సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టులో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇప్పటికే చెన్నైకు చేరుకున్న టీమిండియా, బంగ్లా జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి.
వారిద్దరికి నో ఛాన్స్..
ఇక బంగ్లాతో తొలి టెస్టుకు భారత తుది జట్టులో యువ ఆటగాళ్లు ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్‌లకు చోటు దక్కే సూచనలు కన్పించడం లేదు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రావడంతో వీరిద్దరూ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఈవార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. మా ఆఖరి టెస్టు సిరీస్ ఇంగ్లండ్‌తో ఆడినప్పుడు చాలా మంది సీనియర్ ఆటగాళ్లు గాయం కారణంగా దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొత్త ఆటగాళ్లకు జట్టులో చోటు లభించింది.
బహుశా ఇప్పుడు కొంతమంది యువ ఆటగాళ్లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవచ్చు. కానీ కచ్చితంగా వారికి ముందుముందు అవకాశాలు లభిస్తాయి అని రోహిత్ పేర్కొన్నాడు. దీంతో జురెల్, సర్ఫరాజ్‌లకు దాదాపుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లేనిట్లే.
కాగా వీరిద్దరూ తమ అరంగేట్ర సిరీస్‌లో అదరగొట్టారు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జురెల్, సర్ఫారాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కానీ సీనియర్ ఆటగాళ్లు అందరూ ఇప్పుడు అందుబాటులో ఉండడంతో వీరిద్దరూ తుది జట్టులో చోటు కోసం వేచి చూడక తప్పదు.
చదవండి: వారు ముగ్గురు ఒక అద్బుతం.. కొంచెం కూడా భయం లేదు: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment