భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండు టెస్టుకు సర్ఫరాజ్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వైజాగ్ టెస్టుకు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరం కావడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్ఫరాజ్‌తో పాటు యూపీ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఈ క్రమంలో సర్ఫరాజ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అభినంధనలు తెలిపాడు. భారత జట్టు నుంచి తొలిసారి పిలుపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. వీరిద్దరూ దేశీవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 45 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 69.85 సగటుతో 3,912 రన్స్ చేశాడు. 14 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: Ind vs Eng: ఆఖరి 3 టెస్టులకు జట్టు ఎంపిక?.. కోహ్లి రీఎంట్రీ డౌటే!?
Comments
Please login to add a commentAdd a comment