rohitsharma
-
'రూమ్‌లో కూర్చుంటే కుదరదు'. భారత ప్లేయర్లపై కపిల్‌దేవ్ ఫైర్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో టీమిండియా వైట్‌వాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. కివీస్ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు సైతం కివీస్ బౌలర్ల ముందు తేలిపోయారు.ఫలితంగా స్వదేశంలో తొలిసారి మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్ అయ్యి ఘోర ఆప్రతిష్టతను భారత జట్టు మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రోహిత్ సేనకు కీలక సూచనలు చేశాడు. భారత బ్యాటర్లు మెరుగుపడడానికి నిరంతరం ప్రాక్టీస్ చేయడం ఒక్కటే మార్గమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.రూమ్‌లో కూర్చుంటే కుదరదు.."క్రికెట్ బేసిక్స్‌కి తిరిగి వెళ్లండి. ప్రాక్టీస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టండి. అంతే తప్ప రూమ్‌లో కూర్చుని మెరుగవుతామంటే కుదరదు. ప్రస్తుతం మీకు గడ్డుకాలం నడుస్తోంది. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచిది" అని క్రికెట్ నెక్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు.కాగా కివీస్ టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నద్దమవుతోంది. వచ్చే వారం ఆస్ట్రేలియాకు రోహిత్ సేన పయనం కానుంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టురోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
సత్తాచాటిన రోహిత్ శర్మ, జైశ్వాల్.. టాప్ 10 లోకి
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు.. ఇప్పుడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ టాప్ 10లోకి దూసుకొచ్చారు. హిట్‌మ్యాన్ ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకోగా..జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వీరిద్దరితో పాటు ధర్మశాల టెస్టులో సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్ సైతం తన కెరీర్లో బెస్ట్ ర్యాంక్‌ను పొందాడు. 11 స్ధానాలు ఎగబాకి 20వ ర్యాంక్‌కు గిల్ చేరుకున్నాడు. ఇక టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం వరుసగా రెండు మూడు స్దానాల్లో నిలిచారు. ఇక ఇది ఇలా ఉండగా.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో నిలిచాడు. బుమ్రాను వెనుక్కి నెట్టి అశ్విన్ టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. చదవండి: #David Miller: మూడు మ్యాచ్‌లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్ -
ఏంటి రోహిత్ ఇది..? యువ స్పిన్నర్ ట్రాప్‌లో చిక్కుకున్న హిట్‌మ్యాన్
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ అరంగేట్ర స్పిన్నర్ షోయబ్ బషీర్ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 18 ఓవర్లో బషీర్ ప్లాన్‌గా లెగ్ స్లిప్ ఫీల్డర్‌ను పెట్టుకుని మరి రోహిత్‌కు బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో తొలి రెండు బంతులను డిఫెన్స్ ఆడిన హిట్‌మ్యాన్.. మూడో బంతిని లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి అనుహ్యంగా టర్న్ అయ్యి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని లెగ్ స్లిప్ ఫీల్డర్ ఒలీ పోప్ చేతికి వెళ్లింది. దీంతో చేసేదేమి లేక రోహిత్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. బషీర్‌కు ఇదే తొలి టెస్టు వికెట్ కావడం గమనార్హం. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి టెస్టులో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చదవండి: Ind vs Eng 2nd Test: ‘ఇంత అన్యాయమా.. ఇంకెలా ఆడితే ఛాన్స్ ఇస్తారు?’ Selfless captain Rohit Sharma 🔥#IndvsEng #INDvsENGTest pic.twitter.com/s5oRj4vyL1 — Shivam 🚩 (@Shivam_pal_18) February 2, 2024 -
సౌతాఫ్రికాను ఓడించడం అంత ఈజీ కాదు.. కానీ మా జట్టులో: రోహిత్ శర్మ
భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్టు కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. ఈ సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. దక్షిణాఫ్రికా పిచ్‌లపై బౌలర్ల ఆధిపత్యం గురించి రోహిత్ మాట్లాడాడు. 'సఫారీ పిచ్‌లు పేసర్లకు అనూకూలంగా ఉంటాయి. బౌన్స్ ఎక్కువగా ఉండే వికెట్‌పై ఫాస్ట్ బౌలర్లు తమ ఆధిపత్యం చెలాయిస్తారు. మ్యాచ్ జరుగుతున్న కొద్ది పిచ్‌పై పగుళ్లు(క్రాక్స్) వల్ల బ్యాటర్లకు మరింత కష్టమవుతోంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు మొత్తం పిచ్ ఒకేలా ఉంటుంది. 5 రోజులూ బంతి బౌన్స్ అవుతూనే ఉంటుంది. మ్యాచ్‌లో ప్రతీ రోజు బౌలర్లను ఎదుర్కొడం బ్యాటర్లకు ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. అయితే మాకు గతంలో ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. ప్రస్తుతం జట్టులో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రోటీస్ క్వాలిటి బౌలింగ్ ఎటాక్‌పై పై చేయి సాధించడం అంత ఈజీ కాదు. కానీ ఇటువంటి పరిస్ధితుల్లోనే అద్భుతమైన పోరాట పటిమ కనబరిచి విజయం సాధిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఏం చేయాలో, ఎలా ఆడాలో మేము చర్చించుకున్నాం. అదే విధంగా టెస్టుకు సిద్దం కావడానికి మాకు చాలా సమయం లభించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" ప్రీ మ్యాచ్ కాన్ఫిరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా తొలిసారి మైదానంలో అడుగుపెట్టనున్నారు. -
కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను ముంబై ఫ్రాంచైజీ యాజమన్యం తప్పించింది. అతడి స్ధానంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు తమ జట్టు పగ్గాలు అప్పగించింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వాత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏకంగా 5 ఐపీఎల్ టైటిల్స్‌ను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ముంబై ఇండియన్స్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. "షేమ్ ఆన్ ముంబై ఇండియన్స్"(#ShameOnMI) అనే హ్యాష్‌ట్యాగ్‌ను తెగ ట్రేండ్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ప్రకటించిన కొన్ని గంటలలోపే ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియాలో భారీగా తమ ఫాలోవర్లను ముంబై ఫ్రాంచైజీ కోల్పోయింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్(ట్విటర్)లో ముంబై అధికారిక పేజిని 4 లక్షల మంది అన్‌ఫాలో చేశారు. అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 1.5 లక్షల మంది ఫాలోవర్లను ముంబై ఇండియన్స్ కోల్పోయింది. రోహిత్ ను విపరీతంగా అభిమానించే అభిమానులు ముంబై జట్టును అన్ ఫాలో కొట్టడంతో ఇప్పుడు ఆ జట్టు బ్రాండ్ వాల్యూ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన -
'అందుకే రోహిత్‌ను తప్పించాం.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు'
ముంబై ఇండియన్స్‌లో ఒక శకం ముగిసింది. ముంబైను ఐదు సార్లు చాంపియన్స్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. ఇకపై ఒక సాధరణ ఆటగాడిగానే కొనసాగనున్నాడు. ఐపీఎల్- 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తప్పించింది. అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టు కొత్త నాయకుడిగా ముంబై నియమించింది. ఇక కెప్టెన్సీ మార్పుపై ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మహేలా జయవర్ధనే స్పందించాడు. 2024 సీజన్ నుంచే హార్దిక్‌కు కెప్టెన్సీ అప్పగించాలని తాము భావించినట్లు ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మహేలా జయవర్ధనే తెలిపాడు. ‘ఎప్పుడైనా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ముంబై ఇండియన్స్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది కూడా అందులో భాగమే. రోహిత్‌తో పాటు గతంలోనూ సచిన్, హర్భజన్, పాంటింగ్ కెప్టెన్లగా జట్టును సమర్థంగా నడిపించడంతో పాటు ముందు చూపుతోనూ వ్యవహరించారు. వచ్చే సీజన్ నుంచే హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు అత్యుత్తమ ఫలితాలు సాధించింది. అతని నాయకత్వ పటిమకు మా అభినందనలు. ఐపీఎల్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా రోహిత్ అనుభవం మైదానంలోనూ, మైదానం బయటా జట్టుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అని జయవర్ధనే ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన రోహిత్ శర్మ.. కోహ్లిని వెనక్కి నెట్టి
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సత్తాచాటాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్‌లో రోహిత్ శర్మ ఆరో స్ధానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023లో అదరగొడుతున్న రోహిత్.. ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆఫ్గానిస్తాన్‌పై సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్.. పాకిస్తాన్‌పై కూడా 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. కాగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని తొలిసారి రోహిత్ అధిగమించాడు. కోహ్లి ప్రస్తుతం 9వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక నెం1 ర్యాంక్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఉండగా.. రెండో స్ధానంలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ నిలిచాడు. అదే విధంగా ఈ మెగా టోర్నీలో రెండు వరుస సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్ధానాలు ఎగబాకి 3వ స్ధానానికి చేరుకున్నాడు. చదవండి: Netherlands Cricket: అనలిస్ట్‌లు లేరు, పరిమిత కిట్లు కూడా లేవు.. అయినా నిరుత్సాహపడలేదు -
బంగ్లాదేశ్‌పై టీమిండియా ఉత్కంఠ విజయం.. ఫోటోలు
-
దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. ఆర్ష్‌దీప్ సింగ్‌కు ఏమైంది?
ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, యువ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ దూరమయ్యారు. టాస్ సమయంలో రోహిత్ మాట్లాడుతూ.. "మేము ముందుగా ఫీల్డింగ్ చేయబోతున్నాం. ఇండోర్ హై స్కోరింగ్ గ్రౌండ్. ఇక ఈ మ్యాచ్‌లో మేము మూడు మార్పులతో ఆడనున్నాం. విరాట్, రాహుల్‌కు విశ్రాంతి ఇచ్చాం. ఈ మ్యాచ్‌కు అర్ష్‌దీప్ సింగ్ కూడా దూరమయ్యాడు. అర్ష్‌దీప్ కొంచెం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది ఏమి కాదు. కేవలం ముందుజాగ్రత్తగా మాత్రమే అతడికి విశ్రాంతి ఇచ్చాం. అయ్యర్, ఉమేష్, సిరాజ్‌లు జట్టులోకి వచ్చారు" అని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఇదే టీమిండియాకు అఖరి టీ20 మ్యాచ్. చదవండి: IND vs SA: రోహిత్ శర్మతో ఫోటో దిగిన డీసీపీ.. ఏంటి అరెస్ట్ చేశారా? -
'ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వద్దు.. అతడినే రోహిత్ జోడిగా పంపండి'
టీ20 ప్రపంచకప్-2022కు ముందు భారత్ మరో మెగా టోర్నీకు సిద్దమవుతోంది. ఆగస్టు 27 నుంచి జరగనున్న ఆసియాకప్‌లో టీమిండియా పాల్గొనుంది. ఇప్పటికే ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గత కొంత కాలంగా జట్టుకు దూరమైన భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో భారత ఓపెనింగ్ సమస్య తీరినట్టే అని చెప్పుకోవాలి. కాగా గాయం కారణంగా రాహుల్ జట్టుకు దూరం కావడంతో గత కొన్ని సిరీస్‌ల నుంచి భారత్ పలు ఓపెనింగ్ జోడీలను ప్రయోగించింది. అందులో భాగంగానే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో రోహిత్ జోడిగా సూర్యకుమార్ యాదవ్ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. అయితే ఓపెనర్‌గా సరికొత్త అవతారమెత్తిన సూర్య పర్వాలేదనపించాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన సూర్య 135 పరుగులు సాధించాడు. ఇది ఇలా ఉండగా.. రాహుల్ జట్టులోకి వచ్చినప్పటికీ రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "ఆసియాకప్‌లో రోహిత్ శర్మ జోడిగా సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగాలని నేను భావిస్తున్నాను. అతడు విండీస్ సిరీస్‌లో రోహిత్ కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చినప్పటికీ.. అతడు మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తే బాగుటుంది. రాహుల్ ఏ స్థానంలోనైనా అద్భుతంగా రాణించగలడు. అతడు గతంలో చాలా సార్లు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం మనం చూశాం. కాబట్టి రోహిత్‌తో కలిసి సూర్యకుమార్ టీమిండియా ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే బాగుటుంది" అని పేర్కొన్నాడు. కాగా రాహుల్ ప్రస్తుతం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించడంతో జింబాబ్వే సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ -
India vs Sri Lanka 2nd Test : శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా
-
సిరాజ్‌కు ప్రమోషన్.. ఇకపై ఎంత జీతం అంటే!
ముంబై: భారత స్టార్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా బీసీసీఐ కొత్తగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో కూడా ‘ఎ’ ప్లస్’ గ్రేడ్‌లోనే కొనసాగనున్నారు. వీరికి బోర్డు ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లిస్తుంది. అయితే ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న టెస్టు స్పెషలిస్ట్‌లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మల స్థాయి తగ్గిస్తూ బోర్డు ‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు)లోకి మార్చింది. ఈ ముగ్గురు టెస్టు జట్టులో స్థానం కోల్పోయారు. గాయాలతో వరుసగా మ్యాచ్‌లకు దూరమవుతున్న హార్దిక్ పాండ్యా, వన్డేలకే పరిమితమైన శిఖర్ ధావన్‌లను కూడా ‘ఎ’ నుంచి తప్పించి ‘సి’లో (రూ. 1 కోటి) పడేశారు. దాంతో ‘ఎ’ గ్రేడ్‌లో (రూ. 5 కోట్లు) ఐదుగురు ఆటగాళ్లు అశ్విన్, జడేజా, పంత్, రాహుల్, షమీ మాతమ్రే మిగిలారు. మయాంక్, సాహాలను కూడా ‘బి’ నుంచి ‘సి’కి మార్చారు. టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడంతో పాటు పరిమిత ఓవర్ల జట్లలో కూడా చోటు దక్కించుకున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్ లభించింది. ఇప్పటి వరకు ‘సి’లో ఉన్న అతడిని గ్రేడ్ ‘బి’లోకి తీసుకున్నారు. హనుమ విహారి ‘సి’లోనే కొనసాగనున్నాడు. 27 మందితో రూపొందించిన ఈ కాంట్రాక్ట్ జాబితానుంచి కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలను పూర్తిగా తప్పించారు. మరోవైపు మహిళా క్రికెటర్లలో హర్మన్, స్మృతి, పూనమ్ యాదవ్ ఉన్న గ్రూప్ ‘ఎ’ (రూ.50 లక్షలు)లోకి దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌లను తీసుకొని ప్రమోషన్ ఇచ్చారు. జెమీమా ‘బి’ నుంచి ‘సి’ (రూ. 10 లక్షలు)లోకి పడిపోయింది. మిథాలీ, జులన్ గ్రూప్ ‘బి’ (రూ. 30 లక్షలు)లో కొనసాగనున్నారు. చదవండి: Womens ODI World Cup 2022: ప్రపంచ కప్ సమరానికి సై.. భారత్ తొలి మ్యాచ్‌లోనే.. -
శ్రీలంకకు పయనమైన భారత జట్టు
ముంబై: ముక్కోణపు టి20 టోర్నీలో పాల్గొనేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఆదివారం శ్రీలంక బయల్దేరి వెళ్లింది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్... శ్రీలంకతో తలపడనుంది. మూడు జట్లు ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫైనల్ సహా ఈ మ్యాచ్‌లన్నిటికీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియమే వేదిక కానుంది. -
టీమిండియా క్లీన్‌స్వీప్
-
ఫ్యామిలీతో క్రీడాకారుల దివాలి సెలబ్రేషన్స్