టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు సర్ఫరాజ్ ప్రాతినిథ్యం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలసిందే. దీంతో అతడు ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
ఈ క్రమంలో మింజ్ స్ధానాన్ని సర్ఫరాజ్‌తో భర్తీ చేయాలని గుజరాత్ మేనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా గత ఐపీఎల్‌సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన సర్ఫరాజ్‌ను 2024 వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ విడుదల చేసింది. దీంతో రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సర్ఫరాజ్‌ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
అయితే ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్ అదరగొట్టడంతో గుజరాత్ ఫ్రాంచైజీ తమ జట్టులో చేర్చుకునేందుకు సిద్దమైంది. సర్ఫరాజ్ గతం ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు, ఆర్సీబీకి కూడా ప్రాతనిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 585 పరుగులు చేశాడు.
ఇక ఈ ఏడాది సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment