వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం తన స్పిన్ మయాజాలం ప్రదర్శించిన భజ్జీ.. ఇండియాకు తొట్ట తొలి టైటిల్‌ను అందించాడు.
అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్భజన్‌కు ఓ మహిళా ప్రేజేంటర్ నుంచి ఓ అనూహ్య ప్రశ్న ఎదురైంది. వరల్డ్ క్రికెట్‌లో టాప్ త్రీ బ్యాటర్లను ఎంచుకోమని ఆమె భజ్జీని ప్రశ్నించింది. ఈ క్రమంలో హార్భజన్ ప్రస్తుతం తరంలోని ఒక్క క్రికెటర్‌కు కూడా తన టాప్ త్రీలో చోటు ఇవ్వలేదు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కల్లిస్‌ను తన వరల్డ్ టాప్ త్రీ బ్యాటర్లగా భజ్జీ ఎంచుకున్నాడు. అయితే భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు భారత్‌కు రెండు వరల్డ్‌కప్ టైటిల్స్‌ను అందించిన ధోనిని కూడా హార్భజన్ ఎంపిక చేయకపోవడం గమనార్హం.
మరో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా తన టాప్-3 బ్యాటర్లలో విరాట్ కోహ్లి, రోహిత్ , ధోనిలకు చోటు ఇవ్వలేదు. అతడు కూడా సర్ వివియన్ రిచర్డ్స్, టెండూల్కర్, లారాలను తన టాప్-3 బ్యాటర్లగా ఎంచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment