Sarfraz Khan
-
సర్ఫరాజ్ కెప్టెన్సీలో కోహ్లి.. గెలిచింది మాత్రం వాళ్లే!
టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలుపొందిన భారత్.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓటమిని చవిచూసింది.బాక్సింగ్ డే టెస్టు కోసం సన్నద్ధంఇక వర్షం వల్ల బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టు ‘డ్రా’గా ముగియడంతో ఇరుజట్లు ఇప్పటికీ 1-1తో సమంగా ఉన్నాయి. తదుపరి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో భారత్- ఆసీస్ తలపడనున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాక్టీస్ ముమ్మరం చేసిన భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ లైవ్లీ ఫీల్డింగ్ డ్రిల్‌తో టీమిండియా ప్లేయర్ల మధ్య పోటీ నిర్వహించాడు. ఇందులో భాగంగా ఆటగాళ్లను మూడు జట్లుగా విభజించారు. వీటికి యువ క్రికెటర్లనే కెప్టెన్లుగా నియమించడం విశేషం.సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో కోహ్లిగ్రూప్-1లో భాగంగా సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, అభిమన్యు ఈశ్వరన్, హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్.. గ్రూప్-2లో మహ్మద్ సిరాజ్ సారథ్యంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి.. గ్రూప్-3లో ధ్రువ్ జురెల్ నాయకత్వంలో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శుబ్‌మన్ గిల్, ప్రసిద్ క్రిష్ణ, వాషింగ్టన్ సుందర్ ఈ డ్రిల్‌లో పాల్గొన్నారు.జురెల్ సారథ్యంలోని జట్టుదే గెలుపుఅయితే, ఫీల్డింగ్‌తో అద్భుత నైపుణ్యాలతో మెరిసిన జురెల్ బృందం గెలిచింది. ఈ నేపథ్యంలో జురెల్ కెప్టెన్సీలోని జట్టుకు మూడు వందల డాలర్ల క్యాష్ రివార్డు లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. కాగా మెల్బోర్న్లో డిసెంబరు 26 నుంచి 30 వరకు నాలుగో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.అలా అయితేనే ఫైనల్ ఆశలు సజీవంఇక భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదిక. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో మిగిలిన ఈ రెండు టెస్టులు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక బ్రిస్బేన్ టెస్టు తర్వాత భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల రూపంలో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఆసీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండటంతో అశూ స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేయలేదు. చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
BGT 2024: సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు.. మిడిలార్డర్లో అతడు ఫిక్స్!
టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. సహచర ఆటగాళ్లంతా విఫలమైన వేళ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సెంచరీ చేజారినా తన విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.కివీస్‌తో టెస్టులలో నో ఛాన్స్కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ఎంపిక చేసిన జట్టులో ధ్రువ్ జురెల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్ బరిలోకి దిగగా.. జురెల్‌ను పక్కనపెట్టారు.అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టులోఇక కివీస్‌తో స్వదేశంలో మూడు టెస్టుల్లో టీమిండియా ఓడిపోయి 3-0తో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీసీసీఐ.. కేఎల్ రాహుల్‌తో పాటు ధ్రువ్ జురెల్‌ను ముందుగానే ఆస్ట్రేలియాకు పంపింది. బీజీటీ కంటే ముందు ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టులో వీరిద్దరిని చేర్చి.. వారి ఆట తీరును పరిశీలిస్తోంది.161 పరుగులకే ఆలౌట్ఇక ఇప్పటికే ఆసీస్-ఎ, భారత్-ఎ జట్ల మధ్య తొలి మ్యాచ్‌లో రుతు సేన ఓడిపోగా.. గురువారం మెల్బోర్న్ వేదికగా రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 161 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. నిజానికి భారత్ ఈ మాత్రం స్కోరు చేయడానికి కారణం జురెల్.టాపార్డర్ కుప్పకూలి 11 పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ.. జురెల్ ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ వికెట్ కీపర్ 80 పరుగులు(186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. సహచరులంతా ఆసీస్ బౌలర్ల ధాటికి.. పెవిలియన్‌కు క్యూ కడితే.. తాను మాత్రం పట్టుదలగా నిలబడి.. జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు వేసిఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ధ్రువ్ జురెల్‌ను కొనియాడుతున్నారు. బీజీటీలో మిడిలార్డర్లో అతడిని తప్పక ఆడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో జురెల్‌కు చోటు దక్కడం అంత సులభమేమీ కాదు.వికెట్ కీపర్‌గా పంత్ అందుబాటులో ఉంటాడు కాబట్టి.. మిడిలార్డర్లో ఎవరో ఒకరిపై వేటు పడితేనే జురెల్‌కు లైన్ క్లియర్ అవుతుంది. కివీస్ సిరీస్‌లో ప్రదర్శనను బట్టి చూస్తే సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.కివీస్‌తో తొలి టెస్టులో భారీ శతకం(150) సాధించినప్పటికీ.. ఆ తర్వాత ఈ ముంబై బ్యాటర్ వరుసగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆరో స్థానంలో సర్ఫరాజ్‌కు బదులు జురెల్ ఆసీస్ గడ్డపై బీజీటీలో ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయిబోర్డర్- గావస్కర్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆర్ జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
IPL Auction: వేలంలోకి టీమిండియా స్టార్లు.. వాళ్లిద్దరి కనీస ధర తక్కువే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2025 వేదిక ఖరారైంది. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్–2025 వేలంపాట జరగనుందని మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది దుబాయ్‌లో ఐపీఎల్ వేలం నిర్వహించగా... వరుసగా రెండో ఏడాది విదేశాల్లో ఐపీఎల్ వేలం జరగనుంది. ముందుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వేలం నిర్వహిస్తారని వార్తలు వచ్చినా బీసీసీఐ మాత్రం జిద్దా నగరాన్ని ఎంచుకుంది. 👉ఇక ఇటీవల ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా విడుదల కాగా... 1574 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ఇందులో 1165 మంది భారత ఆటగాళ్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తంగా 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 👉ఇందులో జాతీయ జట్టుకు ఆడిన భారత ఆటగాళ్లు 48 మంది ఉండగా... 965 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడలేదు.. కానీ👉ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వచ్చే ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరకు తన పేరును నమోదు చేసుకోవడం విశేషం. 👉ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టు ఆడుతున్న సమయంలోనే ఈ వేలం జరగనుంది. ఒక్కో జట్టు రీటైన్ ఆటగాళ్లను కలుపుకొని అత్యధికంగా 25 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు కాకుండా... ఇంకా 204 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వేలంలో 641.5 కోట్లు ఖర్చురిటెన్షన్ విధానంలో పలువురు ప్రధాన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో... రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్‌లాంటి పలువురు భారత స్టార్ ఆటగాళ్లు వేలానికి రానున్నారు. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ప్లేయర్ల కోసం రూ. 641.5 కోట్లు వేలంలో ఖర్చు చేయనున్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రిటెన్షన్ గడువు ముగిసేసరికి 10 జట్లు రూ. 558.5 కోట్లు ఖర్చు పెట్టి 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వద్ద రూ.110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి కనీస ధర రూ. 2 కోట్లుఇక ఈసారి వేలంలోకి రానున్న టీమిండియా స్టార్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు వెటరన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితరులు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం.వీరితో పాటు ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ, టి.నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ తదితర ద్వితీయ శ్రేణి భారత క్రికెటర్లు సైతం రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది.వీరి బేస్ ప్రైస్ రూ. 75 లక్షలుఅయితే, ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ల బేస్ ప్రైస్ మాత్రం రూ. 75 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన అవశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా.. ఐపీఎల్‌లోనూ అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. మరోవైపు.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు. అయితే, గతేడాది వేలంలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అతడిని ఈసారి ఏదో ఒక ఫ్రాంఛైజీ కనీసం బేస్ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది.చదవండి: Ind vs Aus BGT: కేఎల్ రాహుల్‌పై దృష్టి -
చెప్పినా వినని సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్‌కు వార్నింగ్.. ఆఖరికి!
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చేసిన పని వల్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేశానికి లోనయ్యాడు. అంపైర్లతో చిన్నపాటి వాగ్వాదానికి దిగాడు. అయితే, సర్ఫరాజ్‌ను సమర్థించే క్రమంలో ఆరంభంలో కాస్త దూకుడు ప్రదర్శించిన రోహిత్.. తర్వాత చల్లబడ్డాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌తో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. బెంగళూరు, పుణెలలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పర్యాటక కివీస్ జట్టు రోహిత్ సేనకు ఊహించని షాకిచ్చింది. రెండింటిలోనూ ఘన విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియాకు టెస్టు సిరీస్‌లో ఓటమిని రుచిచూపించింది.ఆరంభం బాగున్నాఫలితంగా అవమానభారంతో కుంగిపోయిన టీమిండియా ముంబైలో జరుగుతున్న మూడో టెస్టులో గెలుపొంది.. పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. Washington bowls a jaffa to castle Latham 🤌 Don't miss LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/BY5BeQRJ08— JioCinema (@JioCinema) November 1, 2024 ఆరంభంలోనే పేసర్ ఆకాశ్ దీప్ డెవాన్ కాన్వే(4) వికెట్ తీసి బ్రేక్ ఇవ్వగా.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మరో ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(28), స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5)ను పెవిలియన్‌కు పంపాడు.సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్(71), డారిల్ మిచెల్(82) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ సూపర్ హాఫ్ సెంచరీలతో రాణించి.. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగుల మెరుగైన స్కోరు సాధించేలా చేశారు. అయితే, ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు శ్రమించాల్సి వచ్చిన వేళ సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు.కివీస్ ఇన్నింగ్స్‌లో 32 ఓవర్‌కు ముందు బౌలర్ బంతిని రిలీజ్ చేసే సమయంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్.. బ్యాటర్‌కు మరీ దగ్గరగా వచ్చి ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. అప్పుడు క్రీజులో ఉన్న డారిల్ మిచెల్ సర్ఫరాజ్ వల్ల తన ఏకాగ్రత దెబ్బతింటుందని ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు చేసినట్లు కనిపించింది.రోహిత్‌కు వార్నింగ్ఈ క్రమంలో అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ సర్ఫరాజ్‌తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పిలిచి.. మాటలు తగ్గించాలని సూచించాడు. దీంతో అసహనానికి లోనైన రోహిత్ అంపైర్‌తో కాసేపు వాదించాడు. ఆ తర్వాత మిచెల్ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడాడు. దీంతో మిచెల్ సైతం రోహిత్ వ్యాఖ్యలతో అంగీకరించినట్లుగా తిరిగి తన బ్యాటింగ్ పొజిషన్‌కు వెళ్లిపోయాడు. దీంతో వివాదం సద్దుమణిగింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ కంటే ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: నువ్వు జట్టులో ఉండి ఏం లాభం?.. కోహ్లిపై ఫ్యాన్స్ ఫైర్pic.twitter.com/H0G7GazjgE— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 1, 2024 -
అన్నా.. నన్ను నమ్ము: రోహిత్‌ను రౌండప్ చేసి మరీ! వీడియో
న్యూజిలాండ్‌తో టీమిండియా రెండో టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్ రోహిత్ శర్మతో వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరే క్రమంలో భారత్.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలైన రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుపెట్టింది. అశూ మొదలుపెట్టాడుఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా తమ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో బౌలింగ్ అటాక్ ఆరంభించింది. అయితే, ఎనిమిదో ఓవర్ వేసిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కివీస్ ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ పడగొట్టాడు.న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్(15)ను లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత మళ్లీ 24వ ఓవర్లో అశూకు మరో వికెట్ తీసే అవకాశం వచ్చింది. వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్ క్రీజులో ఉన్న సమయంలో అశూ చేతికి కెప్టెన్ రోహిత్ శర్మ బంతినిచ్చాడు.రివ్యూకు వెళ్లాలా? వద్దా? ఈ క్రమంలో అశూ వేసిన ఆఖరి బంతిని తప్పుగా అంచనా వేసిన విల్ యంగ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడు ఊహించిన దాని కంటే ఎక్కువగా బౌన్స్ అయిన బంతి బ్యాట్‌ను తాకి వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో పడింది. కానీ.. పంత్ మాత్రం విల్ యంగ్ వికెట్ పట్ల కాన్ఫిడెంట్‌గా లేడు.దీంతో భారత శిబిరంలో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అన్న సందేహం నెలకొంది. అయితే, షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ మాత్రం విల్ యంగ్ కచ్చితంగా అవుటేనని కెప్టెన్ రోహిత్ శర్మకు చెప్పాడు. బౌలర్ అశ్విన్, ఫీల్డర్ విరాట్ కోహ్లి కూడా సర్ఫరాజ్‌కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో రోహిత్ రివ్యూకు వెళ్లగా.. బంతి బ్యాట్‌ను తాకి కీపర్ చేతుల్లో పడ్డట్లు తేలింది. ఫలితంగా అశూతో పాటు భారత్‌కు రెండో వికెట్ దక్కింది. విల్ యంగ్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.అన్నా.. నన్ను నమ్మే.. నేను చూశా.. అయితే, రోహిత్ శర్మను ఒప్పించేందుకు సర్ఫరాజ్ ప్రవర్తించిన తీరు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ‘‘అన్నా.. నన్ను నమ్మే.. నేను చూశా.. అతడు అవుటే’’ అన్న చందంగా సర్ఫరాజ్ అభినయించాడు. కోహ్లి సైతం అతడికి జత కలిసి రోహిత్‌ను ఒప్పించడం విశేషం. కాగా బెంగళూరు టెస్టులో 150 పరుగులతో అలరించిన సర్ఫరాజ్ ఖాన్ వైపు మొగ్గు చూపిన మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్‌పై వేటు వేసింది. దీంతో సర్ఫరాజ్ ఖాన్‌కు పుణె టెస్టు తుదిజట్టులో చోటు దక్కింది. ఇదిలా ఉంటే.. భారత్‌తో రెండో టెస్టులో గురువారం నాటి తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి నష్టానికి 92 పరుగులు సాధించింది.మూడో వికెట్ కూడా అతడి ఖాతాలోనే..ఇదిలా ఉంటే.. భారత్‌తో రెండో టెస్టులో గురువారం నాటి తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి నష్టానికి 92 పరుగులు సాధించింది. లంచ్ తర్వాత కాసేపటికే అశ్విన్ మరో వికెట్ పడగొట్టాడు. డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(76) రూపంలో భారత్‌కు మూడో వికెట్ అందించాడు. 45 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు: 142/3. అప్డేట్: ఇక టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ స్కోరు: 201/5 (62). వాషింగ్టన్ సుందర్ రచిన్ రవీంద్ర(65), టామ్ బ్లండెల్(3) వికెట్లు తీశాడు.చదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ అండగా నిలిచాడు. ఈ కర్ణాటక బ్యాటర్ ఆటతీరు పట్ల తాము సంతృప్తిగానే ఉన్నామని తెలిపాడు. బయటవాళ్లు ఏమనుకుంటున్నారో అన్న అంశాలతో తమకు సంబంధం లేదని.. జట్టులోని ఆటగాళ్లకు అన్ని వేళలా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశాడు. అద్భుత శతకంకాగా భారత టెస్టు జట్టు మిడిలార్డర్లో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఓపెనర్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్ వన్‌డౌన్‌లో ఆడుతుండగా.. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదోస్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్లతో సర్ఫరాజ్ ఖాన్ సైతం రేసులో ఉన్నాడు. అయితే, ఇప్పటికే అయ్యర్ జట్టుకు దూరం కాగా.. రాహుల్, సర్ఫరాజ్ పేర్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకు గిల్ దూరం కావడంతో.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఇద్దరికీ తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరు డకౌట్ అయ్యారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ అద్భుత శతకం(150)తో కదం తొక్కగా.. రాహుల్ కేవలం 12 పరుగులకే పరిమితయ్యాడు.ఈ నేపథ్యంలో పుణె వేదికగా గురువారం కివీస్‌తో మొదలుకానున్న రెండో టెస్టుకు జట్టు ఎంపిక గురించి సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేఎల్ రాహుల్‌ను విమర్శిస్తూ.. సర్ఫరాజ్ ఖాన్ వైపు మొగ్గుచూపుతున్నారు చాలా మంది విశ్లేషకులు. ఈ విషయంపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు.ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో..‘‘ప్లేయింగ్ ఎలెవన్‌ను సోషల్ మీడియా నిర్ణయించలేదు. విశ్లేషకులు, నిపుణులు ఏమనుకుంటున్నారోనన్న విషయాలతోనూ మాకు సంబంధం లేదు. టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తున్నదే ముఖ్యం. ఇటీవల బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కాన్పూర్ పిచ్‌పై పరుగులు రాబట్టడం కష్టమైనా కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణించాడు.యాజమాన్యం అతడికి అండగానే ఉందితన ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్లుగా మార్చుకోవాల్సి ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతడికి అండగానే ఉంది’’ ప్రి మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో గౌతీ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు గిల్ తిరిగి వస్తున్నాడు కాబట్టి.. రాహుల్‌కు ఛాన్స్ ఇచ్చి, సర్ఫరాజ్‌ను తప్పిస్తారనే వాదనలు బలపడుతున్నాయి.ఇంతకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సైతం మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్‌కు గంభీర్ మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌తో తొలి టెస్టు తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త పంచుకున్న విషయం తెలిసిందే.తండ్రిగా ప్రమోషన్తాను తండ్రినయ్యానని.. తన భార్య మగబిడ్డను ప్రసవించిందని ఈ ముంబైకర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో కుటుంబానికి సమయం కేటాయించాలనుకుంటే సర్ఫరాజ్ ఖాన్ కేఎల్ రాహుల్‌కు లైన్‌క్లియర్ చేసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పర్యాటక న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య టీమిండియాపై మొదటి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.చదవండి: న్యూజిలాండ్ టీమ్‌కు కొత్త కెప్టెన్ -
తండ్రైన సర్ఫరాజ్ ఖాన్
టీమిండియా బ్యాటింగ్ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ తొలిసారిగా తండ్రయ్యాడు. అతడి భార్య రొమానా జహూర్ సోమవారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను సర్ఫరాజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. చేతిలో కుమారుడితో దిగిన ఫొటోను ఈ ముంబైకర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 26 ఏళ్ల సర్ఫరాజ్‌కు గతేడాది జమ్మూకశ్మీర్‌కు చెందిన రొమానా జహూర్‌తో వివాహమైంది.చిన్నస్వామిలో దంచి కొట్టి..కాగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో సర్ఫరాజ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. జట్టు ఓడిపోయినప్పటకి తన విరోచిత ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో సర్ఫరాజ్ చెలరేగాడు. 195 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 150 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో సర్ఫరాజ్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇప్పుడు పుణే వేదికగా జరగనున్న రెండో టెస్టులో అదేదూకుడు కనబరచాలని సర్ఫరాజ్ భావిస్తున్నాడు. ఒకవేళ గిల్ ఫిట్నెస్ సాధిస్తే సర్ఫరాజ్‌ను తుది జట్టులో కొనసాగిస్తారో లేదో చూడాలి. -
'అతడొక అద్బుతం.. నడుము సన్నగా లేదని ఛాన్స్ ఇవ్వలేదు'
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికి మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు సెంచరీతో చెలరేగాడు. కివీస్ బౌలర్లను చీల్చిచెండాడుతూ తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా 195 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సర్ఫరాజ్ ఒక అద్బుతమైన ప్లేయర్, బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంటుందని సన్నీ కొనియాడాడు. అదే విధంగా స్లిమ్‌గా లేడని ఇప్పటివరకు సర్ఫరాజ్‌కు అవకాశమివ్వని భారత సెలక్టర్ల తీరును కూడా గవాస్కర్ తప్పుబట్టాడు.దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్‌కు టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీలు చేసిప్పటకి భారత జట్టులో చోటు సంపాదించుకోవడానికి కొన్నేళ్ల సమయం పట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌కు తగ్గట్టు అతడు స్లిమ్‌గా లేడని, నడుము సన్నగా లేదని అవకాశాలు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అదే సర్ఫరాజ్ అతడి నడుము కంటే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దురదృష్టవశాత్తూ.. భారత క్రికెట్లో చాలా మంది నిర్ణయాధికారులు ఉన్నారు. వారి ఆ ఆలోచనలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని స్పోర్ట్స్ స్టార్ కాలమ్‌లో సన్నీ రాసుకొచ్చాడు. రిషబ్ పంత్ ఫిట్‌నెస్‌పై కూడా గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఫిట్నెస్ అతి ప్రేమికులు కోరుకున్నట్లుగా లేని మరో క్రికెటర్ రిషబ్ పంత్. ఈ ఫిట్నెస్ ప్యూరిస్ట్లు కోరుకునే సన్నని నడుము పంత్‌కు కూడా లేదు. కానీ అతడు చాలా టాలెంటడ్ క్రికెటర్. అతను రోజంతా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఒక టెస్టులో దాదాపు ఆరు గంటల పాటు వికెట్ కీపర్‌గా పలు రకాల సేవలను అందిస్తున్నాడు. కాబట్టి దయచేసి ఈ యోయో-యోయో పరీక్షలను పక్కన పెట్టండి. ఆటగాడు మానసికంగా ఎంత బలంగా ఉన్నాడో పరీక్షంచిండి. అది ఆటగాడి ఫిట్నెస్కి నిజమైన పరీక్ష. ఒక ఆటగాడు రోజంతా బ్యాటింగ్ చేయగలడా లేదా ఒక రోజులో 20 ఓవర్లు బౌలింగ్ చేయగలడా అనే దాని గురించి ఆలోచించండి. అతని నడుము ఎంత సన్నగా ఉన్నా లేదా లేకపోయినా మ్యాచ్‌లో మాత్రం పూర్తి ఫిట్నెస్గా ఉంటాడు అని సన్నీ రాసుకొచ్చాడు.చదవండి: సెలక్టర్లకు వార్నింగ్.. డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా -
Ind Vs NZ: రెండో టెస్టులో సర్ఫరాజ్‌కు నో ఛాన్స్!?
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ కచ్చితంగా ఆడతాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కరుణ్ నాయర్ మాదిరి అతడిని దురదృష్టం వెంటాడబోదని జోస్యం చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ముంబైకర్ తుదిజట్టులో ఉండటం అత్యవసరమని పేర్కొన్నాడు.కాగా కివీస్‌తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా పరాజయంతో ఆరంభించింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటై దారుణంగా విఫలమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు భారీ స్కోరు సాధించింది.ఇందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖాన్. తన కెరీర్లో నాలుగో టెస్టు ఆడిన ఈ ముంబై బ్యాటర్ జట్టు కష్టాల్లో ఉన్న వేళ 150 పరుగులతో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 12 పరుగులకే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు తుదిజట్టులో చోటు దక్కడానికి కారణం శుబ్‌మన్ గిల్ గైర్హాజరీ. ఫిట్నెస్ లేమి కారణంగా గిల్ దూరం కావడంతో విరాట్ కోహ్లి మూడో స్థానంలో రాగా.. సర్ఫరాజ్ నాలుగో నంబర్ బ్యాటర్‌గా కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్‌తో సర్ఫరాజ్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.గిల్ తిరిగి వస్తే ఈ ఇద్దరిలో ఒకరిపై వేటుపడకతప్పదు. తాజా ప్రదర్శన నేపథ్యంలో మేనేజ్మెంట్ సర్ఫరాజ్వైపే మొగ్గుచూపి.. రాహుల్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కరుణ్ నాయర్ సంగతిని గుర్తుచేస్తూ సర్ఫరాజ్‌ను కూడా బ్యాడ్‌లక్ వెంటాడవచ్చునని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘అవును.. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ(300) చేసిన తర్వాత కూడా తదుపరి మ్యాచ్‌లోనే అతడిని తప్పించారు. అజింక్య రహానే తిరిగి రావడంతో కరుణ్‌ను డ్రాప్ చేశారు. టెస్టు కెరీర్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే, కరుణ్ నిలకడలేమి ఫామ్ వల్లే అలా జరిగి ఉండవచ్చు.ఒకవేళ కేఎల్ రాహుల్ కోసం సర్ఫరాజ్‌ను బెంచ్‌కే పరిమితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే, నాకు మాత్రం అతడు పుణె మ్యాచ్‌లో కచ్చితంగా ఆడతాడనే అనిపిస్తోంది. రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అంతేకాదు.. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి, డ్రెసింగ్ రూం వాతావరణం చూస్తుంటే సర్ఫరాజ్ పుణె టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడనే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. స్పోర్ట్స్18తో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. కాగా కరుణ్ నాయర్ 2017లో ఇంగ్లండ్‌తో టెస్టులో త్రిశతకం బాదినా.. ఆ మరుసటి మ్యాచ్‌లో అతడికి చోటు దక్కలేదు. -
సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్
టీమిండియా మిడిలార్డర్లో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో కేఎల్ రాహుల్‌కు ఉద్వాసన పలకాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులో కొనసాగిస్తూనే.. . రాహుల్ స్థానంలో ఇతడిని ఆడించాలంటూ ఓ ‘దేశవాళీ క్రికెట్ హీరో’పేరు మనోజ్ తివారీ సూచించాడు.కాగా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 53 టెస్టులు ఆడి 2981 పరుగులు చేశాడు. సగటు 33.88. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో పూర్తిగా తేలిపోయాడు.తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ సొంతగడ్డ బెంగళూరులో కివీస్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 12 పరుగులే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ మాట్లాడుతూ.. రాహుల్ ఆట తీరును విమర్శించాడు. ‘‘91 ఇన్నింగ్స్ ఆడి కేవలం 33.88 సగటుతో బ్యాటింగ్ చేసే వాళ్లు మనకు అవసరమా?స్పెషలిస్టు ఓపెనరే అయినప్పటికీభారత్లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లు చాలా మందే ఉన్నారు. అలాంటపుడు కేఎల్ రాహుల్ స్థానం గురించి మనం ఎందుకు పునరాలోచించకూడదు? టెస్టు మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ను నాలుగో స్థానంలో పంపించాలి. నా అభిప్రాయం ప్రకారం.. అభిమన్యు ఈశ్వరన్‌ను కూడా మిడిలార్డర్లో ట్రై చేస్తే బాగుంటుంది.అతడిపై ఓపెనర్ అనే ట్యాగ్ వేసి పక్కనపెడుతున్నారు. అతడు స్పెషలిస్టు ఓపెనరే అయినప్పటికీ మిడిలార్డర్లో ప్రయత్నించి చూస్తే తప్పేంటి? గత కొంతకాలంగా అతడు సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు’’ అని మనోజ్ తివారీ క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా మనోజ్ మాదిరే దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ ఇటీవల ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వరుసగా నాలుగు శతకాలు బాది జోరుమీదున్నాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌తో బెంగళూరు టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. తదుపరి ఇరుజట్ల మధ్య అక్టోబరు 24న రెండో టెస్టు మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-‘ఎ’ జట్టును ఇటీవల ప్రకటించారు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో అభిమన్యుకు చోటు దక్కింది.చదవండి: WTC 2023-25 Points Table: న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..? -
వాళ్లిద్దరు అద్భుతం.. ఓటమికి ప్రధాన కారణం అదే: రోహిత్ శర్మ
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 50 లోపు స్కోరుకే ఆలౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపిందని.. అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో తమ జట్టు అద్భుతంగా పోరాడిందని పేర్కొన్నాడు. సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడారని కొనియాడిన రోహిత్.. వారిద్దరి వల్లే తాము మెరుగైన స్కోరు సాధించామని తెలిపాడు.46 పరుగులకే ఆలౌట్ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయి సొంతగడ్డపై అత్యల్ప స్కోరు నమోదు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయగలిగింది.సర్ఫరాజ్, పంత్ అద్భుత ఇన్నింగ్స్మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ అద్భుతంగా రాణించినందు వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది. కెరీర్లో నాలుగో టెస్టు ఆడిన సర్ఫరాజ్ 150 పరుగులతో చెలరేగగా.. మోకాలి నొప్పి ఉన్నా పంత్ 99 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టును గెలిపించేందుకు వీరి పోరాటం సరిపోలేదు.మోచ్యూర్గా ఆడారుఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో మరీ ఘోరంగా బ్యాటింగ్ చేశాం. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మేము పుంజుకున్నాం. ఆ ఇద్దరు(సర్ఫరాజ్, పంత్) భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సర్ఫరాజ్, పంత్ బ్యాటింగ్ చేస్తుంటే డ్రెస్సింగ్‌రూంలో ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా తిలకించారు.వాళ్లిద్దరు ఎంతో పరిణతి కనబరిచారు. మామూలుగా అయితే, రిషభ్ చాలా వరకు రిస్క్ తీసుకుంటాడు. కానీ ఈసారి మంచి బంతులు పడ్డప్పుడు డిఫెన్స్ చేసుకున్నాడు. కొన్నింటిని వదిలేశాడు. ఆచితూచి ఆడుతూనే అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శించాడు.ఇక సర్ఫరాజ్ గురించి చెప్పాలంటే.. ఎంతో మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశాడు. తన కెరీర్లో ఇది నాలుగో టెస్టే అయినా.. ఓవైపు ఒత్తిడి ఉన్నా ఎక్కడా తడబడలేదు’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారన్న రోహిత్ శర్మ.. తాము మూకుమ్మడిగా విఫలం కావడం బాధించిందన్నాడు.వరుసగా నాలుగు గెలిచాంఅయితే, గతంలో ఇంగ్లండ్ చేతిలో తొలి మ్యాచ్ ఓడిన తాము.. తర్వాత వరుసగా నాలుగు టెస్టులు గెలిచిన విషయాన్ని రోహిత్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లోని సానుకూల అంశాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని.. జట్టులో ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసునని పేర్కొన్నాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు(అక్టోబరు 16- 20)👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు(బుధవారం) ఆట రద్దు.. రెండో రోజు పడిన టాస్👉టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాస్కోర్లు:👉టీమిండియా తొలి ఇన్నింగ్స్- 46👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్- 402👉టీమిండియా రెండో ఇన్నింగ్స్- 462👉న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్- 110/2👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రచిన్ రవీంద్ర(134, 39 నాటౌట్)చదవండి: IND vs PAK: పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్ శర్మ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
Ind vs NZ: ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్ వీరిదే: సచిన్
టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు బాగా హైలైట్ అయ్యారు. వారిలో ఒకరు భారత సంతతికి చెందిన కివీస్ క్రికెటర్ రచిన్ రవీంద్ర.. మరొకరు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. బెంగళూరు టెస్టులో వీరిద్దరు సెంచరీలతో చెలరేగారు.టీమిండియా పరువు నిలబెట్టిన సర్ఫరాజ్కాగా ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో సర్ఫరాజ్ సాధించిన పరుగులు సున్నా. అయితే, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయగలిగిందంటే మాత్రం అందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖానే!అద్భుత ఆట తీరుతో కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ మెరుపు సెంచరీ సాధించిన ఈ ముంబైకర్.. 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్న వేళ అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం సాధించి ఆటగాడిగా తన విలువను చాటుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) తండ్రి సొంతూరిలో కివీస్ తరఫున రచిన్ శతకంమరోవైపు.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన రచిన్ రవీంద్ర శతక్కొట్టి జట్టును భారీ స్కోరు వైపు నడిపించాడు. తన తండ్రి సొంత ఊరైన బెంగళూరు వేదికగా టెస్టుల్లో రెండో సెంచరీ(157 బంతుల్లో 134) నమోదు చేశాడు. అతడికి తోడుగా టిమ్ సౌథీ(65) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 402 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.ఎవరిది పైచేయి అవునో?!ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌కు 107 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. మరొక్కరోజు(ఆదివారం) మాత్రమే ఆట మిగిలి ఉండటంతో న్యూజిలాండ్ బ్యాటర్లు, భారత బౌలర్ల మధ్య పోటీలో ఎవరు నెగ్గుతారోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. బెంగళూరు సెంచరీ హీరోలు సర్ఫరాజ్ ఖాన్, రచిన్ రవీంద్రల గురించి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్ వీరిదే‘‘మన మూలాలను అనుసంధానం చేసే మార్గం క్రికెట్‌కు ఉంది. రచిన్ రవీంద్రకు బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అతడి కుటుంబం అక్కడి నుంచే వలస వెళ్లింది. అక్కడే అతడు శతకం బాదాడు.ఇక సర్ఫరాజ్ ఖాన్... తన కెరీర్లో తొలి టెస్టు సెంచరీ సాధించడానికి ఇంతకంటే గొప్ప సందర్భం ఏముంటుంది?! టీమిండియాకు అత్యవసరమైన వేళ అతడు శతకం బాదాడు. ప్రతిభావంతులైన ఈ ఇద్దరు యువకులు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలరు’’ అని సచిన్ టెండుల్కర్ రచిన్, సర్ఫరాజ్లపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్!Cricket has a way of connecting us to our roots. Rachin Ravindra seems to have a special connection with Bengaluru, where his family hails from! Another century to his name.And Sarfaraz Khan, what an occasion to score your first Test century, when India needed it most!… pic.twitter.com/ER8IN5xFA5— Sachin Tendulkar (@sachin_rt) October 19, 2024 -
ఇంకెన్ని ఛాన్సులు?.. నీ వల్ల అతడికి అన్యాయం!
క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవకాశాలు వచ్చినా అతడి ఆట తీరులో మార్పు రావడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ దారుణ వైఫల్యం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అతడిని ట్రోల్ చేస్తున్నారు.ప్రతిభ ఉన్న ఆటగాడి’ని తొక్కేస్తున్నారు!ఇక రాహుల్ కోసం ఇప్పటికే ‘ప్రతిభ ఉన్న ఆటగాడి’ని తొక్కేసారని.. ఇకపై ఆ పొరపాట్లు పునరావృతం చేయవద్దంటూ సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టెస్టుల్లో తాను ఆడిన గత రెండు మ్యాచ్‌లలో చేసిన స్కోర్లు 16, 22*, 68. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో ఈ మేర పరుగులు రాబట్టాడు.దారుణంగా విఫలంఈ క్రమంలో తాజాగా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే, బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో పన్నెండు పరుగులకే పెవిలియన్ చేరాడు.ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా క్లిష్ట పరిస్థితిలో ఉన్న విషయం తెలిసిందే. కివీస్‌కు కేవలం 107 పరుగుల లక్ష్యం విధించిన భారత్.. ఆఖరి రోజైన ఆదివారం నాటి ఆటలో ప్రత్యర్థిని 105 పరుగులకే ఆలౌట్ చేయాలి. లేదంటే.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తప్పదు.సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులతో దుమ్ములేపాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఇంకా పోటీలో నిలవగలగడానికి కారణం సర్ఫరాజ్ ఇన్నింగ్స్ అనడంలో సందేహం లేదు.ఇకనైనా అతడికి అవకాశాలు ఇవ్వండిఇక తుదిజట్టు మిడిలార్డర్లో చోటు కోసం సర్ఫరాజ్ కేఎల్ రాహుల్‌తో పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ గైర్హాజరీ వల్ల విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఆడగా.. సర్ఫరాజ్‌కు అనుకోకుండా ఛాన్స్వచ్చింది. లేదంటే.. రాహుల్ కోసం అతడిని డ్రాప్ చేసేవారే! ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్యాన్స్ రాహుల్‌ను ట్రోల్ చేస్తున్నారు. రాహుల్ కోసం సర్ఫరాజ్ ఖాన్‌కు ఇన్నాళ్లూ అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు.చదవండి: ‘హీరో’లు అవుట్.. కుప్పకూలిన టీమిండియా! అద్భుతం జరిగితేనే..Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్!Harsha : Do you remember last time Kl Rahul saved India from a collapse?Ravi : No, because KL Rahul himself is part of the collapse. pic.twitter.com/6LC5UNmI98— mufaddla parody (@mufaddl_parody) October 19, 2024 View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
‘హీరో’లు అవుట్.. కుప్పకూలిన టీమిండియా! అద్భుతం జరిగితేనే..
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విజృంభించినా.. వారి పోరాటం సరిపోయేలా కనిపించడం లేదు. భారమంతా ఇప్పుడు బౌలర్లపైనే ఉంది. ఏదైనా అద్భుతం జరిగితేనే టీమిండియా ఈ మ్యాచ్ గెలుస్తుంది. లేదంటే రోహిత్ సేన వరుస విజయాలకు బ్రేక్ పడుతుంది.బెంగళూరు వేదికగా భారత్- కివీస్ మధ్య బుధవారం మొదలుకావాల్సిన మ్యాచ్ తొలిరోజు వర్షం కారణంగా.. టాస్ పడకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో గురువారం వాన తెరిపినివ్వగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి బొక్కబోర్లా పడింది. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై పరుగులు రాబట్టలేక 46 పరుగులకే ఆలౌట్ అయింది.అనంతరం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 402 పరుగులు చేసి.. 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. రోహిత్, విరాట్ ఫిఫ్టీలుఓపెనర్లలో యశస్వి జైస్వాల్(35) ఫర్వాలేదనిపించగా కెప్టెన్ రోహిత్ శర్మ(52), వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(70) అర్ధ శతకాలు చేశారు. ఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆటలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు.చెలరేగిన హీరోలు.. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన అతడు చిన్నస్వామి స్టేడియంలో దుమ్ములేపాడు. రిషభ్ పంత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సర్ఫరాజ్ 150 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే, పంత్ కూడా స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగాడు.మొత్తంగా 105 బంతులు ఎదుర్కొన్న పంత్.. విలియం రూర్కీ బౌలింగ్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. వీళ్లిద్దరు నిష్క్రమించిన తర్వాత టీమిండియా టపటపా వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్(12), రవీంద్ర జడేజా(5), రవిచంద్రన్ అశ్విన్(15), జస్ప్రీత్ బుమ్రా(0), మహ్మద్ సిరాజ్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కివీస్ టార్గెట్ ఎంతంటే?కుల్దీప్ యాదవ్ ఆరు పరగులతో అజేయంగా నిలవగా.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కివీస్ కంటే కేవలం 106 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కివీస్‌కు స్వల్ప లక్ష్యం విధించింది.అంటే.. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులు చేసిందంటే గెలిచేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే భారత బౌలర్లదే బాధ్యత. వెలుతురు లేమి కారణంగా శనివారం త్వరగా ఆటను ముగించారు. ఆట పూర్తయ్యే సరికి కివీస్ విజయానికి 107 పరుగులు, టీమిండియా పది వికెట్ల దూరంలో నిలిచాయి.చదవండి: వెనక్కి వెళ్తావా? లేదా?: పంత్‌ను ‘హెచ్చరించిన’ సర్ఫరాజ్! రోహిత్ రియాక్షన్ వైరల్ -
Ind vs NZ: అయ్యో పంత్! .. నీకే ఎందుకిలా?
టెస్టు క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ బ్యాట్ ఝులిపిస్తూ ఆపద్భాందవుడిలా నిలుస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్‌లో సెంచరీతో చెలరేగిన పంత్.. తాజాగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ సేనను గట్టెక్కించే క్రమంలో సర్ఫరాజ్ ఖాన్(150)తో కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.సెంచరీకి ఒక్క పరుగు దూరంలోఅయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రిషభ్ పంత్ అవుటయ్యాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 89వ ఓవర్‌ను కివీస్ పేసర్ విలియం రూర్కీ వేశాడు. అయితే, అతడి బౌలింగ్‌లో మొదటి బంతికే పంత్ అనూహ్య రీతిలో బౌల్డ్ అయ్యాడు. 99 పరుగుల(9 ఫోర్లు, 5 సిక్స్‌లు) వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది.స్టాండింగ్ ఓవియేషన్అప్పటిదాకా సర్ఫరాజ్ ఖాన్- రిషభ్ పంత్ జోడీ న్యూజిలాండ్ బౌలర్లపై అటాకింగ్ చేస్తుంటే సంతోషంతో కేరింతలు కొట్టిన అభిమానులు.. పంత్ శతకం మిస్ కాగానే షాక్‌కు గురయ్యారు. అయితే, గాయం తాలుకు నొప్పి వేధిస్తున్నా విలువైన ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సముచిత రీతిలో గౌరవించారు. పంత్ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.కాగా రిషభ్ పంత్ టెస్టుల్లో ఇలా 90లలో అవుట్ కావడం ఇది ఏడోసారి. అయితే, అతడు సాధించిన శతకాలు ఆరు కావడం విశేషం. ఇక శనివారం కొత్త బంతి రాగానే కివీస్ పేసర్లు మరోసారి విజృంభిస్తున్నారు. 150 పరుగుల వద్ద సర్ఫరాజ్, 99 పరుగుల వద్ద పంత్ అవుట్ కాగానే భారత ఇన్నింగ్స్ గాడి తప్పింది.కేఎల్ రాహుల్(12) మరోసారి నిరాశపరచగా.. రవీంద్ర జడేజా(5) సైతం విఫలమయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్(15), జస్ప్రీత్ బుమ్రా(0), మహ్మద్ సిరాజ్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్👉మొదటి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు(బుధవారం) ఆట రద్దు కాగా.. రెండో రోజు(గురువారం) టాస్ పడింది👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్👉భారత్ తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన👉పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయానంటూ తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్ 👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్👉భారత్ రెండో ఇన్నింగ్స్: 462 ఆలౌట్👉కివీస్ లక్ష్యం: 107 పరుగులు చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
వెనక్కి వెళ్తావా? లేదా?: పంత్‌ను ‘హెచ్చరించిన’ సర్ఫరాజ్!
టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను ‘వెనక్కి పంపేందుకు’ సెంచరీ సర్ఫరాజ్ ఖాన్ వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. అసలు సంగతి ఏమిటంటే!?బెంగళూరు వేదికగా భారత్- కివీస్ జట్ల మధ్య గురువారం(రెండో రోజు) మొదటి టెస్టు మొదలైన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన..తమ తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. కేవలం 46 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. తద్వారా స్వదేశంలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.అయితే, టీమిండియా బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం మెరుగ్గా ఆడారు. ఓపెనర్ డెవాన్ కాన్వే 91, రచిన్ రవీంద్ర 134, టిమ్ సౌథీ 65 పరుగులతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసి.. భారత్ కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.రోహిత్, విరాట్ హాఫ్ సెంచరీలు.. ఈ నేపథ్యంలో పరువు కాపాడుకోవాలంటే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తప్పక రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ(52), విరాట్ కోహ్లి(70) అర్ధ శతకాలతో బలమైన పునాది వేశారు. అయితే, సర్ఫరాజ్ ఖాన్ రాకతో టీమిండియా స్కోరు బోర్డు మరింత వేగంగా పరుగులు పెట్టింది. కేవలం 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. శనివారం నాటి ఆటలో శతకం సాధించాడు.పంత్, సర్ఫరాజ్ దూకుడుఅయితే, కోహ్లి అవుటైన తర్వాత సర్ఫరాజ్‌కు రిషభ్ పంత్ జతకాగా.. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ కివీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 56వ ఓవర్ వేసిన మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో తొలి బంతికి సర్ఫరాజ్ ఖాన్ షాట్ ఆడి.. సింగిల్ తీసుకున్నాడు. అయితే, పంత్ రెండో పరుగు కోసం పరిగెత్తుకు రాగా.. ప్రమాదాన్ని పసిగట్టిన సర్ఫరాజ్ నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి కాస్త ముందుకు వచ్చి గట్టిగా అరిచాడు. వెనక్కి వెళ్తావా? లేదా? పంత్‌ను ఎలాగైనా వెనక్కి పంపించడం సహా ఫీల్డర్ల ఏకాగ్రత చెదిరేలా గెంతులు వేస్తూ పంత్‌కు సైగలు చేశాడు. దీంతో పంత్ క్రీజులోకి వెళ్లగా.. అప్పటికే ఫీల్డర్ త్రో చేసిన బంతిని కివీస్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ వికెట్ల వైపునకు విసిరాడు. అయితే, అంతకంటే ముందే పంత్ క్రీజులోకి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది.రోహిత్ రియాక్షన్ వైరల్ఇదిలా ఉంటే.. పంత్‌ను వెనక్కి పంపేందుకు సర్ఫరాజ్ చిన్న పిల్లాడిలా జంప్ చేసిన విధానం.. భారత శిబిరంలో నవ్వులు పూయించింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లి తదితరులు పంత్ సమయానికి చేరుకుంటాడో లేదోనని ఆందోళన పడుతూనే.. నవ్వులు ఆపుకోలేకపోయారు. 🤣🤣 https://t.co/ThCCxMp1yD pic.twitter.com/ymjEvBO0b4— mon (@4sacinom) October 19, 2024 ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సర్ఫరాజ్ 150, పంత్ 99 పరుగులు చేసి అవుటయ్యారు. టీ బ్రేక్ సమయానికి 90.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసి.. 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema)ALL INDIA REACTION ON SARFARAZ RISHABH RUN OUT CHANCE #INDvNZ pic.twitter.com/ImFtIck1sp— Wasi (@WasiTheBoi) October 19, 2024 -
'వెల్' డన్ సర్ఫరాజ్.. ఎంతో కష్టపడ్డావు: డేవిడ్ వార్నర్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో మెరిశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సర్ఫరాజ్‌కు ఇది ఇది అంతర్జాతీయ క్రికెట్ లో అతనికి తొలి సెంచరీ కావడం విశేషం. భారత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అద్బుతమైన ఆట తీరును కనబరిచి శతకాన్ని నమోదు చేశాడు. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై నిరాశపరిచిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఆడుతున్నాడు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తనదైన షాట్లతో అభిమానులను ఈ ముంబైకర్ అలరిస్తున్నాడు. ప్రస్తుతం 125 పరుగులతో సర్ఫరాజ్ ఆజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ చేరాడు. అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడావు అంటూ డేవిడ్ భాయ్ కొనియాడాడు. "వెల్ డన్ సర్ఫరాజ్. చాలా కష్టపడ్డావు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు, చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటూ" వార్నర్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా ఐపీఎల్లో సర్ఫరాజ్, వార్నర్ కలిసి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.ఇక ఈ మ్యాచ్‌లో 71 ఓవర్లు ముగిసే సరికి ఇండియా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కంటే భారత్ 13 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ 125, రిషబ్ పంత్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే వర్షం కారణంగా ఆట ప్రస్తుతం నిలిచిపోయింది. చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!
టెస్టు క్రికెట్లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో టెస్ట్ ఫార్మాట్లో 100 సిక్స్‌లు బాదిన తొలి జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఈ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బాదిన సిక్సర్‌తో టీమిండియా 100 సిక్స్‌ల మైలురాయిని అందుకుంది. తద్వారా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డును టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 17 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ సేన.. 105 సిక్స్‌లు నమోదు చేసింది. ఈ జాబితాలో భారత్ తర్వాత ఇంగ్లండ్ (2022) 89 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉండగా, 87 సిక్స్‌లతో టీమిండియానే మూడో స్ధానంలో ఉంది. 2021 ఏడాదిలో భారత్ టెస్టుల్లో 87 సిక్స్‌లు బాదింది. ప్రస్తుత మ్యాచ్‌లో భారత్ ఇప్పటివరకు 8 సిక్స్‌లు కొట్టింది. పంత్, సర్ఫరాజ్ తలా 3 సిక్స్‌లు బాదగా.. రోహిత్, విరాట్ చెరో సిక్స్ కొట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 13 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(125), పంత్(53) పరుగులతో ఉన్నారు.చదవండి: IND vs NZ: 'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు' -
IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ మెరుపు సెంచరీ..
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దుమ్ములేపుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్ఫరాజ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. నాలుగో రోజు ఆటలో సర్ఫరాజ్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో శతకాన్ని పూర్తి చేశాడు. వన్డే తరహాలో కివీస్ బౌలర్లపై ఈ ముంబైకర్ విరుచుకుడపడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నిప్పులు చేరిగిన మాట్ హెన్రీని సైతం సర్ఫరాజ్ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు.మొదటి ఇన్నింగ్స్‌లో నిప్పులు చేరిగిన మాట్ హెన్రీని సైతం సర్ఫరాజ్ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. రిషబ్ పంత్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ను సర్ఫరాజ్ ముందుకు నడిపిస్తున్నాడు. సర్ఫరాజ్ 106 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇక 62 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. భారత్ ఇంకా 85 పరుగుల వెనకంజలో ఉంది. SARFARAZ KHAN HAS ARRIVED IN INTERNATIONAL CRICKET...!!! 🥶- Maiden Test century at over 90 Strike Rate is simply crazy! 🤯pic.twitter.com/Vdo6JXAGA5— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2024 -
NCAలో టీమిండియా స్టార్ క్రికెటర్.. కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీ 2024-25 ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ఈ ఇరానీ కప్ హీరో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.డబుల్ సెంచరీఈ క్రమంలో దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌తో పాటు... ఇరానీ కప్-2024లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. లక్నోలో అక్టోబరు 1-5 వరకు రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఈ రెడ్‌బాల్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా ముంబై ఇరానీ కప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులతో అజేయంగా నిలిచిన సర్ఫరాజ్ ఖాన్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా సెలక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో అతడిని బీసీసీఐ.. ఎన్సీఏకు పంపించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. కివీస్‌తో సిరీస్‌కు అతడిని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. స్ట్రాంగ్‌గా రీ ఎంట్రీకేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్ వరుస అర్ధ శతకాలతో దుమ్ములేపాడు. అయితే, బంగ్లాతో సిరీస్ సందర్భంగా రాహుల్ తిరిగి రావడంతో అతడికి మళ్లీ మొండిచేయి ఎదురైంది. అయితే,ఈసారి మరింత స్ట్రాంగ్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సర్ఫరాజ్ సిద్దమైపోయాడు. కాగా ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరువైన టీమిండియా.. బంగ్లాతో టీ20 సిరీస్ తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. అక్టోబరు 16 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. అయితే, అక్టోబరు 11 నుంచే రంజీల్లో ముంబై తమ ప్రయాణం మొదలుపెట్టబోతోంది. బరోడాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. దీంతో సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు పీటీఐ వెల్లడించింది. చదవండి: అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్ అదే: మంధాన -
‘టీమిండియా డ్రెస్సింగ్‌రూంలో గడపడం వల్లే ఇలా’
‘‘దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. అక్కడి మైదానంలోని వికెట్‌కి అనుగుణంగా మన బ్యాటింగ్ శైలి మార్చుకోవాలి. మా నాన్న ఇదే చెబుతూ ఉంటారు. ఏ పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చుకోవాలంటారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో గడపడం నాకెంతో కలిసి వచ్చింది. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దగ్గర నుంచి భిన్న పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనేది సీనియర్లను చూసి నేర్చుకున్నా.ఇక ఈ మేము గెలిచిన ఈ ట్రోఫీ జట్టు మొత్తానిది. అయితే, ముషీర్‌కు నేను ఓ మాట ఇచ్చాను. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తానని చెప్పాను. యాక్సిడెంట్‌కు గురై మ్యాచ్‌కు దూరమైన ముషీర్‌కు ఈ అవార్డు అంకితం’’ అని టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇరానీ కప్-2024లో డబుల్ సెంచరీతో మెరిసిన ఈ ముంబై బ్యాటర్.. తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తన తమ్ముడు, క్రికెటర్ ముషీర్ ఖాన్‌కు అంకితమిచ్చాడు.1997లో చివరిసారిగాకాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై జట్టు.. దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన రెడ్‌బాల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా నిలిచింది. కాగా ముంబై 1997లో చివరిసారిగా ఇరానీ కప్ గెలిచింది. ఇప్పుడిలా.. మళ్లీ 27 ఏళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఓవరాల్‌గా ముంబైకిది పదిహేనో ఇరానీ కప్.కాగా 1997–98 నుంచి గత సీజన్ వరకు మరో ఎనిమిదిసార్లు ఇరానీ కప్ ఆడినా... ముంబై మాత్రం గెలుపు గీత దాటలేకపోయింది. చివరిసారిగా 2015–16లో ఇరానీ కప్‌లో ముంబై పరాజయం పాలైంది. ఈసారి సమష్టి ప్రదర్శనతో కదంతొక్కిన ముంబై ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఓవర్‌నైట్ స్కోరు 153/6తో ఐదోరోజు శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై... 78 ఓవర్లలో 8 వికెట్లకు 329 పరుగులు చేసింది.తనుశ్ కొటియాన్ వీరవిహారం.. ఈ దశలో ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇక ఫలితం తేలడం కష్టమని భావించిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ‘డ్రా’కు అంగీకరించింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముంబైని విజేతగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో.. సర్ఫరాజ్ ఖాన్ (17) రెండో ఇన్నింగ్స్‌లో త్వరగానే ఔటైనా... తనుశ్ కొటియాన్ (150 బంతుల్లో 114 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో అదరగొట్టాడుమిగతా వాళ్లలో... మోహిత్ అవస్థి (91 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) అతడికి చక్కటి సహకారం అందించాడు. సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ (2) వెంట వెంటనే అవుట్ కావడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేసినా... తనుశ్ వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.ఫలితం తేలడం కష్టమనిమోహిత్తో కలిసి తనుశ్ అబేధ్యమైన తొమ్మిదో వికెట్‌కు 158 పరుగులు జోడించాడు. సాధించాల్సిన లక్ష్యం కొండంత పెరిగిపోగా... అందుకు తగిన సమయం కూడా లేకపోవడంతో చివరకు రెస్ట్ ఆఫ్ ఇండియా సారథి రుతురాజ్ గైక్వాడ్ ‘డ్రా’కు అంగీకరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై ఎనిమిది వికెట్లు కోల్పోగా... అందులో 6 వికెట్లు ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ తీయడం విశేషం. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేయగా... రెస్టాఫ్ ఇండియా 416 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. డబుల్ సెంచరీతో మెరిసిన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం కారణంగా రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు దూరమైన ముషీర్ ఖాన్‌కు తన పురస్కారాన్ని అంకితం చేశాడు. కాగా భారత టెస్టు జట్టులో సభ్యుడైన సర్ఫరాజ్ ఖాన్... బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఇరానీ కప్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే.రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం సంతోషంముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ..‘27 ఏళ్ల తర్వాత తిరిగి ఇరానీ కప్ గెలుచుకోవడం సంతోషంగా ఉంది. తనుశ్ కొటియాన్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ విలువైన పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం ఆనందంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశాడు.ఘన సన్మానంఇక సుదీర్ఘ విరామం తర్వాత ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న ముంబై జట్టును ఘనంగా సన్మానించనున్నట్లు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వెల్లడించింది. వాంఖడే స్టేడియంలో త్వరలోనే ఆటగాళ్లను సన్మానిస్తామని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ తెలిపాడు. దేశవాళీల్లో తమ ఆధిపత్యం చాటుతూ ముంబై జట్టు మరోసారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని... సమష్టి ప్రదర్శనకు దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. ఇరానీ కప్-2024: సంక్షిప్త స్కోర్లు ముంబై తొలి ఇన్నింగ్స్: 537 రెస్టా ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 416ముంబై రెండో ఇన్నింగ్స్: 329/8. చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
‘భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!’
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. మూడో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 27 బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అభిమానులు రుతు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే, భారత టెస్టు జట్టుకు ఎంపిక కావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.కాగా రంజీ చాంపియన్ ముంబై- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతోంది. లక్నో వేదికగా అక్టోబరు 1న మొదలైన ఈ రెడ్‌బాల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.సర్ఫరాజ్ డబుల్ సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ (276 బంతుల్లో 221 బ్యాటింగ్; 25 ఫోర్లు, 4 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 536 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 237/4తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై రెండో రోజంతా అదే జోరు కనబర్చింది.కెప్టెన్ అజింక్య రహానే, షమ్స్ ములానీ (5) త్వరగానే ఔటైనా... తనుశ్ కోటియాన్ (124 బంతుల్లో 64; 6 ఫోర్లు)తో కలిసి సర్ఫరాజ్ చెలరేగిపోయాడు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 183 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ముంబై ఆటగాడిగా సర్ఫరాజ్ రికార్డు సృష్టించాడు.భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!ఇలా... టీమిండియా టెస్టు జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోవాలని చూస్తున్న సర్ఫరాజ్ దేశవాళీల్లో భీకర ఫామ్ కొనసాగిస్తూ చెలరేగగా.. రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ తొమ్మిది పరుగుల వద్ద ఉండగా.. ముంబై ప్లేయర్ జునైద్ ఖాన్ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆదిలోనే రెస్ట్ ఆఫ్ ఇండియాకు షాక్ తగిలింది.అయితే, మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అర్ధ శతకంతో అదరగొట్టి సెంచరీ దిశగా పయనిస్తుండగా.. సాయి సుదర్శన్(32) అతడికి సహకారం అందించాడు. ఈ క్రమంలో గురువారం నాటి మూడో రోజు ఆటలో 36 ఓవర్లు ముగిసేసరికి రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై కంటే 396 పరుగులు వెనుకబడి ఉంది.సెలక్టర్లు మాత్రం ఏం చేస్తారు?కాగా టీమిండియా టెస్టు ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ పాతుకుపోయిన విషయం తెలిసిందే. రోజురోజుకూ బ్యాటింగ్ మెరుగుపరచుకుంటూ ఈ యంగ్‌స్టర్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇలాంటి తరుణంలో బ్యాకప్ ఓపెనర్‌గా అయినా స్థానం దక్కించుకునేందుకు రుతు ప్రయత్నిస్తున్నాడు.ఈ క్రమంలో.. ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టు సారథిగా వ్యవహరించిన రుతురాజ్.. మూడు మ్యాచ్‌లలో కలిపి 232 పరుగులు చేయగలిగాడు. అయితే, తాజాగా ఇరానీ కప్ మ్యాచ్‌లో మాత్రం ఇలా నిరాశపరిచాడు. కాగా టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో రుతురాజ్ కూడా జట్టుకు ఎంపికవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇలాంటి ఆట తీరుతో అతడు సెలక్టర్లను ఆకట్టుకోవడం కష్టమేనని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.చదవండి: కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ Maiden First-Class wicket for Mohammad Juned Khan on debut 🙌What a way to get off the mark! He gets the big wicket of captain Ruturaj Gaikwad 👌#IraniCup | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/KvUOFHK6Nx— BCCI Domestic (@BCCIdomestic) October 3, 2024 -
డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్
బంగ్లాదేశ్‌లో టెస్టు సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ మ్యాచ్‌లో దుమ్ములేపాడు. తుదిజట్టులో చోటివ్వని సెలక్టర్లకు సవాల్ విసిరేలా ధనాధన్ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇరానీ కప్-2024లో భాగంగా ఈ ముంబై క్రికెటర్ రెస్ట్ ఆఫ్ ఇండియాపై ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్బంతిని కసితీరా బాదుతూ ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఆకాశమే మద్దుగా చెలరేగి 253 బంతుల్లో.. 23 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. తద్వారా ఇరానీ కప్ చరిత్రలో ముంబై తరఫున ద్విశతకం చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సర్ఫరాజ్ ఖాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. యంగెస్ట్ డబుల్ సెంచూరియన్స్అంతేకాదు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో 200 పరుగులు చేసిన పిన్న వయస్కుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 26 ఏళ్ల 346 రోజుల వయసులో సర్ఫరాజ్ ఈ ఘనత సాధించాడు. ఇక ఇరానీ కప్ యంగెస్ట్ డబుల్ సెంచూరియన్స్ లిస్టులో యశస్వి జైస్వాల్(21 ఏళ్ల 63 రోజుల వయసులో), ప్రవీణ్ ఆమ్రే(22 ఏళ్ల 80 రోజులు), గుండప్ప విశ్వనాథ(25 రోజుల 255 రోజులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.ఈసారి ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియాకాగా ద్విశతకం బాదిన అనంతరం.. హెల్మెట్ తీసి డ్రెసింగ్ రూం వైపు బ్యాట్ చూపుతూ సర్ఫరాజ్ తన సంతోషాన్ని పంచుకోగా.. సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్‌తో అతడిని అభినందించారు. ఇక ప్రతి ఏడాది రంజీ చాంపియన్- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ ట్రోఫీ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి అజింక్య రహానే కెప్టెన్సీలో ముంబై రంజీ చాంపియన్‌గా నిలిచి.. రెస్ట్ ఆఫ్ ఇండియాతో తలపడుతోంది.భారీ స్కోరు సాధించిలక్నోలోని ఏకనా స్టేడియంలో మంగళవారం(అక్టోబరు 1) ఈ ఐదు రోజుల మ్యాచ్ మొదలైంది. ఇందులో.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై రెండో రోజు ఆటలో భాగంగా 500 పైచిలుకు పరుగులు సాధించింది. బుధవారం నాటి ఆట సందర్భంగానే ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ తన డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.చదవండి: WTC: ఫైనల్ చేరాలంటే టీమిండియా చేయాల్సిందిదే! 💯 turns into 2⃣0⃣0⃣ 👌A sensational double century for Sarfaraz Khan✌️He becomes the 1⃣st Mumbai player to score a double ton in #IraniCup 👏The celebrations say it all 🎉#IraniCup | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/225bDX7hhn— BCCI Domestic (@BCCIdomestic) October 2, 2024 -
‘అప్పుడు నాన్న కూడా నాతోనే ఉన్నారు.. ఇది పునర్జన్మ’
తన ఆరోగ్యం బాగానే ఉందని భారత యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ తెలిపాడు. ఆ దేవుడి ఆశీసుల వల్లే తాను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడని.. ఆపత్కాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా ఇరానీ కప్-2024లో పాల్గొనేందుకు ఈ ముంబై ఆటగాడు... తండ్రి నౌషాద్ ఖాన్‌తో కలిసి కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ మెడ భాగంలో గాయాలయ్యాయి.మా నాన్న కూడా నాతోనే ఉన్నారుఅయితే, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా వేగంగా కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ముషీర్ మాట్లాడుతూ.. ఇది తనకు పునర్జన్మ వంటిదని పేర్కొన్నాడు. ‘నా ఆరోగ్యం మెరుగవ్వాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో మా నాన్న కూడా నాతోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కూడా బాగానే ఉన్నారు.ఇది కొత్త జీవితంలాగా భావిస్తున్నా. కష్టకాలంలో అండగా నిలిచిన ముంబై క్రికెట్ సంఘం (ఎమ్సీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని ముషీర్ పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. కాగా టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడైన ముషీర్ ఖాన్ దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ-2024లో ముషీర్ భారీ శతకం సాధించాడు. రంజీ ట్రోఫీలోని ఆరంభ మ్యాచ్‌లకూ దూరంఈ క్రమంలో రంజీ చాంపియన్ ముంబైతో రెస్టాఫ్ ఇండియా ఆడే ఇరానీ కప్-2024 మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. అయితే, ఈ రెడ్‌బాల్ టోర్నీ మ్యాచ్ ఆడేందుకు లక్నోకు వెళ్తుంగా ప్రమాదం జరిగింది. ఈ ఘటన కారణంగా అతడు అక్టోబర్ 1 నుంచి లక్నోలో ప్రారంభం కానున్న ఇరానీ కప్ మ్యాచ్‌తో పాటు... ఆ తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలోని ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకొని ముషీర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. చదవండి: పూరన్ సుడిగాలి శతకం View this post on Instagram A post shared by Naushad Khan (@musheerkhan.97) -
రోడ్డు ప్రమాదం.. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్‌కు గాయాలు
భారత యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ ప్రమాదం బారిన పడినట్లు సమాచారం. తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్‌తో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో వీరికి యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముషీర్ మెడకు తీవ్రంగా గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సొంత తమ్ముడు ముషీర్ ఖాన్.అండర్-19 వరల్డ్‌కప్‌లో అదరగొట్టిఅండర్-19 వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముషీర్.. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 360 పరుగులతో యువ భారత జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం తొమ్మిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే 716 పరుగులతో దుమ్ములేపాడు. దులిప్ ట్రోఫీ-2024లో శతక్కొట్టిఅంతేకాదు.. తన స్పిన్ బౌలింగ్‌తో ఎనిమిది వికెట్లు కూడా కూల్చాడు. ఈ ఏడాది రంజీల్లో ముంబై చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ.. దులిప్ ట్రోఫీ-2024లో ఆడే అవకాశం ఇచ్చింది. ఇండియా-బి తరఫున బరిలోకి దిగిన ముషీర్ అరంగేట్రంలోనే 181 పరుగులతో అదరగొట్టాడు. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న ఈ యువ క్రికెటర్ ఇరానీ కప్-2024 నేపథ్యంలో ముంబై జట్టుకు ఎంపికయ్యాడు.కాన్పూర్ నుంచి లక్నోకురంజీ చాంపియన్ ముంబై- రెస్టాఫ్ ఇండియా మధ్య లక్నో వేదికగా అక్టోబరు 1-5 వరకు ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో తండ్రి నౌషద్ ఖాన్‌తో కలిసి ముషీర్ కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ముంబై నుంచి బయల్దేరకుండా ముషీర్ ఖాన్ తండ్రితో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపిందికాగా ఈ ప్రమాదంలో ముషీర్ మెడకు గాయమైందని.. కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇరానీ కప్‌తో పాటు.. రంజీ తాజా ఎడిషన్‌కు దూరం కానున్నట్లు సమాచారం. మరోవైపు.. సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్