Ranji Trophy 2023-24: రంజీ ట్రోఫీ-2024 సీజన్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
మరోవైపు.. భారత యువ ఓపెనర్ పృథ్వీ షా గాయం నుంచి కోలుకోని కారణంగా అతడికి ఈ జట్టులో చోటు దక్కలేదు. మోకాలి నొప్పితో బాధపడుతున్న పృథ్వీ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.
అదే విధంగా.. గత ఎడిషన్‌లో ముంబై తరఫున ఆడిన టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఈసారి జట్టుతో లేరు. యశస్వి టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉండగా.. సూర్య చీలమండ గాయంతో ఆటకు విరామం ఇచ్చాడు.
ఇక సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ముగించుకుని తిరిగి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండేలతో పాటు గత సీజన్‌లో ఆడిన శివం దూబే సువేద్ పార్కర్, షామ్స్ ములాని, ధవళ్ కులకర్ణి ఈసారి కూడా ముంబై తరఫున మరోసారి బరిలోకి దిగనున్నారు.
బిహార్‌తో తొలి మ్యాచ్
రంజీ ట్రోఫీ-2024లో భాగంగా ముంబై తమ తొలి మ్యాచ్‌లో బిహార్‌తో తలపడనుంది. జనవరి 5న జరుగనున్న ఈ టెస్టు మ్యాచ్‌కు పాట్నాలోని మొయిన్ ఉల్ హక్ స్టేడియం ఇందుకు వేదిక. ఇక జనవరి 12 నాటి రెండో మ్యాచ్‌లో ముంబై ఆంధ్ర జట్టును ఢీకొట్టనుంది.
39 టైటిళ్లు సాధించిన ఘనత
దేశవాళీ టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు జరిగిన 88 రంజీ ఎడిషన్లలో 39సార్లు విజేతగా నిలిచిన జట్టుగా ముంబైకి గొప్ప రికార్డు ఉంది. అయితే, 2014 నుంచి ఇప్పటి దాకా ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేదన్న వెలితి అలాగే ఉండిపోయింది.
గత సీజన్‌లో రహానే సారథ్యంలో ఆడిన ముంబై.. ఎలైట్ గ్రూప్ బిలో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచింది. నాకౌట్స్‌కు కూడా అర్హత సాధించలేక చతికిలపడింది. అయితే, ఈసారి ఎలాగైనా ఆ అడ్డంకిని అధిగమించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. రంజీల్లో సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయాలని రహానే భావిస్తున్నాడు.
రంజీ ట్రోఫీ-2024 తొలి రెండు మ్యాచ్‌లకు ముంబై జట్టు:
అజింక్య రహానె (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, సువేద్ పార్కర్, షామ్స్ ములాని, హార్దిక్ తామోర్(వికెట్ కీపర్), ప్రసాద్ పవార్(వికెట్ కీపర్), జే బిస్టా, భూపేన్ లల్వానీ, తనూష్ కొటియాన్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, ధవళ్ కులకర్ణి, రాయ్‌స్టన్ డయాస్, అథర్వ అంకోలేకర్.
చదవండి: కోహ్లికి బౌలింగ్ చేయడం చాలా కష్టం.. లిస్టులో సచిన్ కూడా! కానీ..
Comments
Please login to add a commentAdd a comment