Ind vs Eng: టీమిండియా ఘన విజయం.. సిరీస్‌ 4-1తో సొంతం | India vs England 5th Test Day 3 Dharamshala Updates And Highlights | Sakshi
Sakshi News home page

Ind vs Eng: టీమిండియా ఘన విజయం.. సిరీస్‌ 4-1తో సొంతం

Published Sat, Mar 9 2024 9:31 AM | Last Updated on Sat, Mar 9 2024 2:05 PM

India vs England 5th Test Day 3 Dharamshala Updates And Highlights - Sakshi

India vs England 5th Test Day 3 Updates:

టీమిండియా ఘన విజయం
ధర్మశాల వేదికగా  ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్‌ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌.. 195 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జో రూట్‌(84) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ధర్మశాలలో 473/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో భారత్‌ శనివారం నాటి ఆట మొదలుపెట్టింది.

ఇక భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. భారత​ తొలి ఇన్నింగ్స్‌లో 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. 

45.5: తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
జడేజా బౌలింగ్‌లో షోయబ్‌ బషీర్‌(13) బౌల్డ్‌. స్కోరు: 189/9 (45.5). ఆండర్సన్‌ క్రీజులోకి వచ్చాడు. రూట్‌ 78 పరుగులతో ఆడుతున్నాడు.

  రూట్‌ అర్ధ శతకం
36.2: బుమ్రా బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న జో రూట్‌

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
34.4: బుమ్రా బౌలింగ్‌లో మార్క్‌ వుడ్‌(0) ఎల్బీడబ్ల్యూ. ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌. షోయబ్‌ బషీర్‌ క్రీజులోకి వచ్చాడు.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
34.2: టామ్‌ హార్లే(20) రూపంలో ఇంగ్లండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. మార్క్‌వుడ్‌క్రీజులోకి వచ్చాడు. రూట్‌ 44 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 141/7 (34.3)

ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
26.4: అశ్విన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయిన బెన్‌ ఫోక్స్‌(8). ఫలితంగా ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 113/6 (26.4). టామ్‌ హార్లే క్రీజులోకి వచ్చాడు. రూట్‌ 36 పరుగులతో ఆడుతున్నాడు.

టీమిండియా కంటే 146 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్‌
26 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 113/5

భోజన విరామ సమయానికి ఇంగ్లండ్‌ స్కోరు: 103/5 (22.5)
జో రూట్‌ 34 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే ఇంగ్లండ్‌ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది.

అశ్విన్‌ తిప్పేస్తున్నాడు.. ఐదో వికెట్‌ డౌన్‌
22.5: అశ్విన్‌ బౌలింగ్‌ స్టోక్స్‌(2) బౌల్డ్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 

17.4: నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
దూకుడుగా ఆడుతున్న బెయిర్‌ స్టోకు భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కళ్లెం వేశాడు. వికెట్ల ముందు అతడిని దొరకబుచ్చుకుని పెవిలియన్‌కు సాగనంపాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన బెయిర్‌ స్టో రివ్యూకు వెళ్లగా.. ఫలితం అతడికి అనుకూలంగా రాలేదు. స్కోరు: 94-4(18). బెన్‌ స్టోక్స్‌ క్రీజులోకి వచ్చాడు.

నిలకడగా బెయిర్‌ స్టో, రూట్‌ ఇన్నింగ్స్‌
17 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 90/3. బెయిర్‌ స్టో, రూట్‌ నిలకడగా ఆడుతుండటంతో ఇంగ్లండ్‌ తిరిగి పుంజుకుంది. బెయిర్‌ స్టో 28 బంతుల్లో 38 పరుగులతో ‘బజ్‌బాల్‌’ క్రికెట్‌ ఆడుతున్నాడు.

దూకుడుగా ఆడుతున్న బెయిర్‌ స్టో
వందో టెస్టు వీరుడు బెయిర్‌ స్టో దూకుడుగా ఆడుతున్నాడు. 15వ ఓవర్‌ ముగిసే సరికి 21 బంతుల్లో 26 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జో రూట్‌ 25 బంతుల్లో 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

9.2: మూడో వికెట్‌ డౌన్‌
అశ్విన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన కాసేపటికే బెన్‌ డకెట్‌(2)ను అవుట్‌ చేసిన అశూ.. అనంతరం మరో ఓపెనర్‌ క్రాలే(1)ను కూడా వెనక్కి పంపాడు.

తాజాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒలీ పోప్‌(19) రూపంలో మూడో వికెట్‌ కూడా తానే దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. స్కోరు:  41-3(10) . రూట్‌ 12, బెయిర్‌ స్టో ఒక పరుగుతో ఆడుతున్నారు.

5.3: రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
అశ్విన్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన క్రాలే(1). జో రూట్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 23-2(6). పోప్‌ 17 పరుగులతో ఆడుతున్నాడు.

1.5: తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
అశ్విన్‌ బౌలింగ్లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(2) బౌల్డ్‌. స్కోరు:  2-1. ఒలీ పోప్‌ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్‌ క్రాలే సున్నా పరుగులతో ఉన్నాడు.

టీమిండియా ఆలౌట్‌
మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే ఇంగ్లండ్‌ లెజెండరీ పేసర్‌ కుల్దీప్‌ యాదవ్‌(30)ని వెనక్కి పంపగా.. షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా(20) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడో రోజు ఆటలో.. ఓవర్‌నైట్‌ స్కోరుకు కేవలం నాలుగు పరుగులు మాత్రమే జత చేసి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ ముగించింది.

124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఫలితంగా ఇంగ్లండ్‌ కంటే 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్పిన్నర్లలో షోయబ్‌ బషీర్‌ అత్యధికంగా ఐదు వికెట్లు దక్కించుకోగా..  టామ్‌ హార్లే రెండు వికెట్లు తీశాడు. ఇక పేసర్లు జేమ్స్‌ ఆండర్సన్‌ రెండు, కెప్టెన్‌ స్టోక్స్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. 

ఇక గురువారం నాటి తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్‌ 218 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలుచుకుంది.

124.1: టీమిండియా ఆలౌట్‌
జస్‌ప్రీత్‌ బుమ్రా రూపంలో భారత్‌ ఆఖరి వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌  షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో బుమ్రా స్టంపౌట్‌ అయ్యాడు. ఫలితంగా  477 (124.1) స్కోరు వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇంగ్లండ్‌ మీద 259 పరుగలు ఆధిక్యం సంపాదించింది.

123.4: తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
మూడో రోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ టీమిండియాకు షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో నైట్‌ వాచ్‌మన్‌ కుల్దీప్‌ యాదవ్‌(30) వికెట్‌ కీపర్‌క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 477/9 (124). బుమ్రా 20, సిరాజ్‌ సున్నా పరుగులతో ఉన్నారు.

►ఇదిలా ఉంటే.. జేమ్స్‌ ఆండర్సన్‌కు ఇది 700వ టెస్టు వికెట్‌ కావడం విశేషం.

రెండో రోజు ఆటలో హైలైట్స్‌
►తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 473/8(120 ఓవర్లలో)  
►రోహిత్ శర్మ(103), శుబ్‌మన్‌ గిల్‌(110) సెంచరీలు 
►రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్‌ ఆధిక్యం 255 పరుగులు  
►అరంగేట్రంలో రాణించిన దేవ్‌దత్‌ పడిక్కల్(65)
►సర్ఫరాజ్‌ ఖాన్‌ మెరుపు అర్ధ శతకం(56)

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ ఐదో టెస్టు- ధర్మశాల- తుదిజట్లు
ఇండియా
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, దేవ్‌దత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్‌ బుమ్రా.

ఇంగ్లండ్‌
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్లే, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement