టీ20 వరల్డ్‌కప్-2024 విజయనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిలు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ టీ20లకు విడ్కోలు పలికినప్పటకి.. పొట్టి ఫార్మాట్‌లో తమకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరచుకున్నారు.
టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరూ టాప్-2లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో 'రోకో' ద్వయంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20ల్లో విరాట్, రోహిత్ స్ధానాలను ఎవరూ భర్తీ చేయలేరని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.
టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల స్ధానాలను ఎవరూ భర్తీ చేయలేరు. టీ20ల్లో మాత్రం కాదే ఇతర ఫార్మాట్‌లో కోహ్లి, రోహిత్ లాంటి ఆటగాళ్లు మరి రారు. భారత క్రికెట్‌కు చాలా ఏళ్ల నుంచి వారు తమ సేవలను అందిస్తున్నారు. నిజంగా ఇది వారికి ఘనమైన విడ్కోలు. కానీ టీ20ల్లో వారిద్దరి లేని కచ్చితంగా భారత జట్టులో కన్పిస్తోంది.
సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనిల మాదిరిగానే వీరిద్దరి పేర్లు కూడా భారత క్రికెట్ చిరస్మణీయంగా నిలిచిపోతాయని ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
కాగా టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత విరాట్, రోహిత్ ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీలంక పర్యటనకు వీరిద్దరి అందుబాటుపై ఇంకా సందిగ్థం నెలకొంది. శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment