ధర్మశాల వేదికగా భారత్‌తో ఐదో టెస్టులో తలపడేందుకు ఇంగ్లండ్ సిద్దమవుతోంది. విజయంతో ఇండియా టూర్‌ను ముగించాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ 3-1తో సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ మాత్రం అందరని అకట్టుకున్నాడు.
రాంఛీ టెస్టులో బషీర్ 8 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలో బషీర్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో బషీర్‌ను వాన్ పోల్చాడు.
"ఇంగ్లండ్ జట్టుకు మరో వరల్డ్ క్లాస్ సూపర్‌స్టార్ దొరికాడు. అతడే యువ సంచలనం షోయబ్ బషీర్ . అతడి కెరీర్‌లో తన రెండో టెస్టులోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా 8 వికెట్టు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును భయపెట్టాడు. వరల్డ్ క్రికెట్‌లో మరో అశ్విన్ పుట్టుకొచ్చాడు. మాకు ఓ అశ్విన్ దొరికినందుకు సెలబ్రేషన్స్ జరపుకుంటున్నామునజ ఇక ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని భావిస్తున్నా.
మా జట్టు అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగాలి. ధర్మశాల వాతావారణం ఇంగ్లండ్ జట్టుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇంగ్లండ్‌కు గెలిచే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. భారత్ మాత్రం తమ జట్టులో కొన్ని మార్పులు చేసే ఛాన్స్ ఉందని ఓ యూట్యాబ్ ఛానల్‌లో వాన్ పేర్కొన్నాడు.
చదవండి: #BCCI: 'అతడొక లీడింగ్ వికెట్ టేకర్.. అయినా కాంట్రాక్ట్ నుంచి'
Comments
Please login to add a commentAdd a comment