ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 765 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్లతో పోలిస్తే టెస్ట్ క్రికెట్ ఎక్కువగా ఆడిన యాష్.. ఒక్క సుదీర్ఘ ఫార్మాట్‌లోనే 537 వికెట్లు తీశాడు. అశ్విన్ టెస్ట్‌ల్లో 37 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు.
టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800) కొనసాగుతున్నాడు. మురళీ తర్వాతి స్థానాల్లో షేన్ వార్న్ (708), ఆండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563) ఉన్నారు.
మురళీథరన్, షేన్ వార్న్ కంటే ఎక్కువ సార్లు..!
టెస్ట్‌ల్లో మురళీథరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ స్పిన్నర్లు అశ్విన్ కంటే ఎక్కువ వికెట్లు తీశారు. వికెట్ల సంఖ్యా పరంగా లేదా ఇతరత్రా రికార్డుల విషయంలో వీరంతా అశ్విన్ కంటే మెరుగ్గా ఉన్నా, ఒక్క విషయంలో మాత్రం అశ్విన్ పై ముగ్గురిని తలదన్నాడు.
టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక సార్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది. అశ్విన్ తన కెరీర్‌లో ఏడు సార్లు టెస్ట్ సిరీస్‌ల్లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీయగా.. షేన్ వార్న్, మురళీథరన్ ఆరు సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అశ్విన్ 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరు సిరీస్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలవడం విశేషం. అశ్విన తన కెరీర్‌లో మొత్తం 12 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment