గిల్- బెయిర్‌స్టో వాగ్యుద్దం (PC: BCCI/X)
India vs England, 5th Test- Shubman Gill- Sarfaraz Khan Vs Jonny Bairstow: టీమిండియా- ఇంగ్లండ్ సిరీస్‌లో భాగంగా తొలిసారి ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో వాగ్యుద్ధం మొదలుపెట్టగా.. భారత యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ అతడికి ఘాటుగా బదులిచ్చారు.
వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మాత్రం గొడవను చల్లార్చేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ధర్మశాల వేదికగా ఐదో టెస్టు శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. 473/8 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ ఆటను మొదలుపెట్టింది. ఈ స్కోరుక కేవలం నాలుగు పరుగులు జతచేసి అంటే.. 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో... ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు టాపార్డర్ కుప్పకూలడంతో కష్టాల్లో పడింది. 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో జో రూట్, జానీ బెయిర్ స్టోతో కలిసి భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేశాడు.
ఆది నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టిన బెయిర్‌స్టో.. 18 ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బాల్ వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టేలా మాట్లాడాడు.
స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి.. స్లెడ్జ్ చేశాడు. ఈ క్రమంలో గిల్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా బెయిర్‌స్టోకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. వారి మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైకులో రికార్డైంది.
Full sledging encounter between Gill & Bairstow:#INDvsENGTest #INDvsENG #ShubmanGill #JonnyBairstowpic.twitter.com/HjdkESr38z
— Ashu 🖤 (@Ashu_x18) March 9, 2024
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం ఆ సంభాణ ఇలా
జానీ బెయిర్‌స్టో: ‘‘జిమ్మీతో నువ్వేమన్నావు? తన రిటైర్మెంట్ గురించి.. తుదిజట్టు నుంచి తప్పించడం గురించి మాట్లాడతావా? కానీ అతడి బౌలింగ్‌లోనే నువ్వు అవుటయ్యావు కదా?’’.
శుబ్‌మన్ గిల్: ‘‘అయితే.. ఏంటి.. నా శతకం పూర్తైన తర్వాతే అతడు నన్ను అవుట్ చేయగలిగాడు. అయినా.. నువ్వు ఇక్కడ ఎన్ని పరుగులు చేశావేంటి?’’.
జానీ బెయిర్‌స్టో: ‘‘బాల్ స్వింగ్ అవుతున్నపుడు నువ్వెన్ని పరుగులు చేయగలిగావు?’’.
ధ్రువ్ జురెల్: ‘‘జానీ భాయ్ ఊరుకోండి!’’
సర్ఫరాజ్ ఖాన్: ‘‘ఈరోజు ఏవో కొన్ని పరుగులు చేశాడని.. తెగ ఎగిరెగిరిపడుతున్నాడు’’.
కాగా ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ విలువైన 56 పరుగులు చేశాడు.
ఇక వందో టెస్టు ఆడిన బెయిర్ స్టో తొలి ఇన్నింగ్స్‌లో 29, రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులు(31 బంతుల్లో) చేశాడు. . ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. ఇక బెయిర్‌స్టో- గిల్, సర్ఫరాజ్ వాగ్వాదంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది బయిర్‌స్టోది తప్పు అంటే.. మరికొందరు వందో టెస్టు ఆడుతున్న క్రికెటర్(బెయిర్‌స్టో)కు గౌరవం ఇవ్వాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: BCCI: బీసీసీఐ కీలక ప్రకటన.. ఒక్కో మ్యాచ్‌కు ఏకంగా రూ. 45 లక్షలు
That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏
— BCCI (@BCCI) March 9, 2024
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy
Comments
Please login to add a commentAdd a comment