Shoaib Bashir
-
ఒకే ఓవర్లో 38 పరుగులు
ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ కౌంటీ క్రికెట్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఒకే ఓవర్లో 38 పరుగులు సమర్పించుకుని కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్‌గా ఘోర అపఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1లో భాగంగా సర్రేతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్సెస్టర్‌షైర్‌కు ఆడుతూ ఈ అపవాదును తన ఖాతాలో వేసుకున్నాడు.బషీర్ వేసిన ఇన్నింగ్స్ 128వ ఓవర్లో సర్రే బ్యాటర్ డాన్ లార్సెన్ తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదాడు. అనంతరం ఆరో బంతికి వైడ్ల రూపంలో ఐదు పరుగులు.. ఆతర్వాతి బంతి నో బాల్.. చివరి బంతికి రెండు పరుగులు రావడంతో మొత్తంగా ఈ ఓవర్లో 38 పరుగులు వచ్చాయి. కౌంటీ చరిత్రలో ఓ సింగిల్ ఓవర్లో ఇన్ని పరుగులు రావడం ఇది రెండోసారి. 1998 సీజన్లో అలెక్స్ ట్యూడర్ కూడా ఓ ఓవర్లో 38 పరుగులు సమర్పించుకున్నాడు. నాడు ట్యూడర్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ 34 పరుగులు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సర్రే తొలుత బ్యాటింగ్ చేసింది. డాన్ లారెన్స్ (175) భారీ సెంచరీతో.. డామినిక్ సిబ్లీ (76), జేమీ స్మిత్ (86), బెన్ ఫోక్స్ (52) అర్దసెంచరీలతో రాణించడంతో సర్రే తొలి ఇన్నింగ్స్‌లో 490 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వార్సెస్టర్‌షైర్ రెండో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జేక్ లిబ్బీ (61), బెన్ అల్లీసన్ (19) క్రీజ్‌లో ఉన్నారు. -
ఏంటి బషీర్ ఇది..? బౌల్డ్ అయితే రివ్యూనా? వీడియో వైరల్
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా ఘనంగా ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ యువ ఆటగాడు షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డ్ అయినప్పటికి రివ్యూ కావాలని అడగడం అందరని ఆశ్చర్యపరిచింది. అసలేం జరిగిందంటే? ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఆఖరి బంతికి షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే బషీర్ తను బౌల్డ్ కాకుండా వికెట్ కీపర్‌కు దొరికిపోయానని భావించి రివ్యూ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రివ్యూ కావాలని సిగ్నల్ ఇచ్చాడు. కానీ నాన్ స్ట్రైక్‌లో ఉన్న జోరూట్ ఒక్కసారిగా నవ్వుతూ బౌల్డయ్యావని బషీర్‌తో చెప్పాడు. ఇది చూసిన భారత ఆటగాళ్లు సైతం నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బాబు బషీర్ బౌల్డ్లకు రివ్యూలు ఉండవు అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2024: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం..!? View this post on Instagram A post shared by TNT Sports (@tntsports) -
అందుకే ఓవరాక్షన్ చేయకూడదు.. అక్కడ ఉన్నది రోహిత్! వీడియో వైరల్
ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను భారత బ్యాటర్లు ఓ ఆట ఆడేసుకున్నారు. తొలి రోజు ఆటలో బషీర్‌కు యశస్వీ జైశ్వాల్ చుక్కలు చూపించగా.. రెండో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ టార్గెట్ చేశాడు. అయితే బషీర్‌ను హిట్‌మ్యాన్ టార్గెట్ చేయడానికి ఓ కారణముంది. తొలి రోజు ఆటలో జైశ్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం బషీర్ ఓవరాక్షన్ చేశాడు. షోయబ్ సెలబ్రేషన్స్ చేసుకునే క్రమంలో జైశ్వాల్ వైపు కళ్లు పెద్దవిగా చేసి చూస్తూ సీరియస్‌గా ఏదో అన్నాడు. అప్పుడు నాన్‌స్ట్రైక్‌లో ఉన్న రోహిత్ శర్మ కాస్త సీరియస్‌గా రియాక్షన్ ఇచ్చాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆట ఆరంభంలోనే బషీర్‌కు హిట్‌మ్యాన్ చుక్కలు చూపించాడు. 32 ఓవర్ వేసిన బషీర్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ వరుసగా సిక్స్, ఫోర్ బాది.. యువ స్పిన్నర్‌ను ఒత్తడిలోకి నెట్టాడు. దెబ్బకు షీర్ తన చేతులను తలపై వేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హిట్‌మ్యాన్‌తో పెట్టుకుంటే అలానే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా రోహిత్ ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. Rohit Sharma having Shoaib Bashir in the breakfast. Shoiab Bashir must be thinking why he was granted Visa 😅pic.twitter.com/oWz45xRffA — Sujeet Suman (@sujeetsuman1991) March 8, 2024 -
ఎందుకంత ఓవరాక్షన్ బాబు.. నీకు రోహిత్ చేతిలో ఉందిలా! వీడియో వైరల్
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో జైశ్వాల్ చెలరేగాడు. కేవలం 58 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఓవరాక్షన్ చేశాడు. ఏమి జరిగిందంటే? తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. స్పిన్నర్ బషీర్‌ను ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో బషీర్‌కు తన తొలి ఓవర్లోనే జైశ్వాల్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన బషీర్ బౌలింగ్‌లో యశస్వీ మూడు సిక్స్‌లు బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. అంతటితో ఆగకుండా తర్వాతి ఓవర్లలో కూడా బషీర్‌ను జైశ్వాల్ టార్గెట్ చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ బషీర్ బౌలింగ్‌లోనే జైశ్వాల్ ఔటయ్యాడు. 20 ఓవర్ వేసిన బషీర్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన జైశ్వాల్ తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. బంతిని అంచనా వేయడంలో కాస్త విఫలమైన యశస్వీ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో బషీర్ సెలబ్రేషన్స్ శృతిమించాయి. జైశ్వాల్ వైపు కళ్లు పెద్దవిగా చేసి చూస్తూ సీరియస్‌గా ఎదో అన్నాడు. జైశ్వాల్ మాత్రం అతడిని పట్టించుకోకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. కానీ నాన్ స్ట్రైక్‌లో ఉన్న రోహిత్ శర్మ మాత్రం ఎందుకు అంత ఓవరాక్షన్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు అరే బషీర్ నీకు మా రోహిత్ చేతిలో ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/Z3RCeCQJ5d — Virat Kohli (@CricUpdates123) March 7, 2024 -
'మాకు ఓ అశ్విన్ దొరికేశాడు.. అతడొక సూపర్ స్టార్'
ధర్మశాల వేదికగా భారత్‌తో ఐదో టెస్టులో తలపడేందుకు ఇంగ్లండ్ సిద్దమవుతోంది. విజయంతో ఇండియా టూర్‌ను ముగించాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ 3-1తో సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ మాత్రం అందరని అకట్టుకున్నాడు. రాంఛీ టెస్టులో బషీర్ 8 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలో బషీర్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో బషీర్‌ను వాన్ పోల్చాడు. "ఇంగ్లండ్ జట్టుకు మరో వరల్డ్ క్లాస్ సూపర్‌స్టార్ దొరికాడు. అతడే యువ సంచలనం షోయబ్ బషీర్ . అతడి కెరీర్లో తన రెండో టెస్టులోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా 8 వికెట్టు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును భయపెట్టాడు. వరల్డ్ క్రికెట్లో మరో అశ్విన్ పుట్టుకొచ్చాడు. మాకు ఓ అశ్విన్ దొరికినందుకు సెలబ్రేషన్స్ జరపుకుంటున్నామునజ ఇక ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని భావిస్తున్నా. మా జట్టు అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగాలి. ధర్మశాల వాతావారణం ఇంగ్లండ్ జట్టుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇంగ్లండ్‌కు గెలిచే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. భారత్ మాత్రం తమ జట్టులో కొన్ని మార్పులు చేసే ఛాన్స్ ఉందని ఓ యూట్యాబ్ ఛానల్లో వాన్ పేర్కొన్నాడు. చదవండి: #BCCI: 'అతడొక లీడింగ్ వికెట్ టేకర్.. అయినా కాంట్రాక్ట్ నుంచి' -
Day 2: చెలరేగిన ఇంగ్లండ్ స్పిన్నర్లు.. ఆదుకున్న జైస్వాల్
India vs England, 4th Test Day 2 Score: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలిరోజు ఆటలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో చెలరేగగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అయితే, జో రూట్ రాకతో సీన్ మారిపోయింది. ‘బజ్‌బాల్’ కాన్సెప్ట్నకుకు విరుద్ధంగా అచ్చమైన సంప్రదాయ క్రికెట్ ఆడుతూ రూట్ అజేయ సెంచరీతో చెలరేగిన కారణంగా.. తొలి రోజు ఇంగ్లండ్ తిరిగి పుంజుకోగలిగింది. ఆట పూర్తయ్యే సరికి 300 పరుగుల మార్కు దాటేసింది.ఈ క్రమంలో 302/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టి 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవరాల్‌గా భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. 𝙅𝙖𝙖𝙙𝙪𝙞 𝙅𝙖𝙙𝙙𝙪 weaving magic with the ball 🪄 Three quick wickets helped #TeamIndia bowl out the visitors early! 💪🏻#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/iiWyPgAn4C — JioCinema (@JioCinema) February 24, 2024 ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సర్ ఆదిలోనే షాకిచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మను 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత యువ బౌలర్ షోయబ్ బషీర్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. పాక్ మూలాలున్న ఈ రైటార్మ్ స్పిన్నర్ దెబ్బకు శుబ్‌మన్ గిల్(38), రజత్ పాటిదార్(17) లెగ్ బిఫోర్ వికెట్లుగా వెనుదిరిగారు. ఇక జట్టును ఆదుకుంటాడనుకున్న రవీంద్ర జడేజా(12)ను కూడా బషీరే పెవిలియన్‌కు పంపడం గమనార్హం. Bashir breaks the crucial partnership between Gill and Jaiswal! 🥲 #INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/hCKcWdJq5A — JioCinema (@JioCinema) February 24, 2024 ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అర్ధ శతకం పూర్తి చేసుకుని దానిని సెంచరీగా మలిచే ప్రయత్నం చేయగా.. బషీర్ అద్బుత రీతిలో అతడి బౌల్డ్ చేశాడు. దీంతో 73 పరుగులకే జైస్వాల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 ఇక సర్ఫరాజ్ ఖాన్(14), రవిచంద్రన్ అశ్విన్(1)లను మరో స్పిన్నర్ టామ్ హార్లే పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఈ క్రమంలో జైస్వాల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, అశూ స్థానంలో వచ్చిన కుల్దీప్ యాదవ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట ముగిసే టీమిండియా 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుబడి ఉంది. చేతిలో ఇంకా మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఆట పూర్తయ్యే సరికి జురెల్ 30, కుల్దీప్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ టీమిండియాపై పైచేయి సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. చదవండి: బంతితో చెలరేగిన బషీర్.. అంతకంటే ముందు సర్ఫరాజ్‌కు షాకిచ్చాడిలా! Kuldeep Yadav spinning surprises with both bat & ball! 🤩#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSport pic.twitter.com/D7hDjNf04x — JioCinema (@JioCinema) February 24, 2024 -
సర్ఫరాజ్‌కు షాకిచ్చిన బషీర్.. ఊహించలేదు కదా!
టీమిండియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఇంగ్లండ్ బౌలర్ షోయబ్ బషీర్. సర్రేలో జన్మించిన 20 ఏళ్ల ఈ రైటార్మ్ స్పిన్నర్ మూలాలు మాత్రం పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత గడ్డపై సిరీస్ ఆడేందుకు వచ్చే క్రమంలో వీసా సమస్యలు ఎదుర్కొన్నా.. ఎట్టకేలకు ఇండియాలో అడుగుపెట్టాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో వికెట్ల ఖాతా తెరిచిన బషీర్.. తన తొలి మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. అయితే, మూడో టెస్టులో మార్క్‌వుట్ ఎంట్రీ కారణంగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అతడు.. రాంచి మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా శుబ్‌మన్ గిల్(38), రజత్ పాటిదార్(17)లను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బషీర్.. రవీంద్ర జడేజా(12) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో బషీర్ బౌలింగ్ నైపుణ్యాలకు ఫిదా అయిన క్రికెట్ అభిమానులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Bashir breaks the crucial partnership between Gill and Jaiswal! 🥲 #INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/hCKcWdJq5A — JioCinema (@JioCinema) February 24, 2024 ఇదిలా ఉంటే.. బౌలింగ్ కంటే ముందు రెండో రోజు ఆటలో బ్యాట్‌తో బరిలోకి దిగాడు బషీర్. జడేజా బౌలింగ్‌లో ఒలీ రాబిన్సన్(58) అవుట్ కాగానే అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ బషీర్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో కామెంట్ చేశాడు. అతడు క్రీజులోకి వచ్చే సరికి సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్.. సహచర ఆటగాళ్లతో.. ‘‘అతడికి హిందీ రాదు కదా’’ అని వ్యాఖ్యానించాడు. Sarfaraz - isko to Hindi nahi aati hain Shoaib - Aati hai thodi thodipic.twitter.com/DJ7ZWGS5Jf — Vector Bhai (@Vectorism_) February 24, 2024 టీమిండియా ఫీల్డింగ్ సెట్ చేసుకుంటున్న సమయంలో సర్ఫరాజ్ అన్న ఈ మాటలకు బదులిస్తూ.. ‘‘నాకు కొంచెం కొంచెం హిందీ వచ్చు’’ అని బషీర్ బదులిచ్చాడు. దీంతో అవాక్కవడం సర్ఫరాజ్ వంతైంది. నెటిజన్లు ఈ సరదా సంభాషణ గురించి ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక టీమిండియా.. రెండో రోజు ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. -
Ind Vs Eng: ఐదుసార్లూ వాళ్లకే చిక్కాడు.. ఇంకెన్ని అవకాశాలు?
India vs England, 4th Test- Rajat Patidar: టీమిండియా బ్యాటర్ రజత్ పాటిదార్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా అతడు మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు. వరుస ఇన్నింగ్స్‌లో వైఫల్యం చెంది టీమిండియా అభిమానుల విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్ సందర్భంగా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ అంతర్జాతీయ టెస్టులో అడుగుపెట్టాడు. విరాట్ కోహ్లి జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో అతడి స్థానంలో ఎంట్రీ ఇచ్చిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ చేసిన పరుగులు 32, 9. రెండు ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లిష్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో పాటిదార్ అవుట్ కావడం విశేషం. ఏదేమైనా.. తొలి మ్యాచ్‌లో కాస్త ఫర్వాలేదనిపించినా రాజ్‌కోట్ టెస్టులో మాత్రం పాటిదార్ పూర్తిగా విఫలమయ్యాడు. ఐదుసార్లూ వాళ్ల చేతికే చిక్కాడు తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే పరిమితమైన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో రెండు సందర్భాల్లోనూ అతడు ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లే చేతికే చిక్కడం గమనార్హం. తాజాగా నాలుగో టెస్టులోనూ 17 పరుగులకే అవుటయ్యాడు పాటిదార్. ఈసారి కూడా స్పిన్ బౌలింగ్ ఆడటంలో తన బలహీనతను మరోసారి బయటపెడుతూ 30 ఏళ్ల పాటిదార్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో రజత్ పాటిదార్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘‘టీమిండియాలో అరంగేట్రం తర్వాత వరుసగా విఫలమైనా.. తుదిజట్టులో అతడికి చోటు ఇస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మరోవైపు.. సంజూ శాంసన్ వంటి ఆటగాడికి 2015లో టీ20లో టీమిండియా తరఫున.. అదీ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయించారు. మళ్లీ అతడు మరో అంతర్జాతీయ టీ20 ఆడటానికి ఐదేళ్లు(2020) పట్టింది. ఎందుకింత వివక్ష? కేవలం ఐపీఎల్లో ఆడిన ఆటగాళ్లకే అవకాశాలు ఇస్తే ఇలాగే ఉంటుంది. కనీసం టెస్టు జట్టుకు ఎంపిక చేసే ఆటగాళ్లనైనా.. రంజీ ట్రోఫీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లలో ప్రదర్శన ఆధారంగా ఎంచుకోండి’’ అని సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు. ఇక శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. చదవండి: IPL 2024- MI: అడ్జస్ట్ అవ్వాలా?.. ఇది ఎలా తింటాననుకున్నావు? పాండ్యా ఫైర్ -
అతడిపై వేటు.. మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
India vs England, 3rd Test: టీమిండియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. రాజ్‌కోట్ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌పై వేటు పడగా.. రైటార్మ్ పేసర్ మార్క్ వుడ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో.. ఒకే ఒక్క ఫాస్ట్‌బౌలర్ మార్క వుడ్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. తర్వాతి మ్యాచ్‌లో దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌కు పిలుపునిచ్చింది. మార్క్‌వుడ్ స్థానాన్ని ఆండర్సన్‌తో భర్తీ చేయడంతో పాటు.. గాయపడిన సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో షోయబ్ బషీర్‌తో అరంగేట్రం చేయించింది. ఈసారి ఇద్దరు పేసర్లతో ఈ క్రమంలో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఆండర్సన్ ఐదు వికెట్లు తీయగా.. బషీర్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. కానీ ఈ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో.. రాజ్‌కోట్ వేదికగా ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లతో బరిలో దిగాలని భావించిన ఇంగ్లండ్.. బషీర్‌పై వేటు వేసి మార్క్ వుడ్‌ను మళ్లీ పిలిపించింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(ఫిబ్రవరి 15) నుంచి గుజరాత్‌లోని రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది. టీమిండియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్. చదవండి: Virat Kohli-Anushka Sharma: ఓ బ్యాడ్ న్యూస్.. ఓ ‘గుడ్’ న్యూస్! -
Day 1: విశాఖలో శతక్కొట్టిన జైస్వాల్.. సెహ్వాగ్ సరసన
Ind vs Eng 2nd Test Day 1 Score: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆటలో సహచరులు నామామత్రపు స్కోరుకే పరిమితమైన వేళ శతకం బాది జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో మెరిసి ‘స్టార్ ఆఫ్ ది డే’గా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండో మ్యాచ్‌లో తలపడుతోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నెమ్మదిగా ఆరంభించి... యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించాడు. కానీ ఇంగ్లండ్ అరంగేట్ర బౌలర్ షోయబ్ బషీర్ మాయాజాలంలో చిక్కుకున్న రోహిత్ శర్మ 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. యశస్వి ఆచితూచి నిలకడగా ఆడుతుండగా.. అతడికి తోడైన వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో గిల్(34) వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 27 పరుగులకే పరిమితం కాగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అరంగేట్ర ప్లేయర్ రజత్ పాటిదార్ 32 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్(27) నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. వికెట్ కీపర్ శ్రీకర్ భరత్(17) వేగంగా ఆడేందుకు యత్నించి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. సెహ్వాగ్ సరసన చోటు ఇలా ఒక్కో వికెట్ పడుతున్నా యశస్వి మాత్రం నిలకడగా ఆడుతూ 149 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి రోజు ఆట ముగిసే సరికి మొత్తంగా 257 బంతులు ఎదుర్కొన్న ఈ 22 ఏళ్ల లెఫ్టాండర్ 179 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో ఆట పూర్తయ్యే సరికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ రెండు వికెట్ల చొప్పున తీయగా.. ఆండర్సన్, టామ్ హార్లీ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. విశాఖపట్నం టెస్టులో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో తానూ చోటు దక్కించుకున్నాడు. టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు ►వీరేంద్ర సెహ్వాగ్- 2004లో ముల్తాన్‌లో పాకిస్తాన్ మీద- 228 రన్స్ ►వీరేంద్ర సెహ్వాగ్- 2003లో మెల్బోర్న్లో ఆస్ట్రేలియా మీద- 195 రన్స్ ►వసీం జాఫర్- 2007లో కోల్‌కతాలో పాకిస్తాన్ మీద- 192 రన్స్ ►శిఖర్ ధావన్- 2017లో గాలేలో శ్రీలంక మీద- 190 రన్స్ ►వీరేంద్ర సెహ్వాగ్- గ్రాస్ ఇలెట్లో వెస్టిండీస్ మీద- 180 రన్స్ ►యశస్వి జైస్వాల్- విశాఖపట్నంలో ఇంగ్లండ్ మీద- 179 రన్స్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
ఒకేరోజు ఎనిమిది మంది క్రికెటర్ల ఎంట్రీ!
క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివిధ ఫార్మాట్లలో ఇవాళ (2024, ఫిబ్రవరి 2న) ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ముందుగా విశాఖ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌తో భారత ఆటగాడు రజత్ పాటిదార్, ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశారు. వెస్టిండీస్‌తో ఇవాళ జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వన్డే అరంగేట్రం చేశారు. శ్రీలంకతో ఇవాళే మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేశారు. మొత్తంగా ఇవాళ ఎనిమిది మంది ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. క్రికెట్ చరిత్రలో ఇంతమంది ఒకే రోజు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఇవాళ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాళ్ల వివరాలు.. రజత్ పాటిదార్ (భారత్) షోయబ్ బషీర్ (ఇంగ్లండ్) జేవియర్ బార్ట్లెట్ (ఆస్ట్రేలియా) లాన్స్ మోరిస్ (ఆస్ట్రేలియా) నూర్ అలీ జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) నవీద్ జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ (ఆఫ్ఘనిస్తాన్) మొహమ్మద్ సలీం (ఆఫ్ఘనిస్తాన్) ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో ఇవాళ మొదలైన రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (125 నాటౌట్) కెరీర్లో మూడో సెంచరీతో కదంతొక్కగా.. అతనికి జతగా అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ (25) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాళ్లు రజత్ పాటిదార్, షోయబ్ బషీర్ పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ తొలి వన్డే విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి చేరువలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 48.4 ఓవరల్లో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 34 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 208 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. గ్రీన్ (68), స్టీవ్ స్మిత్ (65) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ గెలుపుకు మరో 24 పరుగులు మాత్రమే అవసరం ఉంది. అరంగేట్రం ఆటగాళ్లు జేవియర్ బార్ట్లెట్ (9-1-17-4) అద్భుత గణాంకాలతో విజృంభించగా.. లాన్స్ మోరిస్ (10-2-59-0) పర్వాలేదనిపించాడు. ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తొలి రోజు మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు (53 ఓవర్లు) చేసింది. కైస్ అహ్మద్ (16), జియా ఉర్ రెహ్మాన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. అరంగేట్రం ఆటగాళ్లలో నూర జద్రాన్ (31) కాస్త పర్వాలేదనించాడు. -
ఏంటి రోహిత్ ఇది..? యువ స్పిన్నర్ ట్రాప్‌లో చిక్కుకున్న హిట్‌మ్యాన్
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ అరంగేట్ర స్పిన్నర్ షోయబ్ బషీర్ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 18 ఓవర్లో బషీర్ ప్లాన్‌గా లెగ్ స్లిప్ ఫీల్డర్‌ను పెట్టుకుని మరి రోహిత్‌కు బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో తొలి రెండు బంతులను డిఫెన్స్ ఆడిన హిట్‌మ్యాన్.. మూడో బంతిని లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి అనుహ్యంగా టర్న్ అయ్యి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని లెగ్ స్లిప్ ఫీల్డర్ ఒలీ పోప్ చేతికి వెళ్లింది. దీంతో చేసేదేమి లేక రోహిత్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. బషీర్‌కు ఇదే తొలి టెస్టు వికెట్ కావడం గమనార్హం. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి టెస్టులో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చదవండి: Ind vs Eng 2nd Test: ‘ఇంత అన్యాయమా.. ఇంకెలా ఆడితే ఛాన్స్ ఇస్తారు?’ Selfless captain Rohit Sharma 🔥#IndvsEng #INDvsENGTest pic.twitter.com/s5oRj4vyL1 — Shivam 🚩 (@Shivam_pal_18) February 2, 2024 -
ఆండర్సన్ టెస్ట్‌ల్లో ఎంట్రీ ఇచ్చేనాటికి "ఆ ఇద్దరు" పుట్టనేలేదు..!
విశాఖ వేదికగా భారత్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించారు. 41 ఏళ్ల ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ ఆండర్సన్ రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. జట్టు కూర్పు కారణంగా తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కని ఆండర్సన్‌ను రెండో టెస్ట్‌లో బరిలోకి దించాలని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఆండర్సన్ ఎంట్రీతో తొలి టెస్ట్ ఆడిన మరో పేసర్ మార్క్ వుడ్‌పై వేటు పడింది. టీమిండియాపై, ప్రత్యేకించి భారత గడ్డపై ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన ఆండర్సన్ రేపటి మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఈ మార్పుతో పాటు రెండో టెస్ట్ కోసం ప్రకటించిన ఇంగ్లండ్ తుది జట్టులో మరో మార్పు కూడా చోటు చేసుకుంది. తొలి టెస్ట్‌లో ఆడిన సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడటంతో అతని స్థానంలో పాక్ మూలాలున్న స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు ఇంగ్లండ్ మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. ఈ రెండు మార్పులతో ఇంగ్లండ్ రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొంటుంది. Shoaib Bashir and Rehan Ahmed were not even born when Jimmy Anderson made his Test debut. - Tomorrow Anderson will take the field with both Bashir and Rehan...!!! 🫡🐐 pic.twitter.com/i7PgpMVb5g — Mufaddal Vohra (@mufaddal_vohra) February 1, 2024 ఇదిలా ఉంటే, వెటరన్ పేసర్ ఆండర్సన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఆండర్సన్ టెస్ట్ అరంగేట్రం చేసే నాటికి అతని ప్రస్తుత సహచరుల్లో ఇద్దరు పుట్టనే లేదు. ఆండర్సన్ 2003, మే 22న తన తొలి టెస్ట్ మ్యాచ్ (జింబాబ్వేపై) ఆడగా.. ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు సభ్యులు షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ అప్పటికి జన్మించలేదు. బషీర్ 2003, అక్టోబర్ 13న పుట్టగా.. రెహాన్ 2004, ఆగస్ట్ 13న జన్మించాడు. ఈ ఆసక్తికర అంశం గురించి తెలిసి ఆండర్సన్ ఫిట్నెస్ను, ఆట పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని అందరూ కొనియాడుతున్నారు. ఆండర్సన్ ప్రస్తుత పరిస్థితి చూస్తే, అతను మరో రెండేళ్లు కూడా ఆడేలా ఉన్నాడంటు కామెంట్లు చేస్తున్నారు. రేపటి మ్యాచ్‌లో ఆండర్సన్.. షోయబ్, రెహాన్లతో కలిసి బరిలోకి దిగనున్నాడు. ఇదిలా ఉంటే, ఆండర్సన్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అతను 183 టెస్ట్‌లు ఆడి 690 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత లంక దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌కు (800 వికెట్లు) దక్కింది. అతనికి తర్వాతి స్థానంలో షేన్ వార్న్ (708) ఉన్నాడు. వీరిద్దరి తర్వాతి స్థానాన్ని ఆండర్సన్ ఆక్రమించాడు. టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.