ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో 9 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్.. ఈ ప్రదర్శనతో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉన్న పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఇందులో ఓ రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ టెస్ట్ సిరీస్‌లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు అత్యధిక సార్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మురళీథరన్ పేరిట ఉండిన ఈ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (800) సాధించిన మురళీ తన టెస్ట్ కెరీర్‌లో (ఓ టెస్ట్ సిరీస్‌లో) 25 అంతకంటే ఎక్కువ వికెట్ల ఘనతను ఆరు సార్లు నమోదు చేయగా.. అశ్విన్ ఏడు సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు. కేవలం 100 టెస్ట్‌ల్లోనే 516 వికెట్లు (36 ఐదు వికెట్ల ఘనతలు) తీసిన అశ్విన్.. మరో 285 వికెట్లు తీస్తే మురళీథరన్ పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బద్దలు కొడతాడు.
కాగా, ధర్మశాల వేదికగా జరిగిన టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టిన అశ్విన్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో యాష్ రెండు ఐదు వికెట్ల ఘనతలు, ఓ నాలుగు వికెట్ల ఘనత నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment