టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి జురెల్ అడుగుపెట్టాడు. హైదారాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గాయ పడిన కేఎల్ రాహుల్ స్ధానంలో ధ్రువ్ ఎంట్రీ ఇచ్చాడు.
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో 90 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన జురెల్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే తాజాగా తన డెబ్యూ టెస్టులో ఇంగ్లండ్ ఆటగాళ్ల నుంచి ఎదురైన అనుభవాలను ధ్రువ్ పంచుకున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌లో కలిసి ఆడిన జో రూట్ సైతం తనను స్లెడ్జింగ్ చేయడం ఆశ్చర్యపరిచందని ధ్రువ్ చెప్పుకొచ్చాడు.
రాంచీ టెస్టుల్లో నేను 32 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాను. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకుంది. కొత్త బంతి తీసుకోవడంతో జేమ్స్ ఆండర్సన్ ఎటాక్‌లోకి వస్తాడని నేను ముందే ఊహించాను. అతడు అప్పటికే కొంచెం దూకుడుగా ఉన్నాడు. ఎందుకంటే మా భాగస్వామ్యం నెమ్మదిగా పెరుగుతుందని వారికి తెలుసు.
మా భాగస్వామ్యాన్ని ఎలా అయినా బ్రేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో నన్ను స్లెడ్జింగ్ చేయడం మొదలు పెట్టారు. కానీ నేను వారి మాటలను పట్టించుకోకడదని డిసైడ్ అయ్యాను. వారు నా ఏకగ్రాతను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. జానీ బెయిర్‌స్టో అయితే కంటిన్యూగా ఏదో ఒకటి అంటూ వున్నాడు.
అతడితో జో రూట్ కూడా చేరాడు. ఐపీఎల్‌లో జో రూట్ కలిసి ఆడాము. అయినప్పటకి అతడు నన్ను స్లెడ్జ్ చేయడంతో షాక్ అయ్యాను. వెంటనే జో రూట్ భాయ్ మీరు నన్ను ఎందుకు స్లెడ్జింగ్ చేస్తున్నారు? అని అడిగాను. ఇది నా వృత్తి ధర్మం. మనమందరం ఇప్పుడు మన దేశం కోసం ఆడుతున్నాము అని రూట్ బదలిచ్చాడని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువ్ పేర్కొన్నాడు. కాగా ధ్రువ్ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment