
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా ఘనంగా ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ యువ ఆటగాడు షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డ్ అయినప్పటికి రివ్యూ కావాలని అడగడం అందరని ఆశ్చర్యపరిచింది.
అసలేం జరిగిందంటే?
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఆఖరి బంతికి షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే బషీర్ తను బౌల్డ్ కాకుండా వికెట్ కీపర్‌కు దొరికిపోయానని భావించి రివ్యూ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రివ్యూ కావాలని సిగ్నల్ ఇచ్చాడు.
కానీ నాన్ స్ట్రైక్‌లో ఉన్న జోరూట్ ఒక్కసారిగా నవ్వుతూ బౌల్డయ్యావని బషీర్‌తో చెప్పాడు. ఇది చూసిన భారత ఆటగాళ్లు సైతం నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బాబు బషీర్ బౌల్డ్‌లకు రివ్యూలు ఉండవు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IPL 2024: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం..!?
Comments
Please login to add a commentAdd a comment