
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో టీమిండియా వైట్‌వాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. కివీస్ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు సైతం కివీస్ బౌలర్ల ముందు తేలిపోయారు.
ఫలితంగా స్వదేశంలో తొలిసారి మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్ అయ్యి ఘోర ఆప్రతిష్టతను భారత జట్టు మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రోహిత్ సేనకు కీలక సూచనలు చేశాడు. భారత బ్యాటర్లు మెరుగుపడడానికి నిరంతరం ప్రాక్టీస్ చేయడం ఒక్కటే మార్గమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.
రూమ్‌లో కూర్చుంటే కుదరదు..
"క్రికెట్ బేసిక్స్‌కి తిరిగి వెళ్లండి. ప్రాక్టీస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టండి. అంతే తప్ప రూమ్‌లో కూర్చుని మెరుగవుతామంటే కుదరదు. ప్రస్తుతం మీకు గడ్డుకాలం నడుస్తోంది. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచిది" అని క్రికెట్ నెక్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
కాగా కివీస్ టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నద్దమవుతోంది. వచ్చే వారం ఆస్ట్రేలియాకు రోహిత్ సేన పయనం కానుంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు
రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
Comments
Please login to add a commentAdd a comment