దేశవాలీ టోర్నీ అయిన రంజీ ట్రోపీలో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ పేరు కచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. కానీ అతనికి మరోసారి మొండిచేయి ఎదురైంది. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ మండిపడ్డాడు.
టెస్టు క్రికెట్‌లోకి తీసుకునేది రంజీల్లో చేసే ప్రదర్శనతోనే కానీ ఐపీఎల్‌తో కాదు కదా అంటూ చురకలు అంటించాడు. అలాంటప్పుడు పనిగట్టుకొని ప్రతీ ఏడాది రంజీ ట్రోపీ ఆడించడం ఎందుకు.. ఐపీఎల్ ప్రదర్శనతోనే జట్టులోకి ఎంపిక చేస్తామంటే అలానే కానియ్యండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
''సర్ఫరాజ్ ఖాన్ రంజీల్లో అదరగొడుతున్నాడు. మూడు సీజన్లలో అతని పర్ఫామెన్స్ రికార్డు లెవెల్లో ఉంది. దాదాపు 100 సగటుతో పరుగులు చేస్తున్నాడు. అయినా అతనికి చోటు దక్కడం లేదు. టీమ్‌లోకి రావాలంటే అతను ఇంకేం చేయాలి. తుది జట్టులో చోటు ఇవ్వకపోయినా కనీసం అతన్ని ఎంపిక చేస్తే, రంజీల్లో ఆడుతున్నదానికి గుర్తింపు దక్కిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెలక్టర్లు మాత్రం ఐపీఎల్ ఆడిన వాళ్లకే టీమ్‌లో చోటు ఇస్తున్నారు. రెడ్ బాల్ క్రికెట్‌కి కూడా ఐపీఎల్ ఆటే కొలమానం అయితే రంజీ ట్రోఫీ పెట్టడం ఎందుకు? దాన్ని ఆపేయండి. రంజీల్లో ఏ ప్లేయర్ కూడా ఆడకండి. ఫలితం లేనప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీకి అంత ఖర్చు పెట్టి దండగే'' అంటూ కామెంట్ చేశాడు.
ఓవరాల్‌గా సర్ఫరాజ్ ఖాన్ రంజీ క్రికెట్‌లో ఇప్పటివరకు 37 మ్యాచులు ఆడి 79.65 సగటుతో 13 సెంచరీలతో 3505 పరుగులు చేశాడు. ఇక 2022-23 రంజీ ట్రోఫీలో 6 మ్యాచుల్లో 92.66 సగటుతో 556 పరుగులు చేశాడు. అంతకుముందు 2021-22 సీజన్‌లో 4 సెంచరీలతో 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు.
చదవండి: యార్కర్ల కింగ్ అన్నారు.. ఇప్పుడు జట్టు నుంచి ఏకంగా పక్కన పెట్టేశారు!
Comments
Please login to add a commentAdd a comment