
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షర్ఫాణమైంది. ఎడతరిపి లేని వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దు అయింది. సాయంత్రం నుంచే అహ్మదాబాద్‌లో వర్షం కురుస్తోంది.
ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో అంపైర్‌లు మ్యాచ్ రద్దు చేశారు. ఇరు జట్లకూ చేరో పాయింట్ లభించింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ ఐదింట విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో నిలిచింది.
మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే . ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ తొమ్మిదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment