Ind vs Eng 3rd Test- Sarfaraz Khan Debut- Beautiful moment: టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలని ఆశగా ఎదురుచూస్తున్న అతడి నిరీక్షణకు గురువారం(ఫిబ్రవరి 15) తెరపడింది.
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ భారత తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆ సమయంలో తండ్రి నౌషధ్ ఖాన్, సర్ఫరాజ్ భార్య రొమానా జహూర్ అతడి పక్కనే ఉన్నారు.
ఈ క్రమంలో తన క్యాప్‌ను తండ్రికి చూపించగా.. అతడు దానిని ఆప్యాయంగా ముద్దాడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
వెంటనే సర్ఫరాజ్ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఇక రొమానా సైతం కంటతడి పెట్టగా.. సర్ఫరాజ్ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అన్నాదమ్ముళిద్దరూ క్రికెటర్లే
మహారాష్ట్రలో 1997లో జన్మించిన సర్ఫరాజ్ ఖాన్ క్రికెటర్‌గా ఎదగడంలో అతడి తండ్రి నౌషద్ ఖాన్‌ది కీలక పాత్ర. సర్ఫరాజ్‌తో పాటు అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా క్రికెటరే. ఇటీవలే అతడు అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆడాడు. యువ భారత్ ఫైనల్ చేరుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
అందుకే ఆలస్యం!
ఇక సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో ముఖ్యంగా రంజీల్లో అద్భుతంగా రాణించినప్పటికీ టీమిండియా ఎంట్రీ ఆలస్యమైంది. అతడి దూకుడు, ఆటిట్యూడ్ కారణంగానే టీమిండియా సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కనపెట్టారనే వార్తలు వినిపించాయి. అయితే, అభిమానులు మాత్రం ప్రతిభావంతుడైన ఆటగాడికి అన్యాయం జరుగుతోందంటూ అనేక సందర్భాల్లో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోవడంతో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రానికి మార్గం సుగమమైంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ద్వారా ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.
చదవండి: Dhruv Jurel: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి బంగారు గొలుసు అమ్మి మరీ!
From The Huddle! 🔊
— BCCI (@BCCI) February 15, 2024
A Test cap is special! 🫡
Words of wisdom from Anil Kumble & Dinesh Karthik that Sarfaraz Khan & Dhruv Jurel will remember for a long time 🗣️ 🗣️
You Can Not Miss This!
Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @dhruvjurel21 |… pic.twitter.com/mVptzhW1v7
Comments
Please login to add a commentAdd a comment