ధర్మశాల వేదికగా టీమిండియాతో జరగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ క్రాలే మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఓవరాల్‌గా 108 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో క్రాలీ 79 పరుగులు చేశాడు. అయితే 61 పరుగుల వద్ద క్రాలే ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం వల్ల క్రాలే బతికిపోయాడు.
ఏం జరిగిందంటే?
లంచ్ విరామం తర్వాత కుల్దీప్ యాదవ్ 26 ఓవర్ పూర్తి చేసేందుకు బౌలింగ్ ఎటాక్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో ఆ ఓవర్‌లో ఐదో బంతిని క్రాలే డౌన్ లెగ్ వైపు ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎక్కువగా టర్న్ అయ్యి బ్యాట్, ప్యాడ్‌కు దగ్గరకు వెళ్తూ వికెట్ కీపర్ దిశగా వెళ్లింది. అయితే బంతిని ధ్రువ్ జురెల్ సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు.
కానీ బంతి జురెల్ గ్లౌవ్‌కు తాకి కాస్త గాల్లోకి లేవగా.. షార్ట్ లెగ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ డైవ్ చేస్తూ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. వెంటనే సర్ఫరాజ్‌తో పాటు భారత ఆటగాళ్లు క్యాచ్‌కు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. వెంటనే సర్ఫరాజ్ పూర్తి నమ్మకంతో రివ్యూ తీసుకోమని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించాడు.
రోహిత్ మాత్రం వికెట్ కీపక్ ధ్రువ్ జురెల్ సలహా తీసుకున్నాడు. జురెల్ బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తాకిందని చెప్పడంతో రోహిత్ రివ్యూకు వెళ్లలేదు. కానీ తర్వాత రిప్లేలో మాత్రం బంతి క్లియర్‌గా బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది. ఇది చూసిన రోహిత్ ఎంత పనిపోయిందని అన్నట్లు నవ్వుతూ రియాక్షన్ ఇచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా నేను చెప్పా కదా భయ్యా అన్నట్లు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Team India missed out on a big chance, but the skipper made sure that the feels were positive.
— R.Sport (@republic_sports) March 7, 2024
ROHIT SHARMA IS A MOOD! 🤣
Watch Till End#INDvsENG #TeamIndia #RohitSharma pic.twitter.com/DGUJcobu8G
Comments
Please login to add a commentAdd a comment