
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సత్తాచాటాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్‌లో రోహిత్ శర్మ ఆరో స్ధానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023లో అదరగొడుతున్న రోహిత్.. ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆఫ్గానిస్తాన్‌పై సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్.. పాకిస్తాన్‌పై కూడా 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ నేపథ్యంలోనే రోహిత్ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. కాగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని తొలిసారి రోహిత్ అధిగమించాడు. కోహ్లి ప్రస్తుతం 9వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
ఇక నెం1 ర్యాంక్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఉండగా.. రెండో స్ధానంలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ నిలిచాడు. అదే విధంగా ఈ మెగా టోర్నీలో రెండు వరుస సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్ధానాలు ఎగబాకి 3వ స్ధానానికి చేరుకున్నాడు.
చదవండి: Netherlands Cricket: అనలిస్ట్‌లు లేరు, పరిమిత కిట్‌లు కూడా లేవు.. అయినా నిరుత్సాహపడలేదు
Comments
Please login to add a commentAdd a comment