బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దుమ్ములేపుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్ఫరాజ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
నాలుగో రోజు ఆటలో సర్ఫరాజ్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో శతకాన్ని పూర్తి చేశాడు. వన్డే తరహాలో కివీస్ బౌలర్లపై ఈ ముంబైకర్ విరుచుకుడపడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నిప్పులు చేరిగిన మాట్ హెన్రీని సైతం సర్ఫరాజ్ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో నిప్పులు చేరిగిన మాట్ హెన్రీని సైతం సర్ఫరాజ్ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. రిషబ్ పంత్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ను సర్ఫరాజ్ ముందుకు నడిపిస్తున్నాడు. సర్ఫరాజ్ 106 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇక 62 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. భారత్ ఇంకా 85 పరుగుల వెనకంజలో ఉంది.
SARFARAZ KHAN HAS ARRIVED IN INTERNATIONAL CRICKET...!!! 🥶
- Maiden Test century at over 90 Strike Rate is simply crazy! 🤯pic.twitter.com/Vdo6JXAGA5— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2024
Comments
Please login to add a commentAdd a comment