాతథంగా కొనసాగించారు. ఈ నెల 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, చహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ , శివం మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్ ఇక టెస్ట్ జట్టు విషయానికొస్తే (ఆస్ట్రేలియాతో తొలి 2 టెస్ట్‌లకు).. టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్యకుమార్ యాదవ్, ఇటీవలే వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోగా రవీంద్ర జడేజా పునరాగమనం చేశాడు. ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ (నాగ్‌పూర్), ఫిబ్రవరి 17న (ఢిల్లీ) రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనున్నాయి. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్ ఇదిలా ఉంటే, గత కొంత కాలంగా దేశవాలీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఇద్దరు యువ క్రికెటర్లలో ఒకరికి టీమిండియా తలుపులు తెరుచుకోగా.. మరొకరిని మాత్రం సెలెక్టర్లు కరుణించలేదు. ఆ ఇద్దరు ఎవరంటే.. పృథ్వీ షా, ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్. తాజాగా ముగిసిన రంజీ మ్యాచ్‌లో భారీ ట్రిపుల్ సెంచరీ (379) బాదిన పృథ్వీ షాను సెలెక్టర్లు ఎట్టకేలకు కరుణించగా.. అభినవ బ్రాడ్‌మన్‌గా పేరొందిన సర్ఫరాజ్ అహ్మద్‌కు ఇంకా కటాక్షం లభించలేదు. On the one hand Mr. Roger Binny says Ranji performance will be the only criteria for selection and on the hand @chetans1987 and his cohort keeps on ignoring Sarfaraz Khan. Shame! Give the lad a chance for God's sake. @BCCI @BCCIdomestic @bhogleharsha pic.twitter.com/7BtiT9BpGO — Mohammad Anzar Nayeemi (@AnzarNayeemiRJD) January 14, 2023 2019 నుంచి రంజీల్లో అద్బుతంగా రాణిస్తూ.. ప్రస్తుత సీజన్లోనూ 5 మ్యాచ్‌ల్లో 431 పరుగులు (2 సెంచరీలు) చేసిన సర్ఫరాజ్‌కు భారత టెస్ట్ జట్టులో (ఆసీస్ సిరీస్) చోటు గ్యారెంటీ అని అంతా ఊహించినప్పటికీ ముంబై ఆటగాడికి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. గత 22 ఇన్నింగ్స్‌ల్లో 71*, 36, 301*, 226*, 25, 78, 177, 6, 275, 63, 48, 165, 153, 40, 59*, 134, 45, 5, 126*, 75, 20, 162 ఓ ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీలు, 6 సెంచరీలు, 5 అర్ధసెంచరీ బాది పరుగల వరద పారించిన సర్ఫరాజ్‌ను కాదని టీ20ల్లో సత్తా చాటాడన్న కారణంగా సూర్యకుమార్‌ను టెస్ట్ జట్టుకు ఎంపిక చేయడం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Sarfaraz Khan deserves to be in the Indian test team, but to say SKY doesn't deserve the spot after what he has achieved in international cricket is ridiculous. One should be talking about KL Rahul here, who has not delivered anything tangible. https://t.co/ZIZ2adUyJf — Sahil Mohan Gupta (@DigitallyBones) January 14, 2023 జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే ఓ ఆటగాడిగా ఇంతకంటే ఏం చేయాలని సెలెక్టర్లను నిలదీస్తున్నారు. జాతీయ జట్టులోకి రావాంటే రంజీల్లో ప్రదర్శనే కొలమానం అని ప్రకటించిన బీసీసీఐ న్యూ బాస్ రోజర్ బిన్నీ సర్ఫరాజ్‌కు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నారు. There was a bit of an opening in the Test squad…was hoping that Sarfaraz will make it to the squad. He’s done everything that one could do to deserve a call-up. #IndvAus — Aakash Chopra (@cricketaakash) January 13, 2023 -
సూర్య కెరీర్‌పై గంభీర్ ట్వీట్.. ఏం మాట్లాడుతున్నావు భాయ్? ఫ్యాన్స్ ఫైర్
Suryakumar Yadav- Gautam Gambhir Tweet: టీ20 ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మైదానం నలువైపులా తనదైన షాట్లతో విరుచుకుపడే ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌ను.. పలువురు విశ్లేషకులు.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో పోలుస్తూ కొనియాడుతున్నారు. కాగా గతేడాది పొట్టి ఫార్మాట్లో అదరగొట్టి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం పొందిన సూర్య.. స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌లోనూ దుమ్ములేపాడు. దుమ్ములేపాడు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో నిరాశపరిచినా(7).. పుణెలో అర్ధ శతకం(51), రాజ్‌కోట్‌లో అద్భుత సెంచరీ బాదాడు. ముఖ్యంగా సిరీస్ విజేతను తేల్చే మూడో టీ20లో సూర్య ప్రదర్శన అత్యద్భుతం. 51 బంతుల్లోనే 112 పరుగులు పూర్తి చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. తద్వారా టీమిండియా 228 పరుగుల భారీ స్కోరు చేసి.. సిరీస్ గెలుపొందడంలో ఈ వైస్ కెప్టెన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని ప్రశంసిస్తూ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ట్వీట్ చేశాడు. టెస్టు క్రికెట్ ఆడించే సమయం ‘‘అద్భుత ఇన్నింగ్స్ సూర్య! ఇతడిని టెస్టు క్రికెట్ ఆడించే సమయం ఆసన్నమైంది’’ అని గౌతీ అభిప్రాయపడ్డాడు. ఈ ముంబై బ్యాటర్‌ను టెస్టుల్లో అరంగేట్రం చేయించాలని బీసీసీఐ సెలక్టర్లకు సూచించాడు. నీ నుంచి ఇది ఊహించలేదు భాయ్ అయితే, గౌతీ అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో అది కూడా టీ20లో సూర్య ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను గొప్ప టీ20 ప్లేయర్ అనడంలో సందేహం లేదు. కానీ.. నీ నుంచి ఇది ఊహించలేదు భాయ్! తనను ఇప్పుడే టెస్టుల్లోకి ఎందుకు తీసుకోవాలి? రంజీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న వాళ్లు నీకు కనబడటం లేదా? ఉదాహరణకు.. సర్ఫరాజ్ ఖాన్ పేరునే తీసుకో భాయ్.. తను నిలకడగా ఆడుతూ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిజానికి అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రానికి సూర్య కంటే తనే ఎక్కువ అర్హుడు. కేవలం రెడ్ బాల్ క్రికెట్లో ప్రతిభ ఆధారంగా టెస్టుల్లో ఛాన్స్ ఇవ్వాలనడం సరైంది కాదు. వన్డే, టెస్టుల్లో ప్రస్తుతం అతడు వద్దే వద్దు. హనుమ విహారి లాంటి వాళ్లు కూడా పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నారు’’ అని ఓ నెటిజన్ గంభీర్‌కు బదులిస్తూ ట్వీట్ చేశాడు. మరికొంత మంది కూడా అతడికి మద్దతుగా నిలవడం విశేషం. కాగా సర్ఫరాజ్ ఖాన్ గత కొంతకాలంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2022- 23 టోర్నీలో ఇప్పటికే రెండు శతకాలు బాదాడు. మరోవైపు.. సూర్య సైతం లంకతో సిరీస్ ఆరంభానికి ముందు సర్ఫరాజ్‌తో ముంబై తరఫున మైదానంలో దిగిన విషయం తెలిసిందే. చదవండి: Babar Azam: పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఘోర అవమానం Suryakumar Yadav: సూర్య ఇండియన్ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్లో ఉంటేనా: పాక్ మాజీ కెప్టెన్ Expected better from you Gauti. Why does he make the team team? What about those who have been scoring runs in Ranji cricket. Sarfaraz for example? Not setting the right example if you pick someone based on white ball form for a completely different game — Arup Ghose (@arup_ghose) January 7, 2023 Why You Are Not Talking About Sarfaraz And other Ranji Players You Already Have Vihari Please Don't Want Him In Tests And Also Not In ODIs — Alfaz Dodiya (@alfaz_dodiya) January 7, 2023 -
శతకాల మోత మోగించిన టీమిండియా ఆటగాళ్లు
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా నిన్న (జనవరి 3) మొదలైన గ్రూప్ మ్యాచ్‌ల్లో ఇవాళ (రెండో రోజు) కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు సెంచరీలతో రెచ్చిపోయారు. త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో చండీఘర్ ఆటగాడు మనన్ వోహ్రా (200) ద్విశతకంతో విజృంభించగా, అదే జట్టు ఆటగాడు కునల్ మహాజన్ (162) అజేయమైన శతకంతో చెలరేగాడు. ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాగాలాండ్ ఆటగాడు చేతన్ బిస్త్ (129) సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (165) శతకంతో అలరించాడు. మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాడు అనుప్ అహ్లావత్ (123).. అంతకుముందు మేఘాలయ ఆటగాళ్లు కిషన్ (128), పునిత్ బిస్త్ (215), తారిఖ్ సిద్దిఖీ (102 నాటౌట్) శతకాల మోత మోగించారు. విదర్భతో జరుగుతన్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ (121) సెంచరీ సాధించాడు. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్ ఆటగాడు మహ్మద్ సైఫ్ (233) ద్విశతకంతో రెచ్చిపోయాడు. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు నెహాల్ వధేరా (123) సెంచరీ సాధించాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు కరణ్ లాంబా (122) అజేయ శతకంతో రాణించాడు. గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు ఆర్ ప్రేమ్ (112) సెంచరీ సాధించాడు. బరోడా-హిమాచల్ ప్రదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా కెప్టెన్ విక్రమ్ సోలంకి (178), హిమాచల్ ఆటగాడు ప్రశాంత్ చోప్రా (111) శతకాలు సాధించారు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు కేధార్ జాదవ్ (142 నాటౌట్) శతకొట్టాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాళ్లు హార్విక్ దేశాయ్ (107), అర్పిత్ వసవద (127 నాటౌట్) సెంచరీలు సాధించారు. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (162) శతకొట్టాడు. చత్తీస్ఘడ్-కర్ణాటక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత చత్తీస్ఘడ్ ఆటగాడు అశుతోష్ (135), ఆతర్వాత కర్ణాటక కెప్టెన్ మయాంక్ ఆగర్వాల్ (102 నాటౌట్) సెంచరీలతో రాణించారు. పుదుచ్ఛేరితో జరుగుతున్న మ్యాచ్‌లో సర్వీసెస్ ఆటగాళ్లు గెహ్లౌత్ రాహుల్ సింగ్ (137), రజత్ పలివాల్ (101) శతకాలతో రాణించారు. -
రెండో డబుల్ సెంచరీ.. టీమిండియాలో చోటు ఖాయం! పుజారాలా నువ్వు కూడా!
Ranji Trophy 2022-23 Mumbai vs Hyderabad: భారత క్రికెటర్, ముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానే డబుల్ సెంచరీతో మెరిశాడు. రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ద్విశతకం బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 261 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై సారథి.. 26 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 204 పరుగులు సాధించాడు. కాగా ముంబై- హైదరాబాద్ మధ్య డిసెంబరు 20న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వేదికగా టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆదిలోనే వికెట్ కోల్పోయింది. తేలిపోయిన హైదరాబాద్ బౌలర్లు ఓపెనర్ పృథ్వీ షా 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 162 పరుగులతో చెలరేగగా.. వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ 80 బంతుల్లోనే 90 పరుగులు సాధించాడు. సూర్య అవుటైన తర్వాత రెండో రోజు ఆటలో భాగంగా యశస్వి, సర్ఫరాజ్(నాటౌట్)తో కలిసి రహానే భారీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ఈ క్రమంలో బుధవారం 204 పరుగుల వద్ద త్యాగరాజన్ బౌలింగ్‌లో రహానే అవుటయ్యాడు. భారీ స్కోరు ఇక యశస్వి సెంచరీ, రహానే ద్విశతకానికి తోడు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో కదం తొక్కుతుండటంతో రెండో రోజు రెండో సెషన్లో 124 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ముంబై 636 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమిండియాలో చోటు ఖాయం! కాగా ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో రహానేకు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. సెప్టెంబరులో దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్‌జోన్ తరఫున బరిలోకి దిగిన రహానే.. నార్త్ జోన్‌తో మ్యాచ్‌లో 207 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియాలో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్న రహానే ఈ మేరకు అద్భుతంగా రాణించడం పట్ల అతడి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే టోర్నీ ఆసాంతం మెరుగైన ప్రదర్శన కనబరిస్తే పుజారా మాదిరి ఈ మాజీ వైస్ కెప్టెన్ కూడా ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమంటున్నారు. కాగా రహానే చివరిసారిగా దక్షిణాఫ్రికా టూర్లో టీమిండియా తరఫున ఆడాడు. చదవండి: Babar Azam: ఒక్క మాటతో రమీజ్ రాజా నోరు మూయించిన బాబర్! అది సాధ్యం కాదు.. ప్రతి వాడూ.. Ajinkya Rahane gets his Double Century #RanjiTrophy pic.twitter.com/tnP98uiPqd — Jigar Mehta (@jigsactin) December 21, 2022 -
30 ఫోర్లు, 38 సిక్సర్లతో 401 పరుగులు చేసిన యంగ్ క్రికెటర్
Tanmay Singh: 13 ఏళ్ల కుర్రాడు తన్మయ్ సింగ్.. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న అండర్-14 క్లబ్ క్రికెట్ టోర్నీలో విశ్వరూపం ప్రదర్శించాడు. ర్యాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీతో జరిగిన మ్యాచ్‌లో దేవ్‌రాజ్ స్పోర్ట్స్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన తన్మయ్.. 132 బంతుల్లో 30 ఫోర్లు, 38 సిక్సర్ల సాయంతో క్వాడ్రాపుల్ సెంచరీ (401) సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ, భారత యువ క్రికెటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్‌లను గుర్తు చేసిన తన్మయ్.. భవిష్యత్తులో టీమిండియా తరఫున ఆడేందుకు గట్టి పునాది వేసుకున్నాడు. సచిన్ (326), కాంబ్లీ (349) అండర్-14 క్రికెట్ ఆడే సమయంలో శారదాశ్రమ్ విద్యామందిర్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రికార్డు స్థాయిలో 646 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. హ్యారీస్ షీల్డ్ టోర్నీలో సర్ఫరాజ్ ఖాన్ (439), పృథ్వీ షా (546) రికార్డు స్థాయి స్కోర్లు నమోదు చేశారు. तुफान धुलाई! १३ वर्षांच्या मुलाने ठोकले ३८ षटकार अन् ३० चौकार, पाडला धावांचा पाऊस#tanmay #Cricket https://t.co/ioiCVINd3X — Lokmat (@lokmat) December 19, 2022 ఈ భారీ ఇన్నింగ్స్‌ల ద్వారానే ఈ నలుగురు ముంబైకర్లు వెలుగులోకి వచ్చి ఆ తర్వాతి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలను దక్కించుకున్నారు. తన్మయ్ కూడా చిన్న వయసులోనే భారీ ఇన్నింగ్స్ ఆడి సచిన్, కాంబ్లీ, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా తరహాలో టీమిండియాకు ఆడే అవకాశాలను దక్కించుకుంటాడని ఈ ఇన్నింగ్స్ గురించి తెలిసిన అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, తన్మయ్‌తో పాటు రుద్ర బిదురి (135 నాటౌట్; 5 ఫోర్లు, 15 సిక్సర్లు) సెంచరీతో విరుచుకుపడటంతో వారు ప్రాతినిధ్యం వహించిన దేవ్‌రాజ్ స్పోర్ట్స్ క్లబ్ 656 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ర్యాన్ అకాడమీ 193 పరుగులకే చాపచుట్టేయడంతో దేవ్‌రాజ్ స్పోర్ట్స్ క్లబ్ 463 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తన్మయ్ సాధించిన 401 పరుగుల్లో 226 పరుగులు సిక్సర్ల రూపంలో, 120 పరుగులు బౌండరీల రూపంలో రావడం విశేషం. తన్మయ్ భారీ ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ కుర్రాడు టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జై వచ్చాడు.. మరో సెంచరీ కొట్టాడు.. అయినా కరుణించరా..?
దేశవాలీ క్రికెట్లో అభినవ బ్రాడ్‌మన్‌గా పిలుచుకునే ముంబై రన్ మెషీన్ సర్ఫరాజ్ ఖాన్ మరో సెంచరీ బాదాడు.విజయ్ హజారే ట్రోఫీ-2022లో భాగంగా బుధవారం (నవంబర్ 23) రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టి తన జట్టును గెలిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ (94 బంతుల్లో 117; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ ఆజింక్య రహానే (82 బంతుల్లో 88; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), పృథ్వీ షా (47 బంతుల్లో 51; 8 ఫోర్లు) కలిసి ముంబైని విజయతీరాలకు (48.3 ఓవర్లలో 338/5) చేర్చారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన సర్ఫరాజ్ ఖాన్.. డిశ్చార్జ్ అయిన వెంటనే రెస్ట్ కూడా తీసుకోకుండా నేరుగా వచ్చి సెంచరీ బాదడం అందరినీ ఆశ్చర్యపరిచింది.సర్ఫరాజ్ సాహసానికి ముగ్దులైన అభిమానులు అతన్ని వేనోళ్లతో పొగుడుతున్నారు. ఆట పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగడమే ఓ ఎత్తైతే, సెంచరీ బాది మరీ గొప్పతనాన్ని చాటుకున్నాడంటూ ఆకాశానికెత్తుతున్నారు. సర్ఫరాజ్ గురించి బాగా తెలిసిన వాళ్లైతే.. వీడు టీమిండియాలో చోటు దక్కేంతవరకు సెంచరీలు బాదుతూనే ఉంటాడని అంటున్నారు. కాగా, దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ టీమిండియాలో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే అతనికి భారత జట్టులో చోటు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టీమిండియాలో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌ను ఇటీవలే సెలెక్టర్లు కరుణించారు.త్వరలో బంగ్లాదేశ్‌లో జరుగనున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లకు అతన్ని ఎంపిక చేశారు. -
ఆసుపత్రిలో చేరిన క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్
ఇటీవలే దేశవాలీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విజయ్ హజారే ట్రోఫీ నుంచి వైదొలిగాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌కు ముందు సర్ఫరాజ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కిడ్నీలో రాళ్ల కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుఉతున్న సర్ఫారాజ్ ప్రస్తుతం రాంచీలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ''కొన్నిరోజులు కిందట కిడ్నీలో తీవ్రమైన నొప్పి రావడంతో స్కానింగ్ చేయగా స్టోన్స్ ఉన్నట్లు తేలింది. అయితే ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడు'' అంటూ సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ వెల్లడించాడు. ఇక 25 ఏళ్ల సర్ఫారాజ్ ఖాన్ ఇటీవలే ముంబై సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కుతుందని భావించినప్పటికి నిరాశే ఎదురైంది. అయితే బంగ్లాదేశ్-ఏ టూర్‌కు మాత్రం సర్ఫరాజ్‌ను ఎంపిక చేశారు. ఇక విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతున్న ముంబై జట్టుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఫ్రంట్‌లైన్ పేసర్ శివమ్ దూబే గాయంతో దూరమవడం.. తాజగా సర్ఫరాజ్ ఖాన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో టోర్నీకి దూరం కావడం జట్టును దెబ్బతీసింది. ఇక శ్రేయాస్ అయ్యర్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుండడంతో జట్టు బలహీనంగా మారిపోయింది. చదవండి: Ben Stokes: ఆలస్యమైనా కుంభస్థలాన్ని గట్టిగా బద్దలు కొట్టాడు ఇంగ్లండ్ గెలుపులో మూల స్తంభాలు.. -
కీలక ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత ముంబై
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 విజేతగా ముంబై జట్టు నిలిచింది. ఇవాళ (నవంబర్ 6) జరిగిన ఫైనల్లో ముంబై.. హిమాచల్‌ప్రదేశ్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (31 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడగా, తనుష్ కోటియన్ తొలుత బౌలింగ్‌లో (3/15, 5 బంతుల్లో 9 నాటౌట్; సిక్స్), ఆతర్వాత బ్యాటింగ్‌లో ఉత్కంఠ సమయంలో సిక్సర్ కొట్టి ముంబైని గెలిపించాడు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి (3/15), అమన్ హకీం ఖాన్ (1/24), శివమ్ దూబే (1/16) బంతితో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఏకాంత్ సేన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే తడబడినప్పటికీ.. యశస్వి జైస్వాల్ (27), శ్రేయస్ అయ్యర్ (34), సర్ఫరాజ్ ఖాన్ ఓ మోస్తరుగా రాణించి ముంబైని విజేతగా నిలిపారు. 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన సమయంలో సర్ఫరాజ్ ఖాన్ 2 ఫోర్లు, సిక్సర్ బాది జట్టును గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. ఆఖరి ఓవర్లో ముంబై గెలుపుకు 8 పరుగులు అవసరం కాగా.. తనుష్ కోటియన్.. రిషి ధవన్ వేసిన మూడో బంతికి సిక్పర్ బాది ముంబై చాన్నాళ్ల కలను సాకారం చేశాడు. -
అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీ.. రెస్ట్ ఆఫ్ ఇండియాదే ఇరానీ కప్
ఇరానీ కప్ విజేతగా రెస్ట్ ఆఫ్ ఇండియా నిలిచింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా 104 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీతో మెరవగా.. కోన శ్రీకర్ భరత్ 27 పరుగులు చేశాడు. సౌరాష్ట్ర బౌలర్లలో కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ రెండు వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌట్ అయింది. సర్ఫరాజ్ ఖాన్(138 పరుగులు) సెంచరీతో మెరవగా.. హనుమ విహారి 82 పరుగులు చేయగా సౌరబ్ కుమార్ 55 పరుగులతో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 380 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ 89 పరుగులు చేయగా.. ప్రేరక్ మాన్కడ్ 72 పరుగులతో రాణించాడు. ఇక 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్ట్ ఆఫ్ ఇండియా 31.5 ఓవర్లలో చేధించి 8 వికెట్ల తేడాతో గెలిచి ఇరానీ కప్‌ను ఒడిసిపట్టింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఓవరాల్‌గా ఎనిమిది వికెట్లతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్ కుల్దీప్ సేన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. కాగా రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఇది 29వ ఇరానీ టైటిల్ కావడం విశేషం. Winners Are Grinners! ☺️ 🙌 Rest of India beat the spirited Saurashtra side to win the #IraniCup. 👏 👏 #SAUvROI | @mastercardindia Scorecard ▶️ https://t.co/u3koKzUU9B pic.twitter.com/WD2ELx8wrP — BCCI Domestic (@BCCIdomestic) October 4, 2022 చదవండి: టి20 ప్రపంచకప్‌కు దూరం కావడంపై బుమ్రా స్పందన.. 'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం -
సర్ఫరాజ్ ఖాన్.. మొన్న దులీప్ ట్రోపీ.. ఇవాళ ఇరానీ కప్‌లో
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోపీలో సెంచరీల మోత మోగించిన సర్ఫరాజ్ ఖాన్ తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇటీవలే దులీప్ ట్రోపీ ఫైనల్లో సెంచరీతో మెరిసిన సర్ఫరాజ్ ఖాన్.. తాజాగా ఇరానీ కప్‌లోనూ శతకం సాధించి తన జోరు చూపిస్తున్నాడు. కేవలం 92 బంత్లులోనే శతకం సాధించిన సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం 125 పరుగులతో ఆడుతున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా పట్టు బిగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సర్ఫారాజ్ ఖాన్ 125 పరుగులు, కెప్టెన్ హనుమ విహారి 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు రెస్టాఫ్ ఇండియా బౌలర్ల దాటికి సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్ 4 వికెట్లు,కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. 💯 for Sarfaraz Khan! 🙌 🙌 What a stunning knock this has been by the right-hander! 👏 👏 Follow the match ▶️ https://t.co/u3koKzDR7B#IraniCup | #SAUvROI | @mastercardindia pic.twitter.com/O2XeAZ91RV — BCCI Domestic (@BCCIdomestic) October 1, 2022 -
శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్.. సౌత్‌జోన్ విజయలక్ష్యం 529
దులీప్ ట్రోఫీ ఫైనల్ 2022లో భాగంగా వెస్ట్‌జోన్.. సౌత్‌జోన్ ముందు 529 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 3 వికెట్ల నష్టానికి 376 పరుగుల క్రితంరోజు స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 585 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా వెస్ట్‌జోన్‌కు 528 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ 265 పరుగులు చేసి ఔటవ్వగా.. శ్రేయాస్ అయ్యర్ 71 పరుగులు స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ శతకంతో చెలరేగాడు. సౌత్‌జోన్ బౌలర్లను ఉతికారేసిన సర్ఫరాజ్ 178 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. సర్ఫరాజ్‌కు తోడుగా హేల్ పటేల్ కూడా అర్థ సెంచరీతో రాణించాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 318/7తో ఆట కొనసాగించిన సౌత్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఫెదరర్ మ్యాచ్‌కు ముందు నాటకీయ పరిణామం.. పిచ్చి పరాకాష్టకు డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్..