
ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారీ వర్షం కారణంగా ఉప్పల్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు.
అయితే ఇంకా చిన్నపాటి జల్లు కురుస్తుండడంతో సెంట్రల్ పిచ్‌ను మాత్రం కవర్స్‌తో కప్పి ఉంచారు. దీంతో టాస్ ఆలస్యం కానుంది. ఇక ఈ మ్యాచ్ నిర్వహణపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కీలక ప్రకటన చేశారు.
వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మైదానాన్ని సిద్దం చేసుందుకు 100 మందికి పైగా గ్రౌండ్ స్టాప్ శ్రమిస్తున్నారని జగన్ మోహన్ రావు తెలిపారు. మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10.30 వరకు సమయం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.