Ind vs Ban: చెన్నై చేరుకున్న రోహిత్‌, కోహ్లి( వీడియో) | Rohit Sharma And Virat Kohli Arrived In Chennai Before IND Vs BAN Tests, Watch Videos Goes Viral | Sakshi
Sakshi News home page

BAN vs IND: బంగ్లాతో తొలి టెస్టు.. చెన్నైకు చేరుకున్న రోహిత్‌, కోహ్లి

Published Fri, Sep 13 2024 11:50 AM | Last Updated on Fri, Sep 13 2024 3:47 PM

Rohit Sharma, Virat Kohli arrive in Chennai before IND vs BAN Tests

భార‌త్ - బంగ్లాదేశ్ మ‌ధ్య‌ టెస్టు సిరీస్ ప్రారంభానికి ఇంకా ఆరు రోజుల స‌మయం మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 19 నుంచి మొద‌లు కానుంది.

ఈ మ్యాచ్ కంటే ముందు చెపాక్‌లో ఏర్పాటు ఐదు రోజుల పాటు ప్రీట్రైనింగ్ క్యాంపులో భార‌త జ‌ట్టు పాల్గోనుంది. ఈ క్ర‌మంలో ఒక్కొక్క‌రుగా భార‌త ఆట‌గాళ్లు చెన్నైకు చేరుకుంటున్నారు. బంగ్లా క్రికెట్ జ‌ట్టు సైతం శ‌నివారం భార‌త గ‌డ్డ‌పై అడుగుపెట్టే అవ‌కాశ‌ముంది.

భార‌త జ‌ట్టుతో చేరిన రోహిత్‌, కోహ్లి..
ఇక నెల రోజుల సుదీర్ఘ విరామం త‌ర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ద‌మ‌య్యారు. వీరిద్ద‌రూ శుక్ర‌వారం చెన్నైలోని భారత జట్టుతో చేరారు.

 రోహిత్ ముంబై నుంచి చేరుకోగా..విరాట్ లండన్ నుంచి వచ్చాడు. వీరిద్దరూ చెన్నై ఎయిర్ పోర్ట్‌లో కన్పించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరోవైపు టీ20 వరల్డ్‌కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా సైతం తొలి టెస్టు కోసం భారత జట్టుతో చేరారు.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్‌), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా , అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు బంగ్లా జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్‌), మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, హసన్ మహ్మద్,  ఖలీద్ అహ్మద్, జాకర్ అలీ అనిక్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement