
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ అరంగేట్ర స్పిన్నర్ షోయబ్ బషీర్ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 18 ఓవర్‌లో బషీర్ ప్లాన్‌గా లెగ్ స్లిప్ ఫీల్డర్‌ను పెట్టుకుని మరి రోహిత్‌కు బౌలింగ్ చేశాడు.
ఆ ఓవర్‌లో తొలి రెండు బంతులను డిఫెన్స్ ఆడిన హిట్‌మ్యాన్.. మూడో బంతిని లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి అనుహ్యంగా టర్న్ అయ్యి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని లెగ్ స్లిప్ ఫీల్డర్ ఒలీ పోప్ చేతికి వెళ్లింది. దీంతో చేసేదేమి లేక రోహిత్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.
బషీర్‌కు ఇదే తొలి టెస్టు వికెట్ కావడం గమనార్హం. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి టెస్టులో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
చదవండి: Ind vs Eng 2nd Test: ‘ఇంత అన్యాయమా.. ఇంకెలా ఆడితే ఛాన్స్ ఇస్తారు?’
Selfless captain Rohit Sharma 🔥#IndvsEng #INDvsENGTest pic.twitter.com/s5oRj4vyL1
— Shivam 🚩 (@Shivam_pal_18) February 2, 2024