Seeing Rohit Sharma "Pyaar Sa Aata Hai": ‘‘రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఐపీఎల్‌లోనూ తొమ్మిది- పదేళ్ల పాటు ఆడాను. దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటికీ ఆడుతూనే ఉన్నా. అయితే, అన్నింటితో పోలిస్తే రోహిత్ భయ్యా కెప్టెన్సీలో ఆడటం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆయన మంచి కప్టెన్. ఆయన పట్ల నాకు ఆరాధనా భావం ఉంది.
జట్టులో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాడు. టీమ్ మీటింగ్ జరుగుతున్నపుడు రోహిత్ భయ్యా మాట్లాడటం చూస్తుంటే నాకు ఆమిర్ ఖాన్ సినిమా ‘లగాన్’ గుర్తుకువస్తూ ఉంటుంది’’ అని టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు.
ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా ముంబై స్టార్ సర్ఫరాజ్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రాజ్‌కోట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఈ రంజీ వీరుడు.. మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లలోనూ భాగమై మరో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.
ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో తన అనుబంధం, నాయకుడిగా అతడు వ్యవహారశైలి గురించి తాజాగా ఆజ్‌తక్‌తో మాట్లాడాడు సర్ఫరాజ్ ఖాన్. ‘‘రోహిత్ భయ్యా మమ్మల్ని మరీ ఎక్కువగా ఏం తిట్టడు. కాకపోతే సరైన సమయంలో సరైన విధంగా ఆడేలా కాస్త గట్టిగానే హెచ్చరిస్తాడు.
మాట్లాడటంలో ప్రతి ఒక్కరికి తమదైన స్టైల్ ఉంటుంది. రోహిత్ భయ్యా సరాదాగా అన్న మాటల్ని కూడా కొందరు వేరే విధంగా అనుకుంటారు. నాకైతే ఆయన మమ్మల్ని తిట్టినట్లు అనిపించదు. ముంబైవాళ్లంతా అలాగే మాట్లాడతారు.
ఆటగాళ్లతో రోహిత్ భయ్యా ఎంతో కలుపుగోలుగా ఉంటారు. తను సీనియర్, కెప్టెన్ అన్నట్లుగా వ్యవహరించరు’’ అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా గత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సర్ఫరాజ్‌ను ఆ ఫ్రాంఛైజీ విడిచిపెట్టగా.. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.
చదవండి: IPL 2024: అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం?
Comments
Please login to add a commentAdd a comment