Rajiv gandhi international stadium
-
SRH vs GT: మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. హెచ్‌సీఏ కీలక ప్రకటన
ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారీ వర్షం కారణంగా ఉప్పల్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు.అయితే ఇంకా చిన్నపాటి జల్లు కురుస్తుండడంతో సెంట్రల్ పిచ్‌ను మాత్రం కవర్స్‌తో కప్పి ఉంచారు. దీంతో టాస్ ఆలస్యం కానుంది. ఇక ఈ మ్యాచ్ నిర్వహణపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కీలక ప్రకటన చేశారు. వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మైదానాన్ని సిద్దం చేసుందుకు 100 మందికి పైగా గ్రౌండ్ స్టాప్ శ్రమిస్తున్నారని జగన్ మోహన్ రావు తెలిపారు. మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10.30 వరకు సమయం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
India vs England: ఇంట్లోనే తలవంచారు
సొంతగడ్డపై మ్యాచ్... తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యం... ప్రత్యర్థి జట్టులో పెద్దగా గుర్తింపు లేని స్పిన్నర్లు... 231 పరుగుల స్వల్ప లక్ష్యం... అయినా సరే... భారత జట్టు అనూహ్య రీతిలో ఓటమిని ఆహ్వానించింది... ఇంగ్లండ్ బౌలర్లకు తలవంచుతూ పేలవ బ్యాటింగ్‌తో కుప్పకూలింది. నాలుగో రోజు పిచ్‌పై స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తడబడుతూ మన బ్యాటర్లు డిఫెన్స్ ఆడటం గతంలో ఎన్నడూ చూడనిది. కానీ తొలి టెస్టులో అలాంటి దృశ్యమే కనిపించింది. చివరకు హైదరాబాద్‌లో పరాజయం పలకరించింది. రెండో ఇన్నింగ్స్ ఆడుతూ తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చుకునే లోపే ఐదుగురు బ్యాటర్లు పెవిలియన్‌కు... ఎదురుగా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ బలగం... వీటన్నింటిని దాటి సాగిన ఒలీ పోప్ అత్యద్భుత ఇన్నింగ్స్ ఇంగ్లండ్‌కు ఆశలు రేపింది. ఆపై భారత్‌ను నిలువరించగలమా అనే సందేహాల మధ్య టామ్ హార్లీ నేనున్నానంటూ వచ్చాడు. తొలి బంతికి సిక్సర్ ఇచ్చి కెరీర్ మొదలు పెట్టిన అతను చివరి వికెట్ సహా 7 వికెట్లు తీసి సూపర్ అనిపించాడు. టెస్టులో రెండు రోజుల పాటు వెనుకబడి కూడా ఆఖరికి అసలైన ఆటతో ఇంగ్లండ్ జట్టు విదేశీ గడ్డపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఊహించని విధంగా గట్టి దెబ్బ తగిలింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నాలుగో రోజే ముగిసిన తొలి టెస్టులో టీమిండియాకు ఓటమి ఎదురైంది. పలు మలుపులతో సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 231 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 69.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ రోహిత్ శర్మ (58 బంతుల్లో 39; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి టెస్టు ఆడిన ఎడంచేతి వాటం స్పిన్నర్ టామ్ హార్లీ 62 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టడం విశేషం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 316/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఒలీ పోప్ (278 బంతుల్లో 196; 21 ఫోర్లు) త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. తాజా ఫలితంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరుగుతుంది. చేజారిన డబుల్ సెంచరీ... నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసేందుకు భారత్‌కు ఎక్కువ సమయమే పట్టింది. రేహన్ అహ్మద్ (53 బంతుల్లో 28; 3 ఫోర్లు)ను బుమ్రా వెనక్కి పంపినా... పోప్ జోరు తగ్గలేదు. అతనికి టామ్ హార్లీ (52 బంతుల్లో 34; 4 ఫోర్లు) అండగా నిలవడంతో కీలక భాగస్వామ్యం నమోదైంది. ఈ దశలోనే వీరిద్దరిని నిలువరించడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. పోప్, హార్లీ ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు ఒకే స్కోరు వద్ద హార్లీ, వుడ్ (0)లను భారత్ అవుట్ చేయగా... బుమ్రా బౌలింగ్‌లో ర్యాంప్షాట్కు ప్రయత్నించి పోప్ డబుల్ సెంచరీని చేజార్చుకోవడంతో ఇన్నింగ్స్ ముగిసింది. ఆదివారం ఇంగ్లండ్ 25.1 ఓవర్లు ఆడి 104 పరుగులు చేసింది. పేలవ బ్యాటింగ్‌తో... ఛేదనను కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ (15) మెరుగ్గానే ఆరంభించారు. అయితే ఒకే ఓవర్లో యశస్వి, శుబ్‌మన్ గిల్ (0)లను అవుట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టిన హార్లీ... కొద్దిసేపటికే రోహిత్‌ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. టీ విరామం తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు మరింతగా పట్టు బిగించి టీమిండియా బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు. ఫలితంగా 12 పరుగుల వ్యవధిలో అక్షర్ పటేల్ (17), కేఎల్ రాహుల్ (22) వెనుదిరగ్గా, ఒకే స్కోరు వద్ద రవీంద్ర జడేజా (2), శ్రేయస్ అయ్యర్ (13) అవుటయ్యారు. అనవసరపు సింగిల్‌కు ప్రయతి్నంచిన జడేజాను అద్భుతమైన త్రోతో స్టోక్స్ రనౌట్ చేయగా... శ్రేయస్ మళ్లీ చెత్త షాట్‌తో నిష్క్రమించాడు. ఈ దశలోనే భారత్ ఓటమి ఖాయమైనట్లుగా అనిపించింది. అయితే కోన శ్రీకర్ భరత్ (59 బంతుల్లో 28; 3 ఫోర్లు), రవిచంద్రన్ అశి్వన్ (84 బంతుల్లో 28; 2 ఫోర్లు) పట్టుదలగా పోరాడి విజయంపై ఆశలు రేపారు. చివర్లో ఉత్కంఠ... భరత్, అశి్వన్ జత కలిసే సమయానికి భారత్ స్కోరు 119/7... విజయానికి మరో 112 పరుగులు కావాలి. ఈ సమయంలో వీరిద్దరు గట్టిగా నిలబడ్డారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటూ స్వేచ్ఛగా పరుగులు చేశారు. ఒత్తిడి పెరగడంతో ఇంగ్లండ్ బౌలర్లు, ఫీల్డర్లలో తడబాటు కనిపించింది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జత చేశారు. మరో 55 పరుగులు అవసరం. ఈ స్థితిలో హార్లీ చక్కటి బంతితో భరత్‌ను బౌల్డ్ చేసి భాగస్వామ్యాన్ని విడదీయగా... తప్పనిసరి పరిస్థితుల్లో భారీ షాట్‌కు ప్రయతి్నంచి అశ్విన్ వెనుదిరిగాడు. ఈ వికెట్ పడిన తర్వాత ఫలితం కోసం నిబంధనల ప్రకారం అంపైర్లు అరగంట ఆటను పొడిగించారు. చివరి వికెట్‌కు కొన్ని షాట్లతో సిరాజ్ (12), బుమ్రా (6 నాటౌట్) కూడా 25 పరుగులు జోడించడంతో మరో 29 పరుగులే మిగిలాయి. ఆదివారం మరో ఓవర్ మిగిలి ఉండగా... దీనిని ఆడుకుంటే ఆట చివరి రోజుకు వెళ్లేది. కానీ రెండో బంతికి సిరాజ్ స్టంపౌట్ కావడంతో భారత్ కథ ముగిసింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 436 ఆలౌట్; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 420 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) హార్లీ 39; యశస్వి (సి) పోప్ (బి) హార్లీ 15; గిల్ (సి) పోప్ (బి) హార్లీ 0; రాహుల్ (ఎల్బీ) (బి) రూట్ 22; అక్షర్ (సి అండ్ బి) హార్లీ 17; శ్రేయస్ (సి) రూట్ (బి) లీచ్ 13; జడేజా (రనౌట్) 2; భరత్ (బి) హార్లీ 28; అశి్వన్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) హార్లీ 28; బుమ్రా (నాటౌట్) 6; సిరాజ్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) హార్లీ 12; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (69.2 ఓవర్లలో ఆలౌట్) 202. వికెట్ల పతనం: 1–42, 2–42, 3–63, 4–95, 5–107, 6–119, 7–119, 8–176, 9–177, 10–202. బౌలింగ్: రూట్ 19–3– 41–1, వుడ్ 8–1–15–0 హార్లీ 26.2–5–62–7 లీచ్ 10–1–33–1, రేహన్ 6–0–33–0. -
హెచ్‌సీఏలో మరోసారి బయటపడ్డ విభేదాలు.. అజహర్‌పై తీవ్రస్థాయి ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో (హెచ్‌సీఏ) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్‌పై జనరల్ సెక్రెటరీ విజయ్ ఆనంద్ సంచలన ఆరోపణలు చేశాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు (జనవరి 18) వన్డే మ్యాచ్ జరుగనుండగా.. జనరల్ సెక్రెటరీని అయిన నన్ను సంప్రదించకుండా అజహర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆనంద్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జనరల్ సెక్రెటరీగా తన విధులు అధ్యక్షుడితో సమానంగా ఉంటాయని, అయినా అజహర్ తనను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. దళితుడినని అజహర్ తనను చిన్న చూపు చూస్తున్నాడని, బెదిరించి చెక్కులపై సైన్ చేయించుకుంటున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హెచ్‌సీఏలో నియంతలా వ్యవహరిస్తున్న అజహర్.. రేపు జరిగే వన్డే మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టించాడని, ఆన్లైన్ టికెట్ల అమ్మకాల్లో గోల్మాల్ చేశాడని ఆరోపించాడు. తనతో పాటు తన ప్యానెల్ మొత్తాన్ని అజహర్ పక్కకు పెట్టాడని, ఎవరి ప్రమేయం లేకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని అన్నాడు. -
IND vs AUS 3rd T20: మెరిసిన కోహ్లి, సూర్య కుమార్.. భారత్ భలే గెలుపు
India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad: ఆస్ట్రేలియాకు లభించిన ఆరంభం చూస్తే స్కోరు 200 ఖాయమనిపించింది. కానీ మన బౌలర్లు మిడిలార్డర్లో ప్రత్యర్థిని కదలనీయలేదు. చివరకు అంతకంటే తక్కువ స్కోరుకే పరిమితం చేసేశారు. మనకు లభించిన ఆరంభం చూస్తే ఛేదన కష్టమనిపించింది. కానీ సూర్యకుమార్, కోహ్లి దానిని సునాయాసం చేసేశారు. కీలక సమయాల్లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన జట్టుకు మరో గుర్తుంచుకోదగ్గ విజయాన్ని అందించింది. భారీ స్కోర్లతో ఆసక్తికరంగా సాగి ఆఖర్లో కాస్త ఉత్కంఠను పెంచిన పోరులో చివరకు టీమిండియాదే పైచేయి అయింది. రోహిత్ సేన ఖాతాలో మరో సిరీస్ చేరింది. రెండు రోజుల విరామం తర్వాత ఈనెల 28 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్‌లో భారత్ బరిలోకి దిగనుంది. సాక్షి, హైదరాబాద్: చివరి ఓవర్లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా, తొలి బంతికే కోహ్లి సిక్స్ బాదాడు. తర్వాతి 3 బంతుల్లో ఒకే పరుగు రావడంతోపాటు కోహ్లి వెనుదిరిగాడు. దాంతో 2 బంతుల్లో 4 పరుగుల చేయాల్సి రాగా... హార్దిక్ తెలివిగా ఆడిన షాట్ థర్డ్‌మాన్ దిశగా బౌండరీకి దూసుకుపోవడంతో స్టేడియంలో సంబరాలు హోరెత్తాయి. మ్యాచ్‌లో విజయంతో టి20 సిరీస్ 2–1తో భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన చివరి టి20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (21 బంతుల్లో 52; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (48 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 62 బంతుల్లోనే 104 పరుగులు జోడించారు. మెరుపు ఓపెనింగ్... ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మూడు భిన్నమైన దశల్లో సాగింది. ముందుగా గ్రీన్ విధ్వంసం, ఆపై భారత బౌలర్ల కట్టడితో జోరు తగ్గగా... చివర్లో డేవిడ్ దూకుడు జట్టుకు భారీ స్కోరు అందించింది. కెప్టెన్ ఫించ్ (7) విఫలం కాగా, ఆసీస్ 5 ఓవర్లలో చేసిన తొలి 62 పరుగుల్లో 52 గ్రీన్ సాధించడం విశేషం. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో వరుసగా 6,4 కొట్టిన గ్రీన్... బుమ్రా ఓవర్లో ఫోర్, 2 వరుస సిక్స్‌లతో చెలరేగాడు. అక్షర్ ఓవర్లోనూ వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. అయితే గ్రీన్ అవుటైన తర్వాత ఆసీస్ స్కోరు వేగం ఒక్కసారిగా మందగించింది. ముఖ్యంగా అక్షర్ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించాడు. ఒకదశలో 27 బంతుల వ్యవధిలో 22 పరుగులు మాత్రమే చేసి ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అక్షర్ ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. అయితే డేవిడ్, స్యామ్స్ భాగస్వామ్యం కంగారూలను మళ్లీ నిలబెట్టింది. వీరిద్దరు ఏడో వికెట్‌కు 34 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు. భువనేశ్వర్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన అనంతరం హర్షల్ ఓవర్లో మరో భారీ సిక్సర్‌తో 25 బంతుల్లో డేవిడ్ ఆసీస్ తరఫున తన తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు బుమ్రా ఓవర్లో స్యామ్స్ 6, 4 కొట్టడం కూడా హైలైట్‌గా నిలిచింది. శతక భాగస్వామ్యం... భారీ ఛేదనలో భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. 4 ఓవర్లు ముగిసేసరికి 34 పరుగులు రాగా, రాహుల్ (1), రోహిత్ (17) వెనుదిరిగారు. అయితే కోహ్లి, సూర్య భాగస్వామ్యం భారత్‌ను గెలుపు దిశగా నడిపించింది. హాజల్‌వుడ్ ఓవర్లో వరుస బంతుల్లో కోహ్లి 6, 4 కొట్టగా, స్యామ్స్ బౌలింగ్‌లో సూర్య బాదిన సిక్సర్ మైదానాన్ని హోరెత్తించింది. ఆపై జంపా ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాది సూర్య 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. హాజల్‌వుడ్ ఓవర్లోనూ 4, 6 కొట్టిన అనంతరం మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. అయితే 36 బంతుల్లో 53 పరుగులు చేయాల్సిన ఈ దశలో కోహ్లి తన జోరును కొనసాగించగా, హార్దిక్ (16 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ చేరుకున్న కోహ్లి జట్టును విజయానికి చేరువగా తెచ్చి చివరి ఓవర్లో నిష్క్రమించినా హార్దిక్ మరో బంతి మిగిలి ఉండగానే పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: గ్రీన్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 52; ఫించ్ (సి) హార్దిక్ (బి) అక్షర్ 7; స్మిత్ (స్టంప్డ్) కార్తీక్ (బి) చహల్ 9; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 6; ఇన్‌గ్లిస్ (సి) రోహిత్ (బి) అక్షర్ 24; డేవిడ్ (సి) రోహిత్ (బి) హర్షల్ 54; వేడ్ (సి అండ్ బి) అక్షర్ 1; స్యామ్స్ (నాటౌట్) 28; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–44, 2–62, 3–75, 4–84, 5–115, 6–117, 7–185. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–39–1, అక్షర్ 4–0–33–3, బుమ్రా 4–0–50–0, హార్దిక్ 3–0–23–0, చహల్ 4–0–22–1, హర్షల్ 2–0–18–1. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) వేడ్ (బి) స్యామ్స్ 1; రోహిత్ (సి) స్యామ్స్ (బి) కమిన్స్ 17; కోహ్లి (సి) ఫించ్ (బి) స్యామ్స్ 63; సూర్యకుమార్ (సి) ఫించ్ (బి) హాజల్‌వుడ్ 69; హార్దిక్ (నాటౌట్) 25; కార్తీక్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–5, 2–30, 3–134, 4–182. బౌలింగ్: స్యామ్స్ 3.5–0–33–2, హాజల్‌వుడ్ 4–0–40–1, జంపా 4–0–44–0, కమిన్స్ 4–0–40–1, గ్రీన్ 3–0–14–0, మ్యాక్స్‌వెల్ 1–0–11–0. M. O. O. D as #TeamIndia beat Australia in the third #INDvAUS T20I & seal the series win. 👍 👍 Scorecard ▶️ https://t.co/xVrzo737YV pic.twitter.com/uYBXd5GhXm — BCCI (@BCCI) September 25, 2022 -
Ind Vs Aus: హైదరాబాద్ మ్యాచ్.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు!
India Vs Australia T20 Series- 3rd T20 Hyderabad- Uppal: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల 25న భారత్– ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ–20 క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా టికెట్ల కోసం ఎదురుచూసినప్పటికీ నిరాశే మిగిలింది. కేవలం కొన్ని క్షణాల్లోనే వేలాది టికెట్లు అమ్ముడుపోవడం.. కనీసం టికెట్లు అందుబాటులో ఉన్నట్లు పేటీమ్ యాప్‌లో చూపకపోవడం అభిమానులు నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. టికెట్లు చూపకుండానే అమ్ముడుపోయినట్లు ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. ఉప్పల్ స్టేడియంలో 55వేల సీట్ల సామర్థ్యం కాగా, టికెట్లను మాత్రం 38వేలలోపు మాత్రమే విక్రయిస్తారు. మిగతా టికెట్లు నిర్వాహకులు, స్పాన్సర్లకు కేటాయిస్తారు. ఈ మేరకు రూ.850 మొదలు రూ.10వేల వరకు టికెట్ల విక్రయించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. తొలుత గురువారం ఉదయం 11 గంటలకు టికెట్లు పేటీమ్‌లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఆ తర్వాత సాంకేతిక కారణాలతో వాయిదా వేసిన నిర్వాహకులు.. శుక్రవారం రాత్రి 8 గంటలకు టికెట్లను విక్రయించనున్నట్లు ప్రకటించింది. ప్రకటించిన సమయానికే యాప్‌లను ఓపెన్ చేసి లాగిన్ అయిన క్రికెట్ అభిమానులకు.. హైదరాబాద్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు.. స్క్రీన్‌పై 10 గంటలకు ప్రత్యక్షమయ్యాయి. టికెట్ కోసం ఓపెన్ చేసిన అభిమానులకు టికెట్లన్నీ అమ్ముడుపోయాయని స్క్రీన్‌పై సమాచారం రావడంతో నివ్వెరపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -సాక్షి, సిటీబ్యూరో చదవండి: Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు! పఠాన్ బ్రదర్స్ విధ్వంసం.. ఇండియా మహారాజాస్ ఘన విజయం -
ఉప్పల్ టెస్ట్.. టికెట్ డబ్బులు వాపస్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు టికెట్లు కొనుగోలు చేసిన వారికి శుభవార్త. గత నెల 12 నుంచి 16 వరకు జరగాల్సిన ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే (అక్టోబర్–14) ముగిసింది. దీంతో 15, 16వ తేదీల్లో మ్యాచ్ వీక్షించాలనుకున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. కాగా... ఆ రెండు రోజుల కోసం ముందుగానే టికెట్లు తీసుకున్న ప్రేక్షకులకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వనుంది. ఈ మేరకు హెచ్‌సీఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని కోసం ఈ నెల 10న ఉదయం గం. 10 నుంచి సాయంత్రం గం. 6 వరకు జింఖానా గ్రౌండ్స్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. నాలుగో, ఐదో రోజు మ్యాచ్ టికెట్లు కొన్న వారు ఒరిజినల్ మ్యాచ్ టికెట్లతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలతో కౌంటర్ వద్ద సంప్రదించాలి. ఆన్లైన్ ద్వారా కొన్న వారికి ఆన్లైన్ ద్వారానే చెల్లింపు చేయనున్నారు. మొత్తం మ్యాచ్ వీక్షించేందుకు సీజన్ టికెట్ తీసుకున్న వారికి ఇది వర్తించదు. -
మూడో రోజే ముగించారు
ఐదేళ్ల వ్యవధి... అదే రెండు టెస్టుల సిరీస్... అదే 2–0 ఫలితం... మళ్లీ మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్... 2013లో రెండు ఇన్నింగ్స్ విజయాలైతే... ఈసారి ఒక ఇన్నింగ్స్, మరొకటి 10 వికెట్ల గెలుపు... సొంతగడ్డపై ఆడుతూ వెస్టిండీస్‌పై భారత్ అపార ఆధిపత్యానికి మరో నిదర్శనం... తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగుల స్వల్ప ఆధిక్యమే కోల్పోయినా రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కోలేక విండీస్ చతికిల పడింది. ఫలితంగా మరోసారి భారీ విజయాన్ని పళ్లెంలో పెట్టి భారత్‌కు అప్పగించింది. ఉమేశ్ ముందుండి నడిపించగా మిగతా ముగ్గురూ తలా ఓ చేయి వేయడంతో ప్రత్యర్థిని కుప్పకూల్చిన టీమిండియా 72 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ అందుకుంది. సాక్షి, హైదరాబాద్: రెండో టెస్టు తొలి రోజు వెస్టిండీస్ ఆట చూస్తే ఈ మ్యాచ్ మాత్రం మూడు రోజుల్లో ముగిసిపోదని అనిపించింది. కానీ విండీస్ అందరి అంచనాలను తప్పని నిరూపించింది. తమకే సాధ్యమైన రీతిలో కుప్పకూలి వేగంగా ఓటమిని ఆహ్వానించింది. ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముగిసిన రెండో టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 127 పరుగులకే ఆలౌటైంది. సునీల్ ఆంబ్రిస్ (38)దే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం 72 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 16.1 ఓవర్లలో 75 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు పృథ్వీ షా (45 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అజేయంగా నిలిచారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 308/4తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (134 బంతుల్లో 92; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (183 బంతుల్లో 80; 7 ఫోర్లు) సెంచరీలు సాధించడంలో విఫలమయ్యారు. హోల్డర్‌కు 5 వికెట్లు దక్కాయి. కెరీర్లో తొలిసారి మ్యాచ్‌లో పది వికెట్లు (10/133) పడగొట్టిన ఉమేశ్ యాదవ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... ఒక సెంచరీ, ఓ అర్ధసెంచరీ సహా 237 పరుగులు చేసిన పృథ్వీ షాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈనెల 21న గువాహటిలో జరిగే తొలి మ్యాచ్‌తో ఐదు వన్డేల సిరీస్ మొదలవుతుంది. రాణించిన అశ్విన్... మూడో రోజు పూర్తి ఉత్సాహంతో ఆట ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్ ఆశించిన స్థాయిలో సాగలేదు. పంత్, రహానే సెంచరీలు చేజార్చుకున్నారు. 59 పరుగులకే జట్టు మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. ముందుగా ఒకే ఓవర్లో రహానే, జడేజా (0)లను ఔట్ చేసి హోల్డర్ దెబ్బ తీశాడు. కొద్ది సేపటికే గాబ్రియెల్ వేసిన బంతిని పంత్ కట్ చేయగా కవర్ పాయింట్లో హెట్మెయిర్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దాంతో వరుసగా రెండో టెస్టులో కూడా పంత్ 90ల్లోనే వెనుదిరిగాడు. కుల్దీప్ (6)ను ఔట్ చేసిన హోల్డర్ తన ఖాతాలో ఐదో వికెట్ వేసుకోగా, ఉమేశ్ (2) కూడా నిలవలేదు. అయితే మరో ఎండ్‌లో అశ్విన్ (83 బంతుల్లో 35; 4 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. గాయం కారణంగా బౌలింగ్‌కు దూరమైన శార్దుల్ (4 నాటౌట్) బ్యాటింగ్‌కు వచ్చి అండగా నిలవడంతో అశ్విన్ మరికొన్ని పరుగులు జోడించాడు. 19 బంతుల వ్యవధిలో నాలుగు బౌండరీలు బాదిన అనంతరం గాబ్రియెల్ బౌలింగ్‌లో అశ్విన్ బౌల్డ్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెర పడింది. టపటపా... తొలి ఇన్నింగ్స్‌లో ప్రదర్శించిన స్ఫూర్తి, పట్టుదలను వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కొనసాగించలేకపోవడంతో ఆ జట్టు పతనం వేగంగా సాగింది. తొలి ఇన్నింగ్స్‌లో చివరి రెండు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్ మీద నిలిచిన ఉమేశ్ తొలి ఓవర్ తొలి బంతికి దానిని పూర్తి చేయలేకపోయినా... తర్వాతి బంతికే బ్రాత్‌వైట్ (0)ను వెనక్కి పంపించాడు. అనంతరం అశ్విన్ తన రెండో ఓవర్లో పావెల్ (0)ను ఔట్ చేశాడు. గత 18 ఏళ్లలో భారత గడ్డపై విదేశీ జట్టు ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ కావడం ఇదే తొలిసారి. అనంతరం కొద్దిసేపు పోరాడి నిలబడే ప్రయత్నం చేసిన హెట్మెయిర్ (17), హోప్ (28) ఐదు బంతుల వ్యవధిలో వెనుదిరిగారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఛేజ్ (6)ను ఉమేశ్ చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతో 68 పరుగులకు విండీస్ సగం వికెట్లు కోల్పోయింది. డౌరిచ్ (0) కూడా తొలి బంతికే వెనుదిరిగాక టీ విరామం వచ్చింది. ఆ తర్వాత ఆంబ్రిస్, హోల్డర్ (19) ఏడో వికెట్‌కు 38 పరుగులు జోడించి కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి విండీస్ 19 పరుగులకు చివరి 4 వికెట్లు కోల్పోయింది. అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. పృథ్వీ, రాహుల్ చకచకా పరుగులు సాధించారు. ముఖ్యంగా రాహుల్ కొంత ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. 12 పరుగుల వద్ద సబ్‌స్టిట్యూట్ వికెట్‌కీపర్ హామిల్టన్ సునాయాస స్టంపింగ్‌ను వృథా చేయకుండా ఉంటే భారత్ తొలి వికెట్ కోల్పోయేదే. ఆ తర్వాత భారత్ మరో అవకాశం ఇవ్వలేదు. నిర్ణీత సమయం ముగిసినా ఫలితం వచ్చే అవకాశం ఉండటంతో పొడిగించిన అదనపు సమయంలో టీమిండియా విజయాన్ని అందుకుంది. బిషూ బంతిని కవర్స్ దిశగా షా ఫోర్ కొట్టడంతో గెలుపు పరిపూర్ణమైంది. స్కోరు వివరాలు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311; భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) హోల్డర్ 4; పృథ్వీ షా (సి) హెట్మెయిర్ (బి) వారికెన్ 70; పుజారా (సి) సబ్–హామిల్టన్ (బి) గాబ్రియెల్ 10; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) హోల్డర్ 45; రహానే (సి) హోప్ (బి) హోల్డర్ 80; రిషభ్ పంత్ (సి) హెట్మెయిర్ (బి) గాబ్రియెల్ 92; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) హోల్డర్ 0; అశ్విన్ (బి) గాబ్రియెల్ 35; కుల్దీప్ యాదవ్ (బి) హోల్డర్ 6; ఉమేశ్ (సి) సబ్–హామిల్టన్ (బి) వారికెన్ 2; శార్దుల్ ఠాకూర్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (106.4 ఓవర్లలో ఆలౌట్) 367. వికెట్ల పతనం: 1–61, 2–98, 3–102; 4–162; 5–314; 6–314; 7–322; 8–334; 9–339; 10–367. బౌలింగ్: గాబ్రియెల్ 20.4–1– 107–3, హోల్డర్ 23–5–56–5, వారికెన్ 31–7–84–2, ఛేజ్ 9–1–22–0; బిషూ 21–4–78–0, బ్రాత్‌వైట్ 2–0–6–0. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (సి) పంత్ (బి) ఉమేశ్ 0; పావెల్ (సి) రహానే (బి) అశ్విన్ 0; హోప్ (సి) రహానే (బి) జడేజా 28; హెట్మెయిర్ (సి) పుజారా (బి) కుల్దీప్ 17; ఆంబ్రిస్ (ఎల్బీ (బి) జడేజా 38; ఛేజ్ (బి) ఉమేశ్ 6; డౌరిచ్ (బి) ఉమేశ్ 0; హోల్డర్ (సి) పంత్ (బి) జడేజా 19; బిషూ (నాటౌట్) 10; వారికన్ (బి) అశ్విన్ 7; గాబ్రియెల్ (బి) ఉమేశ్ 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (46.1 ఓవర్లలో ఆలౌట్) 127. వికెట్ల పతనం: 1–0; 2–6; 3–45; 4–45; 5–68; 6–70; 7–108; 8–109; 9–126; 10–127. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 12.1–3–45–4; అశ్విన్ 10–4–24–2; కుల్దీప్ 13–1–45–1; జడేజా 11–5–12–3. భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (నాటౌట్) 33; రాహుల్ (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 75. బౌలింగ్: హోల్డర్ 4–0–17–0; వారికన్ 4–0–17–0; బిషూ 4.1–0–19–0; ఛేజ్ 4–0–14–0. ► భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన మూడో భారత పేసర్ ఉమేశ్ యాదవ్. గతంలో జవగళ్ శ్రీనాథ్ (13/132 కోల్‌కతాలో పాకిస్తాన్‌పై 1999లో), కపిల్‌దేవ్ (రెండుసార్లు; 11/146 చెన్నైలో పాక్‌పై 1980లో; 10/135 అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌పై 1983లో) మాత్రమే ఈ ఘనత సాధించారు. ► స్వదేశంలో భారత్‌కిది వరుసగా (2013 నుంచి) పదో సిరీస్ విజయం. సొంతగడ్డపై అత్యధిక వరుస సిరీస్‌లు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా (రెండుసార్లు 10 చొప్పున; 1994–95 నుంచి 2000–01 వరకు; 2004 నుంచి 2008–09 వరకు) పేరిట ఉన్న రికార్డును భారత్ సమం చేసింది. ► వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన చివరి మూడు టెస్టు సిరీస్‌లలో అరంగేట్రం చేసిన భారత క్రికెటర్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. 2011లో అశ్విన్, 2013లో రోహిత్ ఈ ఘనత సాధించారు. ► అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు పొందిన పదో క్రికెటర్‌గా, భారత్ నుంచి నాలుగో క్రికెటర్‌గా పృథ్వీ షా గుర్తింపు పొందాడు. ► రాహుల్ ద్రవిడ్ తర్వాత (92, 93 శ్రీలంకపై 1997లో) వరుస ఇన్నింగ్స్‌లలో 90ల్లో ఔటైన రెండో భారత క్రికెటర్‌గా రిషభ్ పంత్ నిలిచాడు. ► భారత్‌పై భారత్‌లో ఒకే టెస్టులో అర్ధ సెంచరీ చేసి, ఐదు వికెట్లు కూడా తీసిన ఐదో విదేశీ పేస్ బౌలర్ జేసన్ హోల్డర్. గతంలో బ్రూస్ టేలర్ (న్యూజిలాండ్; కోల్‌కతాలో 1965); జాన్ లేవర్ (ఇంగ్లండ్; ఢిల్లీలో 1976); ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్; ముంబైలో 1980); మాల్కమ్ మార్షల్ (వెస్టిండీస్; కోల్‌కతాలో 1983) ఈ ఘనత సాధించారు. ► రవిశాస్త్రి (న్యూజిలాండ్‌పై వెల్లింగ్టన్లో 1981లో), కపిల్‌దేవ్ (ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో 1985లో) తర్వాత ఓ టెస్టులో నాలుగు బంతుల తేడాలో మూడు వికెట్లు తీసిన మూడో భారతీయ బౌలర్ ఉమేశ్ యాదవ్. హోల్డర్, పృథ్వీ షా-జడేజా సంబరం -
ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానుల గొడవ
-
జోరు కొనసాగాలి
-
జోరు కొనసాగాలి
ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్టు సిరీస్ విజయానికి దాదాపు చేరువైనట్లే. భారత జట్టు కూడా ఇప్పుడు ఇలాంటి పటిష్ట స్థితిలోనే ఉంది. తొలి రెండు వన్డేల్లో శ్రీలంకను చిత్తు చేసిన కోహ్లి సేన... అదే జోరు కొనసాగించి హైదరాబాద్‌లోనే సిరీస్ ఫలితాన్ని తేల్చేయాలనే ఉత్సాహంతో ఉంది. ఇక్కడే సిరీస్ గెలిస్తే.. చివరి రెండు వన్డేలకు కావలసినన్ని ప్రయోగాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సాక్షి, హైదరాబాద్: భారత్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడేందుకు అయిష్టంగానే వచ్చిన శ్రీలంక క్రికెటర్లు... ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా తమ స్థాయికి తగ్గ ఆటతీరు చూపించలేకపోయారు. బౌలింగ్ విభాగంలో కొత్త ముఖాలు కనిపిస్తున్నా... బ్యాటింగ్ లైనప్ మాత్రం దాదాపుగా ప్రపంచకప్ ఆడే జట్టుగానే కనిపిస్తోంది. అయినా వరుసగా రెండు వన్డేల్లో ఘోరంగా ఓడిపోయారు. ఇక ఇప్పుడు కోలుకోకపోతే... సిరీస్‌లో ఘోర పరాభవం తప్పదు. మరోవైపు ధోని లేకపోయినా కోహ్లి సారథ్యంలో యువ భారత్ కదం తొక్కుతూ మంచి ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య మూడో వన్డే ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరగనుంది. వరుసగా రెండు వన్డేల్లో ఘన విజయం సాధించిన భారత్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇద్దరే స్పిన్నర్లు ఈ మ్యాచ్ కోసం భారత్ బ్యాటింగ్ విభాగంలో మార్పులేం చేయకపోవచ్చు. ఓపెనర్లు రహానే, ధావన్ ఫామ్‌లోనే ఉన్నారు. రెండో వన్డేలో ఫస్ట్డౌన్లోకి ప్రమోట్ అయి సెంచరీ చేసిన రాయుడిని ఈ మ్యాచ్‌లోనూ ముందుగా బ్యాటింగ్‌కు పంపుతారో లేదో చూడాలి. సొంతగడ్డపై తొలిసారి వన్డే ఆడబోతున్న రాయుడు... మరోసారి రెండో వన్డే తరహాలో ఆడితే ఇక కెరీర్ గురించి నిశ్చింతగా ఉండొచ్చు. ఇక కోహ్లి, రైనా కూడా ఫామ్‌లోనే ఉన్నారు. అయితే వికెట్ కీపర్ సాహాకు ఇప్పటివరకూ అవకాశం రాలేదు. కాబట్టి సాహాను కూడా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక బౌలింగ్ విభాగంలో మాత్రం భారత్ ఓ మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో వికెట్ స్వభావం దృష్ట్యా ముగ్గురు స్పిన్నర్లతో ఆడారు. కానీ హైదరాబాద్ వికెట్‌ను చూస్తే ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఆడే అవకాశం ఉంది. కాబట్టి అక్షర్ పటేల్, జడేజాలలో ఒకరు బెంచ్ మీద కూర్చోవాలి. ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీలలో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇషాంత్, ఉమేశ్ ఇద్దరూ మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తుండటం భారత్‌కు సానుకూలాంశం. ఇప్పుడైనా కోలుకోవాలి శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు దిల్షాన్, పెరీరాలతో పాటు సీనియర్ బ్యాట్స్‌మన్ జయవర్ధనే కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడటం లేదు. సంగక్కర, మాథ్యూస్ మాత్రం ఫర్వాలేదనిపిస్తున్నారు. సంగక్కర, జయవర్ధనేలలో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడితేనే జట్టు మంచి స్కోరు చేయగలుగుతుంది. ఆల్‌రౌండర్లు మాథ్యూస్, తిసార పెరీరా ఏ నిమిషంలో అయినా ఫలితాన్ని మార్చగల సమర్థులు. బౌలింగ్ విభాగంలో మాత్రం లంక శిబిరంలో గందరగోళం కొనసాగుతోంది. మలింగ, హెరాత్ లేకుండా భారత్‌కు రావడం వల్ల ఆ జట్టు ఈ విభాగంలో బాగా బలహీనంగా కనిపిస్తోంది. పేసర్ కులశేఖర ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రహానే, ధావన్, రాయుడు, రైనా, సాహా, జడేజా / అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, అశ్విన్, ధావల్ / బిన్నీ శ్రీలంక: మాథ్యూస్ (కెప్టెన్), దిల్షాన్, జయవర్ధనే, కుశాల్ పెరీరా, సంగక్కర, ప్రసన్న, ప్రియాంజన్, తిషార పెరీరా, ప్రసాద్, రణ్దీవ్ / కులశేఖర, గమగే. పిచ్, వాతావరణం ఆరంభంలో కొద్దిగా బౌన్స్ ఉన్నా... క్రమంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా స్వభావం మారదు. మొత్తం మీద బ్యాటింగ్ వికెట్‌గానే చెప్పాలి. భారీస్కోరు ఆశించవచ్చు. సాధారణంగా హైదరాబాద్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండకపోయినా, ఈ సారి కాస్త ప్రభావం చూపొచ్చు. వాతావరణం మ్యాచ్‌కు అడ్డంకి కాబోదు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ‘ప్రతీ మ్యాచ్‌ను మేం నాకౌట్ మ్యాచ్‌లాగే భావిస్తాం. ప్రపంచకప్‌కు ముందు వేర్వేరు వ్యూహాలపై దృష్టి పెట్టాం. కాబట్టి ప్రత్యర్థి బలహీనంగా ఉందనే చర్చ అనవసరం. మా బలం తెలుసుకోవడమే ముఖ్యం. అయినా... మా జట్టుకు అన్ని రకాల పరిస్థితుల్లో, అన్ని రకాల బౌలింగ్ అటాక్‌లను ఎదుర్కోగల సామర్థ్యం ఉంది. అయితే మరీ ఎక్కువ ప్రయోగాలు చేయడం కాకుండా బాగా ఆడగలిగే 11 మందిని ఎంచుకోవడం కోసమే ఈ ప్రయత్నమంతా. సిరీస్‌లో ఆధిక్యం వచ్చినా మేం ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఆడాలని, భారీ విజయాలు సాధించాలనేదే మా ఆలోచన. రాయుడులో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. 50 ఓవర్ల పాటు ఆడి జట్టును గెలిపించగలడు. దానిని గుర్తించడమే మనం చేయాల్సింది. పదేళ్ల క్రితమే అతను ఇలాంటి ఇన్నింగ్స్ ఆడగలిగేవాడు. అందుకే అతను పరుగులు సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా రాయుడు బాగా ఆడగలడు. అతను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అవకాశం కల్పించాలి’ - విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
తడబడి... నిలబడి...
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మహారాష్ర్ట మొదట తడబడినా తర్వాత నిలబడింది. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయినా ఆ జట్టు కోలుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కర్ణాటకతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అంకిత్ బావ్నే (172 బంతుల్లో 89 బ్యాటింగ్; 10 ఫోర్లు) సెంచరీకి చేరువయ్యాడు. ఓపెనర్ చిరాగ్ ఖురానా (145 బంతుల్లో 64; 8 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఆట ముగిసే సమయానికి బావ్నేతో పాటు సంగ్రామ్ అతీత్కర్ (66 బంతుల్లో 29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. కర్ణాటక బౌలర్లలో మిథున్‌కు 2 వికెట్లు దక్కాయి. కట్టడి చేసిన బౌలర్లు టాస్ గెలిచిన మహారాష్ట్ర బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే ఇబ్బంది పడ్డ ఓపెనర్ హర్షద్ ఖడివాడే (15)ను వినయ్ ఎల్బీగా పంపడంతో మహారాష్ట్ర తొలి వికెట్ కోల్పోయింది. భారత అండర్-19 కెప్టెన్ జోల్ (5) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో ఖురానా, కేదార్ జాదవ్ (44 బంతుల్లో 37; 6 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్లిప్‌లో పాండే క్యాచ్ వదిలేయడంతో ఖురానా బతికిపోగా... ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన జాదవ్ దూకుడు ప్రదర్శించాడు. అయితే అంపైర్ సందేహాస్పద నిర్ణయంతో జాదవ్ పెవిలియన్ చేరడంతో మహారాష్ట్ర ఇబ్బందుల్లో పడింది. కీలక భాగస్వామ్యాలు లంచ్ విరామం తర్వాత క్రీజ్‌లో నిలదొక్కుకున్న ఖురానా 126 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించిన అనంతరం కరుణ్ నాయర్ బౌలింగ్‌లో ఖురానా నిష్ర్కమించాడు. మరో వైపు ఓపిగ్గా ఆడిన బావ్నే 102 బంతుల్లో అర్ధసెంచరీని చేరుకున్నాడు. టీ బ్రేక్ అనంతరం కెప్టెన్ మొత్వాని (17) అవుట్ కావడంతో 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే అతీత్కర్తో కలిసి బావ్నే మరో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. స్కోరు వివరాలు మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్: ఖడీవాలే (ఎల్బీడబ్ల్యూ బి) వినయ్ 15; ఖురానా (ఎల్బీడబ్ల్యూ బి) నాయర్ 64 ; జోల్ (సి) గౌతమ్ (బి) అరవింద్ 5; జాదవ్ (సి) గౌతమ్ (బి) మిథున్ 37; బావ్నే (బ్యాటింగ్) 89; మొత్వాని (సి) గౌతమ్ (బి) మిథున్ 17; అతీత్కర్ (బ్యాటింగ్) 29; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్లకు) 272. వికెట్ల పతనం: 1-24; 2-42; 3-90; 4-144; 5-215. బౌలింగ్: వినయ్ 23-5-56-1; మిథున్ 19-6-44-2; అరవింద్ 23-6-62-1; మనీశ్ పాండే 1-0-2-0; గోపాల్ 13-0-54-0; నాయర్ 5-1-21-1; వర్మ 4-0-14-0; గణేశ్ 2-0-8-0. ఆదరణ శూన్యం సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్లో అతి పెద్ద టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్‌ను తటస్థ వేదికలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బీసీసీఐని కూడా ఆలోచనలో పడేస్తుందేమో. రంజీ ఫైనల్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అదే తరహాలో ఉంది. మ్యాచ్ ఆరంభంలో పదుల సంఖ్యలో ఉన్న ప్రేక్షకులు ఆ తర్వాత కాస్త పెరుగుతూ వచ్చినా మొత్తంగా ఈ సంఖ్య దాదాపు 200కు మించి లేదు. ఒక స్కూల్ నుంచి 50 మంది విద్యార్థులు వచ్చినా కొద్ది సేపు తర్వాత వారంతా వెళ్లిపోయారు. ఫైనల్ చూడమంటూ హెచ్‌సీఏ ప్రవేశం కల్పించినా అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. తమ సొంత జట్టు లేకపోవడం, ఇరు జట్లలోనూ తెలిసిన ఆటగాళ్లు లేకపోవడమే ఇందుకు కారణం. దీనికన్నా ఇరు జట్లకు సంబంధించిన వేదికల్లో ఎక్కడైనా నిర్వహిస్తే కనీసం ఒక టీమ్ కోసమన్నా ప్రేక్షకులు మ్యాచ్‌కు వచ్చేవారు. ఐదుగురు సెలక్టర్లూ.... బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఐదుగురూ రంజీ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఫస్ట్ ఫ్లోర్‌లోని సీఎం బాక్స్ నుంచి వీరు మ్యాచ్‌ను తిలకించారు. బీసీసీఐ క్రికెట్ డెవలప్మెంట్ మేనేజర్ రత్నాకర్ షెట్టి కూడా ఫైనల్‌కు వచ్చారు. -
మహారాష్ట్ర కల నెరవేరుతుందా!
ఉ. గం. 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్ 2లో ప్రత్యక్ష ప్రసారం సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో స్వాతంత్య్రానికి పూర్వం రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచిన మహారాష్ట్రకు ఇప్పుడు మరోసారి అరుదైన అవకాశం లభించింది. అద్భుత ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించిన మరాఠా జట్టు తమ 72 ఏళ్ల కలను నెరవేర్చుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డనుంది. అయితే కర్ణాటక రూపంలో ఆ జట్టుకు పటిష్టమైన ప్రత్యర్థి ఎదురుగా ఉంది. ఈ ఏడాది కర్ణాటక తిరుగు లేని విజయాలు సాధించి ఫామ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం 2013-14 సీజన్ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు తెర లేవనుంది. ఇరు జట్లు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం. సమష్టిగా రాణింపు... మూడేళ్ల క్రితం ‘ప్లేట్’ గ్రూప్‌లో ఆడిన రాజస్థాన్ ఏకంగా రంజీ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు మహారాష్ట్ర కూడా అదే స్ఫూర్తితో టైటిల్‌పై దృష్టి పెట్టింది. గ్రూప్ ‘సి’లో అగ్ర స్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించిన ఆ జట్టు క్వార్టర్ ఫైనల్లో ముంబైపై సంచలన విజయంతో సత్తా చాటింది. ఆ తర్వాత సెమీస్‌లో బెంగాల్‌ను మూడు రోజుల్లోనే చిత్తు చేసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ప్రతీ ఆటగాడు చక్కగా రాణించడంతో జట్టుకు ఈ విజయాలు దక్కాయి. కేదార్ జాదవ్, ఖడీవాలే, విజయ్ జోల్ ఈ జట్టులో కీలక బ్యాట్స్‌మెన్. బౌలింగ్‌లో ఫలా, దరేకర్ రాణించడం కీలకం. 1992-93 సీజన్లో ఆఖరి సారిగా ఫైనల్‌కు చేరి పంజాబ్ చేతిలో పరాజయం పాలైన మహారాష్ట్ర ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగే బలం... మరో వైపు కర్ణాటక... అగ్రశ్రేణి జట్లు ఉన్న గ్రూప్ ‘ఎ’లో టాపర్‌గా నిలిచింది. లీగ్ దశలో పటిష్టమైన ముంబై, ఢిల్లీ, పంజాబ్‌లను చిత్తుగా ఓడించడం ఆ జట్టు ఫామ్‌కు నిదర్శనం. గతంలో ఆరు సార్లు రంజీ ట్రోఫీని గెలుచుకున్న కర్ణాటక ఆఖరిసారిగా 1998-99లో విజేతగా నిలిచింది. కర్ణాటక బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. కేఎల్ రాహుల్, మనీశ్ పాండే , కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడుతున్నారు. ఉతప్ప, గౌతమ్‌లతో జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. కెప్టెన్ వినయ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం మైదానంలోని మూడో వికెట్‌ను ఎంపిక చేశారు. ఆరంభంలో బౌన్స్, ఆ తర్వాత నెమ్మదిస్తూ ఐదు రోజుల పాటు నిలిచి ఫలితం వచ్చే ‘స్పోర్టింగ్ పిచ్’ను తీర్చిదిద్దినట్లు క్యురేటర్ వెల్లడించారు. ఇదే వికెట్‌పై జరిగిన హైదరాబాద్, కేరళ లీగ్ మ్యాచ్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. -
తొలి గెలుపుపై హైదరాబాద్ దృషి
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీని ఎప్పటిలాగే నిరాశాజనకంగా ప్రారంభించిన హైదరాబాద్ టీమ్ మరో పోరుకు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గురువారం నుంచి జరిగే గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో మహారాష్ట్రను హైదరాబాద్ ఎదుర్కొంటుంది. ఆడిన రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించిన హైదరాబాద్ 4 పాయింట్లతో ఈ గ్రూప్‌లో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు మహారాష్ట్ర ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఘన విజయం సాధించి ఉత్సాహంలో ఉంది. కెప్టెన్ విఫలం... గ్రూప్ ‘సి’లో తొలి రెండు స్థానాల్లో నిలిస్తేనే వచ్చే ఏడాది ప్రమోషన్ లభిస్తుంది. సొంతగడ్డపై ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం అందుకోలేకపోయిన హైదరాబాద్, ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాల్సి ఉంది. గత రెండు సీజన్లలో అద్భుతంగా ఆడి చాలెంజర్, దులీప్ ట్రోఫీల్లో కూడా పాల్గొన్న కెప్టెన్ అక్షత్ రెడ్డి విఫలం కావడం హైదరాబాద్‌ను కలవరపరుస్తోంది. అయితే మరో ఓపెనర్‌గా తిరుమలశెట్టి సుమన్ చెలరేగడం జట్టుకు అనుకూలాంశం. మిడిలార్డర్లో విహారి, సందీప్ కూడా నిలకడ ప్రదర్శిస్తున్నారు. బౌలింగ్‌లో రవికిరణ్ చక్కటి పేస్‌తో ఆకట్టుకుంటుండగా, ఆశిష్ రెడ్డి కూడా స్వింగ్‌తో వికెట్లు తీశాడు. అన్వర్ ఖాన్‌కు కూడా రంజీల్లో ఆడిన అనుభవం ఉన్నా...ఖాదర్‌కే తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జోల్‌పై దృష్టి... మరోవైపు మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌లో త్రిపురను చిత్తుగా ఓడించి ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. గత ఏడాది కాలంగా అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్న భారత అండర్-19 కెప్టెన్ విజయ్ జోల్ మహారాష్ట్ర తరఫున సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. తన తొలి రంజీ మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ చేసిన జోల్పైనే ఇప్పుడు జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధార పడింది. -
తొలి పోరుకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీలో గత ఏడాది ఘోర ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ ఈ సారైనా మెరుగైన ఆటతీరును కనబర్చాలని భావిస్తోంది. 2013-14 సీజన్లో భాగంగా నేటినుంచి జరిగే తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్, ఆంధ్ర జట్టుతో తలపడుతుంది. గత ఏడాది గ్రూప్ ‘ఎ’లో ఉన్న హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి గ్రూప్ ‘సి’కి పడిపోయింది. మరో వైపు ఆంధ్ర మాత్రం గ్రూప్ ‘సి’లోనే కొనసాగుతోంది. ఈ గ్రూప్‌లో అగ్ర స్థానంలో నిలిచే రెండు జట్లు మళ్లీ పై గ్రూప్‌కు వెళ్లేందుకు అర్హత సాధిస్తాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో విజయం సాధించి అవకాశాలు మెరుగు పర్చుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. యువ ఆటగాళ్లదే భారం... గత ఏడాది ఆడిన జట్టునుంచి కొందరు ఆటగాళ్లను తప్పించి కొత్త సీజన్ కోసం హైదరాబాద్ సెలక్టర్లు టీమ్‌ను ఎంపిక చేశారు. సీనియర్లలో రవితేజ, అహ్మద్ ఖాద్రీ మాత్రం తమ స్థానాలు నిలబెట్టుకోగలిగారు. గత మూడు సీజన్లు నిలకడగా రాణిస్తున్న కెప్టెన్ అక్షత్ రెడ్డి మరో సారి బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఇటీవల చాలెంజర్ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలో ఆడిన అక్షత్ పరిమిత అవకాశాల్లో కూడా ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్‌గా తిరుమలశెట్టి సుమన్ పునరాగమం చేశాడు. మిడిలార్డర్లో విహారి, సందీప్ కీలకం కానున్నారు. దూకుడైన బ్యాటింగ్‌తో గత ఏడాది అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన ఆశిష్ రెడ్డి మరో సారి ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. బౌలింగ్‌లో సీవీ మిలింద్, ఖాదర్ రూపంలో ఇద్దరు లెఫ్టార్మ్ పేసర్లు ఉన్నారు. ముఖ్యంగా యువ కెరటం మిలింద్ ఇటీవల భారత అండర్-19 జట్టు సభ్యుడిగా ఆస్ట్రేలియా, శ్రీలంకలలో చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఇప్పటి వరకు దేశవాళీ వన్డేలు, టి20 మ్యాచ్‌లు ఆడిన మిలింద్, తొలి సారి రంజీ ట్రోఫీ బరిలోకి దిగనున్నాడు. జట్టులో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడని ఆటగాడు అతనొక్కడే. భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ మ్యాచ్ బరిలోకి దిగుతుండటం జట్టు బౌలింగ్‌ను పటిష్టం చేసింది. భుయ్ అవుట్... మరో వైపు ఆంధ్ర జట్టులో ఎక్కువ మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఉన్న అమోల్ మజుందార్ ఆ జట్టు బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. షాబుద్దీన్, విజయ్ కుమార్, ప్రదీప్, బోడ సుమంత్‌లు జట్టులోని ఇతర సీనియర్లు. ఇటీవలే భారత యువ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన కుర్రాడు రికీ భుయ్ గాయంతో మ్యాచ్‌కు దూరం కావడం ఆంధ్ర బ్యాటింగ్‌ను బలహీనం చేసింది. ప్రశాంత్ కుమార్, బాషా బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. జట్ల వివరాలు హైదరాబాద్: అక్షత్ రెడ్డి (కెప్టెన్), ప్రజ్ఞాన్ ఓజా, సుమన్, విహారి, సందీప్, సందీప్ రాజన్, రవితేజ, అహ్మద్ ఖాద్రీ, ఆశిష్ రెడ్డి, అమోల్ షిండే, హబీబ్ అహ్మద్ (వికెట్ కీపర్), సీవీ మిలింద్, రవికిరణ్, ఎంఏ ఖాదర్, ఆకాశ్ భండారి. ఆంధ్ర: ఏజీ ప్రదీప్ (కెప్టెన్), ప్రశాంత్ కుమార్ (వైస్ కెప్టెన్), మురుముళ్ల శ్రీరామ్, శ్రీకార్ భరత్ (వికెట్ కీపర్), కాకాని హరీశ్, సయ్యద్ షాబుద్దీన్, దువ్వారపు శివకుమార్, బోడపాటి సుమంత్, పైడికాల్వ విజయ్ కుమార్, షేక్ బాషా, అమోల్ మజుందార్, శంకరరావు, చీపురుపల్లి స్టీఫెన్, మర్రిపురి సురేశ్. -
ఫైనల్లో ఢిల్లీ, తమిళనాడు
సాక్షి, హైదరాబాద్: మొయినుద్దౌలా గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు సెమీస్‌లోనే వెనుదిరిగింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఢిల్లీ జట్టు తుదిపోరుకు అర్హత సంపాదించింది. చివరి రోజు ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మూడో రోజు ఆటలో ఢిల్లీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీ స్కోరు చేసింది. మిలింద్ కుమార్ (74 బంతుల్లో 101 నాటౌట్, 10 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు సెంచరీ చేశాడు. మోహిత్ శర్మ (60 బంతుల్లో 57, 4 ఫోర్లు), పునీత్ బిస్త్ (44 బంతుల్లో 60, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్, ప్రజ్ఞాన్ ఓజా, ఆశిష్ రెడ్డి తలా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 4 పరుగులు కలుపుకొని ఆతిథ్య హైదరాబాద్ ముందు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షంతో ఆట నిలిచే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 3.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఢిల్లీ 387, హైదరాబాద్ 383/8 స్కోరు చేశాయి. మరోసారి ఫైనల్‌కు తమిళనాడు డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు... ఢిల్లీతో అమీతుమీకి సిద్ధమైంది. కర్ణాటకతో జరిగిన రెండో సెమీస్‌లో తమిళనాడు జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఈసీఐఎల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి రోజు కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 38.4 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ (104 బంతుల్లో 102, 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. తమిళ బౌలర్లు రాహిల్ షా, రోహిత్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత 238 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు వర్షంతో ఆట నిలిచే సమయానికి 3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో కర్ణాటక 387, తమిళనాడు 392 పరుగులు చేశాయి. ఫైనల్ మ్యాచ్ 10 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.