Ind vs Eng 3rd Test: తొలిరోజు టీమిండియాదే.. కానీ ఆ ఒక్కటే! | Ind vs Eng 3rd Test Day 1: Toss, Playing XI Updates And Highlights - Sakshi
Sakshi News home page

Ind vs Eng: మూడో టెస్టు అప్‌డేట్స్‌.. తొలిరోజు టీమిండియాదే.. కానీ ఆ ఒక్కటే!

Published Thu, Feb 15 2024 9:31 AM | Last Updated on Thu, Feb 15 2024 5:18 PM

Ind vs Eng 3rd Test Rajkot Day 1: Toss Playing XI Updates And Highlights - Sakshi

India vs England 3rd Test 2024- 3rd Test Day 1 Updates: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. గురువారం నాటి ఆట పూర్తయ్యేసరికి 86 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 326 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(131), ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(110- నాటౌట్‌) శతకాలతో మెరిశారు.

అయితే, అరంగేట్ర బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ మెరుపు హాఫ్‌ సెంచరీతో మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాడు. కానీ దురదృష్టవశాత్తూ జడేజాతో సమన్వయలోపం కారణంగా రనౌట్‌ అయ్యాడు. 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(10), శుబ్‌మన్‌ గిల్‌(0), రజత్‌ పాటిదార్‌(5) పూర్తిగా నిరాశపరిచారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో పేసర్‌ మార్క్‌ వుడ్‌ మూడు వికెట్లు తీయగా.. స్పిన్నర్‌ టామ్‌ హార్లేకు ఒక వికెట్‌ దక్కింది. మొత్తానికి మూడో టెస్టు తొలి రోజు ఆటలో ఆరంభంలో టీమిండియా తడబడినా.. రోహిత్‌, జడ్డూ, సర్ఫరాజ్‌ ఇన్నింగ్స్‌ కారణంగా పుంజుకుని ఆధిపత్యం కనబరిచిందని చెప్పవచ్చు. జడ్డూ 110, కుల్దీప్‌ యాదవ్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

జడేజా సెంచరీ
రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియా స్కోరు: 315-5(82). కుల్దీప్‌ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నాడు.

సర్ఫరాజ్‌ రనౌట్‌.. ఐదో వికెట్‌ డౌన్‌
81.5: జడ్డూతో సమన్వయ లోపం కారణంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. 66 బంతుల్లోనే 62 పరుగులు చేసి జోష్‌లో ఉన్న అతడు నిరాశగా పెవిలియన్‌ చేరాడు. కుల్దీప్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు.

అరంగేట్రంలోనే హాఫ్‌ సెంచరీ
సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రంలో అదరగొట్టాడు. 48 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్కు అందుకున్నాడు.

సర్ఫరాజ్‌ ఖాన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌
అరంగేట్ర బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. 45 బంతుల్లోనే 7 ఫోర్ల సాయంతో 43 పరుగులు సాధించి అర్ధ శతకానికి చేరువయ్యాడు. మరోవైపు.. జడ్డూ 95 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 291/4 (76)

 66 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 242-4
జడేజా 86, సర్ఫరాజ్‌ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు.

రోహిత్‌ శర్మ అవుట్‌
63.3: ‍సెంచరీ వీరుడు రోహిత్‌ శర్మ(131) రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.‍ అరంగేట్ర బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ క్రీజులోకి వచ్చాడు.

సెంచరీ పూర్తి చేసిన రోహిత్‌ శర్మ 
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చాలాకాలం తర్వాత టెస్ట్‌ల్లో సెంచరీ చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో హిట్‌మ్యాన్‌ 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో 11వ సెంచరీ పూర్తి చేశాడు. హిట్‌మ్యాన్‌తో పాటు జడేజా (68) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్‌ స్కోర్‌ 190/3గా ఉంది.

టీ బ్రేక్‌ సమయానికి టీమిండియా స్కోరు: 185/3 (52)
రోహిత్‌ శర్మ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండగా.. జడేజా 68 పరుగులతో ఆడుతున్నాడు.

జడ్డూ హాఫ్‌ సెంచరీ
గాయం కారణంగా జట్టుకు దూరమై మూడో టెస్టుతో తిరిగి వచ్చిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అర్ధ శతకంతో మెరిశాడు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను ఆదుకునే క్రమంలో విలువైన యాభై పరుగులు జత చేశాడు.

టెస్టుల్లో అతడికి 21వ ఫిఫ్టీ. ఈ క్రమంలో తనదైన శైలిలో కత్తిసాము చేస్తున్నట్లుగా సెలబ్రేడ్‌ చేసుకున్నాడు జడ్డూ. రోహిత్‌ 79 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 150/3 (44)

వందకు పైగా పరుగుల భాగస్వామ్యం
33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆదుకుంటున్నారు. తొలి రోజు 41 ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్‌ 77, జడ్డూ 47 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.

నిలకడగా ఆడుతున్న రోహిత్‌, జడ్డూ 
రోహిత్‌ శర్మ 53, రవీంద్ర జడేజా 39 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. స్కోరు: 111/3 (32)

 సెంచరీ కొట్టిన టీమిండియా
రోహిత్‌ శర్మ 52, రవీంద్ర జడేజా 31 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరి మెరుగైన భాగస్వామ్యం కారణంగా టీమిండియా వంద పరుగుల మార్కును అందుకుంది. స్కోరు: 100-3(26)

లంచ్‌ బ్రేక్‌
రోహిత్‌ శర్మ 52, రవీంద్ర జడేజా 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: : 93/3 (25)

రోహిత్‌ శర్మ అర్ధ శతకం
22.5: టామ్‌ హార్లే బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి భారత సారథి రోహిత్‌ శర్మ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌ 51, జడ్డూ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 81-3(23).

టీమిండియా హాఫ్‌ సెంచరీ
13.2: ఆండర్సన్‌ బౌలింగ్‌ రవీంద్ర జడేజా ఒక పరుగు తీయడంతో.. టీమిండియా 50 పరుగుల మార్కు అందుకుంది. జడ్డూ 4, రోహిత్‌ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ డౌన్‌
8.5: రజత్‌ పాటిదార్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ టామ్‌ హార్లీ బౌలింగ్‌లో.. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రజత్‌ అవుటయ్యాడు. రోహిత్‌ శర్మ 17, రవీంద్ర జడేజా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు:  33-3(9)

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌
5.4: ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ టీమిండియాను మరోసారి దెబ్బకొట్టాడు. భారత వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను అవుట్‌ చేశాడు. ఫలితంగా టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న గిల్‌ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. రజత్‌ పాటిదార్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 24/2 (6)

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
3.5: యశస్వి జైస్వాల్‌ రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ జో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 10 బంతులు ఎదుర్కొన్న యశస్వి 10 పరుగులు చేసి మైదానం వీడాడు. శుబ్‌మన్‌ గిల్‌ క్రీజులోకి వచ్చాడు. 4 ఓవర్లలో భారత్‌ స్కోరు: 22-1

మొదటి ఓవర్లో భారత్‌ స్కోరు:  6-0
రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ టీమిండియా ఇన్నింగ్స్‌ ఆరంభించారు.

వాళ్లిద్దరి అరంగేట్రం
టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టు మొదలైంది. రాజ్‌కోట్‌ వేదికగా గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. ఈ టెస్టు ద్వారా ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, ఉత్తరప్రదేశ్‌ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు.

తుదిజట్లు:
టీమిండియా:
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజత్ పాటీదార్‌, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement